చర్చ:వ్యభిచారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

==అక్రమ సంబంధాలు ==hgdtrdqydddyf6arsycgyrdf

  • పెళ్ళికి ముందు శృంగారం పై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు: పెళ్లికి ముందు శృంగారం చట్టబద్ధమైన నేరం కాదు.ప్రజాదరణలేని అభిప్రాయాల్ని వ్యక్తంచేసినంత మాత్రాన వ్యక్తులను క్రిమినల్‌ చట్టం శిక్షింపజాలదు.అలా చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుంది.పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మాత్రమే శృంగారం జరగాలనేది మన సమాజంలో బలంగా ఉన్న అభిప్రాయం. ఐపీసీ 497 సెక్షన్‌లో నిర్వచించిన 'వ్యభిచారాన్ని' మినహాయిస్తే... వివాహ బంధానికి వెలుపల పెద్దలు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొంటే అది చట్టబద్ధమైన నేరం కాదు.పెళ్లికి ముందు శృంగారానికి చట్టబద్ధమైన అడ్డంకులేవీ లేవు.పెళ్లికి ముందు శృంగారం సహజీవనం తప్పుకాదని ఖుష్బూచేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగానో, హానికరంగానో లేవు. ఇలాంటి సామాజిక అంశాలపై బహిరంగ చర్చ జరిగే సంస్కృతి అభివృద్ధి చెందాల్సి ఉంది.'భారతదేశంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన సామాజిక వ్యవస్థ.అదే సమయంలో ఈ అభిప్రాయంతో ఏకీభవించని వ్యక్తులు, సంస్థలు కూడా ఉన్నాయన్న వాస్తవాన్ని మరువకూడదు. మన సమాజంలోనే కొన్ని జాతుల వారు పెళ్లికి వెలుపల లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రధాన జనజీవన స్రవంతిలో కూడా చాలా మంది పెళ్లికి ముందు శృంగారం తప్పుకాదని భావిస్తున్నారు.ఇద్దరూ ఇష్టపడి శృంగారంలో పాల్గొంటున్న కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దానిని సమాజం కూడా అంగీకరించాలని ఖుష్బూ కోరారే తప్ప అన్ని రకాల శృంగార కార్యకలాపాలకు బహిరంగ ఆమోదంగా దీనిని పరిగణించకూడదు.(ఈనాడు30.4.2010)

పరాభవంపాలైన దేశీయ ప్రముఖులు[మార్చు]

  • ప్రముఖ్ ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి నటి రంజిత తో కలిసి ఉన్న వీడియో ద్వారా అపఖ్యాతి పొంది, కేసులో చిక్కుకున్నారు.
  • ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఎన్‌.డి.తివారీ కి అనేకమంది అమ్మాయిలతో ఉన్న అక్రమ సంబంధాలు ఆంధ్రజ్యోతి తెలుగు చానెల్ ద్వారా బయటపడి రాజీనామా చేశారు
  • కాంగ్రెస్‌ పార్టీ కేరళ శాఖ ప్రధాన కార్యదర్శి రాజ్‌మోహన్‌ ఉన్నితాన్‌(57) మహిళలను అక్రమంగా తరలిస్తున్నారన్న కేసులో చిక్కారు.
  • బీజేపీ నేత సంజయ్‌ జోషి ఓ మహిళతో కలిసిన ఉన్న సీడీలు బయటికి వచ్చి పదవికి రాజీనామా చేశారు.
  • యూపీ మాజీ మంత్రి అమర్‌మణి త్రిపాఠీ మధుమిత శుక్లా అనే కవయిత్రితో అక్రమ సంబంధంనెరపి హత్య చేశాడు.హత్యకు గురైన ఆమె.. ఆ సమయానికి గర్భవతి కూడా. విచారణ సందర్భంగా కడుపులోని పిండం డీఎన్‌ఏ త్రిపాఠీ డీఎన్‌ఏతో సరిపోలింది. దాంతో ఆయనకు బెయిల్‌ ఇవ్వడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది.
  • ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి హరాక్‌ సర్కార్‌ రావత్‌ పెళ్లికాని తల్లితో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై రాజీనామా చేశారు.
  • తెహల్కా స్టింగ్‌ ఆపరేషన్‌ లో సమతా పార్టీ కోశాధికారి ఒకరు వేశ్యలను ఏర్పాటు చేసేందుకు బేరాలాడారు.కొందరు ఆర్మీ అధికారులు రక్షణ కాంట్రాక్టులు వచ్చేట్టు చేయాలంటే తమకు ఖరీదైన వేశ్యలు కావాలని విలేఖరులను డిమాండ్‌ చేశారు .
  • కేరళ నేత పి.కె.కుంజలికుట్టి కోజికోడ్‌లోని ఐస్‌క్రీం పార్లర్‌ ను సెక్స్‌ వ్యాపారానికి ఉపయోగించేవారు. ఈ కుంభకోణంలో పలువురు కమ్యూనిస్టుల నేతలపైనా ఆరోపణలు వచ్చాయి.
  • కాశ్మీర్‌ సెక్స్‌ స్కాండల్‌ లోతమను సీనియర్‌ అధికారులు, భద్రతాదళాల అధికారులు లైంగిక అవసరాల కోసం ఎలా ఉపయోగించుకున్నదీ బాధిత బాలికలు వెల్లడించారు
  • ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో ఆరోగ్య మంత్రి కార్యదర్శి గిరిరావు మంత్రి చాంబర్‌లోనే శృంగారం జరిపిన మూలంగా ఉద్యోగం నుంచి తొలగించారు.
  • రక్షణ మంత్రి జగ్జీవన్‌రామ్‌ కుమారుడు సురేష్‌ ఒక మహిళతో నగ్నంగా ఉన్న ఫొటో పత్రికలో ప్రచురితమైంది.

విదేశీ ప్రముఖులు[మార్చు]

  • బిల్‌ క్లింటన్‌-అమెరికా అధ్యక్షుడు.వైట్‌హౌస్‌ ఉద్యోగిని మోనికా లూయిన్‌స్కీతో ముఖ రతి జరిపారన్న ఆరోపణలపై అభిశంసనకు గురయ్యారు.
  • జాన్‌ ఎఫ్‌ కెన్నడీ-అమెరికా అధ్యక్షుడు.హాలీవుడ్‌ అందగత్తె మార్లిన్‌ మన్రోతో వ్యవహారం నడిపారని ఆరోపణలొచ్చాయి. 1962లో మన్రో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
  • ఇలియట్‌ స్పిట్జర్‌-న్యూయార్క్‌ గవర్నర్‌.ఏకంగా ఎంపరర్స్‌ క్లబ్‌ వీఐపీ పేరుతో 50 మంది వేశ్యలతో ఒక రాకెట్‌నే నడిపారని వెల్లడైంది.
  • మోషే కట్సవ్‌-ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు దాదాపు పది మంది మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాలతో పదవి నుంచి తప్పుకున్నారు.
  • పాల్‌ ఉల్ఫోవిజ్‌- ప్రపంచబ్యాంకు అధిపతి తన వద్ద పని చేస్తున్న ప్రియురాలు షాహాను విదేశాంగ మంత్రి జీతం కన్నా అధికం ఇచ్చేట్లు పదోన్నతిపై పంపించి తన పదవి కోల్పోయారు.
  • జేమ్స్‌ మెక్‌గ్రీవీ-అమెరికాలో తొలి గే గవర్నర్. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన మాజీ అంగరక్షకుడు గోలన్‌ సిపెల్‌ ఫిర్యాదు చేయడంతో రాజీనామా చేశారు.

సంబధం లేని ఛర్ఛ[మార్చు]

వ్యాసానికి ఈ ఛర్ఛకు సంబంధం లేదు. అక్రమసంబంధాలు విషయం మీద వ్యాసానికి ఈ పైన వ్రాసినవి ముడి సరుకు.

వ్యాసం లో ఫోటోలు[మార్చు]

అపైన, వ్యాసంలో ఉన్న ఫొటోలు అసభ్యంగా ఉన్నాయి. ఆ ఫొటోలు ఎలా సమ్మతింఛారో, నిర్వాహకులే ఛెప్పాలి. ఛిన్న ఛిన్న విషయాలికి దురుసుగా వ్యవహరించే కొందరు నిర్వాహకులు ఈ ఫొటోలు ఛూసి కూడా ఊరుకున్నారంటే........!

మూలాలు[మార్చు]