చేవెళ్ళ

వికీపీడియా నుండి
  ?చేవెళ్ల మండలం
రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్
రంగారెడ్డి జిల్లా పటములో చేవెళ్ల మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో చేవెళ్ల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము చేవెల్ల
జిల్లా(లు) రంగారెడ్డి
గ్రామాలు 36
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
55,784 (2001)
• 28380
• 27404
• 54.63
• 67.48
• 41.23


చేవెళ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది హైదరాబాదు నుంచి తాండూర్ వెళ్ళు ప్రధాన రహదారిలో ఉంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో ఉండుటచే విద్యాపరంగా ఈ పట్టణము బాగా అభివృద్ధి చెందినది. రాజకీయపరంగా కూడా ఈ పట్టణానికి మంచి ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులను నిర్వహించారు. గతంలో స్వర్గీయ ఇంద్రారెడ్డి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో హోంశాఖ పదవిని పొందగా, ప్రస్తుతం ఇంద్రారెడ్డి భార్య సబితా ఇంద్రారెడ్డి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా పదవిలో ఉంది.

విషయ సూచిక

భౌగోళికం [మార్చు]

చేవెళ్ళ పట్టణము 17.3067°ఉత్తర అక్షాంశము మరియు 78.1353°తూర్పు రేఖాంశము పై ఉంది.

రవాణా సదుపాయాలు [మార్చు]

చేవెళ్ళకు రోడ్డుమార్గమున మంచి రవాణా సదుపాయాలున్నాయి. హైదరాబాదు నుంచి వికారాబాదు, తాండూర్ (రంగారెడ్డి) వెళ్ళు మార్గము ఈ పట్టణము ద్వారా వెళుతుంది. జాతీయ రహదారి సంఖ్య 7 మరియు జాతీయ రహదారి సంఖ్య 9 లను కలిపే రహదారి ఈ మండలము గుండా వెళ్తుంది. ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలోని రైల్వే స్టేషన్ వికారాబాదు.

విద్యావ్యవస్థ [మార్చు]

చేవెళ్ళ పట్టణములో ఒక డిగ్రీ కళాశాల, రెండు జూనియర్ కళాశాలలు కలవు. 14 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు మండల పరిధిలో ఉన్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో పేరుపొందిన ఇంజనీరింగ్ కళాశాలలు, బిఇడి కళాశాలు, ఎంబిఏ, ఎంసిఏ కళాశాలలు నెలకొల్పబడ్డాయి.

నియోజకవర్గం [మార్చు]

మండలంలోని గ్రామాలు, పంచాయతీలు [మార్చు]

చేవెళ్ళ మండలంలో 36 రెవెన్యూ గ్రామాలు, 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

మండలంలోని గ్రామాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చేవెళ్ళ&oldid=807956" నుండి వెలికితీశారు