జయభేరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జయభేరి
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. పుల్లయ్య
నిర్మాణం వాసిరెడ్డి నారాయణరావు
కథ ఆచార్య ఆత్రేయ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు (కాశీనాధ శాస్త్రి),
అంజలీదేవి(మంజువాణి),
ఎస్.వి.రంగారావు(విజయానంద రామగజపతి),
చిత్తూరు నాగయ్య (విశ్వభర శాస్త్రి),
రేలంగి వెంకటరామయ్య (బచ్చన బంగారయ్య),[1]
రమణారెడ్డి (బచ్చన నారయ్య),
పి.శాంతకుమారి (అన్నపూర్ణ),
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సూర్యకాంతం (రత్నాలు),
రాజసులోచన (అమృతాంబ),
ముక్కామల (ధర్మాధికారి),
జంధ్యాల గౌరీనాథశాస్త్రి,
చదలవాడ కుటుంబరావు (డప్పుల రాఘవులు),
సురభి కమలాబాయి (రంగనాయకి),
పేకేటి శివరామ్,
మోపర్రు దాసు (హరి కథకుడు)
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
ఎం.ఎల్.వసంతకుమారి,
పి.బి.శ్రీనివాస్,
పిఠాపురం నాగేశ్వరరావు,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
మాధవపెద్ది సత్యం,
సుందరరాజన్,
పి.సుశీల
నృత్యాలు వెంపటి పెదసత్యం
గీతరచన ఆరుద్ర,
మల్లాది రామకృష్ణశాస్త్రి,
శ్రీశ్రీ,
కొసరాజు,
నారపురెడ్డి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
ఛాయాగ్రహణం పి.ఎల్.రాయ్
కూర్పు ఆర్.దేవరాజన్
నిర్మాణ సంస్థ శారద ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

జయభేరి, 1959లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీ దేవి ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగులో బాగా విజయవంతమైన సినిమాలలో ఇది ఒకటి. సినిమాలో పాటలు బాగా హిట్టయ్యాయి. రాగమయీ రావే అనురాగమయీ రావే.., రసికరాజ తగువారముకామా అగడు సేయ తగవా ఏలుదొరవు అరమరకలు.. వంటి పాటలు చాలాకాలం సినిమా సంగీత ప్రియుల ఆదరణకు నోచుకొన్నాయి.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

జయభేరి డివిడి ముఖచిత్రం

విశ్వనాథుడు (నాగయ్య) సంగీత శాస్త్ర కోవిదుడు. వారివద్ద సంగీతవిద్య నభ్యసించి అగ్రస్థానంలో నిలిచిన వాడు కాశీనాథ్ (అక్కినేని). అతనికి అన్న విశ్వనాథ్ (గుమ్మడి వెంకటేశ్వరరావు), వదిన (శాంతకుమారి) అంటే ఎంతో గౌరవం, అభిమానం. బచ్చెన భాగవతులు ఇచ్చిన ప్రదర్శన చూడడానికి వెళ్ళిన కాశీనాథ్ అందులో ప్రధాన పాత్ర వహించి, సవాలు చేసిన మంజుల (అంజలీదేవి) తో ప్రతిసవాలు చేస్తాడు. వారిద్దరి మధ్యా జరిగిన సంగీత సాహిత్యపరమైన వివాదం ప్రణయానికి దారితీస్తుంది. వారి జానపద కళల్లో కూడా మానవీయ విలువలున్నాయని కాశీనాథ్ గ్రహిస్తాడు. మంజులతో వివాహానికి కుల పెద్దలు అడ్డుచెబుతారు. కాశీనాథ్ ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం అన్నగారికి దూరమై, ఇల్లు వదలి మంజులను దేవాలయంలో వివాహం చేసుకుంటాడు.

అక్కడినుంచి వారిద్దరూ, వారి బృందం (రమణారెడ్డి, కమలాబాయి) తో చేరి దేశ సంచారం చేస్తూ కళారూపాల్ని ప్రదర్శిస్తారు. చివరకు విజయనగర సామ్రాజ్యం చేరుతారు. ఆ దేశపు రాజు విజయానందుడు (యస్.వి.రంగారావు) మారువేషంలో వీరి ప్రదర్శన తిలకించి ముగ్ధుడై తన కొలువుకు ఆహ్వానిస్తాడు. నిండుసభలో సరికొత్త రాగంలో 'రసికరాజ తగువారము కామా' అనే పాటతో సభికుల్ని మెప్పిస్తాడు కాశీనాథ్. రాజనర్తకి (రాజసులోచన) కాశీనాథ్ ని ఆకర్షించాలని ప్రయత్నిస్తుంది. ఇందుకు రాజగురువు (ముక్కామల) సహకరిస్తాడు. ఫలితంగా కాశీనాథ్ మధ్యానికి బానిస కావడంతో అతని పతనం ప్రారంభమౌతుంది. అంతటి పతనావస్థలోనూ హరిజనుడి ఆలయప్రవేశం కోరి భక్తనందుని చరిత్రను గానం చేస్తాడు.

ఇక్కడ విశ్వనాథ్ కుటుంబాన్ని సనాతనులు వెలివేస్తారు. మరిదిపై మమకారాన్ని పెంచుకున్న వదిన మరణానికి చేరువకాగా కాశీనాథ్ దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆమెకు స్వస్థత చేకూరి అందరూ ఏకమౌతారు.

పాటలు[మార్చు]

  1. నందుని చరితము వినుమా...పరమానందము గనుమా - రచన: శ్రీశ్రీ - గానం: ఘంటసాల
  2. నీ దాననన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా తానే మధుకలశమని - రచన: మల్లాది - గానం: ఘంటసాల
  3. మది శారదాదేవి మందిరమే, కుదురైన నీ మమున కొలిచే వారి - రచన: మల్లాది - గానం: ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, రఘునాథ్ పాణిగ్రాహి
  4. యమునా తీరమునా సంధ్యా సమయమునా వేయికనులతో రాధా వేచియున్నది కాదా - రచన: ఆరుద్ర - గానం: ఘంటసాల, పి.సుశీల
  5. రసికరాజ తగువారముకామా అగడుసేయ తగవా ఏలుదొరవు అరమరకలు - రచన: మల్లాది - గానం: ఘంటసాల
  6. రాగమయీ రావే అనురాగమయీ రావే - రచన: మల్లాది - గానం: ఘంటసాల
  7. ఉన్నారా జోడున్నారా నన్నోడించేవారున్నారా - సుశీల, ఘంటసాల, మాధవపెద్ది బృందం
  8. నీవెంత నెరజాణవైరా సుకుమారా కళామోహనా సంగీతానంద - ఎం. ఎల్. వసంతకుమారి
  9. వల్లో పడాలిరా పెద్దచేప వేసి వేయంగానే - మాధవపెద్ది, సుశీల, ఘంటసాల బృందం . రచన: ఆరుద్ర.
  10. సంగీత సాహిత్యమే మేమే నవశృంగార లాలిత్యమే - ఘంటసాల, సుశీల . రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి.
  11. సరస్వతీ శుక్లాం భ్రహ్మవిచారసారాపరమాం (శ్లోకం) - మంగళంపల్లి
  12. ఇంద్రలోకము నుండి - రచన: ఆరుద్ర - గానం: పిఠాపురం
  13. దైవం నీవైనా...ధర్మము నీవేనా

విశేషాలు[మార్చు]

  • 1947లో వి. శాంతారం తీసిన మరాఠీ సినిమా "లోక్ షేర్ రామ్ జోషి", హిందీ సినిమా "మత్‌వాలా శాయర్ రామ్ జోషీ"లు ఈ సినిమాకు మూలాలు
  • రసికరాజ తగువారము కామా - పాటను ఘంటసాల పది రోజుల్లో 100సార్లు పైగా రిహార్సిల్ చేసుకొని పాడాడు.
  • ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తీయబడింది. తమిళం పేరు "కళైవణ్ణన్". తమిళ సినిమా విడుదల ఆలస్యమయింది. తెలుగు సినిమా అంతగా విజయవంతం కఅలేదు.

వనరులు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • తెలుగు సినిమా వెబ్ సైటు వ్యాసం - రచన: నచకి, అట్లూరి
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=జయభేరి&oldid=3958892" నుండి వెలికితీశారు