చాట్రాయి

వికీపీడియా నుండి
  ?చాట్రాయి మండలం
కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా జిల్లా పటములో చాట్రాయి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో చాట్రాయి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°59′N 80°52′E / 16.983166, 80.858946
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము చాట్రాయి
జిల్లా(లు) కృష్ణా జిల్లా జిల్లా
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
51,558 (2001)
• 26350
• 25208
• 56.63
• 62.38
• 50.61


చాట్రాయి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన చాట్రాయి మండల కేంద్రం. చాట్రాయి మండలము లో 16 గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయ ప్రధానమైన చాట్రాయి వరి,మొక్కజొన్న,చెరుకు,మిరప,పత్తి,పసుపు లాంటి పంటలకు ప్రసిద్ధి. చాట్రాయి గ్రామ తపాలా గుర్తింపు సంఖ్య 521214.

విషయ సూచిక

పేరు వెనుక చరిత్ర [మార్చు]

మనిషి తన నివాసం కోసం కొత్తగా ఇళ్ళుకట్టుకోవడం ప్రారంభించిన రోజులవి! కొబ్బరాకులతో, తాటిఆకులతో ఇల్లు వేసుకునే మనిషి అనంతరం కొండరాళ్ళతో ఇల్లుకట్టుకోవడం ప్రారంభించాడు. ఇంటిలోపల గదినేల మట్టితో అలికేవాడు. ఇదిలా వుండగా కొండరాళ్ళు కొట్టుకునే ఓ వ్యక్తి రాళ్ళను నున్నగా చెక్కుకుని తన ఇంటిగదిలో చపటాగా పరచుకున్నాడు. ఆ రాళ్ళను బంకమన్ను సాయంతో కదలకుండా గట్టిచేయడంతో ఆవిధానం అందరికీ నచ్చేసింది. తమ ఇంట్లో కూడా చపటా రాయి పరవమంటూ అందరూ అడిగేవారు. ఇంటి గదుల్లో చపటారాయి పరచిన ప్రాంతం కాబట్టి... ఈ ప్రాంతాన్ని అందరూ ఇదే పేరుతో పిలువడం ప్రారంభించారు. మొదట్లో ‘చపటారాయి’గా ...‘చపట్రాయి’గా పిలువబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘చాట్రాయి’గా వ్యవహరిస్తున్నారు.

భౌగోళికం: [మార్చు]

ఖండం:ఆసియా, దేశం:భారతదేశం, రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్

భౌగోళికంగా 16°59′ఉత్తర 80°52′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న ఈ ఊరు దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కు చెందిన ఒక గ్రామం. సమశీతోష్ణ మండలం లో ఉన్న చాట్రాయి లో వేసవి గరిష్ఠ ఉష్ణొగ్రతలు 45°సెల్సియస్, చలికాలం లో కనిష్ట ఉష్ణొగ్రతలు 17°సెల్సియస్ వరకు నమోదు అవుతాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాదు కు సుమారు 300కి.మీ.,విజయవాడ నగరానికి 80కి.మీ.దూరంలో పశ్చిమగోదావరి, మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది చాట్రాయి గ్రామం. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ గ్రామానికి కృష్ణానది కాలువ, వర్షపు నీరు ఆధారం.

చరిత్ర: [మార్చు]

ఆర్ధిక రంగం: [మార్చు]

రవాణా సౌకర్యాలు: [మార్చు]

చాట్రాయి కి రావటానికి 1) నూజివీడు నుండి చింతలపూడి ( వయా విస్సన్నపేట, పోలవరము ) 2) నూజివీడు నుండి చీపురగూడెం ( వయా విస్సన్నపేట, చాట్రాయి ) 3) నూజివీడు నుండి చీపురగూడెం ( వయా చిత్తపూర్ , చాట్రాయి )

చాట్రాయి నుండి

  • విస్సన్నపేట = 12 కి.మీ
  • నూజివీడు = 32 కి.మీ
  • సత్తుపల్లి = 35 కి.మీ
  • తిరువూరు = 38 కి.మీ
  • చింతలపూడి = 23 కి.మీ

దేవాలయాలు: [మార్చు]

శివాలయం, రామాలయం, ముత్యాలమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి, సాయి బాబా గుడి ఇక్కడి ప్రజలు తరుచూ దర్శించుకునే పుణ్యక్షేత్రాలు. శివరాత్రి తిరునాల, వినాయక చవితి ఉత్సవాలు మరియు శ్రీ రామ నవమి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి. నూతనంగా శ్రీ శ్రీ శ్రీ దర్మశాస్తా అయ్యప్పస్వామి వారి దెవాలయము శంఖుస్తాపన జరిగి నిర్మాణం జరుగుతున్నది.

చారిత్రక స్థలాలు/ ప్రకృతి సౌందర్యాలు: [మార్చు]

విద్యా రంగం: [మార్చు]

విద్యా రంగంలో చాలా ముందంజలో వున్నది.

సంస్కృతి: [మార్చు]

రాజకీయాలు: [మార్చు]

ఇతర విశేషాలు: [మార్చు]

చాట్రాయి మండలము లోని గ్రామాలు [మార్చు]

  1. ఆరుగొలనుపేట
  2. బూరుగుగూడెం
  3. చనుబండ
  4. చాట్రాయి
  5. చిన్నంపేట
  6. చిత్తపూర్
  7. జనార్దనవరం
  8. కొత్తపాడు
  9. కొత్తగూడెం
  10. కృష్ణారావుపాలెం
  11. మంకొల్లు
  12. పర్వతపురం
  13. పోలవరం
  14. పోతనపల్లి
  15. సోమవరం
  16. తుమ్మగూడెం
  17. మర్లపాలెం

కింద చూపబడిన చిత్రంలో చాట్రాయి లోని ఒక అందమైన పంటపొలాన్ని చూడవచ్చు.

వరి పంటకు ప్రసిద్ధమైన చాట్రాయి లోని ఒక పచ్చని పైరు చిత్రం

జనాభా [మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. ఆరుగొలనుపేట 362 1,602 818 784
2. బూరుగుగూడెం 422 1,784 905 879
3. చనుబండ 2,154 8,902 4,514 4,388
4. చాట్రాయి 1,091 4,512 2,329 2,183
5. చిన్నంపేట 783 3,337 1,685 1,652
6. చిత్తపూర్ 835 3,776 1,920 1,856
7. జనార్దనవరం 585 2,452 1,256 1,196
8. కొత్తపాడు 1,233 5,325 2,738 2,587
9. కొత్తగూడెం 453 1,807 943 864
10. కృష్ణారావుపాలెం 243 1,074 528 546
11. మంకొల్లు 144 577 292 285
12. పర్వతపురం 244 1,039 524 515
13. పోలవరం 1,080 4,637 2,355 2,282
14. పోతనపల్లి 559 2,493 1,256 1,237
15. సోమవరం 1,077 4,323 2,221 2,102
16. తుమ్మగూడెం 916 3,918 2,066 1,852

వనరులు [మార్చు]

  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
"http://te.wikipedia.org/w/index.php?title=చాట్రాయి&oldid=839633" నుండి వెలికితీశారు