జిక్కి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జిక్కి
Jikki.jpg
వ్యక్తిగత సమాచారం
జన్మ నామం పి.జి.కృష్ణవేణి
జననం నవంబరు 3, 1937
చంద్రగిరి
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
మరణం 2004(2004-08-16) (వయసు 68)
వృత్తి నేపధ్య గాయని
క్రియాశీల కాలం 1938-2004

జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (1938 - 2004) తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన ప్రముఖ దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి అప్పట్లో ప్రముఖగాయకుడైన ఏ.ఎమ్.రాజా ను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు

ప్రాచుర్యం పొందిన గీతాలు[మార్చు]

  • వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
  • జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
  • 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
  • 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
  • పులకించని మది పులకించు లాంటి పాటలు

చిత్ర సమాహారం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

జిక్కి

"http://te.wikipedia.org/w/index.php?title=జిక్కి&oldid=1183108" నుండి వెలికితీశారు