చలివేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలివేంద్రం

చలివేంద్రం అనేది ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతల సహాయంతో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచినీటి కేంద్రం. కొత్త కుండలలో మంచినీటిని నింపడం వలన ఈ నీరు చల్లగా ఉంటుంది. వీటిని ఎక్కువగా రద్దీగా ఉండే కూడలి ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఎక్కువగా దాహం వేసే వేసవి కాలంలో వీటిని ఏర్పాటు చేస్తారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు, ముఖ్యంగా పేదవారికి ఈ చలివేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయి.

ఉగాదినాడు చలివేంద్రం[మార్చు]

ఉగాది మండు వేసవికి ముందు వచ్చే పండుగ. ఈ రోజు నుంచి రోజురోజుకీ ఎండలు క్రమంగా పెరుగుతాయి. కనుక ఉగాదినాడు చేయవలసిన క్రతువులలో పెద్దలు "ప్రపాదాన ప్రారంభం" ను చేర్చారు. "ప్రపాదానం" లో "ప్రపా" అనగా చలి పందిరి. అనగా పేడతో అలికిన ప్రాంతంలో చల్లని కుండలతో నీటిని నింపి వచ్చి పోయే బాటసారుల దాహార్తిని తీర్చమని అర్థం. అయితే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, యథాశక్తి వచ్చేపోయేవారికి దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నించాలి. ఇవేవీ సాధ్యం కానీ వారు నీరు నింపిన కలశాన్ని దానం చేసే ‘జలకుంభ’ దానం కూడా వాడుకలో ఉంది.[1]

చలివేంద్ర నిర్వహణకు తీసుకోవలసిన జాగ్రతలు[మార్చు]

  • చలివేంద్ర ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడం.
  • ప్రతిరోజు మంచినీటిని మార్చడం.
  • కుండలను, గ్లాసులను పరిశుభ్రంగా ఉంచడం.

చలివేంద్రాలలో ఇతర దానాలు[మార్చు]

నేడు నిర్వహిస్తున్న కొన్ని చలివేంద్రాలలో నీటిని మాత్రమే కాక మజ్జిగ, కొబ్బరి బోండాలు, తాటి ముంజలు ఇచ్చే సందర్బాలు కూడా ఉన్నాయి. [2]

మూలాలు[మార్చు]

  1. "ఉగాదినాడు చలివేంద్రం పెట్టమన్నారు పెద్దలు". TeluguOne Devotional (in english). 2021-06-02. Retrieved 2021-06-02.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. Srinivas (2016-05-11). "చలివేంద్రాల్లో మజ్జిగ, తాటిముంజలు: మంత్రితో రిబ్బన్ కటింగ్, చేసేది చీటింగ్". telugu.oneindia.com. Retrieved 2021-06-02.