జవహర్ నవోదయ విద్యాలయం, పాలేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జవహర్ నవోదయ విద్యాలయం సిల్వర్ జూబ్లీ ఉత్సవాల లోగో

జవహర్ నవోదయ విద్యాలయం, పాలేరు ఖమ్మం జిల్లాలో వెనుకబడిన తరగతుల వారికి ఉన్నత విద్య అందించటం కోసం భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న జవహర్ నవోదయ విద్యాలయం.దీనిని పాలేరులో 1987 సంవత్సరంలో స్థాపించారు .

ప్రవేశ విధానం[మార్చు]

ప్రతి సంవత్సరం 6వ తరగతికి 80 మంది విద్యార్థులను తీసుకుంటారు.ప్రతి సంవత్సరం సుమారు 6000 దరఖాస్తులు వస్తాయి, ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక విధానం కొనసాగుతుంది.

విద్య[మార్చు]

  1. 6వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ఉచిత ఉద్యతో పాటుగా, ఉచిత వసతి కూడా ఉంది.
  2. 6వ తరగతి నుంచి 7 వతరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలలో బోధన ఉంటుంది.
  3. 8వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు సి.బి.యస్.ఈ సిలబస్ ఉంటుంది.

వసతి[మార్చు]

  1. ఇక్కడ వసతి పూర్తిగా ఉచితం.
  2. అబ్బాయి లకు ఆమ్మాయిలకు విడివిడి వసతి ఉంది.
  3. విడి విడి బొజనం చేసే సదుపాయం ఉంది.
  4. 6నుంచి 8వరకు విద్యార్థులు ఒకదగ్గర, 9నుంచి 12 వతరగతి వరకు ఒక గుంపుగా హాస్టల్ లో ఉంటారు.
  5. నెల నెల ఉచితంగా సబ్బులు,పేస్టు, కొబ్బరినూనె ఇస్తారు.
  6. ప్రతి సంవస్తరం స్కూల్ యూనిఫాం ఇస్తారు.

పూర్వ విద్యార్ధులు[మార్చు]

ప్రతి సంవత్సరం డిశంబరు నెల మొదటి ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల రోజుగా జరుపబడుతుంది, ఈ రోజున పూర్వ విద్యార్థులు వచ్చి వారి అనుభవాలు,సలహాలు ప్రస్తుత విద్యార్థులకు ఇస్తారు మరియూ తొటివారిని కలుసుకొవడానికి కుడా ఉపయొగకరంగా ఉంటుంది.

చిత్తు నొటు[మార్చు]

ఖమ్మం జిల్లాలో ఉన్న మొదటి నవొదయ విద్యాలయం, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో రెండు నవొదయవిద్యాలయాలున్నాయి . ఇది భారత ప్రభుత్వం చే హ్యూమన్ రిసొర్స్ వారు ఏర్పాటు చేశారు . పాలేరులో సుమారు 50 ఎకరాలలో నిర్మించబడింది. ఈ విద్యాలయంలో 6 వ తరగతి నుంచి, +2 వరకు ఉచిత విద్యని బొదిస్తున్నారు. 6 వ తరగతిలో ప్రారంభమైయ్యే ప్రవేశ నియామకాలలో 80 మంది విద్యార్థులను తీసుకుంటారు ఇది రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది . విద్య బొధన 7వ తరగతివరకు తెలుగు, ఆంగ్ల మాంద్యలో ఉంటుంది, 8వ తరగతి నుంచి ఆంగ్ల మాంద్యం తప్పనిసరి, సి.బి.యస్.యిలో ఉంటుంది. అమ్మాయి లకు అబ్బాయి లకు వేరు వేరుగా వసతి సొకర్యం ఉంది .

బయటి లింకులు[మార్చు]

  1. అధికారిక వెబ్ సైట్.
  2. ఖమ్మం జెన్వీ బ్లాగు.

సంప్రదించుటకు[మార్చు]

ప్రిన్సిపాల్: 08742-273025