చర్చ:కర్నూలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్నూలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 01 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


గోలేగుమ్మ గురించి[మార్చు]

సలాం వాలేకుం అహ్మద్ భాయ్!

మీ తరపున గోలేగుమ్మ గురించి మా నాన్నారిని అడిగి దాని గురించి చెప్పా కదా? దాని గురించిన మరిన్ని విషయాలు తెలిసినవి. (ఇటువంటివి మా నాన్నారు ఒహ పట్టాన వదలరు లెండి!! పైగా కొలవిపు గురించి ఆయనకి చెప్పటంతో ఆయన నా రచనలని ఇంకా ప్రోత్సహిస్తున్నారు.)

కర్నూలు పట్టణంలో ఇటీవలె స్థాపించబడిన ఒక క్రొత్త భోజన విక్రయ శాల కి వెళ్ళిన మా నాన్నారికి అక్కడ కర్నూలు చారిత్రక ప్రదేశాల ఛాయాచిత్రాల తో బాటు ఈ గోలే గుమ్మ పటం కూడ కనబడ్డది. ఆ హోటల్ వారు ఈ నిర్మాణం యొక్క గుంబజ్ (పైన ఉండే టోంబ్) భారతదేశం లోకెల్లా పెద్దది (అంటే తాజ్ మహల్ కంటే పెద్దది) అని వ్రాశారుట. దీని సంగతి ఏంటో తేల్చాలని మా నాన్నారు అక్కడికి పయనమయ్యారు. ఆ గుంబజ్ వద్ద షేర్వానీ లో ఉన్న ఒక పెద్ద మనిషి (యాదృచ్చికంగా ఆ పెద్ద మనిషి కూడా మహమ్మదీయుడే!) ఉనాడుట. ఆయన్ని మా నాన్న గారు కదిలించారుట. ఆయన (అచ్చ తెలుగులో) ఈ గుంబజ్ యొక్క వ్యాసార్థం తాజ్ మహల్ కంటే పెద్దదే. వ్యాసార్థం పెద్దది అయితే మిగతా కొలతలని పరిగణ లోకి తీసుకోనక్కర లేదు. కాబట్టి ఇదే భారతదేశంలో కెల్లా పెద్ద గుంబజ్ అని చెప్పవచ్చును అని అన్నాడుట. ఈ విషయం ఇంటర్నెట్ లో ఎవరయినా వ్రాశారా? అన్న మా నాన్న ప్రశ్నకి (ఈ సారి ఆంగ్లంలో) ఐ డోంట్ థింక్ సో. ఐ విల్ ఆస్క్ సంబడీ టు డూ ఇట్. అని అనటంతో మా నాన్నారు సెలవు తీసుకొని వచ్చేశారు. - శశి (చర్చ) 14:32, 9 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]