చిల్డ్రన్ ఆఫ్ మెన్
| Children of Men | |
|---|---|
| దస్త్రం:Children of men ver4.jpg Theatrical poster showing Clive Owen |
|
| దర్శకత్వము | Alfonso Cuarón |
| నిర్మాత | Marc Abraham Eric Newman Iain Smith Hilary Shor Tony Smith Thomas Bliss Armyan Bernstein |
| రచన | Screenplay: Alfonso Cuarón Timothy J. Sexton David Arata Mark Fergus Hawk Ostby Clive Owen (uncredited)[1] Novel: P. D. James |
| తారాగణం | Clive Owen Julianne Moore Michael Caine Claire-Hope Ashitey Chiwetel Ejiofor Pam Ferris Danny Huston |
| సంగీతం | John Tavener |
| సినిమెటోగ్రఫీ | Emmanuel Lubezki |
| కూర్పు | Alfonso Cuarón Alex Rodríguez |
| డిస్ట్రిబ్యూటరు | Universal Pictures |
| విడుదలైన తేదీలు | 22 September 2006 (UK) December 25, 2006 (US) November 18, 2006 (Japan) |
| నిడివి | 109 minutes |
| దేశము | United States |
| భాష | English |
| బడ్జెట్ | £37 million (US$76 million)[2] |
| Gross revenue | US$69,612,678 |
చిల్డ్రన్ ఆఫ్ మెన్ 2006కి చెందిన ఒక సంక్షోభస్థలపు శాస్త్రీయ కల్పిత కధా చిత్రం; దీనికి ఆల్ఫోన్సొ కారన్ సహరచయితగా ఉండి దర్శకత్వం వహించారు. కారన్ మరియు తిమోతి J. సెక్స్టన్, డేవిడ్ అరాట, మార్క్ ఫెర్గూస్ మరియు హాక్ ఓస్ట్బైల సహకారంతో వ్రాసిన P.D.జేమ్‌స్ యొక్క 1992 నవల ది చిల్డ్రన్ ఆఫ్ మెన్ ను ది స్ట్రైక్ ఎంటర్‌టైన్మెంట్ యొక్క నిర్మాణ సంస్థ కొద్దిగా అనుసరించింది. ఇందులో తారాగణం క్లైవ్ ఓవెన్, జులియాన్ మూర్, పాం ఫెర్రిస్, క్లైర్-హోప్ అషీటే, షివేటల్ ఎజియాఫర్ మరియు మైఖేల్ కైన్.
2027 యొక్క యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క నేపధ్యంతో, ఈ చిత్రం రెండు దశాబ్దాల ప్రపంచ మానవ వంధ్యత్వం ఏ విధంగా మానవాళికి జీవించడానికి కేవలం ఒక్క శతాబ్దపు సమయాన్ని మింగిల్చింది అనే అంశానికి సంబంధించిన ఒక నిరాశాజనకమైన ప్రపంచాన్ని పరిశోధిస్తుంది. సామాజిక వ్యవస్థ పతనమవ్వడం, ఉగ్రవాదం మరియు పర్యావరణ విధ్వంసం రాబోయే నిర్మూలనానికి తోడవుతాయి. ఇంతలో, బహుశా చివరి క్రియాశీలక ప్రభుత్వమైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రవాహంలా వస్తూ తమ దేశంలో నివాసం కోరుతోన్న అక్రమ వలస శరణార్ధులను హింసిస్తూ ఉంటుంది. ఈ అరాచక పరిస్థితుల మధ్య, థియో ఫారన్ (క్లైవ్ ఓవెన్), గర్భిణి అయిన కీ (క్లైర్-హోప్ అషిటే) అనబడే ఆఫ్రికన్ శరణార్ధికి ఒక సురక్షితమైన మార్గం కనిపెట్టాలి.[3]
ఈ చిత్రం 22 సెప్టెంబర్ 2006న UKలోనూ, 19 అక్టోబర్ 2006న ఆస్ట్రేలియాలోనూ ఇంకా 25 డిసెంబర్ 2006న U.S.లోనూ విడుదలయ్యింది, విమర్శకులు క్రిస్మస్ దినపు విడుదలకూ మరియు చిత్ర కధా వస్తువులైన సంభావన, విమోచనము మరియు విశ్వాసముల మధ్య సంబంధాన్ని గ్రహించారు.
చిల్డ్రన్ ఆఫ్ మెన్ ఆర్ధికంగా విజయం సాధించలేక పోయినా, విమర్శకుల నుండి మంచి సమీక్షలు మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే, సినీమాటోగ్రఫి, కళా దర్శకత్వం మరియు సృజనాత్మకమైన సింగిల్-షాట్ సన్నివేశాలకు మంచి గుర్తింపు పొంది, మూడు అకాడెమి అవార్డ్ నామినేషన్స్ అందుకుని రెండు BAFTA పురస్కారాలు గెలుచుంది. విడుదల తరువాత అది చాలా ప్రసంశలు అందుకుంది, చాలా మంది విమర్శకులు మరియు సంఘాలు దానిని సమకాలీన ఆదర్శ చిత్రంగా గుర్తించారు.
విషయ సూచిక |
[మార్చు] కథాంశం
2027 నాటికి 18 ఏళ్ళుగా ఎక్కడా ప్రపంచంలో పిల్లలు పుట్టలేదు. చాలా ప్రభుత్వాలు కూలిపోయి, యునైటెడ్ కింగ్‌డమ్‌ను మిగిలిన కొన్ని (చిత్రంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఒకటి మాత్రమే సంఘటిత సమాజంగా మిగిలినట్లుగా చూపారు) సంఘటిత సమాజాలలో ఒకటిగా మిగులుతుంది. లక్షల మంది శరణార్ధులు నివాసం కోరుతూ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రవేశిస్తారు. దీనికి ప్రతిస్పందనగా, బ్రిటన్ ఒక సైనిక శాసన దేశంగా మారిపోతుంది. భ్రిటిష్ సైన్యం అక్రమ శరణార్ధులను మరియు అనుమానిత సానుభూతిపరులను చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకుంటుంది. క్వయెటస్ అనబడే ఆత్మహత్య చేసుకోడానికి అవసరమయ్యె పరికరాల సమూహాన్ని వార్తాపత్రికా ప్రకటనలలోనూ, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలోనూ, విక్రయ సందేశ ఫలకాలపైనా వినియోగ ప్రేరణ కోసం ప్రదర్శించడం మొదలుపెడతారు.
థియో ఫారన్ (క్లైవ్ ఓవెన్) అనబడే పాషాణ హృదయుడైన అధికారిగా మారిన ఒక మాజీ కార్యకర్త, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన 18 ఏళ్ళ అర్జెంటీనా దేశస్థుడు బేబి డియేగో (జువాన్ గేబ్రియల్ యాకుజ్జి) బువేనాస్ ఎయిరిస్‌లో ఒక వివాదంలో చిక్కుకుని కత్తిపోట్లకు గురై మరణించాడని తెలుసుకుంటాడు. బ్రిటన్‌లో అక్రమ శరణార్ధులకు సమాన హక్కుల కోసం పోరాడుతోన్న ఫిషెస్ అనబడే ఒక రహస్య సముదాయంచే చెయ్యబడినదిగా చెబుతోన్న ఒక కేఫ్ బాంబు ప్రేలుడుని థియో తృటిలో తప్పించుకుంటాడు. తరువాత ఆ ప్రేలుళ్ళను నిజానికి ప్రభుత్వమే భయోత్పాతం సృష్టించడానికి చేయించిందని అన్యాపదేశంగా తెలియచేస్తారు.
ఒక మాజీ రాజకీయ కార్టూనిస్ట్ మరియు ముసలివాడవుతోన్న హిప్పీ అయిన జాస్పర్ పాల్మర్‌ను (మిఖైల్ కైన్) థియో కలుస్తాడు. జాస్పర్ ఒక ఏకాంతమైన రహస్య ప్రదేశంలో గ్రామీణ ప్రాంతంలో మార్జువానా పండిస్తూ, M15చే వేధింపబడిందని వార్తలు వచ్చి, మనోవ్యాధి వల్ల ఒక రకమైన తీవ్ర భయాందోళనకు గురయ్యే తన భార్యకు సేవలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాడు.
లండన్ తిరిగిరాగానే, ఫిషెస్ థియోను అపహరిస్తుంది. థియోకు వారి నాయకురాలిని చూసి చాలా ఆశ్చర్యం, సంతోషం కలుగుతుంది, ఎందుకంటే ఆమె అతని విడిపోయిన భార్య జులియాన్ టేలర్ (జులియాన్ మూర్). 2008లో ఫ్లూ మహమ్మారి బారిన పడి లేత వయస్కుడైన తమ కొడుకు చనిపోయిన కొద్ది కాలానికే వాళ్ళు విడిపోయారు. జులియాన్ ఒక శరణార్ధి అయిన కీ (క్లేర్-హోప్ ఆషిటే) అనబడే యువతికి రవాణా అనుమతి పొందడం కోసం డబ్బు ఇస్తుంది. మొదట్లో సందిగ్ధత వ్యక్తం చేసినా, థియో తన దాయాది, ప్రభుత్వ మంత్రి అయిన నిగెల్ (డాని హుస్టన్) నుండి అనుమతిని పొందుతాడు, కానీ ఆ అనుమతి ప్రకారం ప్రయాణికురాలితో ఎవరైనా తోడుగా ఉండాలి, అందుకని ఎక్కువ డబ్బు తీసుకుని కీ్‌కు తోడుగా ఉండడానికి అంగీకరిస్తాడు.
థియో, కీ, జులియాన్ మరియు మిరియం(పాం ఫెర్రిస్), ఒక మంత్రసాని, మొదలైన వారందరినీ ఫిషెస్ సభ్యుడయిన ల్యూక్ (షివేటల్ ఎజియోఫర్), ఒక పడవలో ఒక సమావేశం కోసం తీరం దిశగా తీసుకు వెళ్తాడు. ఒక సాయుధ దళం వారిని మాటువేసి దాడి చేస్తుంది, జులియాన్ వారు తప్పించుకుంటూ ఉండగా ప్రాణాంతకంగా గాయపడుతుంది. ఇద్దరు పోలీసు అధికారులు కారును ఆపుతారు. ల్యూక్ వారిని చంపుతాడు. బృందం జులియాన్‌ను అడవిలో పాతిపెట్టి, ఒక సురక్షితమైన ఇంట్లో బస చేస్తుంది. జులియాన్ మరణించడంతో, ఫిషెస్‌కు ల్యూక్‌ను కొత్త నాయకుడిగా ఎన్నుకుంటారు.
థియోకు కీ తాను గర్భవతిననీ, ఇంకా జులియాన్ తనకు అతనిని మాత్రమే నమ్మమని చెప్పిందని తెలియచేస్తుంది. జులియాన్ వంధ్యత్వానికి విరుగుడు కనిపెట్టగల, అజోర్స్‌లో ఉన్నట్లుగా భావించిన హ్యూమన్ ప్రాజెక్ట్ అనే ఒక శాస్త్రజ్ఞుల బృందానికి కీ్‌ను అప్పగించాలని తలచింది. కానీ పోలీసులు కాల్చివేయడానికి వెంటపడుతూ ఉండడంతో, కీ్‌ను ఫిషెస్‌తో ఉంచుకుందామని ల్యూక్ ప్రతిపాదిస్తాడు. బిడ్డ పుట్టేంత వరకూ తాను వారితో ఉండడానికి కీ ఒప్పుకుంటుంది. కీ్‌కు బిడ్డ పుట్టిన విషయం గురించి జనాలకి చెబుదామని థియో ప్రతిపాదిస్తాడు, కానీ ప్రభుత్వం బిడ్డను తీసుకుని ఉపయోగించుకుంటుందని ఫిషెస్ వ్యతిరేకిస్తుంది.
ఆ రాత్రి ఆలస్యంగా, థియో నిద్రలేచి, అనుకోని విధంగా, ల్యూక్ మరియు ఫిషెస్‌కు చెందిన ఇతర ఉన్నత శ్రేణి సభ్యుల మధ్య సమావేశంలో చోటు చేసుకున్న సంభాషణను రహస్యంగా వింటాడు. అతను జులియాన్ మరణం వెనుక ఉన్నది ఫిషెస్ సభ్యులేననీ అందుకు కారణం వాళ్ళు కీ యొక్క బిడ్డను రాబోయే విప్లవానికి మద్దతు కూడగట్టడం కోసం ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించాలని చూస్తున్నారనీ తెలుసుకుంటాడు. థియో కీ్‌ను మిరియంను నిద్ర లేపుతాడు; వాళ్ళు ఒక కారుని తస్కరించి, అక్కడి నుండి తప్పించుకుని జాస్పర్ ఇల్లు చేరుకుంటారు. అక్కడ మిరియం, హ్యూమన్ ప్రాజెక్ట్ యొక్క ఓడ "టుమారో ", బెక్స్‌హిల్ శరణార్ధుల శిబిరం నుండి రేవు దగ్గరగా రాబోతోందని చెబుతుంది. జాస్పర్ వారిని ఓడలోకి దొంగతనంగా రవాణా చేయడానికి తన స్నేహితుడైన ఒక కాంప్ గార్డ్, సయ్యెద్(పీటర్ ముల్లన్)ను తీసుకువద్దామని ప్రతిపాదిస్తాడు.
ఫిషెస్ జాస్పర్ యొక్క రహస్య ప్రదేశాన్ని కనిపెడుతుంది, కానీ, థియో, మిరియం మరియు కీ తప్పించుకుంటారు. జాస్పర్ వెనుక ఉండిపోతాడు. తనకు అంతిమ సమయం ఆసన్నమయ్యిందని గ్రహించి, అతను తన భార్యకు మరియు కుక్కకు క్వయెటస్‌ను అప్పగిస్తాడు. ఇతరులు ఎక్కడున్నారో చెప్పడం నిరాకరించడంతో ల్యూక్ అతనిని అమానుషంగా హతమారుస్తాడు. త్రయం సయ్యెద్‌ను కలుస్తుంది, అతను వారిని నకిలీ ఖైదీలుగా బెక్స్‌హిల్‌కు రవాణా చేస్తాడు. బస్సులో ఉండగా కీ్‌కు నొప్పులు మొదలవ్వడంతో, అనుమానిస్తోన్న గార్డు యొక్క దృష్టి మరల్చడం కోసం మిరియం ఒక మతపరమైన పిచ్చిదానిగా వ్యవహరించడంతో ఆమెను బయటకు ఈడుస్తారు.
బెక్స్‌హిల్‌లో, థియో మరియు కీ లు సయ్యెద్ స్నేహితురాలైన మరీచిక(ఓవానా పెళ్ళే)ను కలుస్తారు. ఆమె వారికొక గది ఏర్పాటు చేస్తుంది అక్కడ కీ ఒక పాపకు జన్మనిస్తుంది. మరుసటి రోజు సయ్యెద్, థియో మరియు కీలకు శరణార్ధులలో సంపూర్ణ-పరిమాణ విప్లవం మొదలయ్యిందని తెలియచేస్తాడు. ఫిషెస్ కూడా బెక్స్‌హిల్‌లోకి ప్రవేశించారు మరియు సైన్యం సమీకరించబడుతోంది. వాళ్ళు ఇద్దరు పోలీసుల హత్యతో సంబంధం కలిగి ఉన్నారనీ, బిడ్డ కూడా ఉందనీ తెలుసుకుని, సయ్యెద్ పారితోషికం కోసం వారిని అప్పగిద్దామనుకుంటాడు. మరీచిక సాయంతో వాళ్ళు తప్పించుకుంటారు. మరీచిక ఆ తరువాత థియో మరియు కీలను టుమారో లోకి చేర్చడం కోసం పడవ సమకూర్చడం కోసం ప్రయత్నిస్తుంది.
ఫిషెస్ కీను స్వాధీనం చేసుకుంటారు, కానీ టాంకులూ, ఆయుధసామగ్రి కలిగిన వాహనాల మద్దతుతో వచ్చిన సైన్యం నుండి కాల్పులు ఎదురవుతాయి; గందరగోళ పరిస్థితిలో థియో కీను ఆమె పాపను ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ఉన్నట్టు కనిపెట్టి వారిని విడుదల చేస్తాడు. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ల్యూక్ థియో పై కాల్పులు జరుపుతాడు కాని ఒక టాంక్ షెల్ పైన పడటంతో మరణిస్తాడు. పాప ఏడుపు వినపడగానే సైనికులు మరియు విప్లవకారుల మధ్య యుధ్ధం ఆగుతుంది. మళ్ళీ పోరు మొదలయ్యే లోపల, థియో, కీ మరియు పాప భక్తితో చూస్తోన్న యుధ్ధకారులు మరియు బిల్డింగ్ నివాసులను దాటి వెళ్తారు.
మరీచిక వారిని ఒక నీటిసొరంగం మరియు పడవ దగ్గరికి తీసుకు వెళ్తుంది కానీ, వారి వెంట రావడానికి నిరాకరిస్తుంది. థియో పడవకు తెడ్లు వేస్తూండగా, థియోను ల్యూక్ కాల్చినట్లు కీ తెలుసుకుంటుంది. ఆమె తన పాపకు చనిపోయిన థియో కొడుకైన "డైలాన్" పేరు పెట్టుకుంటానని చెబుతుంది. ఆ పడవలోంచి వాళ్ళు, బెక్స్‌హిల్ పైన రాయల్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైటర్-బాంబర్లు పెద్ద మోతాదులో బాంబుల వర్షం కురిపించడం చూస్తారు. చిక్కటి పొగమంచులో నుండి టుమారో ప్రత్యక్షం అవడంతో థియో నిస్సత్తువగా పడవకు ఒక పక్కగా వాలిపోతాడు. కీ పాప డైలాన్‌కు "మనమిప్పుడు సురక్షితమయ్యాము" అని చెప్పి, మృదువుగా "కా ఫొ" ("ఏడవ వద్దు") అనబడే గా భాషకు చెందిన సాంప్రదాయకమైన లాలిపాటను ఆలపిస్తుంది. చిన్న పిల్లల నవ్వుల శబ్దంతో సినీమా తెర నల్లబడిపోతుంది.
[మార్చు] తారాగణం
- క్లైవ్ ఓవెన్ థియో ఫారన్ గా నటించాడు, అతను ఒక మాజీ కార్యకర్త, ఫ్లూ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో తన బిడ్డ మరణించడంతో మానసికంగా విచ్చిన్నమయిపోయిన తండ్రి పాత్రలో నటించాడు.[4] అయిష్టంగా రక్షకుడిగా మారే థియో "ఆదర్శవంతమైన మగాడి"లాగా ఉంటాడు.[5][6] ఏప్రిల్ 2005లో తారాగణంలో భాగమయ్యి ఓవెన్, కారొన్ మరియు సెక్స్‌టన్‌లతో తన పాత్ర గురించి చర్చిస్తూ కొన్ని వారాలు గడిపాడు.[7] ఓవెన్ యొక్క సృజనాత్మక సూక్ష్మ బుధ్ధికి ముగ్ధులై, కారొన్ మరియు సెక్స్‌టన్ అతనిని ఒక రచయితగా పరిగణనలోకి తీసుకున్నారు.[8] ఎడిటింగ్ ప్రక్రియలో, థియో పాత్ర యొక్క నిర్మాణానికి తోడ్పడ్డ కధా నేపధ్యాన్ని తొలగించారు: థియో తన పనివేళలో పెట్రోల్ వోచర్లను దొంగలించే సన్నివేశాన్ని దృశ్యపరమైన సమాచారానికి, మాటలచే అందజేసే సమాచారం పై ప్రాముఖ్యతను ఇవ్వడం కోసం తొలగించారు. "క్లైవ్ మాకు చాలా సాయం చేసాడు", అని కారొన్ వరయిటీ కి చెప్పాడు. "అతనికి ఒక సన్నివేశాల సమాహారాన్ని పంపుతాను, ఆ తరువాత అతని పునశ్చరణని మరియు అంతఃకరణమును వింటాను".[9]
- జులియాన్ మూర్ జులియాన్ టేలర్ గా నటించింది. జులియాన్ పాత్ర కోసం కారొన్‌కు "నమ్మదగ్గ నాయకత్వ లక్షణాలు, బుధ్ధి కుశలత, (మరియు) స్వతంత్ర భావాలు" కలిగిన నటి కావాలి.[8] జూన్ 2005 లో మూర్‌ను తారాగణంలో భాగం చేసారు.[10] "ఆమెతో కలిసి పని చేయడం చాలా ఉల్లాసంగా ఉంటుంది" అని కారొన్ సినీమాటికల్ కు చెప్పాడు. "ఆమె ఎప్పుడూ మీ కాళ్ళ క్రింద నుండి తివాచి లాగేస్తూ ఉంటుంది. మీకు ఎక్కడ నిలబడాలో అర్థం కాదు, ఎందుకంటే ఆమె మిమ్మల్ని ఆటపట్టించడానికి సిధ్ధంగా ఉంటుంది".[8]
- మిఖేల్ కైన్ జాస్పర్ పాల్మర్ గా నటించాడు. తన స్నేహితుడు జాన్ లెనన్‌తో తనకున్న అనుభవాల ఆధారం పై కైన్ జాస్పర్‌ను ఉంచాడు;[8] గాలి వదిలే, లేదా మత్తుపదార్ధాల పొగ పీల్చే పాత్రలో అతను మొదటి సారిగా నటించాడు.[11] "దుస్తులు ధరించి, అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకోవడం మొదలు పెట్టగానే అతని శరీర హావ భావ ప్రకటన మారడం మొదలు పెట్టింది. మిఖేల్ ఆ పాత్రను ప్రేమించాడు. అతను ఆ పాత్రని తానే అని నమ్మాడు." అని కారొన్ వివరిస్తాడు.[11] షికాగో ట్రిబ్యూన్ కు చెందిన మైఖేల్ ఫిలిప్స్ ఆర్సన్ వెల్ల్స్ ఫిలిం నోయిర్, టచ్ ఆఫ్ ఈవిల్ లోని స్క్వార్జ్ (మోర్ట్ మిల్స్) పట్ల విధేయతని గుర్తిస్తాడు. రేమన్ మిగ్వెల్ వార్గస్ (చార్లటన్ హెస్టన్) ను స్క్వార్జ్ ఎలాగయితే పిలుస్తాడో అలాగే జాస్పర్ థియోను "అమీగొ" అని పిలుస్తాడు.[12]
- క్లైర్-హోప్ ఆషిటే కీ్ గా నటించింది, ఈ పాత్ర పుస్తకంలో లేదు. ఒక ఆఫ్రికన్ అక్రమ శరణార్ధి యొక్క పాత్రను చిత్రం కోసం రచించారు, అది కారొన్ యొక్క మానవ మూలాలకి సంబంధించిన ఇటీవలి ఏకైక-మూల పరికల్పన మరియు సామాజికంగా వంచింపబడిన మనుషుల అభిప్రాయం పై ఆధారపడి సృష్టించిన పాత్ర:[13] "ఈ బిడ్డ ఆఫ్రికన్ స్త్రీకి పుట్టిన బిడ్డ అన్న నిజం, మానవాళి ఆఫ్రికాలో మొదలయ్యిందన్న నిజంతో ముడిపడి ఉంది. మనం మానవాళి భవిష్యత్తుని సామాజికంగా వంచింపబడినవారి చేతుల్లో పెట్టి, దానిలో నుండి కొత్త మానవాళిని సృష్టిస్తున్నాము."[14]
- షివేటల్ ఎజియోఫర్ ల్యూక్ గా నటించాడు.
- పామ్ ఫెర్రిస్ మిరియం గా నటించింది.
- డాని హుస్టన్ నిగెల్ గా నటించాడు. అతను చిత్రంలో థియోకు దాయాది మరియు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారి. నిగెల్ కళల మంత్రిత్వశాఖకు చెందిన కార్యక్రమాన్ని నడిపిస్తాడు. ఆ కార్యక్రమ లక్ష్యం, మిచెలాంజిలో యొక్క డేవిడ్ , పేబ్లో పికాసో యొక్క గ్వార్నిక మరియు బాంక్‌సీ యొక్క భ్రిటిష్ కాప్స్ కిస్సింగ్ లాంటి కళాకృతులను కాపాడటం.
[మార్చు] ఇతివృత్తాలు
[మార్చు] సంభావన
ఉప్పొంగుతోన్న నిస్ప్రయోజకత మరియు నిరాశల మధ్య, చిల్డ్రన్ ఆఫ్ మెన్ సంభావన మరియు విశ్వాసం[15] అనే ఇతివృత్తాలను పరిశోధిస్తుంది.[16][17] చిత్రపు మూలం, చిల్డ్రన్ ఆఫ్ మెన్ అనే P.D. జేమ్‌స్ రచించిన నవల, సమాజం పునరుత్పత్తి చేయలేనపుడు ఏమవుతుందో వర్ణిస్తూ, ఈ సమస్యను వివరించడానికి పురుష వంధ్యత్వాన్ని ఉపయోగిస్తుంది.[18][19] నవలలో, సంభావన భవిష్యత్ తరాల పై ఆధారపడి ఉందని స్పష్టం చేయడం జరిగింది. "ఒక న్యాయసమ్మతమైన, కరుణాపూరిత సమాజం కోసం పోరాడటం, బాధపడటం, బహుశా చావటం కూడా హేతుబధ్ధమే, కానీ భవిష్యత్తు లేని ప్రపంచంలో, అతి త్వరలో, 'న్యాయం,' 'కరుణ,' 'పోరాటం,' 'చెడు,' లాంటి పదాలే ఖాళీ గాలిలో వినపడని శబ్దతరంగాలైనపుడు అలా చేయలేము." అని జేమ్‌స్ రాస్తుంది.[20]
చిత్రం వంధ్యత్వాన్ని పురుషుడి నుండి స్త్రీ[17]కి మారుస్తుంది కానీ దాని కారణాన్ని ఎప్పుడూ వివరించదు: పర్యావరణ విధ్వంసం మరియు దైవం ఇచ్చిన శిక్ష అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.[21] ఈ సమాధానం లేని ప్రశ్నకు (మరియు చిత్రంలోని ఇతర ప్రశ్నలకు), భావ వివరణాత్మక చిత్రం పట్ల కారొన్ యొక్క అయిష్టతను కారణముగా ఆపాదించారు: "ఒక విధమైన చిత్రాలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను, అవి భావ వివరములు మరియు సంజాయిషీలు ఇచ్చుకునేటువంటివి... అదిప్పుడు బధ్ధకపు పాఠకులకు మాధ్యమంగా మారింది... చిత్రం అనేది కధనానికి బందీ అయి ఉంటుంది. చలన చిత్రానికి బందీ అయిన కధనశైలిలో నేను నిష్ణాతుడిని."[22] భావ వివరణము మరియు కధా నేపధ్యం పట్ల కారొన్ యొక్క అయిష్టత అతనిని స్త్రీ వంధ్యత్వాన్ని, సంభావన నశించిపోతోందన్న సంగతికి ఉపమానంగా ఉపయోగించేలా చేసింది.[17] "దాదాపు పౌరాణికమైన" హ్యూమన్ ప్రాజెక్ట్ మానవ శక్తి మరియు మానవ జ్ఞానం యొక్క పరిణామం యొక్క సాధ్యతకు ఉపమానంగా మారిపోయింది.[23] చిత్రం అయిపోయే సరికి ప్రేక్షకులు ఎలా స్పందించాలో నిర్దేశించకుండా, కారొన్, చివరి సన్నివేశాలలో చూపిన సంభావనా దృక్పథానికి సంబంధింది తమవైన అంతిమ నిర్ణయాలు తీసుకొమ్మని ప్రోత్సహించాడు: "ఆ అంతంలో ప్రేక్షకులు తమ సొంత సంభావనా దృష్టిని పెట్టుబడి పెట్టడం కోసం, మేము చిత్రాన్ని సంభావన యొక్క సాధ్యతకు సంబంధించిన ఒక కొసమెరుపుతో అంతం చేద్దామనుకున్నాము. మీరు ఆశావాది అయితే, మీరు చాలా సంభావనని చూడగలరు, మీరు నిరాశావాది అయితే అంతంలో సంపూర్ణమైన నిరాశని మాత్రమే చూడగలరు."[24]
[మార్చు] సమకాలీన సంబంధిత విషయాలు
విమర్శకుడు మైఖేల్ జోషువా రోవిన్ వర్ణించిన "తనదయిన భౌతిక పర్యావరణంలో కాల్పనిక విషయం పట్ల విభ్రాంతి కలిగించే విశ్వసనీయత"ను వ్యక్తం చేయడానికి, లఘుచిత్రం, న్యూస్‌రీల్ రీతులని ఉపయోగిస్తూ, ఆధునిక ఆక్షన్ చిత్రపు చిత్రీకరణలో చిల్డ్రన్ ఆఫ్ మెన్ ఒక అసాధారణ అభిగమనాన్ని ఎంచుకుంది. రోవిన్‌కి, ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2001 నాటి దాడుల యొక్క విపత్కర విధ్వంసం మరియు ప్రతీకాత్మకతను అన్యాపదేశంగా సూచిస్తూ, ప్రతిధ్వనిస్తుంది.[25]
జేసొన్ గ్వెరాసియో మరియు ఈథన్ ఆల్టర్‌లతో పాటు రోవిన్, చిత్రం యొక్క పరదేశీయుల వలసకు సంబంధించిన కొలమానాన్ని గ్రహించాడు; ఆల్టర్ అభిప్రాయం ప్రకారం చిత్రం "వలస వచ్చిన వారి పట్ల వ్యతిరేకతను బలంగా నొక్కి చెబుతుంది", ఈ భావం యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ లాంటి ఆధునిక సమాజాలలో బలంగా ఉంది, మరోవైపు గ్వెరాసియో చిత్రాన్ని, "నేటి రాజకీయాల పై ఒక జటిలమైన ధ్యానం"గా అభివర్ణించాడు.[24][26]
ఆల్టర్ మరియు ఇతర విమర్శకులకి, సమకాలీన సంబంధిత విషాయాలకు వ్యవస్థాపరమైన మద్దతు మరియు ప్రేరణా శక్తి, సాంప్రదాయికమైన సంభాషణలలో కాక, చిత్రీకరణలోని చిత్ర భావ వివరణలోని దృశ్య స్వభావంలో ఉంది.[26] దృశ్యపరంగా, చిత్రంలోని శరణార్ధుల శిబిరాలు, ఉద్దేశపూర్వకంగా, అబు ఘ్రైబ్ ప్రిజన్, గ్వాంటెనామో బే డిటెన్షన్ కాంప్ మరియు ది మేజ్‌లను తట్టి లేపుతాయి.[23] ఇతర జనాకర్షక చిత్రాలు కనపడతాయి; ఉదాహరనికి శరణార్ధుల శిబిరం పైన ఉండే "హోమ్‌లాండ్ సెక్యూరిటి" అనే చిహ్నం.[27] చిత్రంలోని నరకంలాంటి cinéma vérité రీతి యుధ్ధ సన్నివేశాలు మరియు తాజా సమాచారం ఇంకా ఇరాక్ యుధ్ధం యొక్క లఘుచిత్ర అవచ్ఛాదముని చిత్ర విమర్శకుడు మనోహ్ల డార్గిస్ చూసి, కారొన్ యొక్క కాల్పనిక దృశ్యాలని "అపూర్వంగా మెచ్చుకోదగ్గ యుధ్ధ మండలాలు" అని వర్ణించాడు.[28]
చిత్రంలో శరణార్ధులను చుట్టుముట్టి, బోనులలోనూ, శిబిరాలలోనూ పెట్టి, "బొద్దింకలలను వేటాడినట్లుగా వేటాడారు"; అది క్రిస్ స్మిత్ మరియు క్లాడియా ప్యూగ్ లాంటి ప్రఖ్యాత చిత్ర విమర్శకులు, చిత్రంలో ప్రతీకాత్మక "అన్యాపదేశ సూచనలు" మరియు మారణ హోమ చిత్రాలను చూడడానికి దారి తీసింది.[16][29] జర్మన్ భాష మాట్లాడుతోన్న ఒక పెద్దతరహా స్త్రీ శరణార్ధిని ఒక బోనులో బంధించినపుడు,[3] మరియు బ్రిటిష్ హోమ్‌లాండ్ సెక్యూరిటి అక్రమ వలసదారులను బట్టలు విప్పి కొడుతున్నపుడు, నేపధ్యంలో ది లిబర్టైన్స్ యొక్క, "అర్బీట్ మాక్ట్ ఫ్రెయి" అనే పాట వినపడ్డపుడు ఈ ఇతివృత్తం బలోపేతం అవుతుంది.[30] "నాజీ పద్మవ్యూహాలకి సంబంధించిన దృశ్యపరమైన సూచనలు గగుర్పాటు కలిగించేవిగా ఉన్నవి" అని రిచర్డ్ A. బ్లేక్ వ్రాసాడు. ప్రభుత్వం తన స్వలాభం కోసం ప్రజల భయాలను ఉద్దేశ పూర్వకంగా వ్యక్తీకరణ చేస్తే, ప్రజలు ఏమవుతారన్నది ఇది చూపిస్తుంది.[31]
కారొన్ తాను కాల్పనిక, భవిష్యత్ సంఘటనలను వాస్తవ, సమకాలీన లేదా చారిత్రక సంఘటనలతో మరియు విశ్వాసాలతో సంబంధిత విషయ సూచన చేస్తూ ఇతివృత్తాన్ని ఉపదేశించడానికి భావచిత్రాలను ఎలా ఉపయోగిస్తాడో విశదీకరిస్తాడు:
They exit the Russian apartments, and the next shot you see is this woman wailing, holding the body of her son in her arms. This was a reference to a real photograph of a woman holding the body of her son in the Balkans, crying with the corpse of her son. It's very obvious that when the photographer captured that photograph, he was referencing La Pietà, the Michelangelo sculpture of Mary holding the corpse of Jesus. So: We have a reference to something that really happened, in the Balkans, which is itself a reference to the Michelangelo sculpture. At the same time, we use the sculpture of David early on, which is also by Michelangelo, and we have of course the whole reference to the Nativity. And so everything was referencing and cross-referencing, as much as we could.[8]
చివరి సన్నివేశాలలో, "శాంతి శాంతి శాంతి" అనే సంసృత పదాలు (śānti అని పలుకబడిన)[32] తుది పీఠికలుగా కనపడతాయి.[33][34] రచయిత మరియు చిత్ర విమర్శకుడు అయిన చాపెల్ హిల్‌లోని నార్త్ కారొలీనా విశ్వవిద్యాలయానికి చెందిన లారా ఎల్డ్రెడ్ చిల్డ్రన్ ఆఫ్ మెన్ "విద్యావంతులైన ప్రేక్షకులని ఆకర్షించే వంటకాలతో నిండి ఉంది" అని వ్యాఖ్యానించాడు. థియో మరియు కీ తన ఇంటిని సందర్శించినపుడు జాస్పర్ "శాంతి, శాంతి, శాంతి" అంటాడు. చిత్రంలో ఉపయోగించిన "శాంతి" అను పదం ఒక ఉపనిషత్తు తరువాత, ఇంకా "వణుకుతున్న కాళ్ళతో అవసాన దశలో ఉన్న పునరుత్పత్తి లేని ప్రపంచాన్ని ఊహించడానికి సమర్పించుకున్న" కళాకృతి అయిన T.S.ఎలియట్ రచించిన ది వేస్ట్ లాండ్ అనే పద్యం చివరి పంక్తిలో ఉన్నదని సూచిస్తాడు. కానీ, "శాంతి" అను పదము, అన్ని హిందూ ప్రార్థనలకి మొదలు మరియు అంతం కూడా, శబ్దార్థ ప్రకారము దాని అర్థము "శాంతి", హింసను అంతం చేసి దైవ మధ్యవర్తిత్వం మరియు పునర్జన్మ యొక్క ఆవాహనని సూచిస్తుంది.[35]
[మార్చు] మతం
కారొన్ యొక్క Y tu mamá también కు "సావాస చిత్రం"గా వర్ణించబడిన చిల్డ్రన్ ఆఫ్ మెన్ ఒక రోడ్ మూవీ కూడా. వర్జిల్'స్ ఐనీడ్ , దంతె'స్ డివైన్ కామెడి మరియు చాసర్'స్ కాంటర్బరి టేల్స్ లాగా, చిల్డ్రన్ ఆఫ్ మెన్ చిత్రం యొక్క ప్రయాణపు అతి ముఖ్య భాగం, గమ్యస్థానంలో కాకుండా దారిలో తేటతెల్లమౌతుంది.[31] సౌత్ కోస్ట్‌కి థియో యొక్క సాహస ప్రయాణం "ఆత్మజ్ఞానం" కోసం అతని వ్యక్తిగత అన్వేషణకు అద్దం పడుతుంది,[26] ఆ ప్రయాణం థియోను "నిరాశావాదం నుండి ఆశావాదం" వైపుకు తీసుకువెళ్తుంది.[36]
కారొన్ ప్రకారం, P.D. జేమ్‌స్ యొక్క రచన (ది చిల్డ్రన్ ఆఫ్ మెన్ ) యొక్క పేరు బైబిల్‌లోని ఒక పరిచ్ఛేదములోని వ్రాలు నుండి గ్రహించబడిన ఒక కాథలిక్ రూపకాలంకారము.[37] (Psalm 90 (89):3 of the KJV: "మీరు మనిషిని బూడిదగా చేసి, మగవాళ్ళ పిల్లల్లారా వెనక్కు రండు, అని పిలుస్తారు".) జేమ్‌స్ తన కధను ఒక "క్రైస్తవ పిట్టకధ" అని చెబుతుంది,[18] కారొన్ దానిని, "దాదాపు క్రైస్తవ మతం పట్ల సారించిన దృష్టి" అని వర్ణిస్తాడు; "నేను ఆధ్యాత్మిక ఆదర్శాల నుండి దూరంగా పారిపోదలచుకోలేదు", అని కారొన్ ఫిలింమేకర్ మాగజీన్ కు చెప్పాడు. కానీ నేను మూఢ నమ్మకంతో సంపర్కం పెట్టుకోదలచుకోలేదు.[24] మూస:Rquoteఈ చిత్రాన్ని "విధ్వంసక చర్యగా" పిలిచిన ఫర్స్ట్ థింగ్స్ కు చెందిన ఆంథొని సాక్రమోన్‌తో పాటు, మూలం నుండి ఈ మళ్ళింపుని కొంతమంది విమర్శించారు. నైతికంగా ఉత్పాదక శక్తిలేని విధ్వంసకవాదాన్ని క్రైస్తవ మతం అధిగమించినట్లుగా వ్రాసిన P.D. జేమ్‌స్ పిట్టకధలో నుంచి, కారొన్ ఎలా మతాన్ని తొలగించాడో అన్న వ్యంగ్యాన్ని చూసి పై విధంగా విమర్శకులు స్పందించారు.[38]
క్రైస్తవ ప్రతీకను ఉపయోగించినందుకు చిత్రం గుర్తింపబడింది; ఉదాహరణకి, "ఫిషెస్"గా పేరుబడ్డ బ్రిటిష్ తీవ్రవాదులు, శరణార్ధుల హక్కులను పరిరక్షిస్తారు.[39] యునైటెడ్ స్టేట్స్‌లో క్రిస్మస్ రోజు విడుదలవ్వగా, విమర్శకులు థియో మరియు కీ యొక్క పాత్రలను జోసఫ్ మరియు మేరిలతో పోల్చి,[40] చిత్రాన్ని ఒక "ఆధునిక కాలపు జన్మ కధ" అన్నారు.[41] కీ గర్భవతన్న విషయం థియోకు ఒక ధాన్యపుకొట్టులో తెలియచేస్తారు, అది పుట్టుక సన్నివేశంలోని పశువుల దొడ్డిని పరోక్షంగా సూచిస్తుంది, అంతేకాక ఇతర పాత్రలు కీను ఆమె పాపను చూడగానె, వారు "యేసు క్రీస్తు" అనో లేక తమ శిలువ గుర్తుతోనో స్పందిస్తారు.[42]
ఈ ఆధ్యాత్మిక ఇతివృత్తాలను నొక్కి చెప్పడం కోసం, బ్రిటిష్ స్వరకర్త జాన్ టావనర్‌తో ఒక 15-నిముషాల కార్యక్రమాన్ని ఉపయోగిస్తాడు. "దేవుని దృష్టిలో మాతృత్వం, జన్మ, పునర్జన్మ మరియు విమోచనము" అనే ఇతివృత్తాలను ప్రతిధ్వనించే ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చ్ యొక్క సభ్యుడు అతను. తన స్వరరచనను "అల్ఫోన్సొ యొక్క చిత్రానికి సంగీతపరమైన మరియు ఆధ్యాత్మిక పరమైన ప్రతిస్పందన" అని పేర్కొంటూ, మెజ్జొ-సోప్రానో పాడిన, టావనర్ యొక్క "ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఎ ప్రేయర్" యొక్క ముక్కలలో, లాటిన్, జర్మన్ మరియు సంస్కృత గీత రచనలు ఉన్నాయి. "మాత" (తల్లి), "పాహి మాం" (నన్ను రక్షించు), "అవతార" (అవతారం) మరియు "అల్లెలూయా" అనే పదాలు చిత్రమంతటా కనిపిస్తాయి.[43][44]
కారొన్ యొక్క చిత్రంలో వెస్ట్ బాంక్ మరియు గాజాలలో పేరు తప్ప ఇతర రకాలయిన అన్ని రకాల పోలికలూ కలిగిన ప్రతిఘటనలలో పాలుపంచుకునే ముస్లిం నివాసులను దర్పణం పట్టే, అనేక సన్నివేశాలు ఉన్నాయి, ముఖ్యంగా బెక్స్‌హిల్ శిబిరం చుట్టూతా నడిచే సన్నివేశాలలో ఇవి అధికంగా కనిపిస్తాయి. ప్రతిఘటన ఉద్యమం యొక్క పేరు స్ప్రేతో గోడ మీద పెయింట్ చేయబడి ఉంది - "ది అప్‌రైజింగ్". ఇది, "ఇంతిఫాదా" అనబడే ఆక్రమించుకున్న పాలస్తీనియన్ భూభాగాలలోని విప్లవాలను వర్ణించే అరబిక్ పదం యొక్క సమరూప అనువాదం. బెక్స్‌హిల్ వీధుల గుండా సాగే ధిక్కారపు వీధి వ్యతిరేక కవాతులో శరణార్ధ్లులు "అల్లహు అక్బర్", (దేవుదు గొప్పవాడు), అని స్పష్టంగా పాడడం వినిపిస్తుంది. అదే విధంగా, బెక్స్‌హిల్‌లో పోరాటం చేస్తూ మరణించిన అమరవీరుల వీధి అంతిమ సంస్కారం, గాజాలోని అమరవీరుల ఊరేగింపుని చూసి కలిగిన ప్రేరణతో చిత్రించబడినది.
[మార్చు] నిర్మాణం
P.D. జేమ్‌స్ నవల యొక్క అనుసరణను వాస్తవంగా పాల్ చార్ట్ రచించాడు, తరువాత మార్క్ ఫెర్గూస్ మరియు హాక్ ఓస్ట్‌బై మళ్ళీ రచించారు. మార్క్ అబ్రహాం, ఎరిక్ న్యూమన్, హిలరి షోర్ మరియు టోని స్మిత్‌లు వృధ్ధిలోకి తెచ్చిన బెకన్ పిక్చర్స్ 2001లో దర్శకుడు అల్ఫోన్సొ కారొన్‌ను జట్టులో భాగం చేసారు.[45] దర్శకుడు కారొన్ Y tumamá también పూర్తి చేసాక, కారొన్ మరియు స్క్రీన్‌ప్లే రచయిత తిమోతి జె. సెక్స్టన్ వ్రాత ప్రతిని తిరిగి రాయడం మొదలుపెట్టారు. తాను "రెండవ సారి విషయాలను ఊహించడం మొదలు[11]పెడతానని" కారొన్ P.D. జేమ్‌స్ నవల చదవకూడదని నిశ్చయించుకున్నాడు; సెక్స్టన్‌ను చదవమని చెప్పి తాను మాత్రం కుదించబడిన కధనాన్ని చదవాలని నిర్ణయించాడు.[8][24] కారొన్ వెంటనే నిర్మాణం మొదలు పెట్టలేదు; దానికి బదులు హారి పాటర్ అండ్ ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్ కు దర్శకత్వం వహించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో దర్శకుడిగా అనుభవం అతనికి "బ్రిటిష్ వాస్తవికత" యొక్క వ్యక్తీకరణ గురించి అంతఃదృష్టిని ఇచ్చి, "బ్రిటిష్ మనస్తత్వం యొక్క సామాజిక చలనముల"ను అర్థం చేసుకొవడానికి దోహదం చేసింది.[46] క్లైవ్ ఓవెన్ ముందు చిల్డ్రన్ ఆఫ్ మెన్ కు సంబంధించిన దృష్టి యొక్క ఉదాహరణని ప్రదర్శించడానికి కారొన్ నిర్మాణ సన్నాహంలో బాటిల్ ఆఫ్ అల్జియర్స్ చిత్రాన్ని సామాజిక పునర్నిర్మాణానికి ఉదాహరణగా తీసుకున్నాడు. చిత్రానికి ఒక తాత్విక, సామాజిక చట్రం సృష్టించడానికి, దర్శకుడు, స్లావోజ్ జిజెక్ వ్రాసిన సాహిత్యమేకాక అలాంటి కళాకృతులను చదివాడు.[47] సన్‌రైస్ చిత్రం కూడా చాలా ప్రభావం చూపింది.[17]
[మార్చు] ప్రాంతం
2027 చెందిన భవిష్యత్ పూర్వకమైన కాని దాడికి గురైన పటీనకు సహకారం అందించడానికి ఎ క్లాక్‌వర్క్ ఆరెంజ్ సాయపడింది.[17] చిల్డ్రన్ ఆఫ్ మెన్ కారొన్ లండన్‌లో చేసిన రెండవ చిత్రం, నగరం యొక్క సింగిల్ మరియు వైడ్ షాట్స్ తీస్తూ, దర్శకుడు నగరాన్నే ఒక పాత్రగా చిత్రీకరించాడు.[48] కారొన్ చిత్రం తీస్తున్నపుడు, లండన్ బాంబింగ్స్ సంభవించాయి, కానీ దర్శకుడు నిర్మాణాన్ని తరలించడానికి ప్రయత్నించలేదు. "లండన్ తప్ప మరే ప్రదేశంలోనూ చిత్రాన్ని షూట్ చేయడం అసాధ్యమయ్యేది ఎందుకంటే, ప్రాంతాలను చిత్రంలో పొందుపరిచే తీరు అలా ఉంది," అని కారొన్ వరైటీ కి చెప్పాడు. "ఉదాహరణకి, ఫ్లీట్ స్ట్రీట్ St. పాల్ యొక్క దిశగా చూస్తోన్న షాట్‌ను ఇంక ఎక్కడైనా షూట్ చేయడం అసాధ్యమయ్యేది."[48] ఈ పరిస్థితుల వల్ల, ఫ్లీట్ స్ట్రీట్ పై చిత్రీకరించిన మొదటి ఉగ్రవాద దాడి సన్నివేశం లండన్ బాంబింగ్ సంభవించిన ఒకటిన్నర నెలల తరువాత తీయడం జరిగింది.[47]
తన దృష్టిలో "ఆకర్షణ శక్తి లేని స్థలం" అయిన ఈస్ట్ లండన్‌లో కారొన్ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడు. సెట్ లొకేషన్స్‌ను వాటిని మరింత దిగజారి పోయినట్లుగా తయారు చేసారు; కారొన్ తన సిబ్బందికి "మనం దానిని మరింత మెక్సికన్‌గా తయారు చేద్దాము. వేరే మాటలలో చెప్పాలంటే, మనం లొకేషన్ దిశగా చూస్తాము ఆ తర్వాత, అవును, కానీ మెక్సికోలో ఇది ఇలా ఉంటుంది, అని చెప్తాము. స్థలాన్ని దిగజారిపోయ్నట్లు చూపించే ప్రయత్నమే ఇదంతా. పేదరికం గురించి ఇదంతా." అని చెప్పానని చెప్తాడు[47] ట్రఫాల్గార్ స్క్వేర్ మరియు బాటర్‌సీ పవర్ స్టేషన్ లాంటి ప్రదేశాలలో సన్నివేశాలు చిత్రీకరించి అతను లండన్‌లోని అత్యంత జనాకర్షక ప్రదేశాలను ఉపయోగించుకున్నాడు. పవర్ స్టేషన్ సన్నివేశాన్ని (దాన్ని కళా దస్తావేజు కింద మార్పు చేయడం టేట్ మోడర్న్‌కి సూచన), ఆంటోనియోని యొక్క రెడ్ డెజెర్ట్ తో పోల్చారు.[49] పింక్ ఫ్లాయడ్ యొక్క జంతువుల పట్ల విధేయత ప్రదర్శించడం కోసం కారొన్ సన్నివేశానికి పిగ్ బలూన్ జోడించాడు.[50] ఈ సన్నివేశంలో కనపడే ఇతర కళాకృతులలో మిచెలాంజిలో యొక్క డేవిడ్ ,[31] పికాసో యొక్క గ్వార్నిక ,[51] మరియు బాంక్‌సీ యొక్క బ్రిటిష్ కాప్స్ కిస్సింగ్ , ఉన్నాయి.[3] లండన్ విజువల్ ఎఫ్ఫెక్ట్స్ కంపేనీలయిన డబుల్ నెగటివ్ మరియు ఫ్రేమ్‌స్టోర్ కారొన్‌తో నేరుగా, వ్రాత ప్రతి నుండి నిర్మాణ మలిదశ వరకూ, ప్రభావాలని అభివృధ్ధి చేస్తూ, మరో విధంగా సాధ్యం కాని పర్యావరణాలూ, సన్నివేశాలు సృష్టిస్తూ కలసి పని చేసాయి.[48]
[మార్చు] రీతి మరియు రూపకల్పన
"చాలా సై-ఫై (శాస్త్రీయ కాల్పనిక) గ్రంధాలలో, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కధకి బదులుగా నిలుస్తాయి. ఇక్కడ అవి అంతులేకుండా కధను పురోగమింపచేస్తాయి," అని స్టార్ ట్రిబ్యూన్ కు చెందిన కోలిన్ కోవర్ట్ చెప్తాడు.[52] సమకాలీన మరియు భవిష్యత్‌పూర్వక రూపం సమతుల్యం చేయడం కోసం ఇంకా ఆ సమయంలో మిగిలిన ప్రపంచంలో ఏమి జరుగుతోందో సులభంగా ఊహించడం కోసం బిల్‌బోర్డ్స్ రూపకల్పన చేసారు. మొదటి చూపుతో గమనిస్తే ఆధునిక కార్లతో పోల్చదగిన కార్లను చేసారు కానీ కొంచం దగ్గరి నుండి చూస్తే అవి పరిచయం లేనివిగా తెలుస్తాయి.[53] సాంకేతికంగా పురోగమించిన ప్రతిపాదనలు మరియు 2027 అమరిక యొక్క శాస్త్రీయ కాల్పనిక భాగాలను తిరస్కరించే తన చిత్రం ఒక "ఆంటి-బ్లేడ్ రన్నర్ "[54] అని కారొన్ కళా విభాగానికి తెలియచేసాడు. 2014లో ఆపివేయబడిన చిత్రపు కాలగమనంలో వినూత్న సాంకేతికతను ఎన్నుకుంటూ, దర్శకుడు సమకాలీన కాలం[55] గురించి ధ్యానం చేస్తూ చిత్రాల పై దృష్టి నిలిపాడు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, కారొన్ వర్తమానం పై ఒక నిలకడైన దృష్టి నిలిపాడు: "మేము భవిష్యత్తు వల్ల మనసులు చెదరగొట్టుకోదలచుకోలేదు. మేము ప్రేక్షకులని మరో వాస్తవికతలోకి రవాణా చేయదలచుకోలేదు."[56]
[మార్చు] సింగిల్-షాట్ సన్నివేశాలు
చిల్డ్రన్ ఆఫ్ మెన్ అనేక పొడవాటి సింగిల్-షాట్ సన్నివేశాలను ఉపయోగించింది వాటిల్లో, అత్యంత జటిలమైన చర్యలు సంభవిస్తాయి. వీటిల్లో అత్యంత పొడవైన సన్నివేశాలు, కీ జన్మనిచ్చిన సన్నివేశం (199 సెకన్లు); ఒక గ్రామ రహదారి పై జరిగిన ఆకస్మిక దాడి (247 సెకన్లు); ఇంకా థియో ఫిషెస్ చేతిలో చిక్కి ఆ తరువాత ఉగ్రరూపం దాలుస్తోన్న యుధ్ధం మధ్యలో వీధి గుండా, బిల్డింగ్‌లోంచి పరిగెడుతూ వెళ్ళిన సన్నివేశం (454 సెకన్లు). CGI ఎఫెక్ట్స్ సాయంతో కొన్నిసార్లు సన్నివేశం యొక్క కొనసాగింపు యొక్క ప్రభావం మాయ అయినప్పటికీ ఈ సన్నివేశాలు చిత్రీకరించడం అత్యంత కష్టతరం.[57]
కారొన్ అప్పటికే పొడవాటి టేక్స్ విషయంలో Y tu mamá también మరియు హారి పాటర్ అండ్ ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్ చిత్రాలలో ప్రయోగాలు చేసి ఉన్నాడు. కారొన్ రీతి అతను అభిమానించే స్విస్ చిత్రం జోనహ్ హూ విల్ బి 25 ఇన్ ది ఇయర్ 2000 ప్రభావానికి గురైనది. కారొన్ ఈ విధంగా గుర్తుకు తెచ్చుకుంటాడు: "మొదటిసారి (జోనహ్ )ను చూసినపుడు నేను సినీమాను చదువుతున్నాను, ఇంకా ఫ్రెంచ్ న్యూ వేవ్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ చిత్రాలతో పోలిస్తే జోనహ్ చాలా సాధారణంగా ఉంది. కామెరా కొంత దూరంలో ఉంటుంది ఇంకా పోలికగా చూస్తే కొన్ని క్లోజప్స్ మాత్రం ఉంటాయి. అది పొందికగా ఉండి ప్రవహిస్తోంది, నిర్విరామంగా ఆచూకీ తెలుసుకుంటోంది, కానీ చాలా మెల్లగా ఇంకా తన వైపు దృష్టి మరల్చకుండా ఉంటుంది.[58] సంక్లిష్టమైన లాంగ్-టేక్స్ మెక్సికోలో ప్రఖ్యాతిగాంచిన చిత్ర దర్శకులలో అప్పటికే చాలా ప్రాచుర్యం పొంది ఉన్నాయి, ఆ టెక్నిక్‌ను ప్లేనో సీక్వెన్షియా అని పిలుస్తారు.
సింగిల్-షాట్ సన్నివేశాలు సృష్టించడం ఒక సవాలు, అంతే కాక అది సమయం తీసుకునే ప్రక్రియ అందువల్ల స్టూడియో వారు ఆందోళన చెందుతారు. క్లైవ్ ఓవెన్ పాత్ర దాడికి గురవుతున్న బిల్డింగ్‌ను వెతికే సన్నివేశాన్ని సింగిల్ షాట్‌లో తీయడానికి పద్నాలుగు రోజులు పట్టింది; ప్రతిసారి దానిని తిరిగి షూట్ చేయడానికి అయిదు గంటలు పట్టింది. ఒక సన్నివేశం మధ్యలో, లెన్స్ పైన రక్తం చిమ్మింది, సినీమాటోగ్రాఫర్ ఇమాన్యువల్ ల్యుబెజ్కి దర్శకుడిని లొపలికి వదిలేయమని ఒప్పించాడు. ఓవెన్ ప్రకారం, "దాని కష్టతరమైన భాగంలో నేను కామెరా ఆపరేటర్ ఉన్నాము ఎందుకంటే, మేము చాలా సంక్లిష్టమైన, చాలా స్పష్టంగా నిర్వచించబడిన నృత్యం చేస్తున్నాము కానీ అది మేము షూట్ చేస్తున్నపుడు ఆ నృత్యాన్ని మేము చాలా అనిర్దిష్టంగా చూపాలి".[59]
రహదారి ప్రక్కన ఆకస్మిక దాడి సన్నివేశంలో కొనసాగింపు నిలుపుకుందామన్న కారొన్ తొలి ఆలోచనని నిర్మాణ నిపుణులు అది "చేయడానికి అసాధ్యమైన సన్నివేశం" అని త్రోసిపుచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్‌తో నిండి ఉన్న హారి పాటర్ అండ్ ది ప్రిజనర్ ఆఫ్ అజ్కబాన్ అనుభవంతో తాజాగా ఉన్న కారొన్, సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కంప్యూటర్‌చే ఉత్పత్తి చేయబడిన భావచిత్రాన్ని ఉపయోగిద్దామని సూచించాడు. దర్శకుడికి తాము "రా లఘుచిత్రాని"కి దగ్గరగా ఉండే చిత్రం తీయాలనుకున్నామని గుర్తుచేస్తూ లుబెజ్కి దానిని వ్యతిరేకించాడు. దానికి బదులు, కారొన్‌కు సన్నివేశాన్ని అభివృధ్ధి చేసి కొనసాగించబడిన ఒకే సన్నివేశంగా తీయడానికి సహకరిస్తూ, డాగికాం సిస్టమ్స్ కి చెందిన గారి థియెల్జెస్ కనిపెట్టిన ఒక ప్రత్యేక కామెరా రిగ్‌ను ఉపయోగించారు.[12][60] ఒక వాహనాన్ని సీట్లు వంచి కామెరా దారి నుండి నటులను వంచడానికి వీలుగా చేసి, ఇంకా విండ్‌షీల్డ్‌ను కామెరా ముందు విండ్‌స్క్రీన్ లొపలికి వెలుపలికి వెళ్ళే విధంగా రూపకల్పన చేసారు. నలుగురు సిబ్బంది, DP మరియు కామెరా ఆపరేటర్‌తో కలిపి, అటక పైన స్వారీ చేసారు.[61]
కానీ, సాధారణంగా నివేదించే వ్యాఖ్య, ఆక్షన్ సన్నివేశాలు అవిచ్ఛిన్నమైన సన్నివేశాలు[62] అనేది పూర్తిగా నిజం కాదు. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ఫ్రేజర్ చర్చిల్, ఎఫెక్ట్స్ సిబ్బంది "దుస్సాధ్యమైన లాంగ్‌షాట్స్ తీయడానికి అనేక టేక్స్‌ను కలపాల్సి వచ్చింది", అక్కడ వారి పని, "అవిచ్ఛిన్నమైన కామెరా కదలిక యొక్క మాయని సృష్టించడం", అని వివరిస్తాడు. ఒక్క సారి "అతుకుల్లేని కలపోత"ను సృష్టించగానే, వాళ్ళు మరో సన్నివేశానికి కదులుతారు. మూడు అవిచ్ఛిన్నమైన సన్నివేశాలకు ఈ టెక్నిక్స్ చాలా ముఖ్యం: అవి ప్రారంభ సన్నివేశంలో కాఫీ దుకాణం ప్రేలుడు, కార్ పై ఆకస్మిక దాడి, ఇంకా యుధ్ధరంగ సన్నివేశం. కాఫీ దుకాణ సన్నివేశం "రెండు వరుస రోజుల్లో తీసిన రెండు వేర్వేరు టేక్స్" కలిగి ఉన్నది, కార్ దాడి, "ఆరు వేర్వేరు లొకేషన్స్‌లో ఆరు సెక్షన్స్ కలిగి ఉండి, వారం సమయం తీసుకుని, అయిదు అతుకుల్లేని డిజిటల్ ట్రాన్సిషన్స్ కావలసి వచ్చాయి"; ఇంకా బాటిల్‌ఫీల్డ్ సన్నివేశం "రెండు లొకేషన్స్‌లో అయిదు వేర్వేరు టేక్స్‌లో తీయడం" జరిగింది. చర్చిల్ మరియు డబుల్ నెగటివ్ సిబ్బంది, చిత్రం కోసం 160కి పైగా ఇలాంటి ఎఫెక్ట్స్ సృష్టించారు.[63] వరైటీ కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో కారొన్ "సింగిల్-షాట్" ఆక్షన్ సన్నివేశాల ఈ రకమైన స్వభావాన్ని ఒప్పుకున్నాడు: "నేను ఒక పెద్ద రహస్యాన్ని రహస్యంగా మిగలకుండా చేస్తుండవచ్చు, కానీ కొన్ని సార్లు అది కనపడే దాని కంటే చాలా ఎక్కువ. అంతటినీ ఎలా కలబోస్తామనేది ఇంకా మార్పుచెందే కూర్పు యొక్క దృష్టిని ఈ వేర్వేరు తునకల గుండా ఎలా ఉంచుతామనేది అన్నింటి కంటే ముఖ్యమైన విషయాలు.[9]
VFX హౌస్ ఫ్రేంస్టోర్ CFCకి చెందిన టిం వెబ్బర్, కీ బిడ్డకు జన్మనిస్తున్న సన్నివేశాన్ని మూడున్నర నిముషాల సింగిల్ టేక్ తీయడానికీ, బిడ్డ పుట్టే సన్నివేశంలో CG ఎఫెక్ట్స్ సృష్టించడానికి, కూర్చడానికీ బాధ్యత వహించాడు.[48] బిడ్డపుట్టే సన్నివేశాన్ని తప్పించి మిగిలిన వాటిలో కారొన్ తొలుతగా, అనిమట్రోనిక్ (కృత్రిమ) పాపను ఉపయోగిద్దామని తలచాడు. చివరికి, రెండు టేక్స్ తీసారు, అందులో రెండవ టేక్‌లో క్లెయిర్ హోప్ అషిటే యొక్క కాళ్ళను దాచి, వాటిని కృత్రిమ పాదాలతో భర్తీ చేసారు. కారొన్ ఎఫెక్ట్ యొక్క ఫలితాలతో సంతృప్తి చెంది, వాటిని ఫ్రేమ్‌స్టోర్ కంప్యూటర్ ఉత్పత్తి చేసిన పాపతో భర్తీ చేసి, ఆనిమాట్రోనిక్ ఆకృతిలోని పాపకు సంబంధించిన మునుపటి షాట్స్ కోసం వెనక్కి మళ్ళాడు.[57]
[మార్చు] ధ్వని
- చూడండి: Children of Men (soundtracks)
కారొన్ ధ్వనిని, సంగీతాన్ని సామాజిక అస్థిరత మరియు జీవన వంధ్యత్వం యొక్క కాల్పనిక ప్రపంచాన్ని తీసుకురావడానికి ఉపయోగిస్తాడు.[64] రాక్, పాప్, ఎలెక్ట్రానిక్ మ్యూజిక్, హిప్-హాప్ మరియు సాంప్రదాయ సంగీతం, సృజనాత్మకమైన కాని నియంత్రించబడిన కలయిక, విలక్షణమైన చిత్ర స్వర రచనని భర్తీ చేస్తుంది.[64] లాస్ ఏంజెల్స్ టైమ్స్ రైటర్ కెవిన్ క్రస్ట్ చెప్పే "పట్టణ శబ్ద గడబిడ"ను ఉత్పత్తి చేస్తూ, ప్రాపంచికమైన ట్రాఫిక్ శబ్దాలు, మొరిగే కుక్కలు, వాణిజ్య ప్రకటనలు థియో పాత్రను లండన్, ఈస్ట్ ససెక్స్ మరియు కెంట్‌లలో అనుసరిస్తాయి.[64] క్రస్ట్ కోసం, సంగీతం చిల్డ్రన్ ఆఫ్ మెన్ యొక్క వంధ్య ప్రపంచం పై అన్యాపదేశంగా వ్యాఖ్యానిస్తుంది: జాస్పర్ కార్ రేడియోలో నుండి వినపడే డీప్ పుర్పుల్ యొక్క "హుష్" ఒక "బిడ్డలు లేని ప్రపంచానికి ఒక కపటపూరితమైన లాలి పాట" అవుతుంది, మరోవైపు, కింగ్ క్రిమ్‌సన్ యొక్క "ది కోర్ట్ ఆఫ్ ది క్రిమ్‌సన్ కింగ్" తమ గేయరచనతో అలాంటి పోలికే తయారు చేస్తుంది, ".....ప్రాచీన నాలుకతో మూడు లాలిపాటలు".[64]
ఎలెక్ట్రానిక్ సంగీతం యొక్క విలక్షణమైన ఎంపికలో, అఫెక్స్ ట్విన్ యొక్క "ఒంగిజ్య స్విచ్ 7" యొక్క రీమిక్స్, జాస్పర్ ఇంటిలో ఎక్కడయితే జాస్పర్ యొక్క "స్ట్రాబెరి దగ్గు" (ఒక శక్తివంతమైన, స్ట్రాబెరి-రుచితో కూడిన మార్జువానా) నమూనా చేయబడుతోందో, అందులో తొలుతగా వినపడని అరుపుల యొక్క అదనపు నమూనాలతో కలిపి వినవచ్చు. ఇద్దరు మగవాళ్ళ మధ్య సంభాషణలో, నేపధ్యంలో రేడియోహెడ్ యొక్క "లైఫ్ ఇన్ అ గ్లాస్‌హౌస్" వినపడుతుంది.
అనేకమైన డబ్‌స్టెప్ గీతాలు, ముఖ్యంగా డిజిటల్ మిస్టిక్జ్ చేసిన ఆంటీ-వార్ డబ్ , ఇంకా కోడ్9 & ది స్పేస్ ఏప్ అండ్ ప్రెజర్ యొక్క గీతాలు కూడా ఇందులో వినపడతాయి.[65]
చిత్రం రెండవ భాగంలో బెక్స్‌హిల్ సన్నివేశాల కోసం, దర్శకుడు నిశ్శబ్దాన్నీ, ఆటోమటిక్ ఆయుధాల కాల్పులు మరియు "ఫ్యూజీస్" (అక్రమ వలసవాసులు) యొక్క కదలికలను నిర్దేశిస్తూన్న లౌడ్‌స్పీకర్స్ యొక్క రణగొన ధ్వని యొక్క సౌండ్ ఎఫెక్ట్స్‌నీ ఉపయోగిస్తాడు.[64] ఇక్కడ, శరణార్ధుల శిబిరం యొక్క గందరగోళానికి పరిస్థితిని జార్జ్ ఫ్రెడెరిక్ హాండెల్, గుస్తావ్ మాహ్లర్ యొక్క సాంప్రదాయ సంగీతం, మరియు క్రిజ్టోఫ్ పెండెరెక్కి యొక్క "థ్రెనొడి టు ది విక్టింస్ ఆఫ్ హిరోషిమ" పూర్ణతను తీసుకువస్తాయి.[64] చిత్రమంతటా, కధనశైలిని ఉపయోగించకుండా కధను వివరించడానికి, కధకు అర్థం చెప్పడానికీ, జాన్ టావెనెర్ యొక్క ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ అ ప్రేయర్ ను ఒక ఆధ్యాత్మిక ఉద్దేశంగా ఉపయోగించారు.[64]
చిత్రంలో కొన్ని సార్లు, టిన్నిటస్‌ను గుర్తుకు తెచ్చే ఒక పెద్ద, మ్రోగే గొంతు వినపడుతుంది. ఈ ధ్వని సాధారణంగా (జులియాన్, జాస్పర్) లాంటి పెద్ద పాత్రల చావులతో ఏకకాలంలో సంభవిస్తుంది. జులియాన్ దానిని చివరి సారి వినే పౌనః పున్యంగా వర్ణిస్తుంది. ఈ విధంగా, అప్పుడు, పాత్రల చావుకు స్వరాలు నష్టపోవడం ప్రతీకాత్మకంగా నిలుస్తుంది. దీనిని చాలా మూలాలు గుర్తించాయి కానీ మంచి సంగ్రహము 2007లో ఫిల్మింట్‌లో కనపడింది.[66]
చివరి సన్నివేశాలు మొదలయ్యేసరికి, పిల్లలు నవ్వుతోన్న ధ్వని వినపడుతుంది.[67] రెండు రాజకీయ పాటలు, జాన్ లెనన్ యొక్క "బ్రింగ్ ఆన్ ది లూసీ (ఫ్రీద పీపుల్)" మరియు జార్విస్ కాకర్ యొక్క "రన్నింగ్ ది వర్ల్డ్", చిత్రాన్ని ముగిస్తాయి.[64]
[మార్చు] విడుదల
03 సెప్టెంబర్ 2006 నాడు 63వ వెనీస్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో చిల్డ్రన్ ఆఫ్ మెన్ మొదటి ప్రపంచ ప్రారంభ ప్రదర్శన జరిగింది.[68] 22 సెప్టెంబర్ 2006 నాడు, చిత్రం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదటిసారి 2.4 మిలియన్ పౌండ్లతో 368 తెరల మీద ప్రదర్శించబడింది.[69] అది యునైటెడ్ స్టేట్స్‌లో 22 డిసెంబర్ 2006న 16 థియేటర్లలో పరిమితంగా విడుదల అయ్యింది, తర్వాత 5 జనవరి 2007 నాటికి 1200 థియేటర్లకు విస్తరించబడింది.[70] 06 ఫిబ్రవరి 2008 నాటికి, చిల్డ్రన్ ఆఫ్ మెన్ ప్రపంచవ్యాప్తంగా 69,612,678 పౌండ్లు వసూలు చేసింది. అందులో 35,552,383 పౌండ్లు యునైటెడ్ స్టేట్స్‌లో వసూలయ్యాయి.[71]
[మార్చు] విమర్శకుల స్వీకృతి
చిత్రం చాలా అనుకూల సమీక్షలు అందుకుంది. రివ్యూ పట్టికల వెబ్‌సైట్ రాటెన్ టొమేటోస్ ప్రకారం, చిల్డ్రన్ ఆఫ్ మెన్ 196 విమర్శకుల సమీక్షలలో 93 శాతం మంది యొక్క ఆమోదం పొందింది,[72] ఇంకా మెటాక్రిటిక్ ప్రకారం, 36 రివ్యూలలో 84 శాతం ఆమోదం పొందింది.[73]
స్లేట్ కు చెందిన డానా స్టివెన్స్ దానిని "దైవప్రేరితమైన మరో సంఘటన యొక్క ఆవిష్కరణ: అల్ఫోన్సో కారొన్ అనబడే దర్శకుడి రాక" అని చెప్పింది. స్టీవెన్స్ చిత్రం యొక్క కొనసాగిన కార్ చేజింగ్ సన్నివేశం మరియు యుధ్ధ సన్నివేశాలను "నేను ఇప్పటిదాకా చూసిన వాటిల్లో అత్యంత కళానైపుణ్యత కలిగిన సింగిల్-షాట్ చేజ్ సన్నివేశాలు"గా మెచ్చుకున్నాడు.[41] లాంగ్‌చేజ్ సన్నివేశాల పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ, ది న్యూ యార్క్ టైమ్స్ యొక్క మనోహ్ల డార్గిస్, చిత్రాన్ని, "అద్భుతంగా దర్శకత్వం వహించబడిన రాజకీయ థ్రిల్లర్" చిత్రమని చెప్పాడు.[28] సాంకేతిక జటిలత్వంతో దృశ్యపరమైన కళానైపుణ్యతతో మిమ్మల్ని అబ్బురపరిచే సన్నివేశాలతో, ఈ చిత్రం "సులభంగా ఈ సంవత్సరంలోని ఉత్తమ చిత్రాలలో ఒకటి" అన్నాడు ఫిల్మ్ జర్నల్ ఇంటర్‌నేషనల్ కి చెందిన ఈథన్ ఆల్టర్.[26] యునైటెడ్ కింగ్‌డమ్‌ను చిత్రీకరించిన నిర్ధిష్టతను ఇండిపెండెంట్ యొక్క జొనాథన్ రోమ్నీ మెచ్చుకున్నాడు కానీ చిత్రం యొక్క భవిష్యత్‌పూర్వక సన్నివేశాలను "సాధారణమైన భవిష్యత్ ఫాంటసి" అని విమర్శించాడు.[3] 2006 ఉత్తమ చిత్రాల ఫిల్మ్ కామెంట్స్ క్రిటిక్స్ పోల్ ఈ చిత్రానికి 19వ రాంకు ఇస్తే, 2006 రీడర్స్ పోల్ దానికి 12వ రాంకు ఇచ్చింది.[74] ది A.V. క్లబ్ , ది సాన్‌ఫ్రాసిస్‌కో క్రానికల్ , స్లేట్ మరియు ది వాషింగ్‌టన్ పోస్ట్ తమ 2006 ఉత్తమ చిత్రాల పట్టికలో చిత్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టాయి.[75] తన దశాబ్దాంతపు మొదటి పది జాబితాలో ఎంటర్టైన్మెంట్ వీక్లీ చిత్రానికి ఏడవ ర్యాంకు ఇచ్చి, "అల్ఫోన్సొ కారొన్ యొక్క సంక్షోభ స్థలపు 2006 చిత్రం భవిష్యత్త్ ఈ రోజు ఎంత నిర్వేదంగా ఉందో అంత నిర్వేదంగా చూపిస్తే ఆక్షన్ సన్నివేశాలు రక్తి కడతాయని మాకు తెలియచెప్పాయి" అన్నది.[76]
రోలింగ్‌స్టోన్ యొక్క పీటర్ ట్రావర్స్ దీనికి తన ఉత్తమ చిత్రాల పట్టికలో రెండవ స్థానం ఇచ్చి ఇలా అన్నాడు:
"2006లో విడుదల అయినపుడు P.D. జేమ్స్ రచించిన భవిష్యత్ రాజకీయ కల్పిత కధకు సంబంధించిన దర్శకుడు అల్ఫోన్సొ కారొన్ యొక్క చిత్రం బాగుందని నేను అనుకున్నాను. చాలా సార్లు చూసాక, చిల్డ్రన్ ఆఫ్ మెన్ వివాదం లేకుండా అద్భుతమైన చిత్రమని నాకు తెలుసు..... దుఃఖభరితమైన సౌందర్యం మరియు గగుర్పొడిచే చర్యల సువాసన ఈ దశాబ్దంలోని మరే చిత్రంలోనూ లేదు. కార్ ఆకస్మిక దాడికి సంబంధించిన దృశ్యం మీరు కేవలం చూడరు (పరిశుభ్రమైన కామెరా గారడీ) - అందులో ఉండి అనుభవిస్తారు. అదే కారొన్ యొక్క ఇంద్రజాలం: అతను మిమ్మల్ని నమ్మిస్తాడు."[77]
ది ఫిల్మ్ స్టేజ్ యొక్క టాప్ 100 ఫిల్మ్స్ ఆఫ్ ది డెకేడ్ పట్టికలో ఈ చిత్రం దశాబ్దంలో నంబర్ 1 మూవీగా పేర్కొనబడింది.[78]
[మార్చు] మొదటి పది జాబితాలు
అనేక విమర్శకుల టాప్ టెన్ పట్టికలలో ఈ చిత్రం 2006 సంవత్సరం యొక్క ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.[75]
|
సాధారణమైన మొదటి పది
|
[మార్చు] పురస్కారాలు
ఈ చిత్రంతో ప్రఖ్యాతి గాంచిన P.D. జేమ్‌స్[79] మరియు చిల్డ్రన్ ఆఫ్ మెన్ స్క్రీన్‌ప్లే వ్రాసిన వారికి నవల యొక్క స్క్రీన్ అడాప్టేషన్ కొరకు 19వ వార్షిక USC స్క్రిప్టర్ పురస్కారం లభించింది; హౌఆర్డ్ రోడ్మన్, USC స్కూల్ ఆఫ్ సినీమాటిక్ ఆర్ట్స్ వ్రైటింగ్ డివిజన్ యొక్క చెయిర్, నవల యొక్క స్క్రీన్ అడాప్టేషన్‌ను "ఉన్నత ప్రమాణాలకు చెందిన స్క్రీన్‌ప్లే మరియు రచన"గా అభివర్ణిస్తే., మరోపక్క గెర్షాట్, ఫ్రాంక్‌ఫర్టర్ అల్గెమీన్ జీటుంగ్‌లో, స్క్రీన్‌ప్లేకి నవలకు సామ్యం చాలా తక్కువని, అది బిడ్డ యొక్క లింగం విషయంలోనూ, గర్భవతి పాత్ర (నవలలో జులియాన్) విషయంలోనూ మరియు నవలలో లేని థియో మరణం విషయంలోనూ తెలుస్తుందని చెప్పాడు.[80] 79వ అకాడెమి పురస్కారాలలో చిత్రాన్ని బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లేకి నామినేట్ చేసారు.
చిల్డ్రన్ ఆఫ్ మెన్ కు బెస్ట్ సినీమాటోగ్రఫి (ఇమాన్యువల్ ల్యుబెజ్కి) మరియు బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ (అల్ఫోన్సో కారొన్ మరియు అలెక్స్ రోడ్రిగ్వెజ్)కు కూడా అకాడెమి అవార్డ్ నామినెషన్స్ లభించాయి.[81] బ్రిటిష్ అకాడెమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ చిల్డ్రన్ ఆఫ్ మెన్ ను ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కి నామినేట్ చేసి, చిత్రానికి ఉత్తమ సినీమాటోగ్రఫి మరియు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌కు 60వ బ్రిటిష్ అకాడెమి ఫిలిం అవార్డ్లలో పురస్కారాలిచ్చి గౌరవించింది. సినీమాటోగ్రాఫర్ ఇమాన్యువల్ ల్యుబెజ్కి 21వ అమెరికన్ సొసైటీ ఆఫ్ సినీమాటోగ్రఫర్స్ పురస్కారాలలో ఉత్తమ సినీమాటోగ్రఫికి ఫీచర్ ఫిలిం పురస్కారం గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియన్ సినీమాటోగ్రాఫర్స్ సొసైటీ కూడా చిల్డ్రన్ ఆఫ్ మెన్ సినీమాటోగ్రఫికి ల్యుబెజ్కికి 2007 ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ సినీమాటోగ్రఫి పురస్కారం ఇచ్చింది.[82]
ది అకాడెమి ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి & హర్రర్ ఫిలింస్ చిల్డ్రన్ ఆఫ్ మెన్ కు ఉత్తమ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సాటర్న్ అవార్డ్ ఇచ్చింది; ఇంకా వర్ల్డ్ సైన్స్ ఫిక్షన్ కన్వెన్షన్ యొక్క సభ్యుల బెస్ట్ డ్రమాటిక్ ప్రెసెంటేషన్, లాంగ్ ఫారంకు నామినేషన్ అందుకుంది.[83]
[మార్చు] గృహ ప్రసారమాధ్యమాలు
HD DVD మరియు DVDలు యూరోప్‌లో 15 జనవరి 2007న[84] ఇంకా యునైటెడ్ స్టేట్స్‌లో 27 మార్చ్ 2007న విడుదల అయినాయి. అదనాలలో "ది పాజిబిలిటీ ఆఫ్ హోప్" అన్న పేరుతో దర్శకుడు అల్ఫోన్సో కారొన్‌కు చెందిన అరగంట నిడివి ఉన్న డాక్యుమెంటరి ఉంది. ప్రఖ్యాతి గాంచిన పండితుల యొక్క విమర్శనాత్మక విశ్లేషణతో, చిత్రం యొక్క ఇతివృత్తం మరియు వాస్తవికతల మధ్య ప్రతిచ్ఛేదాన్ని డాక్యుమెంటరి పరిశోధిస్తుంది: పండితులలో స్లోవేనియన్ సోషియాలజిస్ట్ మరియు తత్వవేత్త స్లవోజ్ జిజెక్, గ్లోబలైజేషన్ వ్యతిరేక కార్యకర్త నాఒమి క్లైన్, భవిష్యద్వాది జేంస్ లవ్‌లాక్, సోషియాలజిస్ట్ సస్కియా సాసెన్, హ్యూమన్ జియోగ్రాఫర్ ఫాబ్రిజియో ఎవా, కల్చురల్ థియరిస్ట్ జ్వెటాన్ టొడొరోవ్ మరియు తత్త్వవేత్త మరియు ఆర్ధిక శాస్త్రజ్ఞుడు జాన్ ఎన్. గ్రేఉన్నారు; "అండర్ అటాక్"లో కార్ చేజ్ మరియు యుధ్ధ సన్నివేశాలు తీయడానికి అవసరమయ్యే వినూత్న సాంకేతిక పధ్ధతుల ప్రదర్శన ఉన్నది; "థియో & జులియన్"లో క్లైవ్ ఓవెన్ మరియు జులియాన్ తమ పాత్రల గురించి సంభాషిస్తారు; "ఫ్యూచరిస్టిక్ డిజైన్", ప్రొడక్షన్ డిజైన్ మరియు చిత్రం వైపు ఒక దృష్టి సారించడానికి ద్వారాలు తెరుస్తుంది; "విజువల్ ఎఫెక్ట్స్" డిజిటల్ బేబిని ఎలా సృష్టించారొ చూపిస్తుంది. తొలగించిన సన్నివేశాలు దానిలో చేర్చారు.[85] 26 మే 2009న చిత్రం బ్లూ-రే డిస్క్‌తో యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల అయ్యింది.[86]
[మార్చు] మూలాలు
- ↑ Voynar, Kim (25 December 2006). Interview: Children of Men Director Alfonso Cuaron. Cinematical / Weblogs, Inc.. తీసుకొన్న తేదీ: 2008-01-20.
- ↑ "Children of Men", IMDB. Retrieved on 2007-10-22.
- ↑ 3.0 3.1 3.2 3.3 Romney, Jonathan (Jan–Feb 2007). "Green and Pleasant Land". Film Comment: 32–35.
- ↑ Vineberg, Steve (6 February 2007). "Rumors of a birth". The Christian Century 124 (3).
- ↑ Meyer, Carla. "Children of Men", Sacramento Bee, 3 January 2007.
- ↑ Williamson, Kevin. "Man of action", Calgary Sun, 3 January 2007.
- ↑ Snyder, Gabriel. "Owen having U's children", Variety, 27 April 2005. Retrieved on 2007-02-02.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 Voynar, Kim. "Interview: Children of Men Director Alfonso Cuarón", Cinematical, 25 December 2006. Retrieved on 2007-01-23.
- ↑ 9.0 9.1 Debruge, Peter. "Editors cut us in on tricky sequences", Variety, 19 February 2007.
- ↑ Snyder, Gabriel. "Moore makes way to U's Children", Variety, 15 June 2005. Retrieved on 2007-02-02.
- ↑ 11.0 11.1 11.2 "Interview: Alfonso Cuaron", Moviehole. Retrieved on 2007-02-10.
- ↑ 12.0 12.1 Phillips, Michael. "Children of Men director thrives on collaboration", Chicago Tribune, 27 December 2006. Retrieved on 2007-02-28.
- ↑ Wagner, Annie. "Politics, Bible Stories and Hope. An Interview with Alfonso Cuarón", The Stranger, 28 December 2006. Retrieved on 2007-02-26.
- ↑ Hennerson, Evan. "Brave new world. Clive Owen embarks on a mission to ensure humanity's survival", Los Angeles Daily News, 19 December 2006. Retrieved on 2007-02-26.
- ↑ "Cuaron Mulls SF Film", Sci Fi Wire, 27 May 2004. Retrieved on 2007-02-04.
- ↑ 16.0 16.1 Puig, Claudia. "Children of Men sends stark message", USA Today, 21 December 2006. Retrieved on 2007-01-29.
- ↑ 17.0 17.1 17.2 17.3 17.4 Wells, Jeffrey. "Interview with Alfonso Cuarón", Hollywood Elsewhere, 1 November 2006. Retrieved on 2007-01-23.
- ↑ 18.0 18.1 "You ask the questions: P. D. James", The Independent, 14 March 2001. Retrieved on 2007-01-23.[dead link]
- ↑ Seshadri, B.. "Male infertility and world population", Contemporary Review, 1 February 1995. Retrieved on 2007-01-23.
- ↑ Bowman, James (2007). "Our Childless Dystopia". The New Atlantis (15): 107–110. Retrieved on 2007-05-25.
- ↑ Ross, Bob. "Hope is as scarce as Children in Dystopian Sci-Fi Thriller", Tampa Tribune, 5 January 2007.
- ↑ Rahner, Mark. "Alfonso Cuaron, director of "Y tu mama tambien" searches for hope in "Children of Men"", Seattle Times, 22 December 2006. Retrieved on 2009-06-05.
- ↑ 23.0 23.1 Vo, Alex. "Interview with "Children of Men" Director Alfonso Cuarón", Rotten Tomatoes. Retrieved on 2007-01-23.
- ↑ 24.0 24.1 24.2 24.3 Guerrasio, Jason. "A New Humanity", Filmmaker Magazine, 22 December 2006. Retrieved on 2007-01-23.
- ↑ Rowin, Michael Joshua (Spring 2007). "Children of Men". Cineaste 32 (2): 60–61.
- ↑ 26.0 26.1 26.2 26.3 Alter, Ethan. "Reviews: Children of Men", Film Journal International. Retrieved on 2007-01-28.
- ↑ Bennett, Ray. "Children of Men", Hollywood Reporter, 4 September 2006. Retrieved on 2007-01-29.
- ↑ 28.0 28.1 Dargis, Manohla. "Apocalypse Now, but in the Wasteland a Child Is Given", The New York Times, 25 December 2006. Retrieved on 2007-01-30.
- ↑ Smith, Chris. "Children of Men a dark film, and one of 2006's best", Bangor Daily News, 1 January 2007. Retrieved on 2007-01-29.[dead link]
- ↑ Herrmann, Zachary. "Championing the Children", The Diamondback, 14 December 2006. Retrieved on 2007-02-04.
- ↑ 31.0 31.1 31.2 Blake, Richard A. "What If...?", America, 5 February 2007.
- ↑ Om shanti shanti shanti. wildmind. తీసుకొన్న తేదీ: 2009-06-05.
- ↑ LaCara, Len. "Cruelest of months leaves more families grieving", Coshocton Tribune, 22 April 2007.
- ↑ Lowman, Rob. "Cuaron vs. the world", Los Angeles Daily News, 27 March 2007.
- ↑ Kozma, Andrew. "Children of Men: Review", RevolutionSF.com, 16 January 2007. Retrieved on 2007-02-08.
- ↑ Butler, Robert W.. "Sci-fi movie paints grim future", Kansas City Star, 5 January 2007.
- ↑ von Busack, Richard. "Making the Future: Richard von Busack talks to Alfonso Cuarón about filming Children of Men", Metroactive, 10 January 2007. Retrieved on 2007-01-23.
- ↑ http://www.firstthings.com/onthesquare/2008/11/sacramone-children-of-men
- ↑ Simon, Jeff. "Life Force: Who carries the torch of hope when the world is without children?", The Buffalo News, 4 January 2007.
- ↑ (8 January 2007) "Children of Men". 'People' 67 (1).
- ↑ 41.0 41.1 Stevens, Dana. "The Movie of the Millennium", Slate, 21 December 2006. Retrieved on 2007-02-15.
- ↑ Richstatter, Katje (Mar–Apr 2007). "Two Dystopian Movies...and their Visions of Hope" (Reprint). Tikkun 22 (2).
- ↑ Broxton, Jonathan (17 January 2007). Children of Men. Movie Music UK. తీసుకొన్న తేదీ: 2007-02-05.
- ↑ Crust, Kevin. "Unconventional soundscape in Children of Men", Chicago Tribune, 17 January 2007. Retrieved on 2007-01-26.
- ↑ Fleming, Michael. "Helmer Raises Children", Daily Variety, 5 October 2001.
- ↑ Douglas, Edward. "Exclusive: Filmmaker Alfonso Cuarón", ComingSoon.net, 8 December 2006. Retrieved on 2007-02-08.
- ↑ 47.0 47.1 47.2 "Children of Men feature", Time Out, 21 September 2006. Retrieved on 2007-02-08.
- ↑ 48.0 48.1 48.2 48.3 Barraclough, Leo. "Nightmare on the Thames", Variety, 18 September 2006.
- ↑ Pols, Mary F.. "A haunting view of the end", Contra Costa Times, 25 December 2006.
- ↑ Faraci, Devin. "Exclusive Interview: Alfonso Cuaron (Children of Men)", Chud.com, 4 January 2007. Retrieved on 2007-02-08.
- ↑ French. "Children of Men | Reviews | Guardian Unlimited Film", The Observer, 24 September 2006. Retrieved on 2009-06-07.
- ↑ Covert, Colin. "Movie review: Future shock in Children of Men", Star Tribune, 5 January 2007.
- ↑ Roberts, Sheila. "Alfonso Cuarón Interview, Director of Children of Men", MoviesOnline.ca, 19 December 2006. Retrieved on 2007-02-08.
- ↑ "The Connecting of Heartbeats", Nashville Scene, 1 January 2007. Retrieved on 2007-02-15.
- ↑ Briggs, Caroline. "Movie imagines world gone wrong", BBC, 20 September 2006. Retrieved on 2007-02-08.
- ↑ Horn, John. "There's no place like hell for the holidays", Los Angeles Times, 19 December 2006. Retrieved on 2007-02-08.
- ↑ 57.0 57.1 "Framestore CFC Delivers Children of Men", VFXWorld, 16 October 2006. Retrieved on 2007-02-08.
- ↑ Johnston, Sheila. "Film-makers on film: Alfonso Cuarón", The Daily Telegraph, 30 September 2006. Retrieved on 2007-02-08.
- ↑ Sutherland, Claire. "Clive's happy with career", Sunday Herald, 19 October 2006. Retrieved on 2007-02-08.
- ↑ "Two Axis Dolly", Doggicam Systems. Retrieved on 2007-01-24.
- ↑ mseymour7. "Children of Men – Hard Core Seamless vfx", fxguide.com, LLC, 4 January 2007. Retrieved on 2007-11-06.
- ↑ Murray, Steve. "Anatomy of a Scene", The Atlanta Journal-Constitution, 29 December 2006. Retrieved on 2007-01-24.
- ↑ Bielik, Alain. "Children of Men: Invisible VFX for a Future in Decay", VFXWorld, 27 December 2006. Retrieved on 2007-01-24.
- ↑ 64.0 64.1 64.2 64.3 64.4 64.5 64.6 64.7 Crust, Kevin. "Critic's Notebook; Sounds to match to the Children of Men vision", Los Angeles Times, 7 January 2007, p. E-24.
- ↑ Reynolds, Simon. "Reasons to Be Cheerful (Just Three)" ([dead link] – Scholar search). The Village Voice. Retrieved on 2007-07-18.
- ↑ "Children of Men": The Repetition of the Ringing | Film International. Filmint.nu. తీసుకొన్న తేదీ: 2009-12-13.
- ↑ 1:40:16 లో క్లోజ్డ్ కాప్షనింగ్
- ↑ Programme for pass holders and the public (PDF). Venice International Film Festival. తీసుకొన్న తేదీ: 2007-02-08.
- ↑ Bresnan, Conor. "Around the World Roundup: "Perfume" Wafts Past "Pirates"", Box Office Mojo, 25 September 2006. Retrieved on 2007-02-08.
- ↑ Mohr, Ian. "Men takes a bigger bow", Variety, 4 January 2007. Retrieved on 2007-02-08.
- ↑ Children of Men (2006). Box Office Mojo. తీసుకొన్న తేదీ: 2007-02-28.
- ↑ Children of Men (2006). Rotten Tomatoes. తీసుకొన్న తేదీ: 2007-02-08.
- ↑ Children of Men (2006): Reviews. Metacritic. తీసుకొన్న తేదీ: 2007-02-08.
- ↑ (Mar–Apr 2007) "Readers' Poll". Film Comment.
- ↑ 75.0 75.1 Metacritic: 2006 Film Critic Top Ten Lists. Metacritic. తీసుకొన్న తేదీ: 2008-01-08.
- ↑ Ten Best Movies Of The Decade!. Entertainment Weekly (12-11-2009). తీసుకొన్న తేదీ: 4 February 2010.
- ↑ [14243,62320,62567 "Children of Men (2006)"]. http://www.rollingstone.com/movies/lists/;kw=[14243,62320,62567]. Retrieved on May 1, 2010.[dead link]
- ↑ Top 100 Movies Of The Decade. The Film Stage (December 31, 2009). తీసుకొన్న తేదీ: December 31, 2009.
- ↑ P.D. James Pleased With Film Version of Children of Men. IWJBlog (9 January 2007). తీసుకొన్న తేదీ: 2009-06-07.
- ↑ "Scripter goes to Children of Men", The Hollywood Reporter, 13 January 2007.
- ↑ Road to the Oscars 07. Internet Movie Database. తీసుకొన్న తేదీ: 2007-01-26.
- ↑ Emmanuel Lubezki AMC ASC. Australian Cinematographers Society (5 May 2007). June 17, 2007న అసలు పేజీ నుండి తీసుకుని బధ్రపరిచారు. తీసుకొన్న తేదీ: 2007-05-25.
- ↑ Hugo and Campbell Awards Nominations. Locus Online (29 March 2007). తీసుకొన్న తేదీ: 2007-05-25.
- ↑ DVD – Children of Men. Monsters and Critics. తీసుకొన్న తేదీ: 2007-03-12.
- ↑ Howell, Peter. "A stark prophecy", Toronto Star, 29 March 2007.
- ↑ Children of Men. తీసుకొన్న తేదీ: 2009-08-11.
[మార్చు] బాహ్య లింకులు
- మూస:Official
- ఇంటర్నెట్ మూవీ డాటాబేస్‌లో సమాచారం
- మెటాక్రిటిక్లో సమాచారం
- రాటెన్ టొమేటోస్చే సమీక్ష
- ఆల్మూవీచే సమీక్ష
- మూస:Tcmdb title
- క్రిస్టియానిటీ టుడే చే సమీక్ష
- రోజర్ ఎబర్ట్చే సమీక్ష
- ఎవేడ్ ది నాయిస్చే సమీక్ష
మూస:S-achమూస:End boxమూస:Alfonso Cuarón
| ముందు Star Wars Episode III: Revenge of the Sith |
Saturn Award for Best Science Fiction Film 2006 |
తరువాత Cloverfield |
- All articles with dead external links
- Articles with dead external links from August 2010
- Articles with invalid date parameter in template
- Articles with dead external links from June 2010
- Articles with dead external links from July 2008
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Good articles
- 2006 చలన చిత్రాలు
- 2000 సంవత్సరాలలో లోని శాస్త్రీయ కల్పనా చిత్రాలు
- సంక్షోభ స్థలపు చిత్రాలు
- పోస్ట్-అపోకాలిప్టిక్ ఫిలిమ్స్
- ప్రత్యామ్నాయ చరిత్ర చిత్రాలు
- సాహసోపేతమైన చిత్రాలు
- గర్భాధారణ చిత్రాలు
- శాస్త్రీయ కాల్పనిక నవలల పై ఆధారపడి నిర్మించిన చిత్రాలు
- థ్రిల్లర్ నవలలపై రూపొ౦ది౦చిన సినిమాలు
- 2020 కోసం ఉద్దేశించిన చిత్రాలు
- లండన్‌లో చిత్రీకరించిన చిత్రాలు
- అల్ఫోంసో కారొన్ దర్సకత్వం వహించిన చిత్రాలు
- యూనివర్సల్ పిక్చర్స్ వారి చిత్రాలు
- ఆంగ్ల భాషా చిత్రాలు
- అమెరికన్ సైన్స్ కల్పిత చిత్రాలు
- యునైటెడ్ కింగ్‌డమ్‌లో తీయబడ్డ చిత్రాలు
- అమెరికా వారి పోరాట ప్రాధాన్యత కలిగి గగుర్పాటు కలిగించే చలన చిత్రాలు