చర్చ:తుల్జాబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇలాంటి వ్యాసాలు వికీపీడియాలో ఉండదగినదేనా? ఇతర నిర్వాహకుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను. ఇవి కేవలం వార్తల లాగా అనిపిస్తున్నది నాకు. రవిచంద్ర(చర్చ) 07:50, 15 అక్టోబర్ 2008 (UTC)


ఇది వికీపీడియాలో వ్యాసంలా ఉండడానికి సరైనది కాదు. కారణాలు

  • విషయం - ఇది ఒక వార్త. కనుక వ్యాసం అనిపించుకోదు
  • శైలి - ఇందులో రచయిత భావాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి.
  • కాపీ హక్కులు - ఇది ఆ పత్రికనుండి యధాతథంగా కాపీ చేసినట్లనిపిస్తుంది. కనుక కాపీ హక్కులకు భంగం కలుగుతున్నది.
పరిష్కారం
భైంసా వ్యాసంలో ఒక విభాగంగా ఈ విషయాన్ని క్లుప్తంగా వ్రాయవచ్చును అనుకొంటాను.

--కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:31, 15 అక్టోబర్ 2008 (UTC)

మారణహోమం కొనసాగుతున్నప్పుడు మానవత్వాన్ని చాటిన మన తెలుగు రత్నం తుల్జాబాయి.ఈమెను గురించి అన్ని పత్రికలూ ప్రశంసించాయి.వికీలో ఈమెకు అవకాశం ఇస్తే బాగుంటుంది.--Nrahamthulla 02:22, 19 అక్టోబర్ 2008 (UTC)
సభ్యుల కోరికపై ఈ వ్యాసం విషయాన్ని పునఃపరిశీలించడం అవసరం అనిపిస్తున్నది. అందుకని పునఃస్థాపించాను. విధానాల పరిశీలన కొరకు దయచేసి కొన్ని రోజులు ఆగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:59, 19 అక్టోబర్ 2008 (UTC)
ఇలాంటి వ్యాసాలు వికీలో ఉండటం సమంజసం కాదు. మతకలహాలు జరిగేటప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం టివీలలో, వార్తాపత్రికలలో ఇలాంటి సంఘటనలు చూపించడం మామూలే. కాని శాశ్వత ప్రాతిపాదికన వికీలో ఇలాంటి వ్యాసాలు ఉండటం మునుముందు ఇది చదివే వారికి వ్యతిరేక భావాలను కల్పించినట్లవుతుంది. అంతేకాకుండా వికీలో ఇలాంటి వ్యాసాల వలన ప్రయోజనమేమీ లేదు సరికదా నష్టాలు మాత్రం ఉన్నాయి. ఇలాంటి వ్యాసాలను ఇక నుంచి తక్షణమే తొలిగించాలి. వీటికి చర్చ కూడా అవసరం లేదనుకుంటా. -- C.Chandra Kanth Rao(చర్చ) 19:03, 20 అక్టోబర్ 2008 (UTC)
  • ఏ మతం వారైనా మానవత్వాన్ని ప్రదర్శిస్తే ఆ వ్యక్తుల ఉదాహరణల వల్ల చదివే వారికి వ్యతిరేక భావాలు కలుగవు .ఇలాంటి వ్యాసాల వలన ప్రయోజనమే ఉంది కానీ నష్టాలు ఏమాత్రం ఉండవు. మనలోని మంచివాళ్ళు మనకు తెలియాలి.తుల్జాభాయి ,ముత్తులక్ష్మి లాంటి మానవతామూర్తులు మన తెలుగు ప్రజలలో నుంచి భవిష్యత్తులో ఇంకా కొంతమంది రావచ్చు.అసలు తెలుగువికీలో ఇలాంటి వారి ప్రస్తావన తెచ్చే అవకాశం ఉందా లేదా ?--Nrahamthulla 02:11, 21 అక్టోబర్ 2008 (UTC)
ఈ వ్యాసాన్ని ఉంచవచ్చు. కానీ పూర్తిగా తిరిగి వ్రాయాలి. శైలి వికీ శైలిలో వ్రాయాలి. ఉదాహరణకు, తుజ్లాబాయి అనే ఆమె ఫలానా విషయంలో వార్తా పత్రికల్లో వచ్చింది. ఈమె వయసు, బొమ్మ, ఊరు, ఇతర వి వరాలు ఇవ్వవచ్చు. అంతే కానీ ఇలా వార్తా పత్రికను కాపీ పేస్ట్ చెయ్యడం సబబు కాదు. Chavakiran 06:15, 21 అక్టోబర్ 2008 (UTC)
రహంతుల్లా గారూ, ఇలా వార్తల్లోని వ్యక్తులందరినీ వికీపీడియాలో ఎక్కించెయ్యలేము. సద్భావన కలుగజేయటం, సామాజిక మార్పుకు తోడ్పటం వంటివి తెవికీ పరిధిలో లేనివి. అవి మంచి పనులే అయినా అవి వికీ లక్ష్యాలు కావు. ఉదాహరణకు ఒక సంఘటన తీసుకుందాం: అప్పుడెప్పుడో నెల్లూరు జిల్లాలోని దూబగుంటలో సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది. దాన్ని కొంతమంది ఆ ఊరి మహిళలు ప్రారంభించారు. ఆ తర్వాత అది రాష్ట్రమంతటా పాకింది. మీకు ఆ మహిళ పేర్లు గుర్తున్నాయా? అప్పట్లో వాళ్ళు వార్తల్లో ప్రముఖంగా చూపబడ్డారు కూడా. కానీ తెవికీలో సారా వ్యతిరేక ఉద్యమం అని ఒక వ్యాసం వ్రాయవచ్చు (ఎలా మొదలైంది..కారణాలు, పర్యవసానాలు మొదలైనవి) కానీ ఆ మహిళల పేర్లన్నింటా వ్యాసాలు సృష్టించటం అనవసరం. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే --వైజాసత్య 06:39, 21 అక్టోబర్ 2008 (UTC)
ఈ వ్యాసం వలన ఏం ప్రయోజనం ఉంది. మారిన హృదయపు గాయాలను అధికం చేయడానికే తప్ప ప్రయోజనం ఏముంది. మతం గురించి, కులాల గురించి పక్షపాతంతో వ్రాసే వ్యాసాలకు ఇక్కడ చోటు ఉండరాదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:04, 21 అక్టోబర్ 2008 (UTC)
వ్యాస రచన పూర్తిగా పత్రికలలో వ్రాసినట్టున్నది గాని వికీ శైలిలో లేదు. ఏతా వాతా చూస్తే, వ్యాసం వ్రాసింది ఒక సంఘటన గురించి. వికీలో ఇటువంటి సంఘటనల గురించి వ్రాసే అవకాశం ఉన్నదా? లేదా? అన్న అంశం నిర్వాహకులు ఒకసారి పరిశీలించాలి. నామటుకు నాకు అనిపించేది ఏమంటే, ఇలా సంఘటనలగురించి వికీలో వ్రాసుకుంటూ పోతే, ఎవరికి తోచిన సంఘటనలగురించి వారు వ్రాసిపడేసే ప్రమాదమున్నది. ఆ తరువాత అటువంటి వ్యాసాలను ఏమి చెయ్యాలో తెలియక తలపట్టుకోవాలి! ఎంతటి ఉదాత్త సంఘటన అయినా సరే అది వార్త అవుతుందిగాని, వికీలో అంశమవుతుందనుకోను. కాబట్టి, ఇలా సంఘటనల ఆధారంగా వ్రాయబడ్డ వ్యాసాన్ని తొలగించటమే ఉత్తమం అనుకుంటున్నాను. --S I V A 17:59, 9 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • అవునండి, ఈ వ్యాసం వికీ శైలిలో ఎంతమాత్రమూ లేదు. ఈ వ్యాసం ఒక సంఘటనా "రిపోర్టు" లాగ వున్నది. "మతకలహాలు జరిగినపుడు ఈమె తన పొరుగువారికి ఆదుకొన్నది", "ప్రభుత్వంచే ప్రశంశలు పొందినది" అనే రెండు వాక్యాలు తప్పితే, మిగతా సంఘటనలన్నీ తొలగింపుకోవలోకి రావాల్సిందే. ఈ రెండు వాక్యాలకొరకు వ్యాసం అవసరమా ? లేదా మానవత్వం ప్రకటించిన వారికొరకు ఏదైనా వ్యాసంలో జాగా వుంటే, అక్కడ ఆమె పేరును ప్రస్తావించవచ్చు. స్థూలంగా వ్యాసం తొలగింపు వైపుకు మొగ్గాల్సిందే. లేదా చంద్రకాంతరావు గారు చెప్పినట్టు 'మారిన హృదయపు గాయాలకు అధికం చేయడమే' అవుతుంది. ఇలాంటి వ్యాసాలకు మొదట్లోనే తొలగించాల్సిన అవసరం తెవికీకి వున్నది. నిసార్ అహ్మద్ 18:41, 9 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]
అవును తొలగించటమే మంచిది. Chavakiran 05:27, 10 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


తుల్జాబాయి గురించిన సంక్షిప్తమైన విషయాలు భైంసా వ్యాసంలోకి మార్చాను. మరియు తుల్జాబాయి వ్యాసాన్ని దారి మళ్ళింపు పేజీగా మార్చాను. సభ్యులు ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:27, 10 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]