చైనా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇతరవాడుకలు రిపబ్లిక్ ఆఫ్ చైనా లేదాతైవాన్

దేశము పేరు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా
జాతీయ జండా
Flag of the People's Republic of China.svg
జాతియ చిహ్నము
జాతియ చిహ్నము
పటము
China in its region (claimed hatched).svg
జాతియ గీతము 义勇军进行曲
అధికారక భాష చైనీస్
రాజధాని బీజింగ్
వైశాల్యం 9,598,086చ.కి.మి లేదా9,640,821చ.కి.మి
జనాభా 1,321,851,888(2007లో)
జన సాంద్రత ప్రతి చదరపు కిలో మీటర్లకు 140 మంది
జాతియ స్థూల ఉత్పత్తి(విదేశీ మారకద్రవ్యల విలువ ప్రకారము) $8.227 ట్రిల్లియన్లు[1]
జాతియ స్థూల ఉత్పత్తి(కొనుగోలు శక్తి పొలికతొ) $12.405 ట్రిల్లియన్లు[1]
Gini 44medium
HDI Increase 0.768medium
ద్రవ్యవిధానం యువాన్
cctld .cn3
అంతర్జాతియ సంకేత సంఖ్య 86

చైనా అని సాధారణంగా పిలువబడే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (People's Republic of China) (PRC; మూస:Zh-stp About this sound listen ), తూర్పు ఆసియాలో అతిపెద్ద దేశం, మరియు ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఒకటి.[2] 130 కోట్ల (1.3 బిలియన్) పైగా జనాభాతో ప్రపంచంలోని అతి పెద్ద జనాభా గల దేశంగా చైనా ఉన్నది. చైనా రాజధాని నగరం బీజింగ్ (Beijing).అతిపెద్ద నగరం షాంఘై(shangai).

భాష[మార్చు]

గడులు.. గీతలు.. బొమ్మలుగా ఉండే చైనా భాష చాలా చిత్రంగా,సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వారీ భాషను 'మాండరిన్' అని పిలుస్తారు. అక్కడి నిఘంటువుల ప్రకారం చూస్తే సుమారు 56,000 గుర్తులు (కేరక్టర్లు) ఉన్నాయని చెబుతారు. ఎక్కువగా మాత్రం 3,000 గుర్తులు వాడతారు. ఇవి వస్తే 99 శాతం చైనా భాషను నేర్చేసుకున్నట్టే. చైనా అక్షరాలు రాయడానికి కనీసం 1 నుంచి గరిష్టంగా 64 గీతలు గీయాల్సిఉంటుంది![3]

 • చైనాలో మెజారిటీ ప్రజలు మాట్లాడే 'మండారిన్ ‌' భాషను మన సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళికలో చేర్చనున్నారు.[4]

సైన్యం[మార్చు]

PLA soldiers march in Beijing

పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సైన్యాన్ని నిర్వహిస్తుంది. దీనిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (ప్రజా స్వాతంత్ర్య సైన్యం) అని పిలుస్తారు. దీనిలో నావికా దళం, వాయు దళం ఉన్నాయి. 2005లో దీని బడ్జటు సుమారుగా మూడువేల కోట్ల డాలర్లు (పదిహేను వేల కోట్ల రూపాయలు ?)కానీ ఈ బడ్జటు విదేశీ ఆయుధాలు, ఇతర పరిశోధనల ఖర్చు కాకుండా! విమర్శకులు ఈ బడ్జటును ఇంకా చాలా ఎక్కువగా చెపుతారు. ఇటీవలి రాండ్(RAND) అను సంస్థ ప్రకారం ఈ ఖర్చు రెండు రెట్లు ఎక్కువ! ఇది అమెరికా సంయుక్త రాష్టాల నాలుగు వందల బిలియన్ డాలర్ల తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో నిలుస్తుంది. దీనికి చక్కని అణు ఆయుధాలు, ఇతర ప్రధాన ఆయుధాలు ఉన్నప్పటికీ, బలహీనమైన నావికాదళం, విమాన వాహక నౌకలు, వైమానిక దళంలోని పాత విమానాల వల్ల, తక్కువ శిక్షణా సమయం వల్ల దీనిని ప్రపంచపు సూపర్ పవరుగా గుర్తించరు, కానీ ఓ ప్రాంతీయ శక్తిగా మంచి గుర్తింపు ఉన్నది.

 • భారత్‌కు పాక్ కంటే చైనానుంచే ఎక్కువ ప్రమాదముందని భారత వాయుసేనాధిపతి హోమీమేజర్ అభిప్రాయపడ్డారు. భారత్-చైనాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నది.ఈనాడు 24.5.2009.
 • మన దేశంలో జంతువుల పేర్లతో రాశులున్నట్లు, చైనాలో 12 సంవత్సరాలకు జంతువుల పేర్లతో పిలుస్తారు. అవి మూషికం, వృషభం, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, గొర్రె, కోతి, కోడిపుంజు, కుక్క మరియు పంది. వీరికి 1972, 1984, 1996, 2008 మూషిక నామ సంవత్సరాలు. ఫిబ్రవరి 7 నుండి చైనా కాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదలౌతుంది.

చైనా వారి ఆవిష్కరణలు[మార్చు]

 • క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల క్రితమే హ్యాన్‌ చక్రవర్తి కాలంలో కలపగుజ్జు నుంచి పేపరస్‌ పేరుతో కాగితం తయారీని కనిపెట్టారు.[3]
 • మొట్టమొదటిసారి ముద్రణాయంత్రం తయారు చేసింది చైనా వారే. దీనికి 'ఉడ్‌బ్లాక్‌ ప్రింటింగ్‌' అని పేరుపెట్టారు. 220వ సంవత్సరంలో రూపొందించిన ఈ యంత్రం ఆధారంగానే ప్రింటింగ్‌ విధానం అందుబాటులోకి వచ్చింది.
 • ఓడలకు దారి చూపించే దిక్సూచి (కంపాస్‌)ని చైనీయులు 1044 లోనే కనుగొన్నారు. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల్ని కూడా దీని ద్వారానే గుర్తించారు.
 • తొమ్మిదో శతాబ్దంలో కనిపెట్టిన గన్‌పౌడర్‌ ఆధారంగానే టపాసులు(బాణాసంచా) పుట్టుకొచ్చాయి.
 • ప్రపంచం చీనాంబరాలుగా చెప్పుకునే పట్టు వస్త్రాలను క్రీస్తుకు పూర్వం 3630 సంవత్సరాల క్రితమే చైనా అల్లింది. ప్రపంచ వాణిజ్యంలో పై చేయి సాధించింది. క్రీస్తుశకం 6వ శతాబ్దంలో ఇద్దరు యూరోపియన్లు సన్యాసుల వేషంలో చైనా వెళ్ళి చేతి కర్రల్లో పట్టుపురుగులను తీసుకొచ్చేవరకూ ఆ రహస్యం ప్రపంచానికి తెలియనేలేదు.
 • ఇప్పటికి 3000 ఏళ్ళ క్రితమే ఓ చైనా రాజు తన కోటను చుట్టుముట్టిన సైనికులు ఎంత దూరంలో ఉన్నారో కనుగొనడానికి తొలి గాలిపటాన్ని ఎగరేశాడనే కథ ఉంది.
 • రోజూ పళ్ళు తోముకునే అలవాటును నేర్పించింది చైనావాళ్ళే అని చెప్పవచ్చు. 1400లోనే వాళ్ళు టూత్‌బ్రెష్‌తో తోముకున్నారు!
 • ఐస్‌క్రీం పుట్టింది కూడా ఇక్కడే. క్రీస్తు పూర్వం 2000 నాడే పాలతో కలిపిన బియ్యాన్ని మంచులో ఉంచి తినేవారు
 • తేదీలు, ముహూర్తాలు చూస్తే క్యాలెండర్‌ని కూడా క్రీ.పూ. 2600 ల్లోనే రూపొందించారు.
 • చైనీయులు క్రీస్తుకు వందేళ్ళ క్రితమే టీ తయారీని కనిపెట్టి, క్రీస్తుశకం 200 ఏళ్ళకల్లా ప్రజల్లోకి టీ ఒక పానీయంగా ప్రాచుర్యం లోనికి తెచ్చారు.
 • ముడుచుకునే గొడుగును పరిచయం చేసింది కూడా చైనీయులే. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాలకే ఇత్తడి ఊసలతో ఇలాంటి గొడుగు చేశారు.
 • ఇంకా చెప్పాలంటే పరిశ్రమల్లో ఉపయోగపడే
  బ్లాస్ట్‌ఫర్నేస్‌,
  బోర్‌హోల్‌డ్రిల్లింగ్‌,
  ఫోర్క్‌లు,
  ఇండియన్‌ ఇంక్‌,
  దశలవారీగా ప్రయాణించే రాకెట్లు,
  రెస్టారెంట్లో మెనూ పద్ధతి,
  భూకంపాలను కనిపెట్టే సీస్మోమీటర్‌,
  టాయ్‌లెట్‌పేపర్‌,
  పిస్టన్‌పంప్‌,
  క్యాస్ట్‌ఐరన్‌,
  సస్పెన్షన్‌ బ్రిడ్జి,
  ఇంధనాలుగా బొగ్గు,
  సహజవాయువులను వాడే ప్రక్రియ
  ఇలాంటివెన్నింటికో తొలి రూపాలు చైనాలో రూపుదిద్దుకున్నాయి.

పుస్తకాలు[మార్చు]

వీడియోలు[మార్చు]

విశేషాలు[మార్చు]

 • ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం ఆట బొమ్మలు చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి[3]
 • ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కాగితాల రూపంలో డబ్బుని అందుబాటులోకి తెచ్చిన దేశం ఇదే. ప్రస్తుతం చైనాలో డబ్బుని రెన్‌మిన్‌బీ అంటారు. అంటే ప్రజల సొమ్ము అని అర్థం. రూపాయలకి యువాన్‌, జియావో, ఫెన్‌ లాంటి పేర్లు ఉన్నాయి.[3]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 [1]
 2. Area rank is disputed with the United States and is either ranked third or fourth. See List of countries and outlying territories by area for more information.
 3. 3.0 3.1 3.2 3.3 ఈనాడు దిన పత్రికలో(ఆగష్టు 03,2008 నాటి సంచిక) వింతల పుట్టిల్లు... అద్భుతాల నట్టిల్లు! శీర్షికన 'చైనా' వివరాలు 04 ఆగష్టు, 2008న సేకరించబడినది.
 4. ఈనాడు 16.9.2010

బయటి లింకులు[మార్చు]

Overviews

డాక్యుమెంటరీలు

ప్రభుత్వం

పరిశీలన

ప్రయాణం

Wikivoyage has a travel guide for China.

దేశ పటాలు

మూస:Editsection

ఇవికూడా చూడండి[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=చైనా&oldid=1181926" నుండి వెలికితీశారు