జిల్లా పరిషత్
గ్రామీణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థ ( పంచాయతీ రాజ్) లో గ్రామ పంచాయతీ, మండల పరిషత్ తరవాత మూడవ(చివరి) అంచె (జిల్లా స్థాయి) జిల్లా పరిషత్ . ప్రతి జిల్లాకి ఒక జిల్లా పరిషత్తు వుంటుంది. పూర్తి పట్టణ జిల్లా అయితే జిల్లా పరిషత్తు వుండదు. ఉదా: రంగారెడ్డి జిల్లా.
విషయ సూచిక |
[మార్చు] జిల్లా పరిషత్ నిర్మాణం
జిల్లాని ప్రాదేశిక నియోజక వర్గాలుగా విభజించి,ఒకరిని ప్రత్యక్ష పద్ధతి లో ఎన్నుకుంటారు. వీరిని జడ్పిటిసి (Zilla Parishad Territorial Constituency : ZPTC) సభ్యులంటారు. రాజకీయ పార్టీలు అభ్యర్ధులను నిలబెట్టవచ్చు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు వుంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. వీరితో పాటు, జిల్లాకి ప్రాతినిధ్యం వహించే విధానసభ, లోక్‌సభ సభ్యులు, జిల్లాలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన సభచే ఆహ్వానించబడిన (కో ఆప్టెడ్) వారు సభ్యులుగా వుంటారు. సమావేశాలకుశాశ్వత ఆహ్వానితులు: జిల్లా కలెక్టర్, జిల్లా పరిధిలో మండల అధ్యక్షులు, జిల్లా మార్కెటింగ్ సంఘం అధ్యక్షులు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు .వీరికి సమావేశాలలో ఓటు హక్కు లేదు.
[మార్చు] అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు
జడ్పిటిసి సభ్యుల మొదటి సమావేశంలో ,వారిలో ఇద్దరిని అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. అధ్యక్ష పదవికి, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు వుంది.
[మార్చు] జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి
జిల్లా పరిషత్ నిర్ణయాలని అమలు పర్చటానికి జిల్లా పరిషత్ ముఖ్య పాలనాధికారి వుంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. జిల్లా పరిషత్ పరిధిలో పనిచేసే అధికారులందరిపైన , అన్ని సంస్థల పనితీరుపైన పర్యవేక్షణాధికారం వుంటుంది.
[మార్చు] స్థాయి కమిటీలు
- ప్రణాళికా- ఆర్థిక
- గ్రామీణాభివృద్ధి
- వ్యవసాయం
- విద్య, వైద్య సేవలు
- స్త్రీ సంక్షేమం
- సాంఘిక సంక్షేమం
- పనులు
[మార్చు] జిల్లా పరిషత్ విధులు
- జిల్లా పరిధిలో మండల పరిషత్ బడ్జెట్ ల ఆమోదం
- మండల పరిషత్ ప్రణాళికల సమన్వయం చేసి జిల్లా ప్రణాళిక తయారి
- పథకాల నిర్వహణ
- మండల్ పరిషత్ కార్యకలాపాల నిర్వహణ
- జిల్లా అభివృద్ధికి సలహాలు
- ఉన్నత పాఠశాలలు, వృత్తి విద్య పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ
- ప్రభుత్వం నుండి అందిన నిధులను మండల పరిషత్ లకు పంపిణీ
[మార్చు] జిల్లా పరిషత్ ఆర్థిక వనరులు
- భూమి శిస్తు, రాష్ట్ర పన్నులలో భాగం
- మండల పరిషత్లు, ప్రజలు ఇచ్చే విరాళాలు
- ప్రభుత్వ గ్రాంటులు
- పథకాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు
[మార్చు] ఇవీ చూడండి
- జిల్లా పరిషత్ కరదీపిక
- జిల్లా పరిషత్ సమాచార దర్శిని
- Zilla Parishad Financial Management Manual ( జిల్లాపరిషత్ ఆర్థిక నిర్వహణ)
- గుంటూరు జిల్లా పరిషత్ వెబ్సైటు