ఛత్తీస్‌గఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़), మధ్య భారతదేశంలోని ఒక రాష్ట్రం. ఇది 2000 నవంబర్ 1న మధ్య ప్రదేశ్ లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ , ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా వున్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం అని పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా సరిహద్దులు కలిగి ఉంది. అదే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి‌.

రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానము అంచులలో ఉంది. గంగా నది యొక్క ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతున్నది. సాత్పూరా శ్రేణులు యొక్క తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది , దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము దక్కన్ పీఠభూమిలో గోదావరి , దాని ఉపనది ఇంద్రావతి యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాషలు మాట్లాడే గోండులకు ఆలవాలము. హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

చత్తిష్ అనగా36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం. చత్తిస్గడ్ రాజధాని రాయిపూర్ నగరాన్ని రాయ్ జగత్ అనే గోండ్ రాజు స్థాపించాడు . గోండ్ రాజులు నిర్మించిన 36 కోటల వలనే ఈ రాష్ట్రానికి ఛత్తీస్గడ్ అనే పేరు వచ్చింది

జిల్లాలు[మార్చు]

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సౌలభ్యానికై విభజించబడ్డాయి.

ప్రభుత్వం[మార్చు]

రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అనుగా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాష్ట్ర గణాంకాలు[మార్చు]

  • రాష్ట్ర అవతరణ:2000 నవంబరు 1
  • వైశాల్యం:1,36,034 చ.కి.
  • జనసంఖ్య: 25,540,196 అందులో స్త్రీలు 12,712,281, పురుషులు 12,827,915 లింగ నిష్పత్తి .991
  • జిల్లాల సంఖ్య:27
  • గ్రామాలు:19,744 పట్టణాలు.97
  • ప్రధాన భాష :చత్తీస్ గరి,గోండి, హింది, ప్రధాన మతం.హిందూ
  • పార్లమెంటు సభ్యుల సంఖ్య:11 శాసన సభ్యుల సంఖ్య. 90
  • మూలం: మనోరమ ఇయర్ బుక్

దేవాలయాలు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

బయటి లింకులు[మార్చు]