చింతామణి (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతామణి

చింతామణి తెలుగు పత్రిక.

ఆముద్రిత గ్రంథ చింతామణి వలె ప్రాచీన సాహిత్యాన్ని ప్రచురిస్తూ ఆధునిక సాహిత్య ప్రచురణను ప్రోత్సహించడం చింతామణి ప్రత్యేకత.ఇది మాస పత్రిక [1]

ప్రారంభంలో చింతామణి పత్రిక వివేకవర్ధనికి అనుబంధంగా ప్రచురించబడేది.

1891-92లో న్యాపతి సుబ్బారావు చింతామణిని పునరుద్ధరించారు. కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం అతనికి సహాయం చేశారు.

నవలల పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టిన చింతామణి వీటిని 'ప్రబంధము' లనే పదం వాడేవారు. పత్రికను మొదట నిర్వహించిన వావిలాల వాసుదేవశాస్త్రి, కందుకూరి సుబ్బారావు కలసి పోటీకి వచ్చిన నవలలను చదివి బహుమతులకు యోగ్యమైన వాటిని ఎంపిక చేశేవారు.

ఆగష్టు 1892 న ప్రచురించిన చింతామణి పత్రిక సంపుటము రెండులో లో ఈ క్రింది శీర్షికలు గలవు.[2]

ఆతిథ్యము

అలంకార గ్రంథ తత్త్వము

భారత ప్రయోగములు

సాహిత్యము - శాస్త్రము

కృతి నామకరణము

చిత్రం

పండిత పుత్త్రుడు

ఓట్ల దయ్యము

మిత్ర హితోపదేశము

అవి యుద్ధపురోజులు

ప్రభావతి

01 జులై 1899 వికారి నామ సంవత్సర ఆషాడ మాసంలో లో ప్రచురించిన చింతామణి పత్రికలో పూర్వాచారము శీర్షిక లో ఉన్న విషయము[3]

పూర్వాచారము.

మన దేశమునందు సామాన్య జనుల మనస్సులలో నెల్లను పూర్వాచారము నాజరా దన్న యభిప్రాయము దృఢముగా నాటుకొని యున్నది. ఆటివారికిఁ బూర్వాచారము సందున్నంత గౌరవము మతి దేనియందును లేదు. అణుమాత్రమును మేర మీజ పూ ర్వులు నడిచినట్లే మనము సమస్తవిషయములయందును నడపవలెనని బోధించుచు, తమ మేలుకొలకయి యించుక కొత్తవారిని దొక్కినవారి నందతిని పతికులనుగా భావించి పూర్వాచార పరాయణులు గరించుచుందురు. అట్టివారు. పూర్వకాలము ధర్తము నాలుగు పాదములను నడ చెడి సత్యయుగ మనియు, అప్పటివారు సమస్తాను భవములను గలిగిన సర్వత్రా లనియు, ఇది పాపభూయిష్టమై యధర్మ బహుళ మయినకలియుగ మని యు, ఇప్పటివా రనుభవశూన్యు లయిన యజ్ఞు లనియు, సముదురు. ఆయినను వారి నమకము సత్యమునకు మిక్కిలి దూర మయినదని కొంచె మాలోచించినవా రెలను సుల భముగాఁ దెలిసికొనవచ్చును. నిజము విచారింపఁగా నిప్పటి కాలమే పూర్వకాలమున కంటే జ్ఞానాధిక్యమును గలిగి యుండ వలసినదిగా సున్నది. పూర్వపు ప్రపంచము | యొక్క బాల్యద : ఇప్పుడు వచ్చుచున్నది ప్రపంచము యొక్క యాసపడత, కాలుని గంటే యావన పురుషుఁడు జ్ఞానాధికుఁ డగుట స్వాభావికము , ఆట్లు కాకపోవుట య స్వాభావికము. అది కాలమునం బెల్లవారును స్వాముధవను చేతి జ్ఞాన సంపాదనము చేయవలసియున్నది; అటుతరు వాలి వచ్చినవారికి స్వానుభవము చేత వచ్చినది మాత్రమే కాక తమపూర్వులు సంపాదించి యిచ్చిన జ్ఞానము కూడ హస్తగత మగును

బయటి లింకులు[మార్చు]

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-01-16.
  2. "చింతామణి మాసపత్రిక/సంపుటము 2 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-31.
  3. "::Press Academy of Andhra Pradesh". www.pressacademyarchives.ap.nic.in. Retrieved 2020-08-31.[permanent dead link]