చర్చ:రైలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రైలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2016 సంవత్సరం, 16 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

ఆంధ్రపత్రికలో నావ్యాసం[మార్చు]

కొత్తరైలు మార్గాల కోసం ఉద్యమించక తప్పదు (ఆంధ్రపత్రిక, డిశంబరు 22 1990)

భారతీయ రైలు మార్గాల పొడవు ప్రస్తుతం 62 వేల కి.మీ.తో ఆసియాలో కెల్లా అగ్రగామిగా ఉంది. మన రైలు మార్గాల వ్యవస్థ ప్రపంచంలో నాల్గవస్థానం ఆక్రమిస్తున్నది. ఇది దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. రోజూ 99 లక్షల జనాభా రైళ్ళ ద్వారా ప్రయాణం చేస్తున్నారు. అయితే పెరుగుతున్న జనాభాతో పాటు రైల్వే మార్గాలు పెరగడం లేదు.మన రాష్ట్రంలో కరీంనగర్, మెదక్ జిల్లా కేంద్రాలకు రైలు మార్గం లేనందున అవి వెనుకబడి ఉన్నాయి. భద్రాచలం, అమలాపురం, నాగర్ కర్నూల్, సిద్దిపేట పార్లమెంటు స్థానాలకు రైలు మార్గం లేదు. అలాగే ఉట్నూరు, బోత్, అసిపాబాద్, వనపర్తి, జమ్మలమడుగు, మదనపల్లి, కందుకూరు, కొత్తగూడెం, పరకాల, నర్సీపట్నం, పాడేరు, పాలకొండ మొదలైన రెవిన్యూ డివిజన్ కేంద్రాలకు కూడా రైలు మార్గం విస్తరించలేదు.

కీర్తిశేషులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు 1946 లో "విశాలాంధ్ర లో ప్రజారాజ్యం" అనే పుస్తకంలో 12 రైలు మార్గాలు వెయ్యాలని కోరారు. అవి ఈనాటికి కూడా నిర్మించబడలేదు. ఆయన కోరిన రైలు మార్గాలు ఇవి

  • 1. విశాఖపట్నం-భద్రాచలం-వరంగల్లు
  • 2. హైదరాబాద్-దేవరకొండ-మాచర్ల-దొనకొండ-పొదిలి-ఒంగోలు
  • 3. ఒంగోలు-అద్దంకి-నర్సరావుపేట-సత్తెనపల్లి-అచ్చంపేట
  • 4. ఒంగోలు-పొదిలి-కనిగిరి-బద్వేలు-కడప-రాయచోటి-మదనపల్లి-బెంగుళూరు
  • 5. నెల్లూరు-బద్వేలు-మైదుకూరు-ప్రొద్దుటూరు-ఆళ్ళగడ్డ-నంద్యాల-ఆత్మకూరు
  • 6. గూడూరు-రాపూరు-రాజంపేట-రాయచోటి-కదిరి
  • 7. రాయదుర్గ-కళ్యాణదుర్గ-అనంతపురం-తాడిపత్రి-కోయిలకుంట్ల-నంద్యాల
  • 8. బళ్ళారి-ఆదోని-కర్నూలు-ఆత్మకూరు-ఎర్రగొండపాలెం-మాచర్ల
  • 9. కదిరి-పులివెందుల-ఎర్రగుంట్ల-ప్రొద్దుటూరు
  • 10. ఖమ్మం-తిరువూరు-చింతలపూడి-జంగారెడ్డిగూడం-నిడదవోలు
  • 11. చల్లపల్లి-పామర్రు-గుడివాడ-నూజివీడు-తిరువూరు
  • 12. రాజమండ్రి-భద్రాచలం

ఆయన జీవిత కాలంలో ఈ రైలు మార్గాలను చూడలేకపోయారు. బొగ్గు, సిమెంటు, ఎరువులు, ముడి ఇనుము, ఆహారధాన్యాలు, పంచదార, బెల్లం, చేపలు, పండ్లు మొదలైన వస్తువుల మన రాష్ట్రం నుండి రవాణా అవుతాయి. ఈ రవాణా కోసం రైలు మార్గాలు ఎంతో అవసరం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన రాష్ట్ర ప్రభుత్వం 1960 లో ఈ క్రింది కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించారు.

  • కొవ్వూరు-భద్రాచలం-దంతెవాడ-(మద్యప్రదేశ్)
  • గద్వాల-రాయచూర్
  • రామగుండం-జగిత్యాల-నిజామాబాద్
  • లింగంపల్లి-పటాన్ చెర్వు-మెదక్-సిద్దిపేట-సిరిసిల్ల-కరీంనగర్- పెద్దపల్లి
  • జగ్గయ్యపేట-వాడపల్లి
  • నడికుడి-వినుకొండ-దర్శి-పొదిలి-ఉదయగిరి-ఆత్మకూరు-రావూరు-గూడూరు

ఈ మార్గాలన్నింటికీ ప్రాథమిక సర్వే పని పూర్తయ్యింది. కాని కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడం లేదు. ఇక ఆయా ప్రాంతాల ప్రజలు ఈ క్రింది రైలు మార్గాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడం-ఖమ్మం-సూర్యాపేట-నల్గొండ-జడ్ చర్ల కడప-ఆళ్ళగడ్డ-నంద్యాల బాపట్ల-నిజాంపట్నం- రేపల్లె-అవనిగడ్డ-మచిలీపట్నం తెనాలి-ఉయ్యూరు-గుడివాడ-ఏలూరు నర్సాపురం-రాజోలు-అమలాపురం-కాకినాడ ప్రజల ప్రయాణ అవసరాలను కేంద్రప్రభుత్వం శ్రద్ధగా గమనిస్తే ఈమార్గాలు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుస్తాయి. మన రాష్ట్రంలో ప్రస్తుతం 4958 కి.మీ. ల రైలు మార్గాలున్నాయి. ఇందులో 1610 కి.మీ. మీటర్ గేజి, 37 కి.మీ నెరోగేజి మార్గాలు. మీటర్ గేజి మార్గాలను బ్రాడ్ గేజి గా మార్చితే ఎన్నో సదుపాయాలు కలసి వస్తాయి. 770 కి.మీ. దక్షిణ, ఆగ్నేయ రైల్వేల పరిధిలో ఉంది. దీన్ని కూడా దక్షిణ మధ్య రైల్వేల పరిధిలోకి తేవాలి. 1966 లో సికిందరాబాద్ జోనల్ ఆఫీసు, 1974-90 లలో నడికుడి- బీబీనగర్ రైలు మార్గం మనం సాధించిన గొప్ప విషయం.

పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజాప్రతినిధులందరూ కలిసి పార్లమెంటులో కేంద్రం మీద ఈ రైలు మార్గాల కోసం వత్తిడి తేవాలి. 275 వేల చ.కి.మీ విస్తీర్ణం గల మన రాష్ట్రంలో ప్రతి వెయ్యి కిలో మీటర్ల భూమికి కేవలం 18 కి.మీ. రైలు మార్గం మాత్రమే ఉంది. సగటున ప్రతి ఆంధ్రుడు రైలు బండి ఎక్కాలంటే 45 కిలోమీటర్లు పోవలసి వస్తున్నది. కొన్నిచోట్ల అయితే దాదాపు 60 కి.మీ. వ్యాసార్థంలో రైలు సౌకర్యం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రిటిష్ వాడికంటే వేగంగా నిర్మాణం కావలసిన రైలు మార్గాలు నత్త నడక నడుస్తున్నాయంటే సిగ్గుచేటు. రైల్వే మంత్రి పదవి కూడా ఆంధ్రుల కింతవరకు ఇవ్వలేదు. మన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో ఏం చేస్తున్నారో అర్ధం కాదు. "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అని ఉద్యమాలు చేసి ఉక్కు ఫ్యాక్టరీ సాధించాం. మరి ఆ ఉక్కు ఇక్కడి రైలు మార్గాలకు, వంతెనలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తే బాగుంటుంది. ఈ రైలు మార్గాల నిర్మాణం వల్ల మన రాష్ట్రంలోని పరిశ్రమలు అభివృద్ధి అభివృద్ధి చెందుతాయి. వేలాది పేద కార్మికులకు ఉపాధి లభిస్తుంది. రాష్ట్ర రవాణా సమస్యలు తీరుతాయి. రోడ్డు రవాణా గణనీయంగా తగ్గి రోడ్లు పటిష్టంగా ఉండి, ఎక్కువ కలం మన్నుతాయి. ఒక తాలూకా కేంద్రం (విజయవాడ) కార్పొరేషన్ కావటం దేశ చరిత్రలో ప్రథమం. అది పెద్ద రైల్వే జంక్షన్ కావటం వల్లనే అంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఈ రైలు మార్గాల సాధన కోసం ఆంధ్రులంతా గట్టి కృషిసల్పాలి.--Nrahamthulla (చర్చ) 09:27, 23 ఆగష్టు 2013 (UTC)

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:రైలు&oldid=1881967" నుండి వెలికితీశారు