చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై
Chittoor Subramanya Pillai
Chittoor Subramania Pillai.jpg
చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై
వ్యక్తిగత సమాచారం
జన్మ నామం చిత్తూరు సుబ్రహ్మణ్యం
జననం (1898-06-22) జూన్ 22, 1898 (వయస్సు: 116  సంవత్సరాలు)
మూలం పుంగనూరు, చిత్తూరు జిల్లా, India
మరణం 1975
రంగం కర్ణాటక సంగీతం
వృత్తి musician, singer, lyricist
క్రియాశీల కాలం 1904 - 1975

సంగీత కళానిధి చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై గా ప్రసిద్ధిచెందిన చిత్తూరు సుబ్రహ్మణ్యం (Chittoor Subramanyam) (22 జూన్ 1898–1975) సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్యాంసులు మరియు వాగ్గేయకారులు.[1][2]

తొలినాళ్లు[మార్చు]

సుబ్రహ్మణ్యం పేరయ్య మరియు మొగిలమ్మ దంపతులకు 22 జూన్ 1898 తేదీన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం (అప్పటి పుంగనూరు తాలూకా) లోని కొలమాసనపల్లె గ్రామంలో జన్మించారు. మొదట తల్లిదండ్రుల వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొన్నారు. వీరు బాలమేధావిగా తన 5వ ఏటనే శాస్త్రీయ సంగీతం పాడటం ప్రారంభించారు.[3] తండ్రి వద్ద చిన్నప్పుడే హరికథలను చెప్పటం నేర్చుకున్నారు. పదేళ్లు వచ్చేసరికి చిత్తూరు, వేలూరు, బెంగుళూరు మొదలైన ప్రాంతాల్లో పాట కచేరీలు చేయడం ప్రారంభించారు. ప్రఖ్యాత గాయని ధనకోటియమ్మ సలహా మేరకు కాంచీపురంలోని నాయన పిళ్లై గారి వద్ద శిష్యునిగా చేరి శాస్త్రీయ సంగీతాన్ని శాస్త్రీయంగా గురుకుల పద్ధతిలో 14 సంవత్సరాలు అభ్యసించారు.[4]

సంగీత సరస్వతి సేవ[మార్చు]

చిత్తూరు సుబ్రహ్మణ్యం మద్రాసు నగరంలో స్థిరనివాసమేర్పరచుకున్నను భారతదేశమంతా తిరిగి సుమారు 50 సంవత్సరాలకు పైగా సంగీత కచేరీలు చేసి శ్రోతల్ని మెప్పించారు.

వీరు త్యాగరాజస్వామి వారి కీర్తనలను లయ ప్రధానంగా గానం చేయడంలో మేటిగా పేరుపొందారు. వీరు ఎక్కువగా కాంచీపురం రీతిలో గానం చేసేవారు. వీరు స్వరప్రస్థానం మరియు కాలప్రమాణం లో ప్రసిద్ధిచెందారు. వీరు త్యాగరాజు మరియు ముత్తుస్వామి దీక్షితులు రచించిన అరుదైన కీర్తనలను ఆలపించడంలో దిట్ట.[5]

ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన మధురా నగరిలో చల్లలమ్మ బోను, కులములోన గొల్లదాన మరియు మావల్లగాదమ్మ వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి.[6]

వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. వీరిలో మధురై సోమసుందరం, బొంబాయి ఎస్. రామచంద్రన్,[5] చిత్తురు రామచంద్రన్, టి. టి. సీత, తాడేపల్లి లోకనాథ శర్మ మరియు రేవతీ రత్నస్వామి ముఖ్యులు.

వీరు తిరుపతి పట్టణంలో 1942 నుండి త్యాగరాజ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించి సప్తగిరి సంగీత విద్వన్మణి అనే పురస్కారాన్ని ప్రముఖ కర్ణాటక విద్వాంసులకు ప్రదానం చేసేవారు.[2] ఆకాలంలోనే చాలా అన్నమాచార్య కీర్తనలను స్వరపరచి అందించారు. అందులో ఇతడొకడే, నారాయణతే ముఖ్యమైనవి.

కర్ణాటక విద్వాంసునిగా చివరిదాకా సంగీత సాధనతోనే జీవితాన్ని సఫలం చేసుకున్న ధన్యజీవి[4][7] 1975 సంవత్సరంలో పరమపదించారు.

వీరికి మొదటి భార్య కాంతమ్మ మరియు రెండవ భార్య రామతిలకం వలన ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిలో పెద్దకుమార్తె రేవతీ రత్నస్వామి తండ్రి పేరును విశ్వవ్యాప్తం చేయాలని నిరంతరం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. తండ్రిగారి జ్ఞాపకార్థం సుబ్రహ్మణ్య సంగీతక్షేత్ర ప్రారంబించి ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు వివిధ సంగీత కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

నిర్వహించిన పదవులు[మార్చు]

పురస్కారాలు[మార్చు]

వీరు అనేకమైన సన్మానాలు మరియు పురస్కారాలు పొందారు. వానిలో ముఖ్యమైనవి:

  • సంగీత కళానిధి, 1954, మద్రాసు సంగీత అకాడమి, మద్రాసు
  • సంగీత నాటక అకాడమి పురస్కారం, 1964, సంగీత నాటక అకాడమీ.
  • గాన కళాప్రపూర్ణ, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమి
  • స్వర చక్రవర్తి.
  • సంగీత సార్వభౌమ
  • లయ బ్రహ్మ
  • ఇసై పేరరింజర్, తమిళ ఇసై సంఘం, మద్రాసు.
  • సంగీత విద్వన్మణి, త్యాగరాయ ఉత్సవ సమితి, తిరుపతి.
  • ఇసైమన్నార్, శైవ సిద్ధాంత సభ, తిరునల్వేలి

శతాబ్ది ఉత్సవాలు[మార్చు]

జీవితకాలం సంగీత సరస్వతికి సేవచేసిన వీరి జన్మ శతాబ్ది ఉత్సవాలను 20 జూన్ 1998 నుండి 22 జూన్ 1998 వరకు హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తదితరులు వీరి సేవల్ని కొనియాడారు.

మూలాలు[మార్చు]

  1. Legenda | Sri Chittoor Subramaniam Pillai Album | Yahoo! Music. New.music.yahoo.com. Retrieved on 28 July 2011.
  2. 2.0 2.1 Sixty years of service to music. The Hindu (26 July 2002). Retrieved on 28 July 2011.
  3. సుబ్రహ్మణ్యం పిళ్లె, చిత్తూరు (1900-1960) : 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 989.
  4. 4.0 4.1 Chittoor SubramanYam Pillai. Carnatica.net. Retrieved on 28 July 2011.
  5. 5.0 5.1 Classical – Vocal – Chittoor Subramania Pillai 1 – Jaganmohini Shines With Chittor Subramania Pillai. Musicplug.in (30 May 2007). Retrieved on 28 July 2011.
  6. Friday Review Hyderabad / Tribute : Carnatic classicist remembered. The Hindu (27 October 2006). Retrieved on 28 July 2011.
  7. Friday Review Chennai / Columns : Titan from Kanchipuram. The Hindu. Retrieved on 28 July 2011.

బయటి లింకులు[మార్చు]