జయసుధ
| జయసుధ | |
జయసుధ ముఖచిత్రం |
|
| జన్మ నామం | సుజాత |
|---|---|
| జననం | డిసెంబర్ 17, 1959 మద్రాసు |
| ఇతర పేర్లు | జయసుధ |
| ప్రాముఖ్యత | తెలుగు సినిమా నటి. |
| పదవి | సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ |
| పదవి కాలము | 2009 నుండి |
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ |
| భార్య/భర్త | నితిన్ కపూర్ |
| సంతానం | ఇద్దరు కొడుకులు |
సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. ఈమె మద్రాసులో పుట్టి పెరిగినది కానీ మాతృభాష తెలుగు. ఈమె జన్మదినం డిసెంబర్ 17, 1959. ఈమె మేనత్త విజయనిర్మల. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన 'పండంటి కాపురం' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి.
జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు దాయాది అయిన నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.
2001లో జయసుధ బాప్తిస్మము పుచ్చుకొని క్రైస్తవ మతస్థురాలైనది. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును ప్రారంభించింది. 2009 లో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు ఎమ్.ఎల్.ఏ గా గెలిచారు.
జయసుధ నటించిన తెలుగు చిత్రాలు [మార్చు]
- పండంటి కాపురం
- ఎదురీత
- సెక్రెటరీ
- మాంగల్యానికి మరో ముడి
- అల్లుడొచ్చాడు
- ప్రేమలేఖలు
- గడుసు అమ్మాయి
- అడవి రాముడు
- సొమ్మొకడిది సోకొకడిది
- శివరంజని
- యుగంధర్
- శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం
- శివమెత్తిన సత్యం
- కటకటాల రుద్రయ్య
- ప్రాణం ఖరీదు
- కల్యాణి
- ఇంటింటి రామాయణం
- ఇది కధ కాదు
- శ్రీవారి ముచ్చట్లు
- గోపాల రావు గారి అమ్మాయి
- ప్రేమ తరంగాలు
- ప్రేమాభిషేకం
- ఇల్లాలు
- అగ్నిపూలు
- ఆడవాళ్లూ మీకు జోహార్లు
- నా దేశం
- రాముడు కాదు కృష్ణుడు
- మేఘసందేశం
- లంకెబిందెలు
- ఇద్దరు దొంగలు
- బొబ్బిలి బ్రహ్మన్న
- మాంగల్య బలం
- శక్తి
- యుద్ధం
- ఏడడుగుల బంధం
- తాండ్ర పాపారాయుడు
- ముద్దుల మనవరాలు
- మగధీరుడు
- ఆత్మ బంధువులు
- సర్దార్ ధర్మన్న
- ఒంటరి పోరాటం
- కాంచన సీత
- ఓ భార్య కధ
- కలికాలం
- కిరాయి దాదా
- మనీ
- మనీ మనీ
- అక్క పెత్తనం - చెల్లెలి కాపురం
- ఇన్స్పెక్టర్ ఝాన్సీ
- సరోవరం
- దొరగారికి దొంగ పెళ్లాం
- శ్రీనాధ కవి సార్వభౌమ
- బంగారు కుటుంబం
- రిక్షావోడు
- పట్టుకోండి చూద్దాం
- దెయ్యం
- యువకుడు
- కంటే కూతుర్నే కను
- చిన్నా
- ఇష్టం
- అమ్మాయే నవ్వితే
- ఫూల్స్
- అమ్మ, నాన్న, ఓ తమిళ అమ్మాయి
- హేండ్సప్
- బాలు
- స్టైల్
- బొమ్మరిల్లు
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
బయటి లింకులు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జయసుధ పేజీ