చింత

వికీపీడియా నుండి

చింత
Tamarindus indica pods.JPG
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Caesalpinioideae
Tribe: Detarieae
ప్రజాతి: Tamarindus
జాతి: T. indica
ద్వినామము
Tamarindus indica
లి.

చింత (Tamarind) ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు.

[మార్చు] వర్ణన

చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.

[మార్చు] ఉపయోగాలు

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.

  • చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు.
  • చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు. ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు. థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
  • చింతకొమ్మ: పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు.
  • చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు. అమరియు వంటాచె
  • చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%82%E0%B0%A4" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు