చెరువు

వికీపీడియా నుండి

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామ ప్రాంతములో ఒక మంచినీటి చెరువు.
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు గ్రామ ప్రాంతములో మరో మంచినీటి చెరువు.

చెరువు లేదా జలాశయం మంచి నీరు నిలువచేయు ప్రదేశము. చాలా చెరువులు వర్షం మీద ఆధారపడతాయి. మరికొన్ని చెరువుల అడుగున ఊటబావుల నుండి వచ్చిన నీటితో సంవత్సరం అంతా నిండి ఉంటాయి. భారతదేశములో చాలా గ్రామములలో చెరువునీరు త్రాగడానికి ఉపయోగిస్తారు. కొన్ని పెద్దచెరువులు పంటపొలాలకు నీరందిస్తున్నయి. పూర్వకాలంలో మహారాజులు ప్రజల అవసరాల గురించి రాజ్యంలో చెరువులు త్రవ్వించారు. నదులమీద ఆనకట్టలు కట్టి నీటిని నిలువచేసే వాటిని కూడా చెరువులే అనాలి. ఇలా తయారైన నాగార్జునసాగర్ ఒక సముద్రం లాగా ఉంటుంది.

[మార్చు] చెరువులలో రకాలు

చెరువుల నుంచి సాధారణంగా నీటిని బయటకు రాబట్టడానికి తూములు అనబడే ద్వారాలు ఉంటాయి. వీటి ద్వారా నీటిని కొద్ది కొద్ది పరిమాణాల్లో నీటిని పంటలకు వదులుతూ ఉంటారు. వేసవి సమయంలో మరీ నీరు అడుగంటినపుడు మోటార్లు, ఇంజన్ల ద్వారా కూడా నీటిని బయటకు తోడుతారు. వర్షాకాలంలో చెరువులు పూర్తిగా నిండినపుడు పెద్ద మొత్తంలో నీటిని బయటకు విడిచిపెట్టడానికి కలుజులు కూడా ఉంటాయి. ఇవి నీళ్ళు నిండిన చెరువులు తెగిపోకుండా కాపాడుతాయి.

[మార్చు] ప్రముఖమైన చెరువులు

బి.సింగవరం గ్రామంలో ఉపాధి హామీ పధకం క్రింద చెరువు పూడిక తీస్తున్న గ్రామస్తులు
ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో చేపలను పెంచడానికి కృత్రిమంగా తవ్విన చెరువు
ప్రగతి నగర్ చెరువు హైదరాబాద్
పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో తామర పూలతో నిండి వున్న చెరువు
గ్రామ ప్రాంతములో పశువులను కడుగు చెరువు.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%B5%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు