జల్సా
| [[Image:|32x28px]] | తెలుగు సినిమా వేదిక |
| జల్సా (2008) | |
| దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
|---|---|
| నిర్మాణం | అల్లు అరవింద్ |
| కథ | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| చిత్రానువాదం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| తారాగణం | పవన్ కళ్యాణ్, ఇలియానా, కృష్ణుడు (నటుడు), ముకేష్ రిషి, కమలినీ ముఖర్జీ, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, సునీల్, ఆలీ, పార్వతీ మెల్టన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శివాజీ, మహేష్ బాబు (నేపధ్య కధనం) |
| సంగీతం | దేవీశ్రీ ప్రసాద్ |
| సంభాషణలు | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
| ఛాయాగ్రహణం | కె.వి.గుహన్, రసూల్ ఎల్లోర్ |
| కూర్పు | ఎ.శ్రీకర్ ప్రసాద్ |
| నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
కథ [మార్చు]
చదువులో ఎంతో చురుకు గా ఉండే సంజయ్ సాహు (పవన్ కళ్యాణ్), తన క్లాస్ మేట్ ఇందు (కమలినీ ముఖర్జీ)ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. పోలీసు అధికారి అయిన ఇందు తండ్రి (ప్రకాష్ రాజ్) ఇందుని ఒక ధనిక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కొంతకాలం తర్వాత స్నేహితురాళ్ళైన జ్యోత్స్న (పార్వతి మెల్టన్), భాగమతి (ఇలియానా) లు ఇద్దరూ సంజయ్ ని ప్రేమిస్తారు. ఎంతో తెలివైన జో అంటే సంజయ్ ఇష్టపడక పోగా అమాయకురాలైన భాగీ సంజయ్ మెప్పును పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఒక ప్రక్క దామోదర రెడ్డి (ముఖేష్ ఋషి) అనే భయంకర ఫ్యాక్షనిస్టు సంజయ్ కొరకు మనుషులతో వెదికిస్తూ ఉంటాడు. సంజయ్ స్నేహితుడు (ఆలి) ని ఎరగా వేసి అతనిని బంధించాలి అని పథకం వేస్తాడు దామోదర రెడ్డి. ఆ నేపథ్యంలో తన స్నేహితులకు సంజయ్ ఒక మాజీ నక్సలైట్ అని తెలుపుతాడు. తన చిన్న నాటే గుండె జబ్బుతో సోదరుని కోల్పోయిన సంజయ్, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులని కూడా కోల్పోవటంతో నక్సలైట్ల లో కలుస్తాడు. నక్సలిజం సమస్యలకి పరిష్కారం కాదు అని తెలుసుకున్న సంజయ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయి విద్యాభ్యాసం సాగిస్తూ ఉంటాడు.
భాగమతి ఇందు చెల్లెలే అని సంజయ్ కి తెలుస్తుంది. భాగమతిని తన కుమారుడు (శివాజి) ని వివాహమాడేలా ఎత్తుగడ వేస్తాడు దామోదర రెడ్డి. తన రెండవ కుమారుడి హత్యకి కారణం అయినందువల్లనే దామోదర రెడ్డి తన కోసం వెదికిస్తున్నాడని తెలుసుకున్న సంజయ్ అతడిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్రం ముగింపు.
సంభాషణలు [మార్చు]
- బెదిరింపుకి భాష అక్కర లేదు
- సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
- ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
- వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
- పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పని చేసింది.
- నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
- నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
- యుద్ధంలొ గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.
విశేషాలు [మార్చు]
- మహేష్ బాబు వ్యాఖ్యానం ఈ చిత్రానికి విశేషం.అలా చేయించిన పవన్ ఆలోచన, దానికి మహేశ్ ఒప్పుకోలూ, రెండూ అభినందనీయం.
- యుద్ధం లో గెలవటం అంటే శత్రువుని చంపటం కాదు, శత్రువుని ఓడించటం అన్న డైలాగు, మార్షల్ ఆర్ట్స్ ద్వారా పవన్ కళ్యాణ్ కి అలవడిన అహింసా గుణానికి నిదర్శనం.
- ఇలియానాకి డబ్బింగ్ కలర్స్ స్వాతి చెప్పింది.