జీడిసొన

వికీపీడియా నుండి
(జీడి సొన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని జీడి వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

జీడిసొన, జీడిమామిడి కాయ పచ్చిగా ఉన్నప్పుడు కాయ తొడిమను తుంచినపుడు తొడిమ తుంచిన కాయ భాగం నుంచి ఒక రకమైన ద్రవం వస్తుంది. ఈ ద్రవాన్ని జీడి లేక జీడిసొన అని అంటారు.

కాయ రక్షణ కొరకు[మార్చు]

జీడిసొన వృక్ష దృశ్యచిత్రం

పండుగా మారక ముందే కాయలను పక్షులు లేక మనుషులు తినకుండా ఉండటానికి చెట్టు కాయ రక్షణ కొరకు యాసిడ్ వంటి ద్రవాన్ని కాయకు రక్షణ కవచంగా ఉత్పత్తి చేసి కాయ భాగంలో దాచుకుంటుంది. ఈ ద్రవం కొన్ని రకాల క్రిముల నుంచి కాయ చెడి పోకుండా కాపాడుతుంది.

జీడి సొన వలన గాయాలు[మార్చు]

కొందరు జీడిసొన వలన గాయాలవుతాయని తెలియని వారు, ముఖ్యంగా పిల్లలు పచ్చి మామిడి కాయలు సొన అవుతునప్పటి వాటిని తింటారు. ఈ జీడి సొన శరీర భాగాలందు ముఖ్యంగా పెదవుల వద్ద పై చర్మం ఊడి పోయి గాయాలవుతాయి.

మార్కెట్ కు తరలించేటప్పుడు[మార్చు]

జీడి సొన వలన కాయలపై ముఖ్యంగా మామిడి కాయలపై మరకలు ఏర్పడి కాయలు దెబ్బ తినే సందర్భంలో సొన (రసిక) కాయలపై పడకుండా ఉండేందుకు తొడిమలను అంగుళం పొడవు ఉండేలా కత్తిరించుకోవాలి. అలాగే జీడి సొన కారుతున్నంత సేపు కాయలను బొర్లా ఉంచి తరువాత వాటిని వరుసలలో పేర్చి మార్కెట్ కు తరలించాలి. ఈ విధంగా తొడిమ తోటి కాయలను కోయటం వలన కాయలు ఎక్కువ సమయం నిలువ ఉంటాయి.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జీడిసొన&oldid=3657423" నుండి వెలికితీశారు