Coordinates: 17°58′17″N 78°27′42″E / 17.971337°N 78.4618°E / 17.971337; 78.4618

చేగుంట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చేగుంట
చేగుంట is located in Telangana
చేగుంట
చేగుంట
Location ln Telangana, India
చేగుంట is located in India
చేగుంట
చేగుంట
చేగుంట (India)
Coordinates: 17°58′17″N 78°27′42″E / 17.971337°N 78.4618°E / 17.971337; 78.4618
Country India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాMedak
Area
 • Total4.28 km2 (1.65 sq mi)
Elevation
547 మీ (1,795 అ.)
Population
 (2011)[1]
 • Total5,747 (Urban) 53,118 (Rural)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
502255
టెలిఫోన్ కోడ్08452
Vehicle registrationTS15
Literacy76.5%
Lok Sabha constituencyMedak
Vidhan Sabha constituencyDubbaka

చేగుంట, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా, చేగుంట మండలానికి చెందిన గ్రామం.[2] ఇది జనగణన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3]

చరిత్ర[మార్చు]

తెలంగాణ రాష్టంలోని మెదక్ జిల్లాలోని 23 మండలాలలో చేగుంట అనునది ఒక మండలం. పూర్వం ఈ జిల్లా హైదరాబాదు సంస్థానంలో భాగము. పరిపాలన సౌలభ్యం కొరకు హైదరాబాదు సంస్థానం పదహారు జిల్లాలుగా, ఆ జిల్లాలను నాలుగు విభాగాలుగా చేసారు. అవి హైదరాబాదుతో కలసి ఉన్న గుల్శానాబాద్, మెహబూబ్ నగర్, మెదక్, నల్లగొండ. నిజామాబాద్.

1956 లో రాష్ట్ర పునర్విభజనలలో హైదరాబాదు సంస్థానం మూడు ముక్కలుగా చెయ్యబడి ఆ మూడు ముక్కలలో ఒకటి కర్ణాటకా రాష్ట్రంలో, ఇంకొకటి బొంబాయి రాష్ట్రంలో కలిపారు. ఇక చివరి ముక్క అయిన తెలంగాణాను, అప్పటికే ఉన్న ఆంధ్ర్రరాష్ట్రంను కలపి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ విడిపోకముందు ఉన్న రాష్ట్రం) అను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసారు.ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ విడిపోకముందు ఉన్న) రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.మెదక్ మొదటి ఎంపి పి. హనుమంత రావు, మొదటి ఎం.ఎల్.ఎ.గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్వరరావు.

సంస్కృతి[మార్చు]

హిందూ, క్రైస్తవం, ఇస్లాం, సిక్కు కలసిన వైవిధ్య బరిత సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. అనేక ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వలస రావటం వలన ఈ ప్రాంతం ఒక పారిశ్రామిక ప్రాంతంగా రూపు చెందింది. ప్రస్తుతం చేగుంటలో భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుండి వచ్చిన వారు నివసిస్తున్నారు. అన్ని సంస్కృతుల, ప్రాంతాల పండగలు ఘనంగా జరుగుతాయి.

రవాణా సదుపాయం[మార్చు]

ఇక్కడ రైలు, బస్సు రవాణా సదుపాయం ఉంది.ఈ పట్టణం జాతీయ రాజదారి జాతీయ రహదారి 44 పై విస్తరించి ఉండటంతో ఇక్కడి ప్రజలకు మెరుగైన ప్రయాణ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు తమ వ్యవసాయ ఉత్పత్తులను సమీప పట్టణాలకు (ఉదా: హైదరాబాదు) చేర్చుటకు రైలు రవాణా మార్గము ఎంతగానో ఉపయోగపడుతుంది.

సామాజిక సంస్థలు[మార్చు]

చేగుంట గ్రామంలోని దీప్తి విద్యాలయం పూర్వపు విద్యార్థులు సంకల్ప అనే సామాజిక సేవా సంస్థను ప్రారంభించి, చేగుంట, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రారంభం[మార్చు]

ఈ గ్రామంలో కోటి రూపాయలతో ఏర్పాటుచేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాల సముదాయాన్ని 2022 మార్చి 7న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, జెడ్పీ చైర్మ‌న్‌ హేమలత శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 11 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  4. telugu, NT News (2022-03-07). "వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ దుకాణాల స‌ముదాయాన్ని ప్రారంభించిన మంత్రి హ‌రీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-17.

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చేగుంట&oldid=4120430" నుండి వెలికితీశారు