జాతీయ రహదారి 5

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జాతీయ రహదారి 5 (ఆంగ్లం: National Highway 5) భారతదేశంలోని ప్రధానమైన రహదారి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణాన్ని మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కొల్కతా పట్టణాన్ని కలుపుతుంది.

ఈ రహదారి లోని అధికభాగం ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలోని సముద్రతీర ప్రాంతాల ద్వారా పోతుంది.[1]

ఈ రహదారి పొడవు సుమారు 1,533 కిలోమీటర్లు (ఒరిస్సా - 488, ఆంధ్ర ప్రదేశ్ - 1000 మరియు తమిళనాడు - 45).

కూడళ్ళు[మార్చు]

[[ఎన్.హెచ్.16] ఒరిస్సాలోని ఝర్పొఖారియా వద్ద జాతీయ రహదారి 6 తో కలుస్తుంది.

ఎన్.హెచ్.215 ఒరిస్సాలోని పానికోలి వద్ద ప్రారంభమై బర్బిల్ వరకు పోతుంది.

ఎన్.హెచ్.200 ఒరిస్సాలోని చండిఖోల్ వద్ద ప్రారంభమై రాయపూర్ ను కలుపుతుంది.

ఎన్.హెచ్.5A ఒరిస్సాలోని చండిఖోల్ వద్ద ప్రారంభమై పరదీప్ పోర్ట్ ను కలుపుతుంది.

ఎన్.హెచ్.42 ఒరిస్సా లోని చౌద్వార్ వద్ద ప్రారంభమై శంబల్ పూర్ ను కలుపుతుంది.

ఎన్.హెచ్.203 ఒరిస్సా లోని భువనేశ్వర్ వద్ద ప్రారంభమై పూరి ను కలుపుతుంది.

ఎన్.హెచ్.217 ఒరిస్సా లోని బరంపురం వద్ద ప్రారంభమై మహాసముంద్ ను కలుపుతుంది.

ఎన్.హెచ్.43 ఆంధ్ర ప్రదేశ్ లోని రాజపులోవ వద్ద ప్రారంభమై ఒరిస్సాలోని రాయపూర్ ను కలుపుతుంది.

ఎన్.హెచ్.9 ఈ రహదారితో విజయవాడ వద్ద కూడలిని ఏర్పరుస్తుంది.

దారి[మార్చు]

ఈ రహదారి తమిళనాడు లో చెన్నై నుండి ప్రారంభమై కొద్ది దూరం తర్వాత గుమ్మిడిపుండి వద్ద ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని తొమ్మిది కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్టణం మరియు శ్రీకాకుళం ద్వారా ప్రయాణిస్తుంది.

ఇది ఒరిస్సా లోని బారిపడ, బలాసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, బరంపురం మరియు బహరగొర ద్వారా ప్రయాణిస్తుంది.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]