జనపనార

వికీపీడియా నుండి
జనపనార
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Rosids
వర్గము: మాల్వేలిస్
కుటుంబము: మాల్వేసి
ప్రజాతి: Corchorus
Jute fiber is being dehydrated after retting alongside a road
Jute Rope

జనపనార (Jute) మెత్తని, మెరిసే పొడవైన నార. వీటిని బలమైన దారాలు మరియు తాడుగా అల్లుకోడానికి వీలుంటుంది. ఇవి సన్నని పొడవైన మొక్కల ప్రజాతి కార్కొరస్ (Corchorus) నుండి లభిస్తుంది. దీనిని టీలియేసి (Tiliaceae) లేదా మాల్వేసి (Malvaceae) కుటుంబంలో వర్గీకరించారు.

విషయ సూచిక

[మార్చు] జనపనార లక్షణాలు

జనపనార అతి చౌకగా మొక్కల నుండి లభించే ప్రకృతిసిద్ధమైన నార. ఇది ప్రత్తి తర్వాత స్థానంలో విస్తృతంగా ఉపయోగపడుతున్నది. ఈ నారలో ముఖ్యంగా సెల్యులోజ్ (Cellulose) మరియు లిగ్నిన్ (Lignin) లు ఉన్నాయి. దీని పారిశ్రామిక నామం : raw jute. నారపోగులు తెలుపు నుండి లేత గోధుమ రంగులో సుమారు 1–4 మీటర్లు పొడుగు ఉంటాయి.

[మార్చు] సాగుచేయు విధానం

జనపనార రేగడి నేలల్లోను మరియు నీరునిలబడే తడినేలల్లో పెరుగుతుంది. వేడిగా అధిక తేమను కలిగిన వాతావరణం దీనికి సాగుకు అనుకూలమైంది. ఈ రెండూ ఋతుపవనాలు అందించే ఉష్ణమండలంలో కనిపిస్తుంది. దీనికి 20˚C నుండి 40˚C ఉష్ణోగ్రత మరియు 70%–80% గాలిలో తేమ అవసరం. వారానికి 5–8 cm వర్షపాతం ముఖ్యంగా నాటడానికి కావాలి.

[మార్చు] చరిత్ర

జనపనార కొన్ని శతాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ లకు చెందిన బెంగాల్ సంస్కృతి లో భాగంగా ప్రముఖ పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనా కాలంలో 19 మరియు 20 వ శతాబ్దాలలో ముడి జనపనారను యునైటెడ్ కింగ్ డం కు తరళించేవారు. అక్కడి మిల్లులలో దాన్ని శుభ్రపరచి నారను తయారుచేసేవారు. తర్వాత కాలంలో దీని కోసం యంత్రాలను ఉపయోగించారు.[1] 1901 UK జనాభా లెక్కలలో జనపనార మిల్లులలో పని ఒక గుర్తించబడిన వృత్తి. అయితే 1970 తర్వాత కృత్రిమ నారల ఉత్పత్తి మొదలై వీటి ప్రాముఖ్యత తగ్గిపోయింది.

[మార్చు] జనపనార ఉత్పత్తి

జనపనార అధికంగా ఉత్పత్తి చేస్తున్న మొదటి పది దేశాలు — 2008
దేశం ఉత్పత్తి (టన్నులు) పాదపీఠిక
Flag of భారత దేశం భారత్ 1,846,000 F
మూస:BAN 848,715 F
Flag of చైనా చైనా 48,000 F
Flag of మయన్మార్ బర్మా 30,000 F
Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 20,000 F
Flag of నేపాల్ నేపాల్ 16,988 F
Flag of వియత్నాం వియత్నాం 8,800 F
Flag of థాయిలాండ్ థాయిలాండ్ 5,000 F
Flag of సూడాన్ సూడాన్ 3,300 F
Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 2,200 F
 {{{1}}}World 2833041 A
No symbol = official figure, F = FAO estimate, A = Aggregate (may include official, semi-official or estimates);

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division


[మార్చు] ఉపయోగాలు

జనపనార చాలా రకాలుగా ఉపయోగపడుతున్నది.

  • జనపనారను తాళ్ళు గా అల్లి ఉపయోగిస్తారు.
  • దీనిని మందమైన వస్త్రంగా తయారుచేసి దానితో తెరలు, చాపలు, కంబళి, గోనె సంచులు, తివాచీ మొదలైన గృహోపకరణాలు తయారుచేస్తారు.
  • నారతో చేసిన సంచుల్ని పోలిథీన్ సంచుల స్థానంలో ఉపయోగిస్తే మంచిది.
  • ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో జనపనార ఆకులను ఆహారంలో ఆకుకూరగా వాడుతారు. వీటిలో విటమిన్ ఎ, సి మరియు ఐరన్, కాల్షియమ్ లు అధికంగా ఉన్నాయి.

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్ లో కి సంభందించిన మీడియా ఉంది
"http://te.wikipedia.org/w/index.php?title=జనపనార&oldid=674353" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు