చర్చ:ఏకవీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ నవలను నేను స్వయంగా చాలా సార్లు చదివాను. ఇతివృత్తం శీర్షికన ఇచ్చిన అంశమంతా సినిమా ఆధారంగా రాసినదిగా అనిపించింది. నవలలో చివరి అంకంలో ఏకవీర మరణిస్తుంది. కానీ ఈ వ్యాసంలో చెప్పినట్టుగా కుట్టాన్ మరణించడు. విశ్వనాథ అధర్మం చేసిన రెండు పాత్రల్లొ స్త్రీ పాత్రను మరణంతో శిక్షించారని, పురుషపాత్రను సన్యాసంతో సరిపెట్టీ సరిద్దుకునే అవకాశం ఇచ్చారని వ్యాసంలో ఉంది. ఇది కూడా చాలా అసమగ్ర విశ్లేషణ. ఏకవీర పాత్ర ప్రియుణ్ణి కౌగిలించుకున్న అనంతరం తాను అతనికి కట్టుబడ్డాను కానీ వివాహం కావడంతో ఇతనికి ధర్మబద్ధురాలనైన భార్యనయ్యాను అనే సంఘర్షణకు లోనవుతుంది. కుట్టాన్ ఇదంతా తెలియకుండానే ఏకవీర వారించినా వినకుండా కౌగలించుకోవడంతో పరపురుష సంగమం(కావడానికి భర్తే అయినా) అయినట్టు భావించుకుని భరించలేకపోతుంది ఆ సమయంలో ఆమెలోని చైతన్యం జారిపొతుంది. వీరభూపతికి ఈ సమస్య అంతా ఎదురుకాకుండానే(మీనాక్షికి అంతా తెలుసు కనుక) సన్యాసం స్వీకరించే వీలు దొరుకుతుంది. ఇక మీనాక్షి అటు ప్రియుడు కుట్టాన్ మరణంతో(నిజానికి మరణించడు నవలలో), ఇటు భర్త వీరభూపతి సన్యాసంతో ఒంటరిగా మిగిలిపోతుందని రాశారు. అంటే బతికి ఉండిఉంటే కుట్టాన్ మీనాక్షిలు కలిసేవారనే అర్థం వస్తోంది. కానీ వారప్పటికే ప్రేయసీ ప్రియులనే అనుబంధం తెంచుకుని అన్నచెల్లెళ్లుగా భావించుకుంటారు. ఇన్ని విధాలుగా సమస్య ఉంది కనుక ఈ అంశాలు మార్చాలని అభ్యర్థన. --పవన్ సంతోష్ (చర్చ) 20:03, 18 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంలోని లోటుపాట్లు సరిజేసే వీలు[మార్చు]

వ్యాసంలోని ఇతివృత్తం శీర్షికను అభివృద్ధి చేయడానికి సరైన మూలాన్ని ఎంచుకోలేదేమోనని, సరిజేయాల్సిన పని ఉందని ఇంతకుముందుగానే రాసివున్నాను. ఐతే ఇప్పుడు అందుకొక చక్కని అవకాశం దొరికింది. http://pustakam.net/?p=16221 లింకులోని వ్యాసం రాసిన వ్యక్తి విమర్శకురాలు, తెలుగు సాహిత్యంపై పరిశోధన చేసి డి.లిట్ పట్టా పొందిన వ్యక్తి కావడంతో ఈ వ్యాసాన్ని ఆ వ్యాసం ఆధారంగా అభివృద్ధి చేయవచ్చు. ఐతే ఆ వ్యాసంలో నవల ఇతివృత్తంతో పాటు సమాంతరంగా రచయిత్రి విశ్లేషణ సాగుతోంది. రెంటినీ విడదీసి ఇతివృత్తం, శిల్పం శీర్షికలుగా అభివృద్ధి చేయగలరు. వ్యాసాన్ని అభివృద్ధి చేసిన రాజశేఖర్ గారు ఈ పనికి పూనుకోగలరేమో చూడండి. లేదంటే ఇద్దరమూ కలిసి సమిష్టిగా అభివృద్ధి చేద్దాము. ఎందుకంటే ఈ నవల తెలుగు నవల సాహిత్యంలో, చారిత్రిక నవలల పరిణామంలో ముఖ్యమైనది.--పవన్ సంతోష్ (చర్చ) 16:03, 22 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]