జమ్సేట్జి టాటా

వికీపీడియా నుండి

మూస:Peacock

Jamshedji
JNTata.jpg
Jamshetji Tata
జననం మార్చి 3 1839(1839-03-03)
Navsari, Gujarat, India
మరణం మే 19 1904 (వయసు: 65)
Bad Nauheim, German Empire
వృత్తి Businessman
భార్య/భర్త Hirabai Daboo

జంషెట్జి నుస్సేర్వాంజి టాటా (గుజరాతి: જમ્શેત્જી નુંસ્સેર્વાનજી ટાટા; మార్చ్3, 1839 - మే 19, 1904) భారతదేశంలో పెట్టుబడిదారుడు,పారిశ్రామికవేత్త పారిశ్రామిక రంగ పురోగమనంలో ప్రముఖుడు. ఆయన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రం నవసారి గ్రామంలో నివసించే పార్సీకుటుంబంలో జన్మించారు.

ఆయన స్థాపించిన సంస్థ తరువాతి కాలంలో టాటా గ్రూప్ ఆఫ్ కంపనీస్ గా ప్రసిద్ది చెందింది జమ్సేట్జి టాటాను "భారత పారిశ్రామిక రంగ పితామహుడు" గా పేర్కొంటారు.[1]

విషయ సూచిక

[మార్చు] ప్రారంభ జీవితం

నవసారి, దక్షిణ గుజరాత్ లోని ఒక చిన్న పట్టణంలో నుస్సేర్వాంజి మరియు జీవన్ బాయి దంపతులకు 3 మార్చ్ 1839న జమ్సేట్జి టాటా జన్మించారు. జొరాష్ట్రియన్ పురోహితులు అయిన పార్సీ కుటుంబంలో నుస్సేర్వాంజి టాటా మొట్టమొదటి వ్యాపారవేత్త. ఆయన ముంబై చేరి వర్తకం మొదలుపెట్టారు.

14 ఏళ్ళ వయసులో జమ్సేట్జి ముంబైలో ఉన్న త్రండ్రి వద్దకు చేరి ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చేరారు. విద్యార్ధిగా ఉండగానే ఆయన వివాహం హిరబాయి దాబూతో జరిగింది.[2][3] ఆయన 1858లో పట్టభద్రుడు అయిన పిదప తండ్రిగారి వర్తక సంస్థలో చేరారు. బ్రిటిష్ ప్రభుత్వం 1857 భారత స్వతంత్ర విప్లవాన్ని అణిచివేసిన రోజులు కావటంతో వ్యాపారం చేయడానికి ఆ కాలం అనుకూలం కాదు.

[మార్చు] వ్యాపారం

చేతిలో ఇండియన్ ఇంస్టిట్యుట్ ఆఫ్ సైన్స్ భవన నమూనాతో ఉన్న జె.యెన్.టాటా విగ్రహం. ఇది ఇండియన్ ఇంస్టిట్యుట్ ఆఫ్ సైన్స్ భవనంలో ఉంది.

జమ్సేట్జి 29 సంవత్సరాలు వయసు వరకు తండ్రిగారితో పని చేసారు. 1968లో ఆయన సొంత వర్తక సంస్థ ప్రారంభించారు దాని పెట్టుబడి రూ; 21,000. 1869లో చించ్ పోఖ్లి లోని దివాలా తీసిన ఒక నూనె మిల్లుని కొని దానిని పత్తి మిల్లుగా మార్చారు. దానికి అలెగ్జాండ్రా మిల్లు అని పేరు పెట్టారు. రెండు సంవత్సరాలు తరువాత ఆ మిల్లుని మంచి లాభానికి అమ్మారు. తరువాత 1874లో నాగపూర్లో పత్తి మిల్లు ప్రారంభించారు. 1877 జనవరి 1న రాణి విక్టోరియని భారతదేశ చక్రవర్తిగా ప్రకటించిన సందర్భంగా ఆ మిల్లుకు ఏమ్ప్రేస్స్ మిల్ అని నామకరణం చేసారు.

ఆయన ఆలోచనలు సత్ఫలితాలను ఇవ్వాలని తపించేవారు: ఇనుము కర్మాగారం, అత్యుత్తమ విద్యా సంస్థ, ప్రపంచ ప్రఖ్యతి గాంచిన హొటల్, జల విద్యుత్ కేంద్రంలను స్థాపించాలని కలలు కనేవారు. ఆయన జీవితకాలంలో ఒక ఆలోచన నిజం అయ్యింది. డిసెంబర్ 3 1903లో ది తాజ్ మహల్ హొటల్ ప్రారంభించారు.[4]

ఆయన వేసిన పునాదుల పైన అతని వారసులు అతని ఆలోచనలకి ప్రతిరూపంగా ఆయా రంగాలలో ప్రస్తుత కాలంలో గౌరవప్రదమైన స్థానం చేరుకోవడానికి కృషి చేసారు.

  • టాటా స్టీల్(పూర్వం టిస్కో- టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపనీ లిమిటెడ్)ఆంగ్లో-డచ్ కూటమికి చెందిన సంస్థను కొని టాటా స్టీల్ ఆసియాలో మొదటిది, భారతదేశంలో అతి పెద్ద, ప్రపంచంలో అయిదవ అతి పెద్ద సంస్థగా అవతరించింది. ఈ సంస్థ వార్షిక ఉత్పత్తి 28 మిలియన్ టన్నులు.[5]
  • డాక్టర్. హోమీ బాబా స్థాపించిన ది టాటా ఇంస్టిట్యుట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్. డాక్టర్.హోమీ బాబా, జె.ఆర్.డి.టాటాను కలిసి విజ్ఞాన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయడానికి ఆయన సహాయం కోరారు. 1945లో శిక్షణా సంస్థను ప్రారంభించారు.[6]
  • ది టాటా పవర్ కంపనీ లిమిటెడ్ దేశంలోనే ప్రైవేటు రంగంలో నడుస్తున్న అతి పెద్ద విద్యుత్ సరఫరా సంస్థ. దీని ప్రారంభ సామర్ధ్యం 2300 మెగా వాట్లు.[7]

ఆయన జీవిత కాలంలో నిజమయిన కల ముంబై జిల్లా కొలాబాలో ఉన్న తాజ్ మహల్ ప్యాలస్ మరియు బురుజు.[8] డిసెంబర్ 13న 4,21,00,000 రూపాయల ఖర్చుతో దీని నిర్మాణం పూర్తి అయ్యింది. ప్రస్తుత ఆర్ధిక ద్రవోల్బనం ప్రకారం లెక్కలో దాని ఖర్చు రూ:11,475,496,248(£160,962,295) ఉంటుంది.[9]

[మార్చు] వ్యక్తిగత జీవితం

హిరబాయి దాబూతో జమ్సేట్జి టాటా వివాహం జరిగింది. వారి సంతానం దొరబ్జి టాటా మరియు రతన్జి టాటా. రతన్జి టాటా టాటా కూటమికి జంషెడ్జి వారసునిగా అధ్యక్షుడు అయ్యారు.

[మార్చు] వారసత్వం

జంషెడ్జి స్థాపించిన సంస్థ పెరిగి టాటా కూటమిగా మారి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్దవైన సంస్థల్లో ఒకటిగా గౌరవం పొందుతున్నాయి.

జంషెడ్జి సంస్థ స్థాపకునిగా మాత్రమే గుర్తింపు పొందలేదు. ఆ రంగంలో మార్గ నిర్దేశకుడు.

భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్రంలోని టాటా నగర్ అని కూడా జంషెడ్పుర్ కి అతని పేరు పెట్టారు. టాటా కూటమికి చెందిన సంస్థలు అక్కడ ఉన్నాయి.టాటా స్టీల్, టాటా మోటార్స్(భారి వాహనాల తయారీ కేంద్రం), అంతే కాకుండా HVAL,HVTL, టెల్కోన్, టాటా పవర్,జుస్కో, టాటా కమ్మిన్స్, Trf(టాటా రాబిన్స్ ఫ్రెసర్),టాటా బేరింగ్,టాయో,టాటా టుబ్స్ విభాగం ,టిన్ప్లేట్,టాటా అగ్రికో, IS&WP(టాటా కూటమి)టాటా పిగ్మేంట్స్.

ఇండియన్ ఇంస్టిట్యుట్ ఆఫ్ సైన్స్ స్థాపనకు కృషి చేసారు.

[మార్చు] జీవితచరిత్ర

  • ఆర్.ఏం.లాలా రాసిన ఫర్ ది లవ్ ఆఫ్ ఇండియా : లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జంషెడ్జి టాటా (ISBN 0-670-05782-7)

[మార్చు] సూచనలు

  1. జంషెడ్జి టాటా టాటా సంస్థల వ్యవస్థాపకుడు
  2. మూస:cite web ఉపయోగిస్తున్నప్పుడు తప్పులు దొర్లాయి: url మరియు title అనే పారామీటర్లను తప్పనిసరిగా ఇవ్వాలి..
  3. మూస:cite web ఉపయోగిస్తున్నప్పుడు తప్పులు దొర్లాయి: url మరియు title అనే పారామీటర్లను తప్పనిసరిగా ఇవ్వాలి..
  4. Biography on the official website of Tata. తీసుకొన్న తేదీ: September 9, 2006.[dead link]
  5. Tata Steel website. తీసుకొన్న తేదీ: September 9, 2006.
  6. హోమీ భాభా
  7. Tata Power website. తీసుకొన్న తేదీ: September 9, 2006.[dead link]
  8. Taj Hotels website. తీసుకొన్న తేదీ: September 9, 2006.
  9. 1988లో ఒక పౌండ్ విలువ 15 భారత రూపాయిలతో సమానం[1]. లెక్కించబడిన పౌండ్ సమానాంకం మరియు వాడబడిన యుకే జాతీయ పురాతన దస్తావేజుల [2]భద్రతాశాలలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు దాచబడినవి.
  • EPW at www.epw.org.in జమ్సేట్జి నుస్సేర్వాంజి టాటా, నూరు వసంతాల శ్రద్దాంజలి.

[మార్చు] బాహ్య లింకులు

మూస:Chairmen of Tata Group మూస:Tata Group

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు