జడ్చర్ల

వికీపీడియా నుండి
  ?జడ్చర్ల మండలం
మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్
మహబూబ్ నగర్ జిల్లా పటములో జడ్చర్ల మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో జడ్చర్ల మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము జడ్చర్ల
జిల్లా(లు) మహబూబ్ నగర్
గ్రామాలు 20
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
92,170 (2001)
• 46800
• 45360
• 58.29
• 69.51
• 46.71


జడ్చర్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. ఇది 7 వ నెంబరు జాతీయ రహదారి పై ఉన్న ముఖ్య కూడలి. హైదరాబాదు నుంచి కర్నూలు, బెంగుళూరు వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది బాదేపల్లి జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి పురపాలక సంఘం చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.

విషయ సూచిక

జనాభా [మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 102557. ఇందులో పురుషులు 51440, మహిళలు 51117. అక్షరాస్యుల సంఖ్య 61056.[1] మండలంలో పట్టణ జనాభా 50366 కాగా, గ్రామీణ జనాభా 52191.

రవాణా సౌకర్యాలు [మార్చు]

7 వ నెంబరు జాతీయ రహదారిపై ముఖ్యకూడలి కావడంతో బస్సు సౌకర్యం మంచి స్థితిలో ఉంది. హైదరాబాదు నుంచి దక్షిణం వైపుగా కర్నూలు, బెంగుళురు వైపు వెళ్ళు మార్గమే కాకుండా మహబూబ్ నగర్ నుంచి తూర్పు వైపున దేవరకొండ, నల్గొండ వెళ్ళు మార్గం కూడా ఈ పట్టణం ద్వారానే వెళ్తుంది. అంతేకాకుండా ఈ పట్టణానికి రైలు సదపాయము కూడా ఉంది. రోడ్డు మార్గములో హైదరాబాదు నుంచి 83 కిలోమీటర్లు, రైలు మార్గంలో సికింద్రాబాదు నుంచి 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వినోదం [మార్చు]

జడ్చర్ల పట్టణంలో 4 సినిమా థియేటర్లు ఉన్నాయి.

  • శ్రీనివాస థియేటర్
  • దేవి థియేటర్
  • వెంకట రమణ థియేటర్
  • రాఘవేంద్ర థియేటర్

విద్యాసంస్థలు [మార్చు]

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ( స్థాపన: 1982-[[1983|83)
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ( స్థాపన : 1982-83)
  • మాస్టర్స్ జూనియర్ కళాశాల ( స్థాపన : 1997-98)
  • సెయింట్ ఆగ్నస్ బాలికల హై స్కూల్
  • జిల్లా ప్రజా పరిషత్తు బాలుర హై స్కూల్

దేవాలయాలు [మార్చు]

  • శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం (బాదేపల్లి).
  • హనుమాన్ దేవాలయం, పాతబజార్(బాదేపల్లి).
  • వేంకటేశ్వర స్వామీ దేవాలయం, కొత్త బస్సుస్టాండు రోడ్డు ( జడ్చెర్ల )
  • రంగనాయక స్వామీ దేవాలయం ( గుట్ట , బాదేపల్లి )
  • శివాలయం, గంగాపురం రోడ్డు , బాదేపల్లి
  • రాఘవేంద్రస్వామి దేవాలయం, సిగ్నల్ గడ్డ రోడ్డు, బాదేపల్లి
  • సాయిబాబా దేవాలయం, బాదేపల్లి చౌరస్తా
  • మైసమ్మ దేవాలయం, పాతబస్టాండ్ రోడ్డు చైతన్య నగర్. బాదేపల్లి

నీటిపారుదల, భూమి వినియోగం [మార్చు]

మండలంలో 9 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 766 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]

మండలంలోని గ్రామాలు [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూలాలు [మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127
  2. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
Mahbubnagar.jpg

మహబూబ్‌ నగర్ జిల్లా మండలాలు

కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్‌ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమన‌గల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్‌ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్‌ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్

"http://te.wikipedia.org/w/index.php?title=జడ్చర్ల&oldid=830067" నుండి వెలికితీశారు