జల్లికట్టు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
జల్లికట్టు (Jallikattu) తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట .ఇది స్పెయిన్ లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే పోటీలు ప్రముఖమైనవి. దీన్నే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు. మంజు విరాట్టు అనగా ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం.
[మార్చు] చరిత్ర
కొన్ని తమిళ పురాణాల ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన వారిని తమ భర్తలుగా ఎంచుకునే వారని తెలుస్తుంది. [1][2] నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. [3]. ఇంకా మధురై కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. దీని వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా.[3]
ఇది ముఖ్యంగా ఈ క్రింది ప్రదేశాల్లో జరుగుతుంది.
- అనంగనల్లూరు
- పుదుకోట్టై
- సాలెం/తమ్మంపట్టి
- మదురై దగ్గర ఉన్న పాలమేడు
- కారైకుడి దగ్గర ఉన్న శ్రవయాల్
- శివగంగ దగ్గర ఉన్న కందుప్పట్టి
[మార్చు] బయటి లింకులు
- జల్లికట్టు చిత్ర మాలిక
- జల్లికట్టు, కొన్ని ఫోటోలు
- జల్లికట్టు గురించి ది హిందూ లో వచ్చిన శీర్షిక
- జల్లికట్టు వీడియోలు
[మార్చు] మూలాలు
- ↑ Google books version of the book A Western Journalist on India: The Ferengi's Columns by François Gautier. తీసుకొన్న తేదీ: 2008-07-09.
- ↑ NY Times: The ritual dates back as far as 2,000 years.... తీసుకొన్న తేదీ: 2008-07-09.
- ↑ 3.0 3.1 The Hindu : Bull chasing, an ancient Tamil tradition. The Hindu. తీసుకొన్న తేదీ: 2008-06-14.