జాకీర్ హుస్సేన్
| జాకీర్ హుసేన్ | |
| జాకీర్ హుస్సేన్ |
|
|
3వ రాష్ట్రపతి
|
|
| పదవీ కాలము 13 మే 1967 – 3 మే 1969 |
|
| ముందు | సర్వేపల్లి రాధాకృష్ణన్ |
|---|---|
| తరువాత | వి.వి.గిరి |
|
భారత ఉప రాష్ట్రపతి
|
|
| పదవీ కాలము 1962 – 1967 |
|
|
బీహార్ గవర్నరు
|
|
| పదవీ కాలము 1957 – 1962 |
|
|
|
|
| జననం | 8 ఫిబ్రవరి 1897 హైదరాబాదు |
| మరణం | 3 మే 1969 |
జాకిర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969) (ఉర్దూ: زاکِر حسین), భారత 3వ రాష్ట్రపతి మే 13 1967 నుండి మరణించినంతవరకు మే 3, 1969.
హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు, ఇతడు ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ నుండి హైదరాబాదుకు వలసొచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా హైస్కూల్' నందు చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజి లో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘనాయకుడిగా గుర్తింపబడ్డాడు.
హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి దాన్ని జామియా మిలియా ఇస్లామియా అనేపేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేయుటకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయం' లో జర్మనీ వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగొచ్చి, జామియా మిలియా ఇస్లామియాను మార్గదర్శకుడిగా మారాడు. బ్రిటిష్ వారితో సంగ్రామిస్తూ, మహాత్మా గాంధీ తో చేతులుకలిపి "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమదార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నాహ్ చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగతాన్నంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు. భారతస్వాతంత్ర్యంతరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సిలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యమొచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో వుంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సిలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.
బీహార్ గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకూ భారత ఉపాధ్యక్షుడి పదవి అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతం నాఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు.
ఇతడికి 1963 లో భారతరత్న బిరుదుతో గౌరవించారు. ఇతను రాష్టపతి పదవీకాలంలో మరణించిన ప్రథమ రాష్ట్రపతి, (మే 3, 1969)
| ఇంతకు ముందు ఉన్నవారు: సర్వేపల్లి రాధాకృష్ణన్ |
భారత రాష్ట్రపతి 1967 మే 13 — 1969 మే 3 |
తరువాత వచ్చినవారు: వరాహగిరి వేంకటగిరి |
|
|
|
|---|---|
|
డా.రాజేంద్ర ప్రసాద్ · డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ · డా.జాకీర్ హుస్సేన్ · వి.వి.గిరి · ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ · నీలం సంజీవరెడ్డి · జ్ఞాని జైల్ సింగ్ · ఆర్.వెంకటరామన్ · శంకర దయాళ్ శర్మ · కె.ఆర్.నారాయణన్ · డా. ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ · ప్రతిభా పాటిల్ |