చిత్తూరు

వికీపీడియా నుండి


చిత్తూరు (ఆంగ్లం : Chittoor) హిందీ: चित्तूर), భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని ఒక పట్టణము. ఆంధ్ర ప్రదేశ్ దక్షిణ ప్రాంతములో, పోన్న నది లోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉన్నది. ఇది ధాన్యము, చెరకు, మామిడి, మరియు వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు మరియు బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు కలవు.


విషయ సూచిక

[మార్చు] పట్టణ స్వరూపం, జనవిస్తరణ

జనాభా 252,654 (2001 గణాంకాలు).

[మార్చు] సదుపాయాలు

[మార్చు] రవాణా

[మార్చు] విద్య

చిత్తూరు పట్టణంలో అనేక ప్రముఖ విద్యాలయాలున్నాయి. వాటిలో కొన్ని :

ఉన్నత పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు :

  • సర్ సి.ఆర్.రెడ్డి ఉన్నత పాఠశాల
  • బి.జెడ్. ఉన్నత పాఠశాల
  • ఎస్.వి.జెడ్.పి.ఉన్నత పాఠశాల, కాణిపాకం
  • పి.సి.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • వరదప్ప నాయుడు పురపాలక పాఠశాల
  • బి.ఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల
  • బి.వి.రెడ్డి పాఠశాల
  • లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల
  • విజ్ఞాన సుధ డిగ్రీ మరియు పి.జి. కళాశాల
  • గీర్వాణి డిగ్రీ కళాశాల
  • శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ మరియ్ సాంకేతిక కళాశాల

[మార్చు] వైద్యం

పట్టణము నందు వైద్య సదుపాయాలు బాగున్నాయి, ఒక ప్రభుత్వ ఆసుపత్రి మరియు 10 ప్రైవెటు ఆసుపత్రులు కూడ కలవు

[మార్చు] వినోదం

వినోదం కొరకు సినిమా టాకీసులు కలవు

  • విజయలక్ష్మి
  • చాణక్య
  • గురునాధ
  • లక్ష్మి
  • రాఘవ
  • ఎమ్.ఎస్.ఆర్
  • శ్రీనివాస
  • వెంకటేశ్వర
  • మరియు ఇవికాక క్రొత్తగా అమ్యూజ్‌మెంట్ పార్క్ వెలసింది

[మార్చు] ఆర్ధికం

ఆర్ధికంగా చెప్పుకొ దగ్గ పరిశ్రమలు లెవుకాని చుట్టుప్రక్కల పంటలకు మార్కెట్ యార్డ్ గా ఉంది

[మార్చు] పరిశ్రమలు

  • శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర మిల్లు
  • విజయ్ సహకార పాలు మరియు పాలపదార్థాల డైరీ
  • అమరరాజా గ్రూప్ కంపెనీ : ఈ కంపెనీ యందు 3,600 ఉద్యోగులు పనిచేస్తున్నారు.
  • న్యూట్రిన్ కన్ఫెక్షనరీస్ (2007 లో గోద్రెజ్ కంపెనీ కొన్నది)
  • సారా లీ బిస్కట్స్ (క్రితం న్యూట్రిన్ బిస్కట్స్)
  • ఇస్రో రాడార్ కేంద్రం గాదంకి వద్ద.


[మార్చు] వ్యవసాయం

రైతులు ప్రధానముగ ధాన్యము, చెరకు, మామిడి మరియు వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చెస్తున్నారు.

[మార్చు] వ్యాపారం

చిత్తూరు జిల్లా లొ వ్యాపారంనకు ముఖ్య కంద్రముగ ఉన్నది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి మరియు ఇక్కడి నుండి ఆక్కడి కి సరుకులు ఎగుమతి చెసుకుంటారు.

[మార్చు] ఇతరాలు

[మార్చు] చూడవలసినవి

కాణిపాక గణపతి :: చిత్తూరు కి దగ్గరలొ 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉన్నది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ సత్యప్రమాణాలు చెయడాని భక్తులు భయపడతారు ఎందుకు అంటె ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారు ఏదొ ఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం అందుకె ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతి గా పిలుస్తారు. ఏద్తెన కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటె ఆ కార్యము విఘ్నములు లెకుండ సాఫిగా సాగుతుంది. ఇక్కడ స్వామి వారు దినదినమున పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి

అర్ధగిరి వీరాంజనెయ స్వామి :: చిత్తూరు కి దగ్గరలొ 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలొ అర్ధగిరి వీరాంజనెయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలొని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడవు మరియు ఇక్కడ ఉండి 45 దినములు వరుసగా అక్కడ ఉన్న మన్నుతొ శరీరానికి రాసుకొని స్నానం చెస్తె చర్మ వ్యాధులు దరిచెరవని మరియు ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓం"కార నాదం వినబడుస్తుందని భక్తులు చెపుతుంటారు.

మొగిలి :: చిత్తూరు కి దగ్గరలొ 20 కి.మీ మొగిలీశ్వరాలయం ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలొ వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నొటిలొ నుంచి ప్రతి క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగలూరు దారిలొ ఉంది.

[మార్చు] పరిపాలన, రాజకీయాలు

జిల్లా కేంద్రమైనందున, జిల్లా అధికారుల కార్యాలయాలన్నీ చిత్తూరులో గలవు. రెవిన్యూ డివిజన్లు 4. చిత్తూరు , తిరుపతి, మదనపల్లి, చంద్రగిరి.

చట్ట సభల్లో ప్రాతినిధ్యం
పురపాలక సంఘం (మునిసిపాలిటి)

జిల్లాలో తిరుపతి తరువాత పెద్ద పురపాలక సంఘం.

[మార్చు] సమస్యలు

  • రాజకీయాలు ఎక్కువ...

[మార్చు] పట్టణానికి చెందిన కొందరు ప్రముఖులు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు


[మార్చు] బయటి లింకులు


పేజీకి సంభందించిన లింకులు