జాతీయములు
| భాషా సింగారం |
|---|
| సామెతలు |
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ ఏ ఒ ఓ అం అః |
| క ఖ గ ఘ |
| చ ఛ జ ఝ |
| ట ఠ డ ఢ ణ |
| త థ ద ధ న |
| ప ఫ బ భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
| జాతీయములు |
| అ ఆ ఇ ఈ ఉ ఊ |
| ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ |
| క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ |
| ట, ఠ డ, ఢ ణ |
| త, థ ద, ధ న |
| ప, ఫ బ, భ మ |
| య ర ల వ |
| శ ష స హ |
| ళ క్ష ఱ |
| పొడుపు కధలు
|
| ఆశ్చర్యార్థకాలు |
| నీతివాక్యాలు |
| --- అ, ఇ, |
| --- ఉ, ఎ, ఒ |
| --- ఉ, ఎ, ఒ |
| --- క, గ, చ, జ |
| --- ట, డ, త, ద, న |
| --- ప, బ, మ |
| --- "య" నుండి "క్ష" |
| పొడుపు కథలు |
| "అ" నుండి "క్ష" వరకు |
"జాతీయములు" లేదా జాతీయాలు ఒక జాతి ప్రజల సంభాషణలో స్థిరపడిపోయిన కొన్ని నానుడులు. ఇవి అనగానే అర్ధమైపోయే మాటలు. మనిషి జీవితంలో కంటికి కనిపించేది, అనుభవంలోకి వచ్చేది, అనుభూతిని కలిగించేది ఇలా ప్రతి దాని నుంచి జాతీయాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. వేటూరి ప్రభాకర శాస్త్రి, నేదునూరి గంగాధరం, బూదరాజు రాధాకృష్ణ వంటి సంకలనకర్తలు అనేక జాతీయాలను అర్ధ వివరణలతో సేకరించి ప్రచురించారు.
ఆంగ్ల భాషలో "జాతీయము" అన్న పదానికి idiom అనే పదాన్ని వాడుతారు. జాతీయం అనేది జాతి వాడుకలో రూపు దిద్దుకొన్న భాషా విశేషం. ఒక జాతీయంలో ఉన్న పదాల అర్ధాన్ని ఉన్నదున్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్ధం వేరు, ఆ పదాల పొందికతోనే వచ్చే జాతీయానికి ఉండే అర్ధం వేరు. ఉదాహరణకు "చేతికి ఎముక లేదు" అన్న జాతీయంలో ఉన్న పదాలకు విఘంటుపరంగా ఉండే అర్ధం "ఎముక లేని చేయి. అనగా కేవలం కండరాలు మాత్రమే ఉండాలి" కాని ఈ జాతీయానికి అర్ధం "ధారాళంగా దానమిచ్చే మనిషి" అని.
జాన్ సయీద్ అనే భాషావేత్త చెప్పిన అర్ధం - idiom as words collocated together happen to become fossilized, becoming fixed over time.[1]. అనగా తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా ఘనీభవించింది. కనుక భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు సంస్కృతికి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
(అకారాది క్రమంలో వివిధ జాతీయాలు ఇవ్వబడ్డాయి. ప్రక్కనున్న లింకుల ద్వారా ఆయా వ్యాసాలకు వెళ్ళవచ్చును)
విషయ సూచిక |
ఇవి కూడా చూడండి [మార్చు]
పుస్తకాలు [మార్చు]
- "తెలుగు జాతీయాలు" : బూదరాజు రాధాకృష్ణ, ప్రగతి పబ్లిషర్స్, 1999.
- జాతీయ సంపద - తెలుగు నేర్చుకునేవారికి సామెతలు, జాతీయాలు, భవిష్యనిధి వివరణలతో, ఆరి శివరామకృష్ణయ్య, 2008.
- తెలుగు జాతీయములు ప్రథమ భాగం-మధురకవి:నాళముకృష్ణ రావు
మూలాలు [మార్చు]
- ↑ Saeed, John I. (2003), Semantics. 2nd edition. Oxford: Blackwell. Page 60.