చికెన్ పకోడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చికెన్ పకోడి
మూలము
మూలస్థానంభారత్
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు కోడి మాంసము, మొక్కజొన్న పిండి

చికెన్ పకోడి ఒక అత్యంత ప్రజాదరణ పొందిన మాంసాహార వంటకము.

కావలసిన పదార్థాలు[మార్చు]

  • కోడి మాంసము - ఎముకలు లేకుండా - : అరకిలో
  • మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) - : టేబుల్‌స్పూను
  • మైదాపిండి: 2 టేబుల్‌స్పూన్లు
  • కారం: పావుటీస్పూను
  • అల్లంవెల్లుల్లి: అరటీస్పూను
  • పెరుగు: టేబుల్‌స్పూను
  • జీలకర్ర: పావుటీస్పూను
  • గుడ్లు: రెండు
  • గరంమసాలా: టీస్పూను
  • ఉప్పు: రుచికి సరిపడా
  • నూనె: తగినంత

తయారుచేసే విధానం[మార్చు]

  1. కోడి మాంసము (చికెన్‌)ను సన్నని ముక్కలుగా కోయాలి.
  2. మైదాలో మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) గుడ్లసొన, పెరుగు, కారం, అల్లంవెల్లుల్లి, జీలకర్ర, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
  3. తరువాత చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి నాలుగు గంటలసేపు నాననివ్వాలి.
  4. బాణలిలో నూనె పోసి కాగాక పిండి మిశ్రమం పట్టిన ముక్కల్ని పకోడీల మాదిరిగా వేయించి తీయాలి.

బయటి లంకెలు[మార్చు]