జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
జననంజనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
నవంబరు 11, 1899
అనంతపురంజిల్లా, గాండ్లపాడు గ్రామం
మరణంనవంబరు 18, 1972
వృత్తిఆంధ్రోపాధ్యాయుడు
ప్రసిద్ధిప్రముఖ కవి,పండితుడు,పంచాంగకర్త
మతంహిందూ
పిల్లలు6గురు కుమార్తెలు
తండ్రిసుబ్బయ్య
తల్లిసీతమ్మ

జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ (నవంబరు 11, 1899 - నవంబరు 18, 1972) [1] సంపన్న వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1899, నవంబరు 11అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా గాండ్లపాడు గ్రామంలో జన్మించాడు. కాశ్యపస గోత్రోద్భవుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కడపలో నివసిస్తున్న మాతామహుడు మామిళ్లపల్లి సీతారామయ్య పంచన చేరాడు. అనుముల వేంకట సుబ్బావధానుల వద్ద వేదవిద్య, ఋగ్యజుర్వేదాలలోని స్మార్తకర్మల పాఠాలను నేర్చుకున్నాడు. జనమంచి శేషాద్రిశర్మ వద్ద కావ్యపాఠములు చదివాడు. 1915లో కాశీలో వ్యాకరణశాస్త్రం అభ్యసించి 1916లో విజయనగరం సంస్కృతకళాశాలలో చదివాడు. 1918లో జనమంచి శేషాద్రిశర్మ దగ్గర జ్యోతిష్యశాస్త్రం నేర్చుకున్నాడు. 1923లో కలకత్తా సంస్కృత విద్యాపీఠం నిర్వహించిన కావ్యతీర్థ పరీక్షలోను, 1924లో పురాణతీర్థ పరీక్షలోను ఉత్తీర్ణుడయ్యాడు.1927లో మద్రాసు యూనివర్సిటీ నుండి విద్వాన్ పట్టాను పొందాడు. 1918లో కడప పురపాలక ఉన్నత పాఠశాలలో సహాయ ఉపాధ్యాయుడిగా చేరి 1960లో ప్రధాన ఆంధ్రోపాధ్యాయుడిగా పదవీవిరమణ చేశాడు. 1920 నుండి పంచాగం వ్రాసి ముద్రించడం ప్రారంభించాడు. సుమారు 40 సంవత్సరాలు ప్రతి యేటా పంచాంగాన్ని ప్రచురించాడు. త్రిస్కంద జ్యోతిషము, వ్యాకరణము, ధర్మశాస్త్ర కృషి జాతక ముహూర్త భాగాలలో ఇతనికి మంచి ప్రవేశం ఉంది.

రచనలు[మార్చు]

  1. దేవీభాగవతము
  2. లలితాంబా శతకము (1926 వావిళ్ల ప్రెస్‌లో ప్రచురితం)
  3. సమాసాలంకార ఛందోదర్పణం
  4. ఆంధ్రవ్యాకరణ సుగ్రహము
  5. దశావతారములు
  6. అద్భుతోత్తర రామాయణము
  7. బ్రహ్మఖండము (ఆంధ్రీకరణం 2000 పద్యాలు)
  8. పుష్పగిరి మాహాత్మ్యము
  9. పురాణ కథాసాగరము
  10. సీమంతిని
  11. కాత్యాయిని[2]
  12. వనజాక్షి

ఇవి కాకుండా ఇంకా 10 శతకాలు, ఎన్నో దండకాలు వ్రాశాడు. ఎన్నో శతకాలను, గ్రంథాలను పరిష్కరించాడు.

మూలాలు[మార్చు]

  1. రాయలసీమ రచయితల చరిత్ర మొదటిసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
  2. లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి