జాజ్ నృత్యం
|
ఈ వ్యాసం ఏ మూలాలను ఆధారంగా చేసుకొని వ్రాయబడిందో తెలపలేదు. (April 2007) |
విస్తృతమైన నృత్య శైలులలో జాజ్ నృత్యం అనేది ఒక రకమైన నృత్య శైలి. 1950లకు ముందు జాజ్ నృత్యం ఆఫ్రికా మరియు అమెరికా శాస్త్రీయ నృత్యాల నుండి వచ్చిన ఒక నృత్య శైలిగా చెప్తారు. 1950లలో కరేబియన్ సాంప్రదాయ నృత్య మూలాల నుండి జాజ్ నృత్యంలో ఒక నూతన శైలి—ఆధునిక జాజ్ నృత్యం —ఉద్భవించింది. జాజ్ నృత్యంలో ప్రతి ఒక్క భంగిమలో ఈ రెండు విభిన్న మూలాల శైలిని పోల్చుకోవచ్చు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
[మార్చు] సాంప్రదాయ
1950ల మధ్య వరకు అనగా 19వ శతాబ్దం చివరి నుండి 20 శతాబ్దం మధ్య వరకు జాజ్ నృత్యంను ఆఫ్రికా అమెరికా శాస్త్రీయ నృత్యం నుండి వచ్చిన నృత్య శైలిగా చెప్పుకునేవారు. జాజ్ నృత్యంను ట్యాప్ నృత్యంగా కూడా చెప్తారు ఎందుకనగా ట్యాప్ నృత్యం జాజ్ సంగీతంకు అనుగుణంగా చేస్తారు, ఆ శకంలో అది ఒక ప్రధానమైన నృత్యం. జాజ్ నృత్యం ఆ కాలంలో ఒక విభిన్న రీతుల సాంఘిక మరియు వేదికల మీద ప్రదర్శించే నృత్యం శైలులకు ప్రచారమును కలిగించింది. జాజ్ శకం తరువాత కాలంలో ప్రముఖ జాజ్ నృత్య రీతులు కేక్ వాక్, బ్లాక్ బాటం, చార్లీస్టన్, జిట్టర్ బగ్, బూగీ వూగీ, స్వింగ్ మరియు ఇదే నృత్య శైలిని పోలి వుండే లింది హాప్ వంటి నృత్య రీతులను కలిగి ఉండేవి. ఈనాడు, ఈ నృత్యానికి సంబంధించిన అనేక నృత్య శైలులు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతున్నాయి మరియు ఇప్పటికీ వాటికి శిక్షణ మరియు అభ్యసన జరుగుతూ ఉంది.
[మార్చు] ఆధునిక కాలం
1950ల తరువాత క్యాథరీన్ దన్హం వంటి సృజనాత్మకత కలిగిన వారు కరేబియన్ సాంప్రదాయ నృత్యం యొక్క సారాన్ని తీసుకుని ఒక ప్రదర్శిత కళగా రూపొందిస్తున్నారు. ఇతర ఉల్లాస సంగీత రూపాలకు పెరుగుతున్న ఆదరణ వలన, మరియు ట్యాప్ నృత్యం దాని యొక్క ప్రత్యేక పంధాను రూపుదిద్దుకోవటం వలన ఈ రోజు బ్రాడ్ వే మందిరంలో జాజ్ నృత్యం ఒక నూతన మరియు సున్నితంగా ఉండే ఆధునిక జాజ్ అని పిలిచే ఒక శైలిని నేర్పుతుంది. జాజ్ నృత్య ప్రదర్శిత శైలి బాబ్ ఫోస్సే యొక్క కృషి వలన విస్తృతంగా ప్రజాదరణ పొందింది. దీనికి నిదర్శనం చికాగో, కాబరేట్, డామన్ యంకీస్, మరియు ది పజమా గేమ్ వంటి బ్రాడ్ వే ప్రదర్శనలు. ఆధునిక జాజ్ నృత్యం సంగీత మందిరంల యొక్క ఒక ముఖ్యమైన కారకం అయినది, మరియు దీనిని తరచుగా సంగీత వీడియోలలో మరియు నృత్య పోటీలలో వీక్షించవచ్చు.
[మార్చు] ఆధునిక జాజ్ నృత్యం
జాజ్ నృత్యకారులు ఎక్కువగా తోలు జాజ్ బూట్లు తొడుగుకుంటారు, ఎందుకనగా ఇవి మలుపులు తిరుగునప్పుడు మొత్తగా కదులటకు సహాయపడతాయి.(ఉదాహరణ పిరౌట్టె(సుడిగుండం వలె గిర్రున తిరిగే ఒక విధమైన నృత్య భంగిమ)).[citation needed]
నృత్యం చేయుటకు ముందు నృత్యకారులు గాయాలు అవకుండా నిరోధించుటకు కండరాలను వదులు చేసుకొను వ్యాయామాలు చేస్తారు. అదనంగా, సరైన స్థితిలో ఉండటానికి పరిపుష్ట వ్యాయామాలు చేస్తారు.
[మార్చు] విధానం
ఆధునిక జాజ్ నృత్యం తరచుగా ఆక్రో, బాల్లేట్, కాన్టెంపరరి, లిరికల్, మరియు హిప్-హోప్ వంటి ఇతర నృత్య శైలుల వలన ప్రభావితం అవుతుంటుంది. అలాగే, అనేక ఇతర నృత్య శైలులు కూడా జాజ్ నృత్యం చేత ప్రభావితం అవుతుంటాయి.
అనేక ఇతర నృత్య రూపాల వలె, చేసే విధానం అనేది అన్ని ఆధునిక జాజ్ నృత్య భంగిమలకి పునాది. మరీ ముఖ్యంగా, జాజ్ నృత్యకారులు నృత్యరూపకాల విధానం గురించి గొప్ప పరిజ్ఞానాన్ని పొందే అవకాశం పొందుతారు, జాజ్ నృత్యాంశాలు నృత్య రూపకాల శిక్షణను కలిగి ఉంటాయి.
ఆధునిక జాజ్ నృత్యం అనేక విధానాలతో నిండి వుంటుంది, అవి ఏవనగా:
- కేంద్ర నియంత్రణ
- భంగిమలు మొదలయ్యే స్థానంను కేంద్రక నియంత్రణగా పరిగణలోకి తీసుకుంటారు, ఇది భంగిమలు చేసే సమయంలో పడిపోకుండా నియంత్రించుకొనుటకు సాధ్యపడుతుంది లేదంటే అది నృత్యకారుడు పడిపోకుండా నియంత్రించుకొనుటను సాధ్యపడదు.
- స్పాటింగ్
- పిరౌట్టెలు(సుడిగుండం వలె గిర్రున తిరుగుట) మరియు ఫౌట్టీ(సుడిగుండం వలె గిర్రున దిశలు మార్చుతూ తిరుగుట) వంటి భంగిమలలో ఇది నృత్యకారుడికి పడిపోకుండా మరియు అదే పనిగా భ్రమణం చేయునప్పుడు కళ్ళు బైర్లు కమ్ముటను తగ్గిస్తుంది.
- స్థాన సూచన
- స్థాన సూచన చేయునప్పుడు నృత్యకారులు వారి కాలి గిలకలను వారి బ్రొటన వ్రేళ్ళ దిశగా చాచుతారు, అందువల్ల వారి పాదాలు మరియు కాళ్ళు ఒకే రేఖలో అలంకారంగా ఉండి ఒక మనోహరమైన పద్ధతిలో కనిపిస్తారు.
[మార్చు] ప్రముఖ దర్శకులు, నృత్యకారులు, నృత్యదర్శకులు
- క్యాథరీన్ దన్హం, బ్లాక్ థియేటరికల్ నృత్యంలో మంచి సృజనాత్మకత కలిగినవారు.
- జాక్ కాలే, జాజ్ నృత్య విధాన పితామాహుడిగా పరిగణిస్తారు.[citation needed] ఈయన మాట మటోక్స్, బాబ్ ఫోస్సే, జేరోమే రాబిన్స్, గ్వెన్ వెర్దన్, మరియు అనేక నృత్య దర్శకులకు ఒక కీలకమైన ప్రేరణ.
- యూగేనే లూయిస్ ఫసియోటో (అకా "ల్యుగి"), ఒక పరిపూర్ణమైన నృత్యకారుడు. 1950లలో ఒక ఆటోమొబైల్ ప్రమాదం వలన అవిటి వారయ్యారు. ఈయన తన శారీరక అవిటితనాన్ని అధిగమించి విరామ స్థితి నుండి శరీరం వెచ్చదనం పొందుటకు చేసే వ్యాయామాల ఆధారంగా ఒక నూతన జాజ్ నృత్య శైలిని కనుగొన్నారు.
- బాబ్ ఫోస్సే, ఒక ప్రముఖ జాజ్ నృత్య దర్శకుడు, ఈయన ఫ్రెడ్ ఆస్టైర్ మరియు బుర్లేస్క్ మరియు వుడేవిల్లె శైలుల ప్రేరణతో ఒక నూతన జాజ్ నృత్య రీతిని రూపొందించారు.
- గస్ జియోర్దనో, ఒక ప్రభావిత జాజ్ నృత్యకారుడు మరియు నృత్య దర్శకుడు.
- జేరోమి రాబిన్స్, పీటర్ పాన్ , ది కింగ్ అండ్ ఐ , ఫిడ్డ్లేర్ ఆన్ ది రూఫ్ , జిప్సీ , ఫన్ని గర్ల్ , మరియు వెస్ట్ సైడ్ స్టొరీ వంటి అనేక విజయవంతమైన సంగీత రూపకాలకు నృత్య కళాకారుడు.
- గ్వెన్ వెర్దన్, డామన్ యంకీస్ , చికాగో , మరియు స్వీట్ చారిటి వంటి వాటిలో ఆమె పాత్రలతో చిరపరిచితురాలు.
[మార్చు] గ్రంథ పట్టిక
[1] ఎలియనే సెగిన్, "హిస్టిరీ దే ల డాన్స్ జాజ్", 2003, ప్రచురణలు CHIRON, ISBN 2-7027-0782-3, 281 pp
[2] జెన్నిఫర్ డన్నింగ్, "ఆల్విన్ ఐలీ: ఎ లైఫ్ ఇన్ డాన్స్", డా కాపో ప్రెస్, 1998 - 468 pp
[3] ఎ. పీటర్ బైలీ, "వెలువరింపులు: ది ఆటోబయాగ్రఫీ ఆఫ్ ఆల్విన్ ఐలీ", క్యారోల్ ప్రచురణల సమూహం, 1995 - 183 pp
[4] మర్గోట్ ఎల్. టొర్బెర్ట్, "టీచింగ్ డాన్సు జాజ్", మర్గోట్ టోర్బెర్ట్, 2000, ISBN 0976407108, 9780976407102
[5] రాబర్ట్ కహన్, "ది డాన్స్ వర్క్ షాప్", గియా బుక్స్ లిమిటెడ్, 1989, ISBN 0-04-790010-5
- మూలాలు లేని వ్యాసాలు -April 2007 నుండి
- మూలాలు లేని వ్యాసాలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from October 2009
- Articles with invalid date parameter in template
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Articles with unsourced statements from April 2010
- సమకాలీన నృత్యం
- నృత్యాలు
- జాజ్ సాంప్రదాయం
- సంగీత మందిరం