జయంతి (నటి)
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి జయంతి అసలు పేరు కమల కుమారి (జ: 1950). శ్రీకాళహస్తి లో పుట్టి పెరిగిన ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్‌కుమార్‌కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈమె సుమారు 500 సినిమాలు తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో నటించారు.
విషయ సూచిక |
తొలి జీవితం [మార్చు]
జయంతి కర్ణాటక లోని బళ్ళారిలో జన్మించింది. తండ్రి బాలసుబ్యమణ్యం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేశారు. తల్లి సంతానలక్ష్మి. జయంతి వారికి ముగ్గురు పిల్లలలో పెద్ద కూతురు; తనకు ఇద్దరు తమ్ముళ్ళు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు వేరుకావడం వలన జయంతిని తీసుకొని తల్లి మద్రాసు చేరింది. సంతానలక్ష్మికి తన కూతుర్ని నాట్యకళాకారినిగా చేయాలని కాంక్ష. మద్రాసులో బడికి వెళ్తూ కమలకుమారి నాటి ప్రముఖ నర్తకి, నాట్య విదుషీమణి చంద్రకళ వద్ద నాట్యం నేర్చుకోసాగింది. ఒకనాడు కన్నడ సినిమా షూటింగ్ చూడడానికి స్కూలు విద్యార్ధినులతో వెళ్ళింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు వై.ఆర్.స్వామి కమలకుమారి రూపురేఖల్ని చుసి జేనుగూడు (Jenu Goodu) అనే సినిమాలోని ముగ్గురు నాయికల్లో ఒకరిగా ఎంపిక చేశారు. కమలకుమారి పేరు లోగడ చాలామందికి అచ్చిరాలేదని ఆమె పేరును జయంతిగా మార్చారు.[1]
బడి పిల్లలతో కలిసి మద్రాసుకు విహారయాత్ర వెళ్ళినప్పుడు అప్పటి సూపర్ స్టార్ ఎన్.టి.రామారావు కాస్సేపు ముచ్చటించిన తర్వాత బొద్దుగా, ముద్దుగా కనిపిస్తున్న కమలకుమారిని దగ్గరకు తీసుకుని 'నాతో సినిమాలలో హీరోయిగ్ గా వేస్తావా' అని యథాలాపంగా అన్నారు. పన్నెండేళ్ళ కమలకుమారి బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ అమ్మాయి సిగ్గుతో ముఖం కప్పుకొంది. తర్వాత కాలంలో ఆనాటి కమలకుమారి జగదేకవీరుని కథ కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాలలో ఎన్టీఆర్ సరసన నాయికగా నటించారు.
సినిమా జీవితం [మార్చు]
చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహ పరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చింది. కన్నడ చిత్రసీమలో జయంతి స్థానం ఉన్నతమైనది. ఈమె కన్నడ మెగా హీరో రాజ్ కుమార్ తో అందరు హీరోయిన్లకన్నా ఎక్కువగా 30 సినిమాలలో నటించారు. ఆమె మాతృభాష తెలుగైనా కన్నడం చాలా చక్కగా మాట్లాడతారు. అమె అసలైన కన్నడ నటి అని కన్నడ ప్రేక్షకులు భావిస్తారు.
ఎన్.టి.రామారావు తో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్, కె.బాలచందర్ లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
అవార్డులు [మార్చు]
1965లోనే 'మిస్ లీలావతి' అనే కన్నడ సినిమాలో స్విమ్మింగ్ పూల్ డ్రస్‌లో నటించారు. అనూహ్యంగా ఈ సినిమాలోనే ఆమెకు భారత ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు శ్రీమతి ఇందిరా గాంధీ చేతుల మీదుగా లభించింది.[2]
రాజకీయాలు [మార్చు]
జయంతి 1998 లోక్‌సభ ఎన్నికలలో లోకశక్తి పార్టీ తరపున చిక్ బళ్ళాపూర్ నియోజకవర్గం నుండి పోటీచేసినది. అయితే మూడో స్థానంతో సంతృప్తిపడవలసి వచ్చింది.[3] మళ్ళీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కోరటగీరె నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయినది.
నటించిన సినిమాలు [మార్చు]
- స్వాతి కిరణం (1992)
- తల్లిదండ్రులు (1991)
- రాజా విక్రమార్క (1990)
- కొదమ సింహం (1990)
- Ghayal Sherni (1988)
- దొంగ మొగుడు (1987)
- Naya Anubhav (1986)
- Aaj Ke Sholey (1985)
- శ్రీ దత్త దర్శనం (1985)
- జస్టిస్ చౌదరి (1982)
- పార్వతీ పరమేశ్వరులు (1981)
- అగ్నిపూలు (1981)
- కొండవీటి సింహం (1981)
- Oridathoru Phayalwan (1981)
- కమలమ్మ కమతం (1979)
- శ్రీ రామాంజనేయ యుద్ధం (1974)
- అమ్మ మనసు (1974)
- మాయదారి మల్లిగాడు (1973)
- శారద (1973)
- Tumse Achha Kaun Hai (1969)
- Ethir Neechal (1968)
- Mehrban (1967)
- బొబ్బిలి యుద్ధం (1964)
- డాక్టర్ చక్రవర్తి (1964)
- జగదేకవీరుని కథ (1961)
- భార్యాభర్తలు (1961)
మూలాలు [మార్చు]
- ↑ Fernandes, Ronald Anil. "Straight from the Heart:As this month’s guest at Maneyangaladalli Mathukathe, cine actress Jayanthi held her audience spellbound with her usual charm", Deccan Herald, December 23, 2003. Retrieved on 2006-12-24.
- ↑ http://www.hindu.com/mp/2008/05/31/stories/2008053151840200.htm
- ↑ http://ibnlive.in.com/politics/electionstats/constituency/1998/s10/9.html