చర్చ:ఉర్దూ భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉర్దూ భాష వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 15 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఈ వాక్యాలు తొలిగించబడ్డాయి

ప్రపంచంలో దాదాపు 35 కోట్ల మంది మాట్లాడే భాష. భారతదేశపు 23 అధికారిక భాషల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో 2వ అధికారిక భాష. ప్రపంచంలో మాండరిన్, ఇంగ్లీషుల తరువాత అత్యధికులు మాట్లాడేభాష ఉర్దూ.

ఉర్దూ అధికార భాషగా ఉన్న పాకిస్తాన్ లో కూడా చాలా మంది ఉర్దూ మాట్లాడరు. వారు పంజాబీ, సింధీ, బలోచీ వంటి బాషలు మాట్లాడుతారు. ప్రపంచంలో నిజంగా అంత మంది ఉర్దూ వారు ఉన్నారా?! అది కూడా పాకిస్తాన్ మొత్తం జనాభా కంటే మరీ ఎక్కువగా?!

పాకిస్తాన్‌లో ఉర్దూ మాతృభాషగా ఉన్నవాళ్ళు 8% శాతమే ఉన్నా. అంతకంటే ఎక్కువశాతం ద్వితీయభాషగా మాట్లాడేవాళ్ళు ఉంటారేమో? (నాకూ ఖచ్చితంగా తెలియదు). చాలాచోట్ల ఉర్దూతో పాటూ హిందీమాట్లాడే వారి సంఖ్యను కలిపి ప్రకటిస్తుంటారు. జాగ్రత్తగా పరిశీలించాలి --వైజాసత్య 18:36, 4 డిసెంబర్ 2008 (UTC)
పాకిస్తాన్లో 95% మంది ఉర్దూను కనీసం ద్వితీయ లేదా తృతీయ భాషగానో మాట్లాడతారంట. ఇంక ప్రపంచవ్యాప్త గణాంకాలు ఇక్కడ చూడండి --వైజాసత్య 18:41, 4 డిసెంబర్ 2008 (UTC)

జాగ్రత్తగా పరిశీలిస్తే హిందీ భాషకి, ఉర్దూ భాషకి తేడా కనిపిస్తుంది. ఉదాహరణకి ఉర్దూలొ అబ్బా (మూలం సెమిటిక్ భాషలలోని "ఆబా" అను పదం). హిందీలొ బాప్ (మూలాలు పెర్షియన్ భాషలోని బాబా, లాటిన్ భాషలోని పాపా అను పదాలు. గమనిక: బ, ప, య, జ, లాంటి అనేక అక్షరాలు భాషలు మారేటప్పుడు మార్పు లేదా రివర్షన్ చెందుతాయి). ఇలాంటి తేడాలు మరి కొన్ని కూడా చూపించవచ్చు.

వ్యవహారికంగా హింది - ఉర్దూ భాషలు ఒక లాగే ఉంటాయి. కానీ గ్రాంథిక ఉర్దూ భాషలో పెర్షియన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

ఏతెమాద్ లింకు తొలిగించబడినది. అది ఉర్దూ పత్రిక కాదు. అది ఫార్సీ పత్రిక.

ఈ సభ్యుడి ఛాదస్తం మరీ మొండిగా వున్నది,
  1. ఉర్దూ భాష కేవలం పాకిస్తాన్ లోనే మాట్లాడరు, భారత్ లో మాట్లాడే వారు కోకొల్లలు, కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ (సోలన్ పట్టణంలో "ఉర్దూ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ సెంటర్" సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగువేజెస్ చే నడుపబడుచున్నది.),ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఉపయోగంలో వున్నది. ఇంకో ఉదాహరణ, హైదరాబాద్ నగరంలో ముస్లింలేకాదు, దాదాపు 90%మంది హిందూ సోదరులు కూడా ఉర్దూ మాట్లాడగలరు. అలానే, ఢిల్లీ, లక్నో, ముంబాయి, భోపాల్ నగరాలు ఉర్దూ భాషకు కేంద్రాలు. పొరుగుదేశాలలోనూ ఉర్దూ అధికంగా ఉపయోగంలో వున్నది.
  2. గ్రాంధిక ఉర్దూ భాషలో ప్రమేయం పర్షియన్ ది గాదు, అరబ్బీ భాషది ఎక్కువగా కానవస్తుంది.
  3. ఏతెమాద్ పత్రిక హైదరాబాద్ నుండి ప్రచురించబడు "ఉర్దూ దిన పత్రిక", మూలం చూడండి, [1]
  4. భారతదేశంలోని 23 అధికార భాషల్లో ఉర్దూ ఒకటి అని ప్రభుత్వమే ప్రకటిస్తూ వుంటే, ఈ సభ్యుడు ఓ పెద్ద మేధావిలా, ఈ విషయాలన్నీ తుడిపేసి, చర్చాపేజీలోని చర్చలలో పీఠమూ అలంకరిస్తున్నాడు. ఊరంతా ఒక దారి అంటే, ఉలిపిరికట్టె ఇంకోదారి అన్నట్టున్నది. హేతుబద్దమైన విషయాలు వాస్తవాలతో కూడిన విషయాలను వ్యాసాలలో చేరిస్తే అందరూ సంతోషిస్తారు, వ్యాస విస్తరణ సంగతి దూరం, ఉన్నవాటికి తుడిపేసుకుంటూ పోవడం అదీ అసంబద్ధంగా, ఇదో దురలవాటు.

తెవికీ నిర్వాహకులు ఈ విషయాలను ఓ సారి పరికించి సరిదిద్దవలెనని మనవి. నిసార్ అహ్మద్ 20:06, 26 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు లిపిలో వ్రాసేప్పుడు IPA మూస అవసరం కాదనుకొంటాను[మార్చు]

  • IPA మూస ఉంటే ఇలా కనిపిస్తుంది: అస్సలామ్ ఒ అలైకుమ్ - (నా కంప్యూటర్లో పొల్లులు విడిగా - తెగగొట్టబడినట్లు - కనిపిస్తున్నాయి. మిగిలినవారికి మామూలుగా కనిపిస్తున్నాయేమో తెలియదు.
  • IPA మూస లేకపోతే ఇలా కనిపిస్తుంది: అస్సలామ్ ఒ అలైకుమ్ - ఇది బాగానే ఉన్నది.

కనుక "IPA మూస" అనవుసరమనుకొంటాను.

--కాసుబాబు 11:20, 24 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]