జాగాబత్తిన నవనాధరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాగాబత్తిన నవనాథరావు(1941-2012) ప్రముఖ రంగస్థల నటుడు, నిర్మాత, దర్శకుడు.

ఆయన రంగస్థలానికి ఆయన విశిష్టసేవలు అందించారు. జిల్లాలో పౌరాణిక నాటకాలు ఎక్కువవుతున్న సమయంలో సాంఘిక నాటకాలను కాపాడేందుకు సిద్ధార్థ ఆర్ట్స్ సంస్థను ప్రారంభించి అనేక నాటకాలు ప్రదర్శించారు. దాదాపు 500 నాటక ప్రదర్శనలు చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నంది నాటకోత్సవాల్లో నాటక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు పొందారు వేరు నటులే కాకుండా దర్శకులు కూడా. అలాగే ౨౦ నాటిక, నాటకాలను కూడా రచించారు. వారు పలు పోటీల్లో కూడా ప్రదర్శించారు. సింహపురి కీర్తిప్రతిష్టలను నలుదిశలా వ్యాప్తి చేసిన వారిలో నవనాధరావు ఒకరు.. ప్రముఖ నటులు జి. చంద్ర శేఖర్ గారితో కలసి వీరు జెడ్. జి. ఆర్ట్స్ పేరుతో నాటక సంస్థను ప్రారంభించి పలు నాటకాలు ప్రదర్శించారు. పలు నాటకాలకు దర్శక నిర్మాతగా వ్యవహరించారు. వీరు ఒక ఏడాది ‘కళ’ సాంస్క్రతిక సంస్థకు అధ్యక్షులుగా వున్నారు. కళా పరిషత్ నిర్వహించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారు వున్నారు. ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు జెడ్. శివప్రసాద్, డా. శశికాంత్, మెడికల్ సాంకేతిక నిపుణుడు శైలేష్ ఈయన కుమారులే. వీరు నెల్లూరులో మార్చి7 2012 తేదీన కన్నుమూశారు. రెండు నెలలు నవనాధారావు అనారోగ్యంతో బాధపడుతూ నారాయణ ఆసుపత్రిలో చేర్చగా అక్కడే తుదిశ్వాస విడిచారు.