చర్చ:హిందువులపై అకృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అజ్ఞాత సభ్యులు, నిషేధింపబడిన సభ్యులు వ్యాసరచనతో సంబంధంలేని అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలకు స్పందించడం అనవుసరం అని గమనించగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:56, 16 డిసెంబర్ 2008 (UTC)

ఇటువంటి వివాదాస్పద వ్యాసాలను తొలగించకున్నా మరిన్ని వ్యాసాలు మొదలయ్యే ప్రమాదం ఉన్నది. --Svrangarao 13:17, 5 డిసెంబర్ 2008 (UTC)

తీవ్రవాదులకు కొందరు భారతీయ ముస్లిం ల సహకారం

"Despite being a proscribed outfit, LeT still enjoys funding from ISI and through donations from a wide range of domestic and overseas sympathisers, including Indian Muslims." http://in.news.yahoo.com/48/20100406/1246/twl-india-s-political-establishment-on-l.html

  • ఈ దేశంలో పుట్టటమే ఏ మతస్థుడికైనా ఎన్నోజన్మల పుణ్యఫలం. తీవ్రవాది ఏ మతాన్నీ అనుసరించలేని అరాచకవాది. నరహంతకులు, సాటిమనిషిని ప్రశాంతంగా బ్రతకకుండా చేసేవాళ్ళు ఏ మతంలో ఉన్నా వారిని కఠినంగా అణిచివేయాలి. యోగి వేమన చిత్రం కోసం సముద్రాల రాఘవాచార్యులు 1947లో రాసిన ఈ పాటతో ఏకీభవించని మతాలు ఉండవనుకుంటాను:
ఇదేనా ఇంతేనా జీవితసారమింతేనా?

అంతులేని ఈ జీవనవైభవమంతయు తుదకు నశించుటకేనా?

సకల శాస్త్రములు పారసమిడినా

అఖిల దేశముల ఆక్రమించినా కట్టకడకు ఈ కాయము విడిచీ మట్టిగలిసి పోవలెనా?మట్టిగలిసి పోవలెనా?--Nrahamthulla 12:56, 7 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షర సత్యము. ఇది ఇస్లామిక మతానుయాయులందరికీ ఎవరు చెప్పుతారు? చెప్పగలరు?Kumarrao 16:54, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ఈదీ అమీన్

ఈదీ అమీన్ నిజంగానే హిందువుల నరమాంసం తిన్నాడు. భారత నాస్తిక సమాజం మీటింగులలో మేము ఈదీ అమీన్ రాక్షసత్వం గురించి వివరంగా చెప్పినప్పుడు జనం భయపడిపోయేవారు. ఈదీ అమీన్ నిజంగా ఇస్లామిక్ ఉన్మాదే. అందుకే అతనికి సౌదీ అరేబియా ప్రభుత్వం ఆశ్రయం ఇచ్చింది.

  • నరమాంసభక్షకుడికి మతం ఏమిటి? ఇతను సంభోగశక్తిపెరగటంకోసం హిందువులు ముస్లిములు క్రైస్తవులు అనే తేడా లేకుండా బలిష్టుల వృషణాలు కాల్చుకుతినేవాడని కధలుగా చెప్పుకున్నారు. నరమాంసభక్షణ చెయ్యమని ఇస్లాం చెప్పిందా? ఇస్లాం చెప్పిన ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని పెడచెవిన పెట్టి సౌదీ అరేబియాలో రాచరికపాలన కొనసాగిస్తున్నారు.--Nrahamthulla 02:23, 15 డిసెంబర్ 2008 (UTC)

ఇస్లాంలో ప్రజాస్వామ్యమా? బలోచిస్తాన్ లో పాకిస్తానీ ప్రజస్వామిక ప్రభుత్వపు సైనికులే మహిళా డాక్టర్ ని రేప్ చెయ్యడం వల్ల బలోచీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయి సైనిక కేంద్రం పై దాడి చేశారు. టర్కీలోని ఒక ప్రజాస్వామిక హాస్టల్ లో ముగ్గురు అమ్మాయిలకి బలవంతంగా కన్యత్వ పరీక్షలు చెయ్యించడం వల్ల వారు అవమానం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈజిప్ట్ లో వాయెల్ అబ్బాస్ అనే జర్నలిస్ట్ జైళ్ళలోని ఖైదీల పై జరుగుతున్న చిత్రహింసలకు వీడియోలు తీశాడని అతన్ని కూడా జైళ్ళో పెట్టారు. ఇరాన్ లో ఆడవాళ్ళు బురఖా వేసుకోకపోతే వాళ్ళ ముఖాల మీద ఏసిడ్ పోస్తారు. హిందూ తాలిబాన్ సంస్థ అయిన ఆర్.ఎస్.ఎస్. చేతికి ఇండియాని అప్పగిస్తే ఇండియా కూడా ఇలాగే తయారవుతుంది. మతానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పొంతన కుదురుతుందని భ్రమ పడవలసిన అవసరం లేదు. సభ్యులు:Kumarsarma

మా భారత నాస్తిక సమాజం మీటింగ్ లకి రా. సమాధానం చెపుతాం. ఆర్.ఎస్.ఎస్. వాడైనా, క్రైస్తవ సామ్రాజవాదైనా, ఇస్లామిక్ ఉన్మాదైనా వాళ్ళ చరిత్రలని నగ్నంగా బయట పెడతాం.

@kumarrao@Kumarsarma - వికీలో 'మీటింగ్ లకి రా. సమాధానం చెపుతాం' వంటి జవాబులు ఇవ్వడం సముచితంగా లేదు. వాక్యానికి తగిన మూలం ఇస్తే చాలు. నిర్వాహకులు ఈ సభ్యుడి పదప్రయోగాన్ని గమనించగలరు. --Svrangarao 05:26, 15 డిసెంబర్ 2008 (UTC)
  • థాంక్యూ Svrangarao గారూ సభ్యుడికి సభ్యత ముఖ్యం.భారత నాస్తిక సమాజం హేతుబద్ధమైన వాదనలు వినిపించిందికానీ ఇలా పిడివాదం చెయ్యలేదు.గాంధేయ నాస్తికవాదం అవలంభించిన గోరా ఎందరికో ఆదర్శప్రాయుడు కాలేదా?నరమాంసభక్షణ ప్రజాస్వామ్యం విషయాల్లో ఇస్లాం చెప్పిందానికి భిన్నంగా వ్యవహరించేవాళ్ళది తప్పు కానీ ఇస్లాంది తప్పు కాదు.మేధస్సును మేధస్సుతో ఎదుర్కోవాలి కానీ హింసకు తెగబడ కూడదు తెలివిగా జవాబివ్వాలికానీ తిట్లకు వ్యక్తిగత విమర్శలకూ దిగకూడదు.--Nrahamthulla 05:57, 15 డిసెంబర్ 2008 (UTC)

ప్రపంచంలోని ఒక్క ఇస్లామిక్ దేశంలోనైనా ప్రజాస్వామ్యం ఉందని నిరూపిస్తే నేను చెవిలో పువ్వులు పెట్టుకుని గాడిద మీద ఊరేగుతాను. జయగోపాల్ గారు పాకిస్తాన్, ఇజ్రాయెల్, పాలస్తీనాలలో జరుగుతున్న మత హింస గురించి భయంకరమైన లెక్చర్లు ఇచ్చారు. అతని ప్రభావం వల్లే నేను వీర నాస్తికున్నయ్యాను.

  • అందుకే మీ భయంకరమైన లెక్చర్లు కు ఇస్లాం కధావస్తువయ్యింది. ప్రజాస్వామ్యం లేని ఏఒక్క ఇస్లామిక్ దేశాన్నీ సమర్దించకండి..ప్రజాస్వామ్యాన్ని ప్రబోధిస్తూనే ఉండండి. కాదన్నదెవరు? వీరనాస్తికుల్ని ఎవరూ సవాలు చేయకపోయినా సవారీ చేస్తుంటారా?--Nrahamthulla 13:20, 16 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసం

వ్యాసము పూర్తి చేయుటకు సమయము పట్టవచ్చును. ముఖ్యముగా ఆంగ్ల వికీలోనున్న వ్యాసము నుండి విషయములు గ్రహించబడుచున్నవి (http://en.wikipedia.org/wiki/Persecution_of_Hindus#During_Islamic_rule_of_the_Indian_sub-continent).Kumarrao 13:04, 5 డిసెంబర్ 2008 (UTC)

  • Kumarrao గారూ పూర్వం ఎవరో పెంటతిన్నదృశ్యాలు ఇప్పటికీ గుర్తుచేసేకంటే మనప్రజలు శాంతిసామరస్యాలకోసం ఇప్పుడు ఏం చెయ్యాలో చెబితే బాగుంటుంది.అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి.నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే.పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు.ఏది ఏమిటో తెలుసుకున్నాక నేను ఆస్తిక హేతువాది ని మానవవాది ని అయ్యాను.నామకార్ధంగా ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడుపుతున్ననాలాంటి భరతమాత ముద్దుబిడ్డలు ఈ దేశంలో కోట్లాదిమంది ఉన్నారు.మానినపుండు మళ్ళీ సెలపోసేలా చేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదంలో భాగస్తులే.ఒకవేళ అంతగా అకృత్యాలు చేసే ఇస్లామ్ మతాన్ని వద్దనుకొని ఈనాటి ముస్లిములు బయటకు రాదలుచుకున్నా హిందూ మతంలో మాత్రం చేరే చట్టపరమైన అవకాశం లేదే?అందరికీ సగౌరవంగా బ్రతికే దారికావాలి.కౌరవ సంతతినైనాసరే నిందించి నలిపి చంపటం కంటే మానవత్వంతో కలుపుకు పోవటమే మంచిది.ఎప్పుడో ఎవరో చేసిన అకృత్యాలను మళ్ళీ మళ్ళీ కొన్ని తరాలపాటు గుర్తుచేసి ఆ మతంలో ఉన్నఈనాటి వారసుల్ని నిందలువేసి అవమానిస్తే అది హిందూ మతం ప్రకారం మోక్షసిద్ధినిస్తుందా?హింసకు జవాబు హింసేనా? అహింసకాదా?ఎవరు తప్పుచేస్తే వారినే శిక్షించాలి.ఆంగ్ల వికీనుండి గ్రహించినా అశుద్ధం అశుద్ధమే.దాన్నే ఇష్టంగా ఎత్తుకొచ్చి అందరికీ చూపించటం అనర్ధదాయకం.వికీలో ఇలాంటి వ్యాసాలు ఎందుకు?ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ వ్యాసం?వెంటనే తొలగించండి.--Nrahamthulla 14:36, 5 డిసెంబర్ 2008 (UTC)
మతాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యాసాలను తొలిగించాలని నెలరోజుల క్రితమే ప్రతిపాదిస్తే సభ్యులు ఉదాసీనంగా వ్యవహరించి సమస్య ఇంతవరకు తీసుకువచ్చారు. దీనికి సభ్యులందరూ బాధ్యులే. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:43, 5 డిసెంబర్ 2008 (UTC)
ఈ చర్య ఏ విధముగను సమర్ధనీయము కాదు. వివాదములేని వ్యాసము అనువదిస్తుంటే అభ్యంతరము చేయుట పలు అనుమానాలకు దారి తీస్తున్నది. కుహనా ఉదారవాదులు, హేతువాదులు ఎంత వరకు నిజముగా వారు చెప్పు భావాలకు అంకితమయ్యారు? నిజాలను కప్పిపెట్టి, భరతదేశంలో వేయి సంవత్సరాలుగా హిందువులపై జరిగిన, జరుగుతున్న అకృత్యాలను కనీసము నామమాత్రముగా కూడ ఉటంకించని వ్యాసాలను వికీలో ఎలా ఉండనిచ్చారు? దానిపై ఎందుకు చర్చ జరగలేదు? ఉదా: భారతదేశంలో ఇస్లాం. ఇది పూర్వ కాలపు సమస్యా? ఘజనీ, ఘోరీ లకు, నిన్న గాక మొన్న ముంబాయిలో మారణకాండ గావించిన పాకీస్తానీ ముస్లిం ఉగ్రవాదులకు తేడా ఏమిటి? వారు కత్తులు వాడారు. వీరు ఎ.కె. 47లు వాడారు. సమస్యకు మూలం ఒకటే. అది మానవాళి సర్వవినాశనానికి దారి తీసే పరిస్థితులు కల్పిస్తున్నది. ఈ విషయముపై శాస్త్రీయ దృక్పథముతో, తర్కముతో కూడిన నిర్ణయము తీసుకోవాల్సిన సమయమొచ్చింది.Kumarrao 15:11, 5 డిసెంబర్ 2008 (UTC)
I suggest that we should work first on those topics that relate to Telugu in some way. Although this is a very interesting and a highly debatable topic, we rather remove it for the present. KumarRao, why don't you point out clearly the objectionable places in the "discussion page" for భారతదేశంలో ఇస్లాం?59.93.78.234 21:10, 5 డిసెంబర్ 2008 (UTC)
ప్రస్తుతము వ్యాస సంబంధిత చర్చలపై మారటోరియం ఉన్నది. పది దినముల పిదప చర్చిద్దాం. ఈలోపు మీరు వికీలో ఊరు, పేరులతో సభ్యులు కండి.Kumarrao 15:40, 7 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసంలోని సమాచారం

ఈ వ్యాసంలో ఇంతవరకూ ఒక్క వాక్యానికి కూడా మూలాలను తెలుపలేదు. సభ్యులు అన్నీ తమతమ సొంత అభిప్రాయాలను వ్యాసంలో తెలుపుతున్నారు. ఇది వికీ నియమాలకు విరుద్దం. దయచేసి మీరు ఇక్కడ తెలుపుతున్న సమాచారానికి ఆధారాలు మూలాలను తెలుపండి. అలాగే, ఈ వ్యాసం హిందువులపై అకృత్యాలు అనే అంశంపై ఉంది. ఇందులో క్రైస్తవులపై, ముస్లిములపై ఇతర మతాలపై అకృత్యాల గురించి ఎందుకు ఉంది. వాటిని వేరేగా వాటికి కేటాయించిన వ్యాసాలలోకి తరలించాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:44, 10 డిసెంబర్ 2008 (UTC)

మూలాలు కావాలి. లేకున్నచో ఈ వ్యాసాన్ని తొలగించటానికి ప్రతిపాదించవచ్చు. Chavakiran 09:15, 12 డిసెంబర్ 2008 (UTC)
వ్యాసము తొలగించుటకు నేను వ్యతిరేకము. వ్యాసము నేనే మొదలుపెట్టాను. ఆంగ్ల వికీలోనున్న వ్యాసాన్ని అనువదిస్తున్నాను. వ్యాస సంబంధిత చర్చపై మారటోరియం వల్ల ప్రస్తుతానికి అపాను. కొద్ది దినములలో ప్రతివాక్యమునకు మూలములు ఉదహరించుతూ వ్రాయగలను. సత్యదూరమగు విషయములు వ్యాసములో ఉండవు.Kumarrao 13:49, 13 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసము

వ్యాస రచన కొనసాగించబడుతున్నది. ఆంగ్లవికీలోని వ్యాసము సౌలభ్యము కొరకు అతికించబడినది. వ్యాసములోని విషయములతో ఏకీభవించని వారు తొలుత ఆంగ్ల వ్యాసములో చర్చించి, మార్పులు చేసి అప్పుడు తెలుగులో చర్చా పుటలో చర్చించ ప్రార్ధన. Kumarrao 11:19, 18 డిసెంబర్ 2008 (UTC)

గతంలో ముస్లింలు హిందూ పురుషులని చంపి వారి భార్యలని రేప్ చేసేవారన్నది నిజం కాదా? మనం చరిత్ర తెలుసుకోవడం అవసరం లేదా?

వ్యాసంలో పెద్ద పెద్ద ఇంగ్లిష్ పేరాగ్రాఫ్ లు కనిపిస్తున్నాయి. అవి తెలుగులోకి అనువదించొచ్చు కదా. అనువదించకుండా copy & paste చెయ్యడం ఎందుకు?

సూచనలు

మృత్యుంజయ గారు, మీ సూచనకు ధన్యవాదాలు. మీ వద్ద ఏదైనా ప్రమాణము గాని నిదర్శనము గాని ఉంటే సూచించవచ్చు. కొందరు పారశీకులు వ్రాసిన గ్రంథములలో అట్టి ఉదంతాలు ఉన్నాయి. అవి వ్యాసములో త్వరలో ఉదహరించబడతాయి. ఆంగ్ల వికీలోని సమాచారములు ఒక్కటొక్కటి తొలగించబడతాయి. 59.88.113.168 గారు, మీరు వికీ సభ్యులు కండి. అప్పుడు మాట్లాడుకుందాము. Kumarrao 13:27, 29 డిసెంబర్ 2008 (UTC)

కుమారశర్మ, రావుకుమార్ మున్నగు సభ్యుల పేర్లు అనుకరణలా? లేక నిజనామములా?Kumarrao 13:29, 29 డిసెంబర్ 2008 (UTC)

మూలాలు

కొన్ని వాక్యములకు ఇంకా మూలాలు సూచింపలేదు. త్వరలో ఇవ్వబడతాయి. గమనింపగలరు.Kumarrao 13:25, 3 జనవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించండి

  • ఒక మతం హత్యల్ని మరొకరు ఎత్తి చూపే వ్యాసాలు కొనసాగించటంనిష్ప్రయోజనం. అన్ని మతాలలో హింస ఉంది. మతచరిత్రల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే సంఘటనలను పేర్కొనాలి. అన్ని మతాలవాళ్ళూ వారి వారి మతాల కోసం అకృత్యాలకు పాల్పడ్డవారే. కానీ ఒక మతం కొమ్ముకాసే వారికి సొంతమతం పేరుతో జరిగే అరాచకాలు పుణ్యకార్యాలుగా కనబడతాయి. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమే. పుట్టిన బిడ్డలు ఫలానా మతంలో పుట్టాలని కోరుకుని పుట్టరు. ఒక మతస్తులు గతంలో అకృత్యాలకు పాల్పడ్డారని ఆమత వారసులందరూ నేరస్తులైనట్లు వారు చేయని నేరానికి వారిని అపరాధభావనకు గురిచెయ్యటం అవమానించటం కూడా అకృత్యమే. ముస్లిముల పేర్లుపెట్టుకుని శాంతియుత జీవనం గడిపే వారికి వారి పూర్వీకులఅకృత్యాలను పదేపదే గుర్తుచేసే మతవాద రచయితలు కూడా ఉగ్రవాదులే. అశుద్ధం అశుద్ధమే. దాన్ని అందరికీ చూపించటం అనర్ధదాయకం. ఈ వ్యాసంవెంటనే తొలగించండి--Nrahamthulla 03:24, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

సమాధానం చెప్పడం చేతకాక తొలిగింపు డిమాండ్ చేస్తున్నావా?

తొలగింపుకు వ్యతిరేకం

  • మతపరమైన హింసకి సంబంధించిన వ్యాసాలు కూడా ఉండాలి. కానీ అవి నిజానిజాల్ని సరైన మూలాలతో తెలియజేసేవిగా ఉండాలి. ఇవి కొందరికి బాధకలిగించినా చరిత్రను యధాతథంగా ఉంచడానికి మనం అందరూ ప్రయత్నించాలి. వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉండకూడదని నా అభిప్రాయం.Rajasekhar1961 04:11, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే ప్రతిదానికి మంచీ, చెడూ రెండూ ఉంటాయి. అయితే కేవలం విమర్శగానే చూడటం మాత్రం సరైనది కాదు. ఇదివరకు ఒక అజ్ఞాత సభ్యుడు కేవలం మతాలను విమర్శించడం కోసమే రచనలు చేస్తున్నప్పుడు మతాలకు వ్యతిరేకంగా వ్యాసాలు వద్దు అని చర్చ తీసినది నేనే. చరిత్రను చూస్తే ప్రతి మతంపై ఇతర మతాల అకృత్యాలు ఉన్న సంగతి వాస్తవమే కావచ్చు, అంతమాత్రాన ఇతర మతాలను విమర్శించడం సమంజసం కాదు. ఇది చాలా సున్నితమైన విషయం అని నేను ఎప్పుడో చెప్పాను. విమర్శ అనేది విమర్శగానే ఉండాలి కాని కక్షతో, పగతో చేసేది/రాసేదిగా ఉండకూడదు. ప్రస్తుతం వ్యాసాలలో ఉన్న వివాదాస్పద మరియు ఆధారంలేని వాక్యాలను తొలిగిస్తే సరిపోతుంది. ఒక మతానిపై కేవలం అకృత్యాలు మాత్రమే కాకుండా ఇతర మతస్థులు చేసే మంచి పనులు కూడా వ్యాసాలలో చేర్చాలి. ఎందుకంటే పరాయి మతస్థులందరూ ఎదుటి మతంపై విమర్శించే వ్యక్తులు కారు. -- C.Chandra Kanth Rao-చర్చ 20:22, 22 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • తొలగింపునకు కారణములు లేవు. ఈ వ్యాసములో ఏ విషయమైననూ అసంబద్ధము, అసంగతము, నిరాధారము ఐనచో చర్చించి ఎడిట్ చేయవచ్చును. వ్యాసము వ్యక్తులను, మతమును కించపరచుటకు వ్రాయలేదు. ఇది చారిత్రకము. నాణెమునకు రెండు వైపుల చూడాలి. మనకు నచ్చని విషయములు చాపక్రిందకు త్రోసివేయుట తగదు. చరిత్ర ను నిష్పాక్షికముగా పరిశీలించి భవిష్యత్ కాలమును పదిలపర్చుకొనుటకు ఇట్టి వ్యాసములు చాల అవసరము. Kumarrao 04:21, 23 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని తొలిగించడం ఎందుకు? ప్రముఖ నాస్తికుడు కత్తి మహేష్ కుమార్ గారు మతం గురించి ఆసక్తికరమైన విషయాలు వ్రాయగలరు. అతన్ని ఇక్కడికి తీసుకొస్తే మంచిది. తొలిగింపు ఐడియా మంచిది కాదు. అదేదో సినిమాలో విలన్ చరిత్ర అడక్కు, చెప్పింది విను అంటుంటాడు. మీ మాటలు కూడా అలాగే ఉన్నాయి.

జిహాద్ని కీర్తించే రాతలు రాస్తే తప్పు కాదు కానీ హిందువుల పై అకృత్యాలని ప్రశ్నిస్తే తప్పా? నేను హిందువుని కాదు. నేను సిక్కు మతస్తుడిని. మీ రాతలు మత పక్షపాతం చూపేలా ఉన్నాయని గుర్తుంచుకోండి.

వర్గాలు

ఇస్లాం నిజస్వరూపాన్ని బట్టబయలు చేసే ఇట్టి వ్యాసాలు ఇస్లాం కు సంబంధించిన అన్ని వ్యాసాలలో ఉటంకించాలి. గుట్టు చప్పుడు కాకుండా మార్పులు చేయుట వాడుకరి నిజస్వరూపము తెలియచేస్తున్నది.Kumarrao 15:50, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడు తాలిబాన్ ఉగ్రవాదులు కూడా ఇండియా వైపు వస్తున్నారు. మతోన్మాదం గురించి తెలుసుకోవడం తప్పా?


ఈ వ్యాసం హిందూమతానికి సంభందించిన ఒకానొక అంశాన్ని వివరిస్తుంది. అక్కడక్కడా ఇస్లాం గురించి, క్రైస్తవం గురించి ప్రస్తావన వచ్చినంత మాత్రాన ఇది ఆ మతాలకు సంభందించిన వ్యాసం కాదు. ఇది కేవలం హిందూమతానికి, చరిత్రకు, హిందూ మతంపై వ్యతిరేకతకూ సంభందిన వ్యాసం మాత్రమే. వ్యాస వర్గీకరణను సరిచేసినంత మాత్రాన నిజస్వరూపం బయటపడటంలాంటి పెద్దపెద్ద మాటలు అవసరంలేదు అనుకుంటా. __మాకినేని ప్రదీపు (+/-మా) 18:00, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
I am sorry for my earlier comment, but, please continue your great work and donot take any action of any user seriously. I did the mistake too and rependted, and hece the post again. Forgetting everything else, we are here for the sharing our knoweldge and provide a repository for the coming generations. Issues with past should not be made presntకిరణ్మయీ 19:21, 9 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
కుమారరావు గారూ, ఎంతో శ్రమతో ఈ వ్యాసాన్ని తెనుగించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు. ఈ వ్యాసం ప్రదీపన్నట్టు ఇతర మతాల వర్గాలలో అనవసరం. దయచేసి వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగవద్దు. సదరు వాడుకరి సరైన స్ఫూర్తితోనే ఆ వర్గాలను తొలగించారని భావిస్తున్నాను. --వైజాసత్య 02:10, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • మనకు పులి భయం,పులికి మన భయం.అసలు ఈ వ్యాసమే వద్దు అంటే నరహంతక చరిత్రకూడా ఉండాల్సిందే అని కొందరు దీన్ని కొనసాగిస్తున్నారు.అనుములు తిన్నతరువాత అపానవాయువులకు వెరిస్తే ఎట్లా?ఈ సబ్జెక్టే అలాంటిది.అహ్మద్ భాయ్ మంచి చేసినా చెడే ఔతుంది.అదంతే.--Nrahamthulla 03:10, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
దయచేసి వ్యక్తిగత విమర్శలు పక్కన పెడదాం. --వైజాసత్య 03:19, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
  • నా చర్చా పేజీలో నిస్సారు గారు అడిగిన దానికి ఇది సమాధానంగా వ్రాస్తున్నాను. ఎదుటి వారిని నొప్పించేది నిజం అయినా అది చెప్పకుండా మౌనం వహించటం మంచిది. వీకీలో విజ్ఞనానికే పెద్ద పీట. ఇలాంటి వాదోపవాదాలు వీకీ ప్రయోజనాలను దెబ్బతీస్తాయి. భాతీయతంటే వివిధ మతధర్మాల సమన్వయం. వారి వారి ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం సబబు . సున్నితమైన విషయాలకు దూరంగా ఉండటం వీకీ ప్రయోజనాలకు మంచిది.వ్యక్తిగత విమర్శలకు తావివ్వడం మంచిదికాదు. --t.sujatha 04:08, 10 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

మెంటలెక్కిన దొంగ సన్నాసులు వ్రాసిన వ్యాసం లాగ ఉంది ఇది.

తాలిబాన్ గాళ్ళని చూస్తోంటే చరిత్రలో జరిగిన తప్పులు పునరావృతం అవుతున్నట్టు తెలియడం లేదా? ఇస్లామిక్ ఉన్మాదం గురించి నిజాలు వ్రాస్తే తప్పేమిటి?

ఈ పైన రెండు వ్యాఖ్యలు ఒక ఆకాశరామన్న గారు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎవరూ స్పందించవలసిన అవసరం లేదు. --వైజాసత్య 16:10, 12 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆత్మహత్యా సదృశమ్

ఈ వ్యాసము చరిత్ర. తగు ఆధారాలతో వ్రాయబడుతున్నది. 90% ఇస్లాముకు సంబంధించినది. గత వేయివర్షములుగా ఉదారవాదులగు హిందువులు (పులులు గారు) ఎంత ఘోరాతిఘోరమగు అకృత్యాలకు గురయ్యారో అద్దములో చూపించు చేదు సత్యము. ఈ చరిత్ర ప్రతిరోజూ ఎలా పునరావృతమవుతున్నదో అందరికీ తెలుసు. చరిత్ర తెలుసుకొని, అది చెప్పే పాఠాలు నేర్చుకున్నచో ఒక జాతి మనగలుగుతుంది. సత్యాలను చాప క్రిందకు త్రొయడం ఆత్మహత్యా సదృశమ్. కుహనా ఉదారవాదులకు భయపడి పచ్చినిజాలను మరుగు పరచవద్దనినా మనవి. అన్ని మార్పులు త్రిప్పబడ్డాయి.Kumarrao 13:56, 16 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

ఆధారాలతో వ్రాస్తున్నారు. ఒప్పుకున్నాం. బాగానే ఉంది. మీ రచనల నిష్పాక్షికతను, ఉద్దేశాలను ప్రశ్నార్ధకం చేసే విధంగా వ్యాఖ్యలు చెయ్యటం వలన వికీతో సహా, మీరు బాధితులని బాధపడుతున్న వర్గానికిన్నూ మరెవరికున్నూ పెద్దగా ఉపయోగమేమీ లేదు. --వైజాసత్య 23:27, 16 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
మరో విషయం. ఈ వ్యాసంలోని ఏ విషయాన్ని ఏ సభ్యుడు ఇంతవరకు అసత్యమని కానీ, దాచిపెట్టడానికి కానీ ప్రయత్నించలేదు. హిందువుల గురించి ఉదారవాదుల గురించి చర్చ ఇక్కడ అనవసరం --వైజాసత్య 23:31, 16 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
కుమారరావుగారు, వ్యాసంలో "ముగింపు" అనే విభాగంలో రాసిన వాక్యాలు, పత్రికలలో రచయత తాను అప్పటిదాకా చేసిన వాదనను మరింత బలం చేకూర్చటానికి రాసిన వాక్యాలకు మల్లే ఉన్నాయి. ఆ వాక్యాల వలన వ్యాసానికి ఎటువంటి విజ్ఞానపరమైన ప్రయోజనం చేకూరటంలేదు. తీసేసిన ఆ మార్పును మరలా ఎందుకు చేర్చారో చెప్పగలరు. అలాగే వ్యాసంలో విషయం "హిందువులపై" జరిగిన అకృత్యాలను ఏకరువు పెడుతుంది. అంత మాత్రాన అది ఇస్లాంమతానికి సంబందించిన వ్యాసం ఎలా అయిపోయిందో నాకు అర్థం కాలేదు. దాని గురించి కూడా మరింతగా నాకు వివరించగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 09:27, 17 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]
హిందువులపై హిందువులు చేసిన అకృత్యాలు, హిందువులు ఇతరులపై చేసిన అకృత్యాలు, ఇవి కూడా వున్నాయిగా? అకృత్యాలు ఒక వర్గం వారిపై ఆ వర్గంవారు గాని, వేరే వర్గంవారు గాని చేసినవే. మతాల పేర్లు వద్దు.కిరణ్మయీ 15:09, 17 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]

అంగీకారం

వైజాసత్య గారు, ప్రదీపు గారు ఇచ్చిన సలహా తో ఏకీభవిస్తున్నాను. ముగింపు తొలగించాను. వ్యాసము ఇస్లాము మూలప్రవచనములకు, వానివల్ల జరిగిన, జరుగుతున్న సంఘటనలకు సంబంధించినది. ఆ విధముగా వ్యాసము నేరుగా ఇస్లాం మతానికి, మతానుయాయులకి, వారి మనోప్రవృత్తికీ, ముఖ్యముగా భారత దేశం లో ఇస్లాం మతవ్యాప్తికీ సంబంధించినది. వ్యాసములోని ప్రతి యుద్ధము, మారణకాండ, హింసాత్మక ఘటనలు ఇస్లాం పేరు మీద జరిగినవే. ముస్లిం రాజులు, సుల్తానులు చేసిన అట్టి "పవిత్రకార్యాలను" వారి చరిత్రకారులే వేనోళ్ళా కొనియాడారు. వ్యాసమునకు, ఇస్లాం నకూ సంబంధములేదనుట తర్కవిరుద్ధము. గమనించగలరు.Kumarrao 10:58, 19 జూలై 2009 (UTC)[ప్రత్యుత్తరం]


సరే! పైన గౌరవనీయులైన సభ్యులు సూచించినట్లుగా ఈ వ్యాసాన్ని తొలగించడమో లేదా ఆపివేయడమో చేద్దాం. చేదుచరిత్ర తెలుసుకోవడం, చదవడం వల్ల ఉదారవాదులకు, మానవతావాదులకు చాల ఇబ్బందిగా ఉంటున్నట్లు ఉంది. ఇది కూడ ఒప్పుకొందాం మనం పరమత సహనం పాటిస్తూ............................................నే ఉందాం. కాని ఎంత కాలం? ఒకప్పుడు మన శరీరం మీద పుండు అయింది, అది మానిపోతే ఏగొడవా లేదు. కాన్ని దాన్నే కెలుకుతూ పోతుంటే ఎంతకాలం భరిస్తూ ఉండాలి. ఎప్పుడో మొదలు పెట్టిన జిహాద్ ఇంకా కొనసా....................గుతూనే ఉంది. ఎవరి మీద? ఏదైన వస్తువు కాని, ఏదైన సంపద గాని పోగొట్టుకొంటే దాన్ని పొందడాని కి పవిత్ర యుద్దాలో అపవిత్ర యుద్దాలో చెయ్యొచ్చు. కాని దోపిడూలు, మానభంగాలు, ఊచకోతలు చెయ్యడం పవిత్రయుద్దమా?? కనీసం వర్తమానం దృష్టిలో ఉంచుకోండి. సరే! అప్పుడెప్పుడొ ముందు తరాలు వాళ్ళు చేసిందానికి ఇప్పటి వాళ్ళను బాధ్యుల్ని చేయద్దు. కాని వర్తమానం లొ చేసే పవిత్రయుద్దాల్ని గురించి మట్లాడ్డం కూడా నేరమేనా. గాంధారం నుండి కాంభోజం వరకు విస్తరించిన (కాందహార్ నుండి కాంబోడియా) హిందు ప్రాభవం ఇప్పుడు ఎంతఉందో అందరికి తెలుసు. ఎవడైనా మనమీదకు వస్తున్నపుడు ధైర్యానికి తోడు కోసం ఒక కర్ర పట్టుకోడం కూడ తప్పయితే ఎట్లా? ఇంకా ఇంకా సహనం వహిద్దాం! ఆఖరి హిందు అన్నవాడు భూమ్మీద అంతరించి పోయేంతవర~़భవాని శంకరం

శంకరం గారు, మీ భావాలతో ఏకీభవిస్తున్నాను. ప్రపంచములో ఒకే ఒక్క దేశములో ఉన్న నిజమైన శాస్త్రీయ, మానవతా, ప్రజాస్వామ్య, లౌకిక దృక్పథము గల ధర్మము హిందూ ధర్మము. ఇది మతము కాదు. నాస్తికులను, అజ్ఞాన వాదులను (agnostics), సెమెటిక్ మతానుయాయులను అందరినీ ఆదరించి వారి భావాలను గౌరవించే ఈ ధర్మము అతి ఉత్కృష్టమైనది. అట్టి ధర్మము వేయి వర్షములుగా నిరంతరము వేటాడబడుతున్నది. ఈ ధర్మమును కాపాడుటకు ముందు ఇతర మతాల నిజ స్వరూపము తెలుసుకొనుట అందరి విద్యుక్త ధర్మము. అట్టి ఉద్దెశముతోనే ఈ వ్యాసము వ్రాశాను. ధన్యవాదాలు.Kumarrao 17:57, 22 ఆగష్టు 2009 (UTC)
ప్రపంచములో శాంతిని, సహజీవనాన్ని కాంక్షించె ప్రతి మానవుడు చదివి తీరవలసిన విషయాలు. ఇది వ్యాసములోని విషయాలకు సంబంధించినది కావున చదువరులు తెలుసుకొనుట ఉత్తమమని భావించాను.[<http://frontpagemag.com/2010/03/26/the-wrong-way-to-stand-against-jihad/print/].Kumarrao 10:08, 5 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]


ఆంగ్లం ఎక్కువగా ఉంది

ఈ వ్యాసంలో ఆంగ్లం ఎక్కువగా ఉంది. ఎవరన్నా ఓపిక చేసుకోని దాన్ని తెలుగుతో తర్జుమా చేసి బ్రాకెట్లో ఉంచితే బాగుంటుంది. Chavakiran 19:55, 9 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్వాహకులు

  • కొంతమంది నిర్వాహకులు వారి వారి ఇహలోక మానసిక వృత్తి, ప్రవృత్తి, తదితర నిర్వాకముల వలన ప్రాచీన భారత దేశ చరిత్ర తదితరములు గురించి అనవసర అర్ధములేని చర్చలు, వ్యాసములతో కాలం వృథా చేస్తూ, వాడుకరులకు ఇబ్బంది కలిగించి, ఉత్సాహవంతులను నిర్వీర్యం చేస్తూ, పాత అయినా కొత్త వారు అయినా తిరిగి పాల్గొనాలంటేనే వారి మనసులు అంగీకరించక నిరాశక్తి, నిస్పృహలు, తదితరములుతో కలుగు విధముగా తయారు చేస్తున్న కొంత మంది (ఎవరైనా) నిర్వాహకులు ఉంటే, ఆటువంటి వారిని అధికారులు వారిని తక్షణము తొలగించండి.
  • ఎవరూ అతీతులు కారు. చరిత్రలు తొలగించాలనుకోవడం అవివేకము. చరిత్ర వ్రాయాలనుకునే వారు సున్నితముగా తెలియ చెప్పవచ్చును. ఇబ్బంది ఉండదు. అందరూ చరిత్రను తెలియజేస్తున్నప్పుడు, ఇక్కడ అభ్యంతరము అనవసరము అని నా అభిప్రాయము.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:28, 10 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]