జవ్వాది లక్ష్మయ్యనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జవ్వాది లక్ష్మయ్యనాయుడు (నవంబర్ 16, 1901 - జూన్ 27, 1978) సహజ సౌజన్య సంపత్తి.. ఉదారత.. వితరణ.. కళారాధనతోపాటు సహకార రంగానికి చేసిన సేవలతో ఆంధ్ర లోకమంతా జవ్వాజి వలె గుభాళించారు.

జననం[మార్చు]

వీరు పెనుగొండలో 1901నవంబర్ 16 న వెంక య్య, సుబ్బమాంబ దంపతులకు ద్వితీయ కుమారునిగా జన్మించారు. పెనుగొండ (ప.గో)పెనుగొండలో ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో తండ్రి వెంకయ్య నూలి వెంకటరత్నం, మాణిక్యం సహకారంతో తెన్నేటి వెంకటదీక్షితులు ప్రధానాధ్యాపకులుగా మాధ్యమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. అనంతరం నరసాపురం, తణుకులో ఆంగ్ల పాఠశాలలో స్కూల్ ఫైనల్ వరకు చదివారు. 17 ఏళ్లకే మేనమామ గంధం వీరాస్వామి కుమార్తె ఆదిలక్ష్మీదేవితో లక్ష్మయ్య నాయుడు పెళ్ళి జరిగింది. పాతికేళ్లు నిండకముందే పెనుగొండ సర్పంచ్‌గా ఎన్నికై మూడు దశాబ్దాలు కొనసాగారు. ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టి జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దారు.

భార్యపై గల గాఢానురాగాలకు తార్కాణంగా తణుకులో మహిళల కోసం ఆదిలక్ష్మి సాహిత్య భవనాన్ని ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. ఆకలిబాధ తట్టుకోలేక కొందరు పెనుగొండలోని షాపులను దోచుకుంటున్నారు. ఆ పరిస్థితుల్లో లక్ష్మయ్యనాయుడు అల్లరి మూకలను ఎదుర్కొన్నారు. వారు దోచిన సామగ్రిని తిరిగి యజమానులకు ఇప్పించి, ఆకలి బాధతో ఉన్న వారికి ఆహార ధాన్యాలు పంచిపెట్టారు. లక్ష్మయ్యనాయుడు ఓగిడి, కొయ్యేటిపాడు ఎస్టేట్లను కొనుగోలు చేసి జమిందారుగా భాసిల్లారు. పెనుగొండలో నిర్మించిన శ్రీనివాస మహాసౌధం, మినర్వా థియేటర్, రైసు మిల్లు, గిడ్డంగి, సత్రం వీరి ఆర్థిక సౌష్టవానికి అద్దం పడతాయి. రామాలయం నిర్మించి ఆలయ పోషణార్ధం ఐదెకరాల భూమిని, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఎకరం పొలాన్ని మాన్యంగా రాశారు.500 ఎకరాల వ్యవసాయ భూమి కల జమిందార్ కుటుంబం.తణుకులో ఆంధ్రా షుగర్స్ స్థాపనకు రూ.5,000 తో షేర్లు కొనుగోలు చేసి వ్యవస్థాపక డైరెక్టర్ గా పని చేసారు.

సాహిత్య పోషణ[మార్చు]

లక్ష్మయ్యనాయుడు గృహం శారదా పీఠం. తన అధ్యక్షతన పరకాల సూర్యనారాయణ కార్యదర్శిగా పెనుగొండలో సాహితీ పరిషత్‌ను స్థాపించారు. సాహితీ దురంధరులను ఘనంగా సన్మానించారు. వీరు ప్రప్రథమంగా స్వీకరించిన కృతి కవిశేఖర కాళహస్తి నరసింహరావు రచించిన భగవద్గీతానువాదం. ఈ కృతి స్వీకరణోత్సవానికి ఆంధ్రదేశం నలుమూలల నుంచి కవి పండితులు వచ్చారు.

ఆ సభకు శ్రీపాద కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థాన కవి చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి మలి ఆస్థాన కవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరశింహం మొదలైన పండితులు లక్ష్మయ్యనాయుడి సాహిత్యాభిమానం తెలిసినవారే. 1940లో పెనుగొండలో జరిగిన అఖిలాంధ్ర ఉపాధ్యాయ పరిషత్తు లక్ష్మయ్య నాయుడును "వాజ్మయోద్ధారక" బిరుదుతో సత్కరించింది. ఇంకా కవి కులాలంకార, సామ్రాజ్య సామ్రాట్ బిరుదులు ఆయన కీర్తి కిరీటంలో చేరాయి. 1954లో పశ్చిమ గోదావరి జిల్లా లోకల్ లైబ్రరీ అథారిటీకి ఛైర్మన్‌గా 15 ఏళ్లు పనిచేసి, గ్రంథాలయోద్యమాన్ని వ్యాప్తి చేశారు. లక్ష్మయ్యనాయుడు సంపాదకుడుగా విశ్వామిత్ర పత్రిక స్థాపించి రెండేళ్లు నిర్వహించారు.తెలుగు సాహిత్యంలో ఎనలేని సేవలు అందించారు.ప్రతీ ఏడాది తన జన్మదినం రోజున ఆంధ్రదేశంలో ప్రసిద్ధి గాంచిన కవులను పెనుగొండ రప్పించి వారికి ఘనంగా కానుకలు అందించారు.

సహకార రంగానికి సేవ[మార్చు]

లక్ష్మయ్యనాయుడు 1927లో పెనుగొండ లో తన అధ్యక్షతన ప్రథమంగా వ్యవసాయ సహకార సంఘాన్ని స్థాపించారు. 1931లో పెనుగొండలో మండల సహకార సంఘాల సమావే శాన్ని ఏర్పాటు చేసి, సహకార సంఘాల ప్రయోజనాల్ని రైతులకు చెప్పారు. 1930లో పెనుగొండలో సహకార భూమి తనఖా బ్యాంకును స్థాపించి, రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణ సదుపాయాలు కల్పించారు. 1935లో పెనుగొండలో సహకార మార్కెటింగ్ సంఘాన్ని స్థాపించారు. రైతుల కోసం ధాన్యం గిడ్డంగులను నిర్మించారు. 1936లో పెనుగొండ సహకార గృహ నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసి, అల్పాదాయ వర్గాలకు గృహ నిర్మాణాలు చేసుకునే అవకాశం కల్పించారు. 1938లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డెరైక్టర్‌గా ఎన్నికయ్యారు. 1953 ఆగస్టు నుంచి 1969 ఆగస్టు వరకు జిల్లా కేంద్ర సహకార సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. నాయకత్వ పటిమతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆర్థిక పరిపుష్టికి పాటుపడ్డారు. వందలాది మంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులను ఉద్యోగాల్లో నియమించి ఉపాధి కల్పించారు. 1960 మార్చి 13న ఆంధ్ర రాష్ట్ర సహకార సభలు లక్ష్మయ్యనాయు డు ఆధ్వర్యంలో ఏలూరుసహకార కేంద్ర బ్యాంకు ప్రాంగణంలో నిర్వహించారు.నేటికీ ఆయన కాంశ్య విగ్రహం ఏలూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లో ఉంది.

పెనుగొండ జమిందార్ గా ప్రసిద్ధి.అభినవ భోజ బిరుదాంకితుడు.పశ్చిమ గోదావరి జిల్లాల్లో సహకార ఉద్యమాన్ని నడిపించారు. పెనుగొండలో 1961 నవంబర్ 18న లక్ష్మయ్యనాయుడు షష్టి పూర్తి వైభవంగా జరిగింది.మహాకవి గుర్రం జాషువా కవీంద్రులు లక్ష్మయ్య నాయుడు ను "పెనుగొండ ప్రభువు" అని కీర్తించారు. గుదిమెళ్ల రామానుజాచార్యులు నాయుడును "పెనుగొండ గండశిల కాదు, జవ్వాది కొండ" అని స్తుతించారు. లక్ష్మయ్యనాయుడు పెనుగొండ నియోజక వర్గం నుంచి 1955, 1967లలో శాశన సభ్యులు గా రెండు సార్లు ఎన్నికయ్యారు.తనప్రత్యర్థుల ప్రశంసలను సైతం పొందగలిగిన లక్ష్మయ్యనాయుడు 1978 జూన్ 27 న తన 78వ ఏట పరమపదించాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ నుండి ఎన్నికైన శాసన సభ్యులు "కవికులాలంకార"జవ్వాది లక్ష్మయ్య నాయుడు (1901-1978) తణుకుతాలూకా పెనుగొండలో జమిందారీ కుటుంబంలో1901 నవంబరు 16న జననం. సుబ్బమాంబ,వెంకయ్యలు తల్లిదండ్రులు. తణుకులో ఉన్నత విద్యను చేసారు. జాతీయవాది. పెనుగొండ గ్రామపంచాయితీకి దశాబ్దాల పైన అధ్యక్షుడు. తణుకు తాలూకాబోరు సభ్యులుగానూ కొంతకాలమున్నారు. పెనుగొండ శాసనసభకు నియోజకవర్గానికి మూడుసారు ప్రాతినిధ్యం వహించారు. 1953లో ఏలూరు సహకారకేంద్రబ్యాంకు అధ్యక్షులుగా ఎన్నికై, 17 సంవత్ల ఆ పదవిలో కొనసాగారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్గా 15 సంuలు పనిచేసారు. సాహిత్యప్రియలుగా, దానశీలిగా ప్రసిద్దులు. తణుకు తాలూకాలో ముళ్ళపూడి వంశీయులకు దీటైనవారిగా జవ్వాది వారినే చెప్పాలి. "కవికులాలంకార, "వాజ్మయోద్దారక వీరి బిరుదులు. 16-02-58న తణుకు నన్నయపీఠం జరిపిన శివరాత్రి సాహిత్య సమారాధన మహోత్సవ కార్యక్రమంలో వీరధ్యక్షత వహించారు. భాషా, సాహిత్య వాజ్మయోద్దారణలో వీరు తణుకు జమిందార్ ముళ్ళపూడి తిమ్మరాజు సమకాలికుడు.ఆంధ్రా సుగర్స్ వ్యవస్థాపక డైరెక్టర్.

తణుకులో స్త్రీజనాభ్యుదయానికై వీరు గృహదానంచేసి, వసతులను కల్పించి, ధనసహాయం చేసారు. తణుకు తాలూకా ప్రాంతం గర్వించదగ్గ ఈ మహోన్నత వ్యక్తిత్వం జనవరి  27న, 1978 సంవత్సరంలో పరమపదించారు.