చేవ్రొలెట్
| Chevrolet Logo | |
| రకం | Division of GM |
|---|---|
| Founded | November 8, 1911 |
| వ్యవస్థాపకు(లు) | Louis Chevrolet, William C. Durant |
| ప్రధానకార్యాలయం | Detroit, Michigan, U.S. |
| పరిశ్రమ | Automotive |
| ఉత్పత్తులు | Cars, trucks, CUV, SUV |
| ఆదాయం | General Motors Company |
| వెబ్‌సైటు | Chevrolet.com |
చెవీ (pronounced /ˈʃɛvi/) అని కూడా పిలువబడే చేవ్రొలెట్ (pronounced /ˌʃɛvrəˈleɪ/), జనరల్ మోటార్స్ కంపెనీ (GM) చేత తయారు చేయబడిన ఒక వాహనం బ్రాండ్. 1911 నవంబరు 8న, లూయిస్ చేవ్రొలెట్ మరియు GM నుండి తొలగింపబడిన, దాని వ్యవస్థాపకుడు విలియం సి.డ్యూరాంట్‌ల చేత, చేవ్రొలెట్ ఆవిష్కరింపబడింది.[1] 1917లో చేవ్రొలెట్, జనరల్ మోటార్స్‌లో లీనమయ్యింది. 1920లలో, హెన్రీ ఫోర్డ్ మోడల్ టి కార్లకు ప్రత్యక్ష పోటీనిస్తూ, ఈ రోజు వరకూ జనరల్ మోటార్స్ వారి అత్యధిక అమ్మకాల బ్రాండ్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్న చేవ్రొలెట్, ఆల్‌ఫ్రెడ్ స్లోన్ వలన ప్రధాన స్రవంతి వాహనాల అమ్మకాలతో తన శ్రేణిని నిలబెట్టుకుంటూ, కాలగతిలో జిఎంకు పర్యాయపదంగా చేవ్రొలెట్ లేదా చెవీ సుస్థిర స్థానంలో నిలిచింది. ఉత్తర అమెరికాలో, చేవ్రొలెట్, పొందికైన చిన్న కార్ల నుండి, మీడియం డ్యూటీ వాణిజ్య ట్రక్కుల దాకా, మోటారు కార్ల సంపూర్ణ శ్రేణిని అందిస్తోంది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] ఉత్తర అమెరికా
రేస్ కార్ల చోదకుడూ, కూపర్ చేవ్రొలెట్ కుమారుడూ అయిన లూయిస్ చేవ్రొలెట్, మరియు (జనరల్ మోటార్స్ యొక్క వ్యవస్థాపకుడైన), విలియం డ్యూరాంట్ల చేత, చేవ్రొలెట్ ఆవిష్కరింపబడింది. 1910లో జిఎం యాజమాన్యం నుండి, విలియం డ్యూరాంట్ తొలగింపబడ్డాడు. మాసన్ మరియు లిటిల్ కంపెనీలను కలుపుకొని, ఫ్లింట్ వ్యాగన్‌లో పనిని డ్యూరాంట్ చేపట్టాడు. 1911, నవంబరులో చేవ్రొలెట్ మోటార్ కార్ కంపెనీ ఇందులో విలీనమైంది. తన స్వీయ ప్రతిష్ఠని పునర్నించుకునేందుకు, రేసర్‌గా చేవ్రొలెట్ పేరుని అతడు వినియోగించుకున్నాడు. GMను స్థాపించక ముందు, బక్ మోటార్స్ కంపెనీ అధినేతగా, డ్యూరాంట్, కార్ల అమ్మకాలను ప్రోత్సహించే రేసుల్లో బ్విక్‌ను నడిపేందుకోసం చేవ్రొలెట్‌ను కిరాయి చోదకుడుగా తీసుకునేవాడు.[2] తొలి చెవీ, ఖరీదైన చేవ్రొలెట్ శాస్త్రీయ సీ 6 శ్రేణి యొక్క వాస్తవ నమూనా, ఎటైన్నె ప్లాంచె చేత, అతడి చిరకాల మిత్రుడు లూయిస్ యొక్క ఆదేశాలను పాటిస్తూ రచించబడింది. చేవ్రొలెట్, వాస్తవ విలీనానికి కొన్ని నెలల ముందుగానే దాని మొదటి ప్రాథమిక రూపం తయారైంది.
చేవ్రొలెట్, 1913లో తొలిసారిగా తన వ్యాపార చిహ్నం "బౌలిక్ ఎంబ్లెమ్"[3]ని ఉపయోగించింది. ఒకసారి డ్యూరాంట్ ఒక ఫ్రెంచ్ హోటల్‌లో చూసిన వాల్ పేపర్ నుండి ఆ నమూనా చేయబడిందని చెప్పుకుంటారు. కెన్ క్వాఫ్మన్నే అనే చరిత్రకారుడి ఇటీవలి పరిశోధనలు, ఆ వ్యాపార చిహ్నం, "కోలెటర్స్" యొక్క వ్యాపార చిహ్నం మీద ఆధారపడి ఉందని ప్రకటించాడు.[4] మరో వాదన ప్రకారం, చేవ్రొలెట్ తల్లితండ్రుల మాతృభూమి స్విస్ పట్ల గౌరవాన్ని సూచిస్తూ, స్విస్ శిలువ గుర్తుకు ఆ వ్యాపార చిహ్నం అనుకరణ శైలి అంటారు.[5]
దీన్నే నియంత్రించేందుకు, డ్యూరాంట్, టోరొంటో, కెనడాలో చేవ్రొలెట్ తయారీ స్థాపనకు తగిన సౌకర్యాల కోసం ప్రయత్నించాడు. ఆ సంవత్సరం తర్వాత, మెక్‌లాఫ్లిన్-బక్ కార్లను ఉత్పత్తి చేసే మెక్ లాఫ్లిన్ మోటార్ కార్ల కంపెనీ యజమాని "కొలొనెల్ శామ్" మెక్ లాఫ్లిన్‌తో న్యూయార్క్‌లో జరిగిన ఓ విందు సమావేశంలో, మెక్ లాఫ్లిన్ నమూనా రూపంతో, చేవ్రొలెట్ కార్లు కెనడీయన్ కంపెనీ ఉత్పత్తుల సరళికి జోడింపబడేటట్లుగా ఒప్పందం కుదిరింది. మూడేళ్ళ తర్వాత, రెండు ప్రక్రియలు జనరల్ మోటార్స్ ఆఫ్ కెనడా లిమిటెడ్ పేరుతో GM చేత వృద్ధి చేయబడింది. (అప్పటి నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో చేవ్రొలెట్ GMలో ఒక భాగమైంది.)[6]
1916 నాటికి, చేవ్రొలెట్ తగినంత లాభాలతో ఉండి, GMలో అధిక షేర్లు కొనేందుకు డ్యూరాంట్‌కు సావకాశం వచ్చింది. 1917లో ఆ వ్యాపార ఒప్పందం పూర్తయి, ఆ తర్వాత, డ్యూరాంట్ జనరల్ మోటార్స్ కు అధ్యక్షుడయ్యాడు. చేవ్రొలెట్ ఒక ప్రత్యేక విభాగంగా, GMలో లీనమైంది. 1918 నమూనా సంవత్సరంలో, చేవ్రొలెట్ నమూనా డి , ఒక వి8 నలుగురు ప్రయాణించే శక్తిగల రోడ్డు వాహనాన్ని, ఇంకా, ఐదుగురు ప్రయాణించగల యాత్రా వాహన నమూనాలను మార్కెట్‌కు పరిచయం చేసింది. అది, 6మోటారు కార్ల శ్రేణిలో పై కవాటం గల కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఆ కాలం నాటి కార్లు ఎక్కువగా స్వల్ప ఒత్తిడితో కుదించబడిన, చదునుగా ఉన్న ఇంజన్లను మాత్రమే కలిగి ఉండేవి. ఈ కార్లు జెనిత్ కార్బోరేటర్లు మరియు త్రీ-స్పీడ్ ట్రాన్స్‌మిషన్లతో కూడిన 288in3 >
55 hp (మూస:Convert/kW)మూస:Convert/test/Aon ఇంజన్లను కలిగి ఉండేవి.
1950లు మరియు 1960ల కాలంలో అమెరికన్ ఆటోమొబైల్ మార్కెట్‌పై చేవ్రొలెట్ గొప్ప ప్రభావం చూపింది. 1957లో, చెవీ, ఇంధనాన్ని లోపలికి పంపే తొలి ఇంజన్‌ను తయారు చేసింది.[citation needed] 1963లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అమ్ముడైన ప్రతి పది కార్లలో ఒకటి చేవ్రొలెట్టే అయ్యి ఉండేది.[7]
మూల భాగాలను, కొన్ని విభాగాలతో పరస్పర మార్పిడి చేసినట్లే, ఇప్పటి కొన్ని నమూనాలు ఉన్నాగానీ, 1955లో ప్రదర్శించిన నాటి నుండి చేవ్రొలెట్ వి-8 తాలూకూ చిన్న-మూస నిరంతరాయంగా వాడుకలో ఉంది. ప్రపంచంలో ఏ ఇతర తయారీ ఇంజిన్ల కంటే కూడా ఇది సుదీర్ఘమైనది. ప్రాధమిక చిన్న-మూస ఓహెచ్ వి వి-8 నమూనా వేదిక యొక్క తర్వాతి నమూనాల తయారీ, ఈనాడు మరెంతో అభివృద్ధి చేయబడింది. అల్యూమినియం మూస, ఇంకా పై భాగాలు, ఎలక్ట్రానిక్ ఇంజిన్ యాజమాన్యం, ఇంకా క్రమానుగతిలో ఇంధనాన్ని లోనికి పంపే ఏర్పాటు వంటివి అభివృద్ధిలో పేరుకి కొన్ని. ఎల్ టీ వి-8ల వంటి రూపంలో చిన్న-మూస వి-8 తర్వాతి నమూనాలు, ఎల్ ఎస్ వి-8ల వంటి నమూనా రచనలో ప్రభావితం చేయబడి, ఇప్పటికీ చేవ్రొలెట్ వాహనాలలో రెండూ అమర్చబడుతున్నాయి. ఫోర్డ్ మోటార్ కంపెనీ ఉపయోగించే, ఇప్పటికీ భారీ కార్లు, ఇంకా తేలిక ట్రక్కులలో ఉపయోగించటాన్ని కొనసాగిస్తున్న ఓవర్ హెడ్-కామ్ వి-8 నమూనాలతో పోలిస్తే మొదటి చిన్న-మూస చాలా సరళమైనది. వాహన రకాన్ని బట్టి, చేవ్రొలెట్ వి-8, 4.3 నుండి 8.1 లీటర్ల స్థానే 6 లీటర్ల ఉత్పాదక శ్రేణి >
110 horsepower (మూస:Convert/kW)మూస:Convert/test/Aకి అమర్చి, ఫ్యాక్టరీలో >
638 horsepower (మూస:Convert/kW)మూస:Convert/test/A నిర్మించబడుతున్నాయి. ఇంజన్ నమూనా రచన (GM ఉత్పత్తి నిర్మాణాల్లో) సంవత్సరాల తరబడి వాడబడుతూ, పొంటియాక్, పూర్వవాహన రూపాలు, బక్, ఒపెల్ (జర్మనీ) హమ్మర్ & హోల్డెన్ (ఆస్ట్రేలియా)లో విక్రయింపబడుతున్నాయి.
2010లో జనరల్ మోటార్, 91 ఏళ్ళగా తనకు సేవలందించిన వాణిజ్య ప్రచార సంస్థ స్థానంలోకి, ప్రపంచవ్యాప్త ప్రచారానికై కేంప్ బెల్ ఎవార్డ్‌ని తీసుకున్నారు. కేంప్ బెల్ ఎవార్డ్ ఆఫ్ ఇంటర్ పబ్లిక్ కంపెనీల సమూహం, చేవ్రొలెట్‌కు 1919 నుండి సేవలందించింది.
మే 2010లో, ‘చెవీ’ యొక్క వాణిజ్య ప్రచార బాధ్యత, గుడ్‌బై, సిల్వర్ స్టైన్, మరియు భాగస్వాములకు అప్పగించబడింది. http://www.adweek.com/aw/content_display/news/account-activity/e3i3b8cb13fe213cb8339474ab7c48c6148
[మార్చు] యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా వెలుపల
[మార్చు] మెక్సికో
మెక్సికో విభిన్న GM బ్రాండ్‌లు మరియు ఫ్లాట్‌ఫామ్‌ల నుండి చేవ్రొలెట్ నమూనాల సమ్మేళనాన్ని కలిగి ఉంది కాని చేవ్రొలెట్‌గా బ్రాండ్ వేయబడింది. చేవ్రొలెట్ USA, ఒపెల్ యూరప్ మరియు ఇతర మూలాల నుంచి అనేక రకాల నమూనాలు వచ్చాయి. ఒపెల్ ఆధారిత వాహనాలను ఉదాహరణలు వెక్ట్రా, ది ఆస్ట్రా, ది మెరివా మరియు ది కాప్టివా. మెక్సికో చెవీ సి2 వంటి తన స్వంత కార్లను కలిగి ఉంది, ఇది మునుపటి తరం కోర్సా కార్లనుంచి తిరిగి నిర్మించబడినది. యుఎస్ ప్లాట్‌ఫాం ఆధారిత వాహనాలు ది అవలాంచె, ది సబర్బన్, ది ఈక్వినాక్స్ ది టాహో, ది చెయిన్నే (సిల్వరాడోని పోలి ఉంది కాని స్వల్ప తేడాలతో ఉంది) ది ఏవో, ది హెచ్‌హెచ్ఆర్, ది ట్రావర్సె, ది మలిబు మరియు ది కొర్వెట్టె. ది చేవ్రొలెట్ ఆప్ట్రా, దక్షిణ కొరియాలో GM దేవూచే రూపొందించబడింది, మెక్సిలో కూడా విక్రయించబడుతుంది. యూరోపియన్ ఎపికా వ్యాపారానికి మాత్రమే వాహనంగా అమ్ముడవుతోంది.
[మార్చు] ఆసియా
[మార్చు] చైనా
2009లో 332,774 వాహనాల అమ్మకాలతో, చేవ్రొలెట్ మూడవ అతి పెద్ద మార్కెట్‌గా చైనా అవతరించింది, యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రెజిల్ తర్వాత (1,344,629 మరియు 595,500 వాహనాలతో) స్థానంలో ఉంది.[8]
[మార్చు] భారతదేశం
చేవ్రొలెట్ భారతదేశంలో తాజా బ్రాండ్‌లలో ఒకటిగా ఉంది, GM ఇండియా ఆపరేషన్స్‌తో ప్రారంభించబడింది. 2003, జూన్ 6 వరకు (చేవ్రొలెట్ అధికారిక జన్మదినం), GM ఇండియా (మొదట్లో ఇది హిందూస్థాన్ మోటార్స్‌తో జాయింట్ వెంచర్‌గా ఉండేది) ఒపెల్ కోర్సా, ఒపెల్ ఆస్ట్రా, మరియు ఒపెల్ వెక్ట్రాలను అమ్మేది. కోర్సా మరియు ఆస్ట్రాలను గుజరాత్‌లోని హలోల్ వద్ద నిర్మించారు.
అప్పటినుంచి, చేవ్రొలెట్ ఇప్పుడు చేవ్రొలెట్ క్రుజ్, చేవ్రొలెట్ స్పార్క్, చేవ్రొలెట్ ఆప్ట్రా, చేవ్రొలెట్ అవెయో, చెవ్రొలెట్ టావెరా, చెవ్రొలెట్ క్యాప్టివా, చెవ్రొలెట్ SRV, చెవ్రొలెట్ బీట్ మరియు చెవ్రొలెట్ అవెయో U-UAలను విక్రయిస్తుంది. సుబరు మోడల్‌కి మరో పేరు పెట్టబడిన చేవ్రొలెట్ ఫారెస్టర్ 2005 వరకు జపాన్‌లోని ఫుజి హెవీ ఇండస్ట్రీస్ నుంచి నేరుగా దిగుమతి చేయబడుతూ వచ్చింది. ఆప్ట్రా మరియు టవెర్టా నమూనాలు హలోల్ కర్మాగారంలో నిర్మించబడ్డాయి. చేవ్రొలెట్ ఇండియాలో చేవ్రొలెట్ కాప్టివా ఎస్‌యువి పేరిట ప్రారంభించబడింది. చేవ్రొలెట్‌చేత చేవ్రొలెట్ బీట్ & చేవ్రొలెట్ క్రుజ్ తాజా మోడళ్లు ప్రారంభించబడినాయి.
భారత్‌లో ఫార్ములా రోలోన్ సింగిల్ సీటర్ ఏకైక ఇంజన్ సరఫరాదారుగా కూడా చేవ్రొలెటే ఉంది.
[మార్చు] జపాన్
2000 మధ్యలో సుజుకి, ట్రెయిల్‌బ్లేజర్ మరియు చేవ్రొలెట్ ఆప్ట్రా వేగన్‌ని జపాన్‌కి దిగుమతి చేసి మార్కెట్ చేసింది. జనరల్ మోటార్స్ ఆసియా పసిఫిక్ (జపాన్) ప్రస్తుతం చాలా పరిమిత సంఖ్యలో చేవ్రొలెట్ ట్రెయిల్‌బ్లేజర్‌ని పంపిణీ చేసి మార్కెట్ చేస్తోంది. GM భాగస్వామి అయిన సుజుకి, చేవ్రొలెట్ క్రుజ్ సబ్‌కాంపాక్ట్ మరియు చేవ్రొలెట్ ఎమ్‌డబ్ల్యూ కెయి కార్‌లను కూడా కూర్పు చేసి మార్కెట్ చేస్తోంది. ఎమ్‌డబ్ల్యూ మొదట్లో పేరుమార్చబడిన సుజుకి వేగన్ ఆర్‌గా ఉండేది. 2008 నాటికి ఇది సుజుకి సోలియోగా పేరు మార్చబడింది. మిట్సుయి ప్రస్తుతం చేవ్రొలెట్ టాహో, చేవ్రొలెట్ ఎక్స్‌ప్రెస్, చేవ్రొలెట్ హెచ్‌హెచ్‌ఆర్‌లను మరియు జి-వాన్ మరియు చేవ్రొలెట్ ట్రయిల్‌బ్లేజర్ యొక్క స్టార్‌క్రాఫ్ట్ వెర్షన్‌లను పంపిణీ మరియు మార్కెట్ చేస్తోంది. జనరల్ మోటార్స్ జపాన్ నేరుగా కొర్వెట్టిని దిగుమతి చేసుకుని పంపిణీ చేస్తోంది. ఇది తన స్వంత ఉత్పత్తికింద మార్కెట్ చేయబడుతోంది కూడా. అందుచేత చేవ్రొలెట్-బ్రాండ్ వాహనాల కోసం మూడు విశిష్టమైన పంపిణీ ఛానెళ్లు మరియు ఒక ప్రత్యేక చేవ్రొలెట్-బ్రాండ్ కార్ల నెట్‌వర్క్ ఉంటున్నాయి.
[మార్చు] మలేషియా
2003లో, GM మరియు డిఆర్‌బి-హికోమ్ మధ్య హికోమోబిల్ అని పిలవబడుతున్న జాయింట్ వెంచర్, చేవ్రొలెట్ అవియో, చేవ్రొలెట్ ఆప్ట్రా, చేవ్రొలెట్ నబిరా మరియు చేవ్రొలెట్ ల్యుమినాలను మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ జాయింట్ వెంచర్ 2009 నుంచి రద్దయిపోయింది, దీని స్థానంలో 2010లో నాజా వచ్చింది.
[మార్చు] మధ్యప్రాచ్య ప్రాంతం
మధ్యప్రాచ్య ప్రాంతంలో చేవ్రొలెట్-బ్యాడ్జి కల కార్లు, ట్రక్కులు, ఎస్‌యువిలు మరియు క్రాస్ఓవర్లకు జిమ్ దేవూ (దక్షిణ కొరియాలో) నుంచి, ఉత్తర అమెరికాలోని GM నుంచి, GM హొల్డెన్ (ఆస్ట్రేలియాలో)లు మూలం. మధ్యప్రాచ్య మార్కెట్ చేవ్రొలెట్ స్పెషల్ వెహికల్స్ (సిఎస్‌వి) అని పిలువబడుతున్న ప్రత్యేక విభాగాన్ని కలిగి ఉంది. ఇది (2007 డిసెంబర్) వరకు హోల్డెన్ స్పెషల్ వెహికల్స్ నుండి అత్యధిక పనితనం కలిగిన >
మూస:Convert/bhpమూస:Convert/test/Aon సిఆర్8 సెడాన్‌కి ఆధారంగా ఉంది. హోల్డెన్ కమోడోర్ మధ్యప్రాచ్యంలో, దక్షిణాఫ్రికాలో కూడా చేవ్రొలెట్ ల్యుమినా అని బ్యాడ్జ్‌ని కలిగి ఉంది. పొడవాటి వీల్ బేస్ హోల్డెన్ స్టేట్స్‌మన్ మధ్యప్రాచ్యంలో చేవ్రొలెట్ కాప్రైస్‌గా అమ్ముడవుతోంది.
[మార్చు] పాకిస్తాన్
పాకిస్తాన్‌లో చేవ్రొలెట్ తన కార్లను స్థానిక ఆటోమొబైల్ ఉత్పత్తిదారు నెక్సస్ ఆటోమోటివ్‌తో సహకారంతో ప్రవేశపెట్టబడింది. చేవ్రొలెట్ పాకిస్తాన్ నుంచి అందుబాటులో ఉన్న ప్రస్తుత కార్ల శ్రేణిలో చేవ్రొలెట్ ఆప్ట్రా, చేవ్రొలెట్ స్పార్క్, చేవ్రొలెట్ జోయ్, చేవ్రొలెట్ అవియో, మరియు చేవ్రొలెట్ కొలరాడో నమూనాలను కలిగి ఉంది. కంపెనీ భవిష్యత్తులో తన కార్ల శ్రేణిలో చేవ్రొలెట్ కేప్టివా, చేవ్రొలెట్ ఎపికా మరియు చేవ్రొలెట్ క్రుజ్‌లను జోడించాలని పథకాలు రచిస్తోంది.
[మార్చు] దక్షిణ కొరియా
చేవ్రొలెట్-బ్రాండ్ వాహనాలు దక్షిణ కొరియాలో విక్రయించబడటం లేదు. అయితే, గ్లోబల్ మార్కెట్లోని అనేక చేవ్రొలెట్ వాహనాలకు దక్షిణ కొరియాకి చెందిన GM దేవూ ఆధారంగా ఉంటోంది.
[మార్చు] థాయ్‌లాండ్
అమెరికాలో నిర్మించబడిన చేవ్రొలెట్ కొలరాడో పికప్ కూడా థాయ్‌లాండ్‌లోని రేయాంగ్‌లో ఉత్పత్తి చేయబడింది. హోల్డెన్ కొమడోర్ నమూనా కారు థాయ్‌లాండ్‌లో చేవ్రొలెట్ ల్యుమినాగా బ్యాడ్జ్ చేయబడింది.
జనరల్ మోటార్స్ ప్రస్తుతం తన పునర్నిర్మాణ పథకంలో భాగంగా ఖర్చు తగ్గించే మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ఎంపికలలో ధాయ్‌లాండ్ లోని రేయోంగ్ ప్లాంట్‌ని విస్తరించడం కూడా ఒకటి. అమెరికాకు కొలరాడో కార్లను ఎగుమతి చేయడానికి అదనపు సామర్థ్యాన్ని జోడించాలని చూస్తోంది. దీంతో లూసియానాలోని ష్రేవ్‌పోర్ట్‌ని ప్లాంట్‌ని మూసివేయడానికి వీలవుతుంది (ఇక్కడ కొలరాడో కూడా ఉత్పత్తవుతోంది). అమెరికాకు ధాయ్‌లాండ్‌కు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన పక్షంలోనే ఇది సాధ్యపడుతుంది. ఎందుకంటే స్వేచ్ఛా వాణిజ్యేతర దేశాల నుంచి ట్రక్కులను దిగుమతి చేసుకోవడానికి చెల్లించవలసిన అమెరికన్ టారిఫ్ ప్రస్తుతం 25%గా ఉంది. యునైటెడ్ ఆటో వర్కర్స్ సంస్థ టారిఫ్ వ్యవస్థను మార్చడానికి అత్యంత వ్యతిరేకత తెలుపుతోంది.
[మార్చు] ఆస్ట్రేలియా
నేటి ఆస్ట్రేలియన్ మార్కెట్ ప్రధానంగా ఆస్ట్రేలియా స్వంత ఆటోమోటివ్ కంపెనీలతో పాటు ఆసియా మరియు యూరోపియన్ ఆటోమొబైల్ బ్రాండ్‌లతో కూడి ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఆస్ట్రేలియాలో, అమెరికా కార్లకు తగుమాత్రపు సంఖ్యలో ఉండేవి.
చేవ్రొలెట్ స్థానిక అసెంబ్లీ విభాగాలు ఆస్ట్రేలియాలో 1918 [9] లోనే నిర్మించబడ్డాయి మరియు 1926నాటికి కొత్తగా రూపొందించబడిన జనరల్ మోటార్స్ (ఆస్ట్రేలియా) ప్రైవేట్ లిమిటెడ్ హోల్డెన్ మోటార్ బాడీ బిల్డర్లు సరఫరా చేసిన విడిభాగాలను ఉపయోగించి, చేవ్రొలెట్ మరియు GM వాహనాలను తయారు చేయడానికి అయిదు ఆస్ట్రేలియన్ రాష్ట్రాలలో అసెంబ్లీ ప్లాంట్లను స్థాపించింది.[10] 1931లో సంక్షోభంలో ఉన్న హోల్డెన్ మోటార్ బాడీ బిల్డర్స్‌తో జనరల్ మోటార్స్ (ఆస్ట్రేలియా) ప్రైవేట్ లిమిటెడ్ విలీనంతో జనరల్ మోటార్స్ – హోల్డెన్స్ [11] సంస్థ రూపొందింది మరియు చేవ్రొలెట్‌తోపాటు పలు GM ఉత్పత్తుల తయారీ మొదలయింది. 1934లో చేవ్రొలెట్ కపుల్ యుటిలిటీ మరియు 1935లో చేవ్రొలెట్ “స్లోపర్” రకాల విడుదలతో సాంప్రదాయిక యుఎస్ బాడీ శైలుల నుంచి GMH వేరుపడిపోయింది. 1946లో యుద్ధానంతర ఉత్పత్తి ప్రారంభమైంది.[12] 1949 నుండి ఆస్ట్రేలియా చేవ్రొలెట్ కార్లు, కెనడాలోని చేవ్రొలెట్ నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాలను స్థానికంగానే కూర్చడం ప్రారంభించాయి, అయితే కపుల్ యుటిలిటీ బాడీ యొక్క స్థానిక ఉత్పత్తి 1952 వరకు కొనసాగింది.[13] 1968వ సంవత్సరం ఆస్ట్రేలియాలో చేవ్రొలెట్ విడిభాగాలను కూర్చిన చివరి సంవత్సరంగా చరిత్రకెక్కింది.[14]
బెల్ ఎయిర్, ఇంపాలా, షెరో వంటి క్లాసిక్ చేవ్రొలెట్ నమూనా కార్లు ఇప్పటికీ ఆస్ట్రేలియాలో పలు రాష్ట్రాల్లో కనపడుతుంటాయి. 1998 నుంచి 2001 వరకు చేవ్రొలెట్ సబర్బన్ కారు ఆస్ట్రేలియాలో హోల్డెన్ సబర్బన్ పేరుతో అమ్మబడింది. ఈ రోజు పలు చేవ్రొలెట్ డిజైన్‌లు వాటి ఆస్ట్రేలియన్ సంస్థ (GM హోల్డెన్)పై ఆధారపడి ఉంటున్నాయి.
[మార్చు] దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాలో, చేవ్రొలెట్ 1982 వరకు GM ప్రధాన బ్రాండ్ పేరుగా ఉండేది, అనేక వాక్స్‌హాల్ మోటార్స్ మరియు హోల్డెన్ వ్యుత్పన్న రూపాలు 1964 నుండి చెవీ పేరుతో నిర్మించబడుతూ వచ్చాయి. 1970లలో, అడ్వర్టయిజింగ్ జింగిల్ "బ్రాయివ్లెయిస్, రగ్బీ, సన్నీ స్కైస్ మరియు చేవ్రొలెట్"[15] (యుఎస్ "బేస్‌బాల్, హాట్ డాగ్స్, ఎపిల్ పైస్ మరియు చేవ్రొలెట్ నుండి స్వీకరించబడింది") దక్షిణాఫ్రికా తెల్ల పురుషుల సోమరి జీవన శైలిని చిత్రిక పట్టింది. ఆస్ట్రేలియాలోని హోల్డెన్ "ఫుట్‌బాల్, మీట్ పైస్, కంగారూస్ అండ్ హోల్డెన్ కార్స్" అనే జింగిల్‌ని ఉపయోగించింది. ఒరిజనల్‌గా, చేవ్రొలెట్‌లు పోర్ట్ ఎలిజబెత్‌లోని తమ ప్లాంట్‌లో కూర్చబడిన యుఎస్ మోడల్స్‌కి చెందిన CKD సామగ్రిగా ఉండేవి. అయితే, దక్షిణాఫ్రికాలో కుడి చేతివైపు డ్రైవింగ్, యుఎస్‌లో ఎడమ చేతివైపు డ్రైవింగ్ వాడుకలో ఉన్నందున, స్థానిక శైలిని ఉపయోగించవలసిందిగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రోత్సహించడంతో, బైస్కాయ్నె వంటి చేవ్రొలెట్ కార్లు క్రమక్రమంగా పూర్తిగా దక్షిణాఫ్రికాలోనే తయారు చేయబడ్డాయి, GM కంపెనీ యొక్క "దక్షిణాఫ్రికా స్వంత కారు" రేంజర్ కూడా స్థానికంగానే తయారు చేయబడింది.
1970ల నాటికి, దక్షిణాఫ్రికాలో చేవ్రొలెట్ కార్లలో చాలా భాగం ఆస్ట్రేలియన్ జనరల్ మోటార్స్-హోల్డెన్ మోడల్స్‌పై ఆధారపడేవి, కొమాండో హోల్డెన్ కింగ్స్‌వుడ్‌పై[16] ఆధారపడగా, కాన్‌స్టాంటినా కారు స్టేట్స్‌మన్‌పై ఆధారపడేది,[17] చిన్నవైన ఫిరెంజా కార్లు వాక్స్‌హాల్ వివా మోడల్‌పై ఆధారపడేవి. దక్షిణాఫ్రికాలో అమ్మబడిన చేవ్రొలెట్ నోమాడ్ కారు అమెరికాలో అమ్మబడే నోమాడ్ కార్ల శ్రేణికి పూర్తిగా భిన్నంగా ఉండేది; అమెరికన్ నోమాడ్ కారు ఒరిజనల్‌గా కొర్వెట్టీ యొక్క స్టేషన్ వేగన్‌గా పరిగణించబడేది, క్రమంగా ఇది బెల్ ఎయిర్ స్టేషన్ వేగన్ వెర్షన్‌గా మారిపోయింది, దక్షిణాఫ్రికా నోమాడ్ ఎస్‌వియులు ప్రజాదరణ పొందక ముందునాటి ఎస్‌వియు ట్రక్‌లను పోలి ఉండేవి.
అయితే, ఇవి రెకోర్డ్, కమోడోర్, మరియ సెనేటర్ వంటి ఒపెల్ కార్ల శ్రేణులచేత భర్తీ చేయబడినాయి మరియు 1982లో ఒపెల్‌కు ప్రయోజనకరంగా చేవ్రొలెట్ బ్రాండ్ పేరు ఉపసంహరించబడింది. ఆనాటి రాజకీయ వాతావరణం కారణంగా, దక్షిణాఫ్రికా నుంచి పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని GM 1986లో నిర్ణయించింది మరియు GM యొక్క దక్షిణాఫ్రికా కార్యకలాపాలను (పోర్ట్ ఎలిజబెత్ ప్లాంట్‌తో సహా) ఒక స్థానిక గ్రూపు కొనివేసి, కంపెనీని డెల్టా మోటార్ కార్పొరేషన్‌గా పేరు మార్చింది, ఇది ఓపెల్స్, ఇసుజుస్ మరియు సుజుకీస్‌లను లైసెన్స్‌తో చేయడంపై కేంద్రీకరించింది.
అయితే, 1990లో రాజకీయ వాతావరణం మెరుగుపడిన ఫలితంగా GM దక్షిణాఫ్రికాలో తిరిగి ప్రవేశించాలని నిర్ణయించింది, తర్వాత డెల్టా కంపెనీ మొత్తానని సంస్థ కొనుగోలు చేసింది. 2001లో, హోల్డెన్ కమోడోర్ బ్యాడ్జీని పెట్టుకున్న ల్యుమినా, తర్వాత దేవూ శ్రేణి కార్లతో చేవ్రొలెట్ పేరు తిరిగి ముందుకు వచ్చింది. ప్రస్తుతం చేవ్రొలెట్ కార్లు స్పార్క్ (దేవూవారి మాతిజ్‌గా పేరు మార్చుకుంది), అవియో, అప్ట్రా, ల్యుమినా (యుటెఇ నమూనాతో పాటు), దేవూ టకుమా వెర్షన్‌ని బ్యాడ్జ్‌గా చేసుకున్న వివాంట్, ఎంపీవి రకాలతో ఉంటున్నాయి.
[మార్చు] ఐరోపా
చేవ్రొలెట్ యూరప్ (జ్యూరిచ్‌లో) స్విస్ కేంద్రంగా పనిచేస్ సంస్థ, ఇది ప్రధానంగా GM దేవూ ఉత్పత్తి చేసే కార్లను అమ్ముతుంటుంది.
2005 వరకు, చేవ్రొలెట్ యూరప్ కొన్ని మోడల్ కార్లను అమ్మింది, చాలావరకు యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగు దిద్దిన యునైటెడ్ స్టేట్స్ దేశీయ మార్కెట్ (యుఎస్‌డిఎమ్) నమూనా కార్లను ఇది అమ్మింది. వీటిలో చేవ్రొలెట్ అలెరో (ఓల్డ్స్‌మొబైల్ అలెరో కారుకు రీబ్యాడ్జ్ చేసినది) మరియు చేవ్రొలెట్ ట్రాన్స్ స్పోర్ట్ (ఇది పోంటియాక్ ట్రాన్స్ స్పోర్ట్ ఫ్రంట్ ఎండ్‌తో ఉన్న చేవ్రొలెట్ వెంచర్) ఉన్నాయి. చేవ్రొలెట్ యూరప్ ద్వారా అమ్ముడయిన ఇతర మోడల్ కార్లు కమారో, ది కోర్సికా/బెరెట్టా, ది కొర్వెట్టి, ది బ్లేజర్, మరియు ట్రయిల్‌బ్లేజర్. ఉత్తర అమెరికాలో నిర్మించిన ప్రస్తుత తరం చేవ్రొలెట్ ఇంపాలా వి-8 సెడాన్ కార్లు కూడా ఇటీవలి సంవత్సరాలలో యూరప్‌లో లభ్యమవుతున్నాయి. ఇవి అతి పెద్ద కుటుంబ సెడాన్‌లుగానూ, అత్యధిక సామర్థ్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కార్లవలే జాగ్వార్ మరియు బిఎమ్‌డబ్ల్యూ కార్లకు తక్కువ ధరలతో కూడిన ప్రత్యామ్నాయ కార్లుగా మార్కెట్లో ప్రవేశపెట్టబడ్డాయి.
2005లో GM దేవూ నుండి వచ్చిన అన్ని ప్రధాన శ్రేణి మోడల్ కార్లు యూరప్‌లో చేవ్రొలెట్గా బ్రాండ్ మార్చబడ్డాయి (మునుపటి దేవూ శ్రేణిలోని ఎస్‌వియు మోడల్ కార్ల యాజమాన్యం ఈసారి శాంగ్ యోంగ్ మోటార్ కంపెనీ యాజమాన్యంలోకి మార్చబడింది.) అయితే దేవూ పేరు దక్షిణ కొరియా మరియు వియత్నాంలలో అలాగే కొనసాగింది. తక్కిన ప్రపంచంలో, చాలావరకు దేవూ మోడల్ కార్లు 2003నుంచి చేవ్రొలెట్ బ్యాడ్జ్‌ను ధరించాయి. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడాలలో ఉపయోగిస్తున్న సుజుకి బ్యాడ్జ్, కెనడా లోని పోంటియాక్ బ్యాడ్జ్, ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ లోని హోల్డెన్ బ్యాడ్జ్, చైనాలోని బ్విక్ బ్యాడ్జ్‌లు కొన్ని GM దేవూ మోడల్ కార్లకు మినహాయింపులుగా ఉంటూ వచ్చాయి.
నెదర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న క్రోయిమాన్స్ కార్పొరేషన్ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న విడి పంపిణీ ఛానెల్ ద్వారా యూరప్‌లో కొర్వెట్టి మరియు కాడిలియాక్‌లు ఆర్ మార్కెట్ చేయబడ్డాయి.[18] క్రోయిమాన్స్ కార్పొరేషన్ రుణ దాతలనుంచి కోర్టు రక్షణకు ప్రయత్నించింది.[citation needed] క్రోయిమాన్స్ కార్పొరేషన్ జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియంలలో ఫోర్డ్, ఓపెల్, నిస్సాన్, సాబ్, వోల్వో మరియు ఇతర బ్రాండ్లను కూడా అమ్ముతోంది. క్రోయిమాన్ నెదర్లాండ్స్‌లో దిగుమతి, పంపిణీ, మార్కెటింగ్ మరియు కార్ రిటైల్ అమ్మకాలుపై మాత్రమే కేంద్రీకరించింది.[19]
చేవ్రొలెట్ బ్రాండ్ ప్రస్తుతం యూరప్‌లో విలువ ప్రాధాన్యత కలిగిన కార్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది, కొర్వెట్టి పేరు యూరప్ మరియు జపాన్‌లలో ప్రత్యేక పేరుగా మార్చబడింది.
[మార్చు] రష్యా
రష్యాలో, పలు రకాల చేవ్రొలెట్ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న చేవ్రొలెట్లు స్పార్క్, అవియో, లాసెట్టి, క్రుజ్, రెజ్జో, ఎపికా, కేప్టివా, ట్రయిల్‌బ్లేజర్, మరియు టహో. ఈ అన్ని మోడల్ కార్లూ (ట్రయిల్‌బ్లేజర్ మరియు టహో మినహా) దేవూ మోడల్ కార్లుగా రూపు మార్చుకున్నాయి. అలాగే GM మరియు రష్యన్ అటోవజ్ మధఅయ 2002 నుంచి జాయింట్ వెంచర్ ఏర్పడిన కారణంగా చేవ్రొలెట్ నివా - ఎస్‌యువి మోడల్‌ని ప్రత్యేకించి రష్యన్ మార్కెట్ కోసం తయారు చేశారు. 2009లో ఈ మోడల్‌ని బెర్టోనే ద్వారా రూపురేఖలను మార్పు చేయించారు.
[మార్చు] దక్షిణ అమెరికా
చారిత్రకంగా, GM నుండి అనేక లాటిన్ అమెరికన్-మార్కెట్ వాహనాలు GM యొక్క ఉత్తర అమెరికన్ మరియు యూరోపియన్ ఆపరేషన్‌ల నుండి పాత మోడళ్ల నుంచి వృద్ధి చేసిన నమూనాలే. ప్రస్తుత ఎస్10 మరియు బ్లేజర్ ఈ వ్యూహానికి మినహాయింపుగా ఉన్నాయి. అయితే, మార్కెట్ పరిస్థితులు మారి, పోటీ పెరిగినందువల్ల, మరిన్ని ఆధునిక వాహనాలు ఇప్పుడు మార్కెట్ చేయబడుతున్నాయి. మెక్సికో, ఈక్విడార్, కొలంబియా మరియు మెర్కోసుర్ దేశాలలో రూపొందించబడిన పాత కార్లకు, మునుపటి దేవూ ఫ్యాక్టరీల నుండి కొరియన్ మూలం కలిగిన కార్లకు తోడుగా, కొన్ని మార్కెట్లు తమ స్థానిక శ్రేణులపై జర్మన్ ఒపెల్ మరియు అమెరికాలో తయారుచేయబడ్డ చేవ్రొలెట్‌లను పొందాయి.
[మార్చు] బ్రెజిల్
బ్రెజిల్‌లో, 1960ల చివరలో జర్మన్ ఒపెల్ రికోర్డ్‌పై ఆధారపడిన చే్వ్రొలెట్ ఒపాలా 1990 ప్రారంభం వరకు ఉత్పత్తిని కొనసాగించింది, తర్వాత దీనిస్థానంలో ఒపెల్ ఒమేగా వచ్చి చేరింది. బ్రెజిల్‌లోని కడెట్ మరియు మోంజా వంటి చిన్న స్థాయి చేవ్రొలెట్ కార్లు వరుసగా ఒపెల్ కాడెట్ మరియు అస్కోనాలపై ఆధారపడి ఉండేవి. బ్రెజిల్ లోని చేవ్రొలెట్ ఉత్పత్తి శ్రేణి ఇప్పుడు సుజుకి బ్రాండ్ కింద అర్జెంటైనాలో అమ్మబడుతున్న కొర్సా "బి" ఆధారిత సెల్టా, వంటి విలాసవంతమైన డిజైన్లతో కూడి ఉంది. అస్త్రా మరియు ప్రస్తుత ఒపెల్ అస్త్రాపై ఆధారపడిన కొత్త బ్రాండ్ అయిన బ్రెజిల్‌లో రూపొందించిన వెక్ట్రా వంటి డిజైన్లతో కూడి ఉంది. ప్యాసింజర్ కార్ శ్రేణిలో క్లాసిక్, ప్రిస్మా, కోర్సా హాచ్‌బ్యాక్ మరియు సెడాన్ మరియు ఆస్ట్రేలియన్ హోల్డెన్ కమోడోర్ దిగుమతి అయిన ఒమేగా సెడాన్‌లతో కూడి ఉంది. చేవ్రొలెట్ ఎగిల్ హాచ్‌బ్యాక్ తాజాగా స్థానికంగా రూపొందించబడిన ఉత్పత్తి 2009 చివరలో విడుదల చేయబడింది.
యుటిలిటీ మరియు నాలుగ చక్రాలతో నడిచే వాహనాల శ్రేణిలో ఎస్10, బ్లేజర్ మరియు మోంటానా ఉన్నాయి. మోంటానా ఒక చిన్న శ్రేణి ట్రక్, ఇది కొర్సా నమూనాపై ఆధారపడింది, ఇది లాటిన్ అమెరికన్ మార్కెట్లసో అమ్మబడుతోంది. 1960ల నుండి 1980ల వరకు సి10 ట్రక్ ( వెరానియో అని పిలవబడే సబర్బన్) నుండి రూపొందించబడిన పెద్ద స్టేషన్ వేగన్ కార్లు కూడా ఉండేవి.
[మార్చు] చిలీ
చీలీలో చేవ్రొలెట్ ఉత్పత్తి 1962లో మొదలైంది, మొదట్లో ఇది స్థానికి భాగస్వాముల ఆధ్వర్యంలో జరిగింది (ఈ సందర్భంలో, నోవాIIతో కూడిన అవయు ఉండేది) GM ఇప్పటికీ ఇసుడు డి-మాక్స్ కార్లను ఎరికాలో LUV డి-మాక్స్గాను మరియు శాంటియాగోలోని హ్యూచురబాలో ఇసుజు´ ఎఫ్ మరియు ఎన్ సీరీస్ కార్లను తయారు చేస్తూనే ఉంది.
చేవ్రొలెట్ గత 80 ఏళ్లుగా ఈక్వడార్‌లో నడుస్తూనే ఉంది. GM ఈక్వడార్ GM దేవూ మరియు ఒపెల్ ఆధారిత మోడల్ కార్లతో పాటు యుఎస్ చేవ్రొలెట్ కార్లను కూడా అమ్ముతోంది. ఇది చేవ్రొలెట్ పేరుతో 1983 నాటి సుజుకి సూపర్‌క్యారీని కూడా అమ్ముతోంది మరియు 1990ల పొడవునా చేవ్రొలెట్ రొడియో పేరిట ఇసుజు రొడియో అమ్ముడుపోతూనే ఉంది.
వెనెజులాలో, చేవ్రొలెట్ 1948 నుంచి అంటే ట్రక్ ఉత్పత్తి కరాకస్‌లో ప్రారంభమైనప్పటి నుంచి చలామణీలో ఉంటోంది. 1979లో క్లిస్లర్ నుంచి కొనుగోలు చేసిన వాలెన్సియాలోని కర్మాగారానికి ఉత్పత్తి తరలించబడింది. చేవ్రొలెట్ వెనెజులాలో తొలి 50 సంవత్సరాల కాలంలో 1,500,000 కంటే ఎక్కువ వాహనాలను తయారు చేసింది.
[మార్చు] ట్రినిడాడ్ మరియు టొబాగో
1920ల ప్రారంభం నుంచి, చేవ్రొలెట్ కార్లు మరియు ట్రక్కులు ఈ దేశంలో మార్కెట్ చేయబడుతూ వచ్చాయి. 1930ల నాటి మాస్టర్ డీలక్స్ సెడాన్ కార్లు విలాసానికి మారుపేర్లుగా గుర్తించబడేవి. స్థానిక డీలర్, నీల్ మరియు మస్సె (ఇది వాక్స్‌హాల్ మరియు బ్విక్‌కు ఫ్రాంచైజ్ కూడా) ద్వారా అమ్మబడిన అన్ని కార్లు కుడివైపు డ్రైవ్‌కు అనుకూలంగా ఉండేవి, ఇవి కెనడా మరియు ఆస్ట్రేలియా నుండి దిగుమతి చేయబడేవి. 1940లు మరియు 1950ల పొడవునా, GM సంస్థ బెల్ ఎయిర్, ఇంపాలా మరియు ఫ్లీట్‌లైన్‌లతో పాటు మార్కెట్లో కనిపించేది. 1960ల చివర్లో మరియు 1970ల ప్రారంభంలో, చేవ్రొలెట్ కాప్రిసెస్‌గా బ్యాడ్జ్ చేయబడిన ఆస్ట్రేలియన్ హోల్డెన్ డెవిల్లెస్ కార్లు అమ్మబడేవి, కొన్ని "ఐస్లాండర్" పరిమిత ఎడిషన్ అమెరికన్ చేవ్రొలెట్ కాప్రిసెస్ కార్లు మాత్రం దిగుమతి చేయబడేవి. నీల్ అండ్ మస్సే సంస్థ 1974లో GM ఫ్రాంచైజ్‌ని వదలుకోవడంతో ఈ బ్రాండ్ మార్కెట్ నుంచి తప్పుకుంది. 1998-2001 కాలంలో, సదరన్ సేల్స్ లిమిటెడ్ సంస్థ చెవీ మోంజా మరియు జోయ్ కార్లను దిగుమతి చేసుకుంది. ఒపెల్/వాక్స్‌హాల్ కోర్సా ప్లాట్‌ఫాంపై ఆధారపడి మెక్సికోలో తయారు చేయబడిన ఈ కార్లు కొత్తగా లభ్యమవుతున్న కార్లలో అత్యంత చౌకగా లభించేవి. పేలవమైన నిర్మాణ నాణ్యత, వృత్తి నిపుణత లేని డీలర్ సేవలు మరియు పరిమితమైన విడిభాగాల సరఫరా కారణంగా కొన్ని కార్లు మాత్రమే అమ్ముడు పోవడంతో ఇవి మార్కెట్లోంచి నిష్క్రమించాయి. 2003లో, స్థానిక రీనాల్ట్ డీలర్, అవియో సెడాన్ మరియు హాచ్‌బ్యాక్ మోడల్ కార్లను మార్కెట్ చేసింది, అప్ట్రా సెడాన్ (సుజుకి ఫొరెంజా నుంచి రీబ్యాడ్జ్ చేయబడినది) కార్ల అమ్మకాలు పరిమిత విజయాన్నే సాధించాయి. తాజా చేవ్రొలెట్ డీలర్ లైఫ్‌స్టయిల్ మోటార్స్ చేసిన విస్తృత మార్కెటింగ్ ప్రచారం ద్వారా ఇది మరింత విజయం సాధించింది. 2009 నాటికి, చేవ్రొలెట్ కొలరాడో (థాయ్‌ల్యాండ్‌లో తయారు చేసిన ఇసుజు డి-మాక్స్ కార్లను రీబాడ్జ్ చేసిన నమూనా), స్పార్క్ (ఆగిపోయిన దేవూ మాటిజ్ సరికొత్త ఆవిష్కరణ), అవియో, అప్ట్రా, కేప్టివా మరియు హొల్డెన్ కమోడోర్ యొక్క రీబ్యాడ్జ్ చేయబడిన వెర్షన్ కార్ల మోడళ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
[మార్చు] అర్జెంటీనా
1924లో, జనరల్ మోటార్స్, చేవ్రొలెట్ డబుల్ ఫెయిటన్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. పైగా అది గొప్ప గిరాకీతో స్వాగతించబడింది.
1925లో, జనరల్ మోటార్స్, అర్జెంటీనా మార్కెట్‌లో ధరని తగ్గించేందుకు, అర్జెంటీనాలోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. అంతేగాక నలుగురు కూర్చుని ప్రయాణించగల మోటారు వాహనాలని, రోడ్డు వాహనాలని, ట్రక్కు చట్రాలని ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. అర్జెంటీనియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన నమూనా, చేవ్రొలెట్ డబుల్ ఫెయిటన్, ఇప్పుడు "ఎస్పెషల్ అర్జెంటీనో"గా పిలవబడుతోంది. అమ్మకాలు పెరిగాయి. వెంటనే, విడిభాగాలను ఒకచోట అమర్చే కర్మాగార శ్రేణిలో, ఓల్డ్స్ మొబైల్, ఓక్‌లాండ్ మరియు పోంటాయిక్ ప్రమాణాలు జోడింపబడ్డాయి.
రెండవ ప్రపంచ యుద్ధం సంభవించినప్పుడు, దీని కార్యక్రమాలు క్లిష్టమయ్యాయి. 1941లో, చేవ్రొలెట్ 250,000 ఉత్పత్తయినా, విడిభాగాల ఉత్పత్తి కొరత కారణంగా కార్ల తయారీ అసాధ్యమయ్యింది. ఆగస్టు 1942 లో, చివరి చేవ్రొలెట్ కర్మాగారం నుండి విడుదలయ్యింది. సంపూర్ణ నిలుపుదలని తప్పించటానికి, ఎలక్ట్రికల్ మరియు మోసుకుపోదగిన చిన్న శీతలీకరణ యంత్రాలనీ, ఇంకా ఇతర వస్తువులతో బాటు కారు అనుబంధ సాధనాలనీ, కంపెనీ తయారు చేసింది. యుద్ధానంతరం, GM, ఓల్డ్స్ మొబైల్‌నీ, ఇంకా పోంటాయిక్ శ్రేణిని ఉత్పత్తి చేయటం ప్రారంభించింది; తర్వాత చేవ్రొలెట్‌ని కూడా ఉత్పత్తి చేసారు.
1959లో ఉత్పత్తి కర్మాగారాలని విస్తరించి, కార్లు, ట్రక్కుల ఉత్పత్తిని మెరుగు పరిచేందుకు ఏర్పాట్లు చేసారు. జనవరి 25, 1960న, మెరుగు పరచిన తొలి అర్జంటీనియన్ చేవ్రొలెట్ ప్రవేశపెట్టబడింది. తర్వాత ఏడాది, జాతీయ ప్రభుత్వం, 12,000 m2 గల ఉత్పత్తి కర్మాగారంతో సహా, 45 మిలియన్ల డాలర్ల పెట్టుబడి ప్రణాళికని అనుమతించింది. 1962 మార్చి 12 న, ఉత్తర అమెరికా చెవీII మీద ఆధారపడిన తొలి చేవ్రొలెట్ 400 తయారైంది. తొలి ఉత్పాదక సంవత్సరంలో 50% జాతీయ ఏకీకరణని అసలు పథకం పరిగణించింది, మరియు 1964 నాటికి 15,000ల ప్రమాణ వస్తూత్పత్తితో, ఈ మొత్తం 90% కావాలి. 1969 నాటికి, అమెరికన్ చెవీ నోవా నుండి ఉత్పాదించిన, చెవీ శ్రేణి సమర్పించబడింది.
డెభ్బైల మధ్యలో, జనరల్ మోటార్స్ యొక్క మార్కెట్ భాగస్వామ్యం, 1976లో గల 9% నుండి 1978లో 2%కి వేగంగా పడిపోయింది. నష్టాలు 30 మిలియన్ డాలర్లని మించగా, యూఎస్ఎలో గల ప్రధాన కంపెనీ, అర్జెంటీనాలో ఉత్పత్తి కార్యకలాపాలని నిలిపి వేయాలని నిర్ణయించింది.
సి-20 మరియు డి-20ల మెరుగైన ప్రత్యేక రూపాల ఉత్పత్తితో, చేవ్రొలెట్ యొక్క వ్యాపార చిహ్నం 1985లో పునర్దర్శనం ఇచ్చింది. చేవ్రొలెట్ కోర్సా మీద ఆధారపడిన ఓపెల్ ఉత్పత్తి, మరియు చేవ్రొలెట్ గ్రాండ్ విటారా 4x4 మీద ఆధారపడిన సుజుకి ఉత్పత్తుల కోసం, మెర్కొసర్‌లోని ఇతర దేశాలతో పాటు, ప్రత్యేకంగా బ్రెజిల్‌కు ఎగుమతి చేయాలనే లక్ష్యంలో చేపట్టిన ఉత్పత్తి ప్రణాళిక, 1995లో, రోసారియో, శాంటా ఫెల దగ్గర కొత్త కర్మాగార నిర్మాణంతో, వాస్తవ రూపం రాల్చింది.[20]
[మార్చు] కొలంబియా
కొలంబియాలో, 1956లో స్థాపించబడిన కొలంబియన్ ఆటోమోటివ్ ఫ్యాక్టరీ ఎస్ఏ (కొల్మొటొరెస్), ముందుగా ఆస్టిన్‌లో వాహనాలని ఉత్పత్తి చేసింది, ఇంకా 60లలో సింకా ఆటోమోబైల్స్‌నీ, డాడ్జినీ ఉత్పత్తి చేసింది, (ఇది మొదట ఉత్పత్తి చేసిన కారు కొరొనెట్ 440), 1980లో చేవ్రొలెట్ కార్లని ఉత్పత్తి చేయటం ప్రారంభించింది. దేవూ, సుజుకి, ఇంకా ఒపెల్, ప్రత్యేకంగా చెప్పుకోదగిన ఎవియో, ఓప్ట్రా మరియు స్పార్క్ వంటి GM నమూనాలతో, కొల్మొటోరిస్‌కు, ప్రస్తుత దేశీయ మార్కెట్‌లో 75% కంటే మించిన వాటా ఉంది. ఎవియో, ఆప్టివా మరియు స్పార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.
[మార్చు] భవిష్యత్ కార్లు మరియు అభివృద్ధి
GMను పునర్నిర్మించటం, మాతృ సంస్థకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నించటంలో భాగంగా, ఉత్తర అమెరికాలోని GM యొక్క ఇతర వ్యాపారోత్పత్తులతో బాటుగా, చేవ్రొలెట్ కూడా, ప్రస్తుతం పునర్వవస్థీకరణకు గురవుతోంది. టయోటా మరియు హోండా వంటి కంపెనీలతో పోటీ పడేందుకు, ఇటీవల జనరల్ మోటార్స్, అధిక ఇంధన సామర్ధ్యం గల చేవ్రొలెట్ బ్రాండు వాహనాలని ఉత్పత్తి చేసే అభివృద్ధి దశలో ఉంది. 2007లో ఉపసంహరించబడి, కామెరో చేత పునఃస్థాపించబడిందని చెప్పబడుతున్న మాంటె కార్లోకు కూడా తగిన స్థానం ఉంది. 2009లో జరిగిన డెట్రాయిట్ ఆటో ప్రదర్శనలో, స్పార్క్ పేరు క్రింద చేవ్రొలెట్ స్పార్క్ ఉత్పత్తి రూపాలు ప్రదర్శింపబడ్డాయి. జనరల్ మోటార్స్, స్పార్క్, యూఎస్ ఉత్పత్తి కానుందని ప్రకటించింది. స్పార్క్‌తో పాటుగా జనరల్ మోటార్స్, మరో రెండు నమూనాలని ప్రవేశ పెట్టనుంది: ది ప్లగ్-ఇన్-హైబ్రిడ్ 2011 చేవ్రొలెట్ ఓల్ట్ మరియు 2011 చేవ్రొలెట్ క్రూజ్, కొబాల్ట్‌కు తర్వాతి నమూనా. 2010 వేసవిలో విడుదల చేయనున్న రెండవ తరపు ఎవియోని చేవ్రొలెట్ ప్రారంభిస్తోంది. 2010 ఆటో చైనాలో, జనరల్ మోటార్స్ ఓల్ట్ ఎంపివి5 యొక్క, ప్రచారం కోసం తయారు చేసే కొత్త భావాన్ని, నలుగురు ప్రయాణించే ఎలక్ట్రిక్ ఓల్ట్ మోటార్ వాహనం మీద ఆధారపడిన ఒక MPVనీ ప్రదర్శించింది. ఓల్ట్ ఎంపివి5 కూడా 32 మైళ్ళ వ్యాప్తి గలిగిన ఎలక్ట్రిక్ వాహనమే.
2011-2013 నమూనా సంవత్సరాలకు కొత్త వాహనాలు:
- స్పార్క్
- ఓల్ట్
- కాప్రైస్ పోలీస్ ఇంటర్‌సెప్టర్
- ఓల్ట్ ఎంపివి5
[మార్చు] వాహన నమూనాలు
చేవ్రొలెట్ వాహనాల జాబితా
[మార్చు] కరెంట్
[మార్చు] యూఎస్ మరియు కెనడా నమూనాలు
| కార్లు | అవియో | క్రుజె | మలిబు | ఇంపాలా | కమారో | కర్వెట్టె |
| ట్రక్కులు | కొలరాడో | సిల్వరాడో | అవలాంచె | |||
| క్రాస్‌ఓవర్స్ | హెచ్‌హెచ్‌ఆర్ | ఈక్వినోక్స్ | ట్రావర్సె | |||
| ఎస్‌వీయులు | టహో | సబర్బన్ | ||||
| వాన్స్ | ఎక్స్‌ప్రెస్ |
[మార్చు] లాటిన్ అమెరికా నమూనాలు
| కార్లు | స్పార్క్ | సెల్టా/ప్రిస్మా కోర్సా B/చెవీ C2 కొర్సా C |
అవియో | ఒపత్రా | అస్త్రా బి అస్త్రా సి/వెక్ట్రా |
వెక్ట్రా C | ఎపికా |
| ట్రక్కులు | మోంటానా/టోర్నడో | ఎస్-10 | డి-మాక్స్ | సిల్వరాడో | అవలాంచె | ||
| క్రాస్‌ఓవర్స్ | హెచ్‌హెచ్ఆర్ | కేప్టివా | కేప్టివా స్పోర్ట్ | ట్రావర్స్ | |||
| ఎంపీవీలు | మెరివా | టకుమా/రెజ్జో | జఫిరా |
[మార్చు] యూరప్ నమూనాలు
| కార్లు | స్పార్క్ | అవియో | క్రుజ్ | ఎపికా |
| ఎస్‌వీయూలు | హెచ్‌హెచ్ఆర్ | కేప్టివా | ||
| ఎంపీవీలు |
[మార్చు] మధ్యప్రాచ్య నమూనాలు
| కార్లు | స్పార్క్ | అవియో | ఒప్ట్రా | ఎపికా | లుమినా | కేప్రైస్ | మలిబు | కర్వెట్టె | బీట్ | కమారో |
| ట్రక్కులు | కొలరాడో | అవలాంచె | సిల్వరాడో | |||||||
| క్రాస్‍ఓవర్స్ | ట్రావర్స్ | కేప్టివా | ||||||||
| ఎస్వీయులు | ట్రయల్‌బ్లేజర్ | టహో | సబర్బన్ | |||||||
| వాన్స్ | అప్‌లాండర్ | ఎక్స్‌ప్రెస్ |
[మార్చు] భవిష్యత్తు
[మార్చు] యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా
| కార్లు | వోల్ట్ | క్రుజ్ | స్పార్క్ |
[మార్చు] మార్కెటింగ్
ప్రపంచవ్యాప్తంగా చేవ్రొలెట్, పాటలు, ట్యాగ్ లైన్లు మరియు నినాదాలతో కూడిన, వాణిజ్య ప్రచార కార్యకలాపాలు కలిగి ఉంది:
[మార్చు] పాటలు
- "చెవీ వోల్ట్ అండ్ మి"
- మీ చేవ్రొలెట్ (1950s-1960s) లో యు.ఎస్.ఎని చూడండి. దీన్ని ది దినాహ్ షోర్ చెవీ షో కి థీమ్ సాంగ్‌గా దినాహ్ షోర్ పాడారు.
- 409 (1962) ది బీచ్ బాయ్స్
- షట్ డౌన్ (1963) ది బీచ్ బాయ్స్
- మై స్టింగ్రే--
- ఎస్ఎస్ 396 (1965) పాల్ రెవరె అండ్ ది రైడర్స్
- లిటిల్ రెడ్ కోర్వెట్టి (1982), ఆల్బమ్ 1999 (ఆల్బమ్) లిజన్ టు ది హార్ట్‌బీట్ ఆఫ్ అమెరికా (1986–1992) నుండి ప్రిన్స్ (మ్యుజీషియన్) పాడినది
- అమెరికా గుండె చప్పుడును వినండి (1986–1992)
- లైక్ ఎ రాక్ (1991–2004)
- ఇది మా దేశం (2006–ఇప్పటివరకు)
- అమెరికన్ పై - డాన్ మెక్‌లీన్
- స్టింగ్‌రే- స్టాటిక్-ఎక్స్
- చెవీ వాన్ - సామీ జాన్స్
[మార్చు] ట్యాగ్‌లైన్స్
- (1991)లో చాలామంది అమెరికన్లు ఆధారపడే కార్లు
- దీర్ఘకాలం మన్నికైన ట్రక్‌లు (1991)
మీరు ఆధారపడదగిన ట్ర్రక్కులు, దీర్ఘకాలం మన్నికైన ట్రక్కులు (1992)
- రోడ్‌పై అత్యంత ఆధారపడదగిన, దీర్ఘకాలం మన్నికైన ట్రక్కులు (1993,1995–ఇప్పటివరకు)
- ఇది మా దేశం(1994)
- లైక్ ఎ రాక్
- ఉత్తమమైన కారు గెలవవచ్చు (2009–ఇప్పటివరకు)
[మార్చు] నినాదాలు
- మీ చేవ్రొలెట్‌లో యుఎస్ఎ ని చూడండి (1950s-1960s)
- నిన్ను మొదట్లో ఉంచడం ద్వారా మేం మొదట్లో ఉంటాము (1960లు)
- ఇది అద్భుతంగా ఉంది
! (1960ల మధ్యకాలం)
- యుఎస్ఎని చూడడానికి ఉత్తమమైన రీతిలో నిర్మించబడ్డాయి (1970ల మొదట్లో)
- బేస్‌బాల్, హాట్‌డాగ్స్, ఆపిల్ పీ & చేవ్రొలెట్ (1970ల మధ్యలో)
- చేవ్రొలెట్‌తో సంభవించే మంచి విషయాలు (1980ల ప్రారంభంలో)
- నేటి చేవ్రొలెట్ (1980ల మధ్యలో)
- అమెరికా గుండె చప్పుడు (1987–1994)
- రాక్, ఫ్లాగ్ అండ్ ఈగిల్ (1985–1987)
- అసలైన చే్వ్రొలెట్ (1994-2001 యునైటెడ్ స్టేట్స్; 1994-1996 కెనడా)
- ప్రయత్నించబడింది, పరీక్షించబడింది మరియు నిజమైనది (1996–2004 కెనడా)
- అక్కడే ఉంటుంది (2001–2004 యునైటెడ్ స్టేట్స్)
- లైక్ ఎ రాక్ (1991–2004; చేవ్రొలెట్ ట్ర్రక్కులు) బాబ్ సెగర్ సాంగ్ ఆఫ్ ది సేమ్ నేమ్ను ప్రదర్శిస్తుంది
- యాన్ అమెరికన్ రివల్యూషన్ (2003–2009)
- ఫర్ ఆల్ లైఫ్స్ రోడ్స్ (2004–2006; కెనడా)
- అవర్ కంట్రీ, మై ట్రక్ (2006–2007; చేవ్రొలెట్ ట్రక్కులు)
- అమెరికా యొక్క అత్యుత్తమ ట్రక్కులు (2007–ఇప్పటివరకు; చేవ్రొలెట్ ట్రక్కులు)
- లెటజ్ గో (2007–2009; కెనడా)
- ఉత్తమమైన కారే గెలువవచ్చు (2009–ఇప్పటివరకు; యునైటెడ్ స్టేట్స్ & కెనడా)
[మార్చు] "చెవీ"ని వదిలివేసే నిర్ణయం
2010, జూన్ 8న, డెట్రాయిట్‌లోని జనరల్ మోటార్స్ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులకు, "చేవ్రొలెట్" స్థానే "చెవీ" అనే పదాన్ని ఉపయోగించరాదని అధికారికంగా తెలియజేయబడింది. సహోద్యోగులతో, వ్యాపార పంపిణీదారులతో, వినియోగదారులతో, కుటుంబ సభ్యులతో మరియు మిత్రులతో సంభాషించేటప్పుడు "చెవీ" ని ఉపయోగించకుండా, ఉద్యోగులని ప్రోత్సహించారు. అధికారిక వ్యాపార ప్రచార కార్యకలాపాలనీ, వ్యాపార పంపిణీలని, ఈ దశలో అదెంత వరకూ ప్రభావపరుస్తుందో అస్పష్టమే.
[మార్చు] గడియారాలు
2007లో, లూయిస్ చేవ్రొలెట్ వాచ్ వ్యాపార నామంతో, చేవ్రొలెట్ తన తొలి గడియారాల సేకరణని పరిచయం చేసింది. గడియారాల తయారీదారుల కుటుంబంలో జన్మించిన, బాల్యంలో తండ్రికి పనిలో సాయం చేసిన, చేవ్రొలెట్ సహవ్యవస్థాపకుడైన లూయిస్ చేవ్రొలెట్ కు, ఈ గడియారాల సేకరణ నివాళులర్పించింది. లూయిస్ చేవ్రొలెట్ చేత స్థాపించబడిన రేసు కార్ల కంపెనీ నుండి, వారసత్వంగా వచ్చిన పేరు ఫ్రాంటెనాక్‌గా ఈ వాచీల సేకరణ పిలవబడింది. ETA మరియు రోండా కదలికల పరికరాలతో, చేవ్రొలెట్ గడియారాల సేకరణలో, స్వయం చాలక, మానవ ప్రయత్నంలో చుట్టబడిన మరియు స్పటిక నమూనాలున్నాయి.
లూయిస్ చేవ్రొలెట్ ఫ్రాంటినాక్ గడియారాలు, స్విస్ జురా ప్రాంతపు పోరెంట్రైలో, తయారు చేయబడుతున్నాయి. చేవ్రొలెట్ కార్ల సలహాలతో ఆధునాతన పోకడలను సంతరించుకున్నాయి. కార్ల పరిశ్రమలో ఉపయోగించిన ముడి పదార్థాలనే వినియోగిస్తూ గడియారాలు వృద్ధి చేయబడ్డాయి. చేవ్రొలెట్ గడియారాల ఉపరితలంపైన అమర్చబడిన ముత్యాల అల్లిక, పాత డాష్ బోర్డ్‌ల నమూనా రూపాలను గుర్తు తెస్తుంది. చేవ్రొలెట్ రేసు పందెపు సంఖ్య ‘8’, గడియారపు పెట్టె వెనుక గుర్తించబడింది.[21]
[మార్చు] NASCARలో
ప్రధాన జట్లలో, ఇంపాలాను నడపగల హెడ్రిక్ మోటార్ స్పోర్ట్స్, రిచర్డ్ చిల్డ్రెస్స్ రేసింగ్, ఎర్న్ హార్డ్ గనస్సీ రేసింగ్ మరియు స్టెవార్ట్ హాస్ రేసింగ్‌లు ఉన్నాయి. హెండ్రిక్ 9 సార్లు విజేతగా, RCR 6 సార్లు విజేతగా నిలిచారు.NASCAR యొక్క సంపూర్ణ చరిత్రలో ఇప్పటి వరకూ, అత్యంత విజయవంతమైన ఉత్పత్తిదారు చేవ్రొలెట్.
[మార్చు] వీటిని కూడా చూడండి
- సూపర్ స్పోర్ట్
- చేవ్రొలెట్ హాల్
- మాన్సన్ ట్రక్
- మార్క్ IV బిగ్ బ్లాక్ ఇంజిన్
- యాన్ అమెరికన్ రివల్యూషన్ — "ఇరవై నెలల్లో పది కొత్త కార్లు మరియు ట్రక్కుల"ను ప్రమోట్ చేసేందుకు 2003లో ప్రారంభించిన అతి పెద్ద ప్రకటనల ప్రచారం
- Geo — 1989-1997 నుండి ఉత్తర అమెరికా వ్యాప్తంగా చేవ్రొలెట్ డీలర్‌షిప్‌ల ద్వాపా అమ్ముడయిన చిన్న కార్లు మరియు SUVలకు చెందిన బ్రాండ్
- U.S. సూకర్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్
[మార్చు] సూచికలు
- ↑ బెవర్లీ రే కిమ్స్, రాబర్ట్ సి. కుంటర్సన్, చేవ్రొలెట్: ఎ హిస్టరీ ఫ్రమ్ 1911 . ఆటోమొబైల్ హెరిటేజ్ పబ్లిషింగ్ & కో, 1986, p. 16.
- ↑ హౌస్టఫ్‌వర్క్స్ "1911, 1912, 1913 చేవ్రొలెట్ సీరీస్ సి క్లాసిక్ సిక్స్"
- ↑ Chevrolet Bowtie History. తీసుకొన్న తేదీ: July 21, 2006.
- ↑ Gustin, Lawrence R. (2008). Billy Durant: Creator of General Motors. University of Michigan Press, 266–267. ISBN 0-472-03302-6.
- ↑ మెక్‌ఫీ, జాన్ లా ప్లెస్ డె లా కంకార్డె స్విసే . న్యూయార్క్: నూన్‌డే ప్రెస్ (ఫర్రార్, స్ట్రాస్ అండ్ గిరౌక్స్), 1984.
- ↑ అవర్ కంపెనీ - హిస్టరీ
- ↑ Gunnell, John (Editor) (1987). in Gunnell, John: The Standard Catalog of American Cars 1946–1975. Kraus Publications, 134–183. ISBN 0-87341-096-3.
- ↑ Cheryl Jensen. "Forecast Says China Provides Opportunities and Competition", New York Times Wheels blog', 2010-04-23. Retrieved on 2010-04-23.
- ↑ నార్మ్ డార్విన్, ది హిస్టరీ ఆఫ్ హోల్డెన్ సిన్స్ 1917, 1983, పేజ్ 11
- ↑ ది హోల్డెన్ హెరిటేజ్ – పేజ్ 5 media.gm.com నుంచి 25 జూలై 2009న తిరిగి పొందబడింది
- ↑ ది హోల్డెన్ హెరిటేజ్ – పేజ్ 6
- ↑ ది హోల్డెన్ హెరిటేజ్ – పేజ్ 23 media.gm.com నుంచి 24 జూలై 2009న తిరిగి పొందబడింది
- ↑ ది మాక్‌క్వయిరీ డిక్షనరీ ఆఫ్ మోటారింగ్, 1986, పేజీ 84
- ↑ చేవ్రొలెట్ C20 మరియు C50 కాబ్ చేసిస్ యొక్క RHD వెర్షన్లు కూడా GMH ద్వారా 1981 వరకు రూపొందించబడ్డాయి.ది ఆస్ట్రేలియన్ స్టోరీ – చేవ్రొలెట్ ozgm.com నుంచి 24 జూలై 2009న తిరిగి పొందబడింది
- ↑ SPRINGBOK RADIO SOUNDS: CHEVROLET
- ↑ 1972 చేవ్రొలెట్ కొమాండో బ్రోచర్
- ↑ 1976 చేవ్రొలెట్ కాన్‌స్టాన్షియా AJ బ్రౌచర్
- ↑ Kroymanscorporation.com. Kroymanscorporation.com. తీసుకొన్న తేదీ: 2009-04-28.
- ↑ http://www.autonews.com/article/20090320/ANE02/903209984/1042
- ↑ www.auto-historia.com అర్జెంటైనాలో జనరల్ మోటార్స్ చరిత్ర - యాక్సెస్ చేయబడింది 2008-11-10
- ↑ వ్రిస్ట్‌లో లెజెండరీ చేవ్రొలెట్
[మార్చు] బాహ్య లింకులు
| Chevrolet
]]మూస:Chevrolet Vehicles మూస:Chevrolet మూస:Chevrolet Truck మూస:General Motors brands మూస:General Motors మూస:ChevroletinNASCAR
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from May 2010
- Articles with invalid date parameter in template
- Articles with unsourced statements from April 2009
- 1975లో స్థాపించబడిన సంస్థలు
- మోటార్ వెహికల్ కంపెనీలు
- చేవ్రోలెట్
- అత్యవసర సేవల సామగ్రి ఉత్పత్తిదారులు
- మిచిగాన్ కేంద్రంగా మోటార్ వాహనాల ఉత్పత్తిదారులు
- కారు ఉత్పత్తిదారులు
- ట్రక్ ఉత్పత్తిదారులు
- ఇండీకార్ ఇంజిన్ ఉత్పత్తిదారులు
- డెట్రాయిట్, మిచిగాన్ ఆధారిత కంపెనీలు
- జనరల్ మోటార్స్ మార్క్యూస్