చర్మము

వికీపీడియా నుండి

చర్మము (Skin) మన శరీరంలో అతిపెద్ద అవయవము. దీనిలో మూడు ముఖ్యమైన పొరలుంటాయి. చర్మము శరీరమంతా కప్పి లోపలి భాగాల్ని రక్షిస్తుంది. నవరంధ్రాలవద్ద చర్మం లోపిస్తుంది. ఇది వివిధ రంగులలో ఉంటుంది. చర్మానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని 'డెర్మటాలజీ' అంటారు.

విషయ సూచిక

[మార్చు] నిర్మాణం

చర్మంలో ముఖ్యంగా బాహ్యచర్మం, అంతశ్చర్మం అనే రెండు పొరలుంటాయి. బాహ్యచర్మం బహిస్త్వచం నుంచి ఏర్పడుతుంది. రోమాలు, స్వేద గ్రంధులు బాహ్యచర్మానికి చెందినవి. గోళ్ళు కూడా దీనినుంచే ఏర్పడతాయి.

[మార్చు] ధర్మాలు

  • పరిసరాల వాతావరణమునుండి, సూక్ష్మక్రిములనుండి శరీరభాగాల్ని రక్షించడం.
  • స్పర్శ జ్ఞానాన్ని (Touch sensation) కలుగజేయడం.
  • నీరు చర్మంద్వారా చెమట రూపంలో పోతుంది. చర్మంలోని రక్తనాళాల సంకోచ వ్యాకోచాల ద్వారా నీటినష్టాన్ని నిరోధిస్తుంది.
  • శరీర ఉష్ణోగ్రతను వివిధకాలాల్లొ స్థిరంగా ఉంచడం.
  • కొన్ని విటమిన్లు తయారుకావడానికి చర్మం ఉపయోగపడుతుంది.

[మార్చు] వర్ణభేదం

ఆఫ్రికా దేశీయులు నల్లగా ఉంటారు. ఉత్తర ఐరోపా దేశీయులు తెల్లగా ఉంటారు. ఆసియా మరికొన్ని ప్రాంతాల ప్రజలు వీరిరువురి మధ్యలో ఉంటారు. ఈ వర్ణభేదాలకు కారణం చర్మంలోని 'మెలనిన్' అనే రంగుపదార్ధం.

[మార్చు] వ్యాధులు

[మార్చు] జంతువుల చర్మం (తోలు)

  • కొన్ని జంతువుల చర్మంతో బట్టలు, సంచులు మొదలగునవి తయారుచేస్తారు. వీటికోసం జంతువులను చంపడం చట్టారీత్యా నేరమైనా కోట్లల్లో వ్యాపారం దీనివల్ల జరుగుతుంది.

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
చర్మము గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=చర్మము&oldid=727557" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు