చికన్‌గన్యా
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
చికన్‌గన్యా (Chikungunya) టోగావిరిడే కుటుంబానికి చెందిన ఆల్ఫా వైరస్ వల్ల కలిగే అరుదైన విష జ్వరము. ఈ వైరస్ ఏడిస్ ఈజిప్టీ అనే రకము దోమ యొక్క కాటు వలన వ్యాపిస్తుంది. చికన్‌గన్యా అన్న పేరు స్వహీలీ భాషలో నుండి వచ్చినది. స్వహీలీ లో చికన్‌గన్యా అంటే వంకర తిరిగేది లేదా వంచేది అని అర్ధము. ఈ వ్యాధి వచ్చిన రోగులు కీళ్ల నొప్పులతో నిటారుగా నడవలేక వంగి గూనిగా నడవడముతో ఆ పేరు వచ్చినది. చికన్‌గన్యా వ్యాధి ప్రాణాంతకము కాదు కానీ 2005 - 2006 లో ఈ వ్యాధి బారిన పడి ర్యూనియన్ దీవిలో 77 మంది మరణించారు. పేరులో సారూప్యత ఉన్నా.., కోళ్ళకూ (చికెన్) ఈ వ్యాధికీ, అలాగే బర్డ్ ఫ్లూ వ్యాధికీ చికన్‌గన్యాకు ఏ విధమైన సంబంధమూ లేదు.
చికన్‌గన్యాను తొలుత 1952 లో ఆఫ్రికా ఖండములోని టాంజానియా లొ కనుగొన్నారు.
విషయ సూచిక |
భారతదేశంలో [మార్చు]
భారతదేశంలో తొలుత చికన్‌గన్యాను 1963లో కలకత్తాలో గుర్తించారు. 1964లో మద్రాసు లో నాలుగు లక్షల మందికి ఈ వ్యాధి సోకినది. 1973లో మహరాష్ట్రలోని బార్సిలో వ్యాధి సోకిన వారిలో 37.5% రోగులు మరణించారు.
వ్యాధి లక్షణాలు [మార్చు]
చికన్‌గన్యా సోకిన రోగికి 39(102 డిగ్రీలఫారన్ హీటు) డిగ్రీల వరకు చేరే ఉష్ణోగ్రత కూడిన విష జ్వరము వస్తుంది. కీళ్ల నొప్పులు మరియు వంటినొప్పులతో బాధ పడతారు. నడవడానికి కూడా శ్రమపడాల్సి వస్తుంది. స్వల్ప తలనొప్పి మరి ఫోటోఫోబియా (కాంతి చూస్తే కళ్ళలొ భాద) కూడా కలిగే అవకాశము ఉంది.
రోగ నిర్ధారణ [మార్చు]
రోగ నిర్ధారణకై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లోని మలయా యూనివర్శిటీ ఒక సీరలాజికల్ పరీక్షను
చికిత్స [మార్చు]
చికన్‌గన్యాకు ఇప్పటివరకు ఖచ్చితమైన చికిత్స లేదు. కానీ రోగ లక్షణాలైన నొప్పి ఉపశమనానికి వైద్యులు అనాల్జెసిక్స్ ను ఉపయోగించి చికిత్స చేస్తారు. 2000 లో వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి కృషి జరిగినా సరైన ఆర్ధిక సహాయము లేకపోవడము వలన ఆ కృషి ఆగిపోయినది.
బయటి లింకులు [మార్చు]
- ఆల్ఫా వైరస్
- ర్యూనియన్ దీవిలో చికన్‌గన్యా విష జ్వరము
- చికన్‌గన్యా వ్యాధి వ్యాప్తి పై ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటు లో వార్తలు
- భారతదేశంలో చికన్‌గన్యా పై సమాచారము
- తూర్పు గోదావరి జిల్లాలో చికన్‌గన్యా వ్యాప్తి
- అనంతపురం లో చికన్‌గన్యా
|
|||||||||||||||||||||||