జీప్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Jeep
తరహా Division of Chrysler
స్థాపన 1941
ప్రధానకేంద్రము Auburn Hills, Michigan, USA
Area served Worldwide
కీలక వ్యక్తులు Michael Manley (CEO of Jeep division)
Sergio Marchionne (CEO of Chrysler Group LLC)
పరిశ్రమ Automobile
ఉత్పత్తులు Sport Utility vehicles
మాతృ సంస్థ Chrysler Group LLC
నినాదము I live. I ride. I am Jeep.
వెబ్ సైటు Jeep.com

జీప్ అనేది క్రిస్లర్ సంస్థ యొక్క ఆటోమొబైల్ మార్క్ (మరియ నమోదు చేయబడిన వ్యాపార చిహ్నం). ఇది అత్యంత ప్రాచీనమైన ఆఫ్-రోడ్ వాహనం (మరియు స్పోర్ట్ యుటిలిటి వెహికిల్ – SUV). ఇది పలు ఇతర సైన్య లఘు యుటిలిటి వాహనాల రూపకల్పనకు ప్రేరణగా నిలిచింది. వాటిలో ఒకటి, రెండవ అతి ప్రాచీనమైన 4-చక్రాల బ్రాండ్ అయిన ల్యాండ్ రోవర్. జీప్ యొక్క మొట్ట మొదటి రూపం అయిన బాంటం BRC వాహనం తరువాత రెండవ ప్రపంచ యుద్ధం మరియు యుద్ధం అనంతర కాలాలలో యునైటెడ్ స్టేట్స్ అర్మి మరియు అలైస్ ప్రాధమిక లఘు 4-చక్రాల వాహనంగా మారింది. ఇతర దేశాలలో సైన్యానికి మరియు పౌర అవసరాలకు జీప్ మాదిరిగా పలు వాహనాలు రూపొందించబడ్డాయి.

చరిత్ర[మార్చు]

"జీప్" అనే పేరుకు మూలం[మార్చు]

"జీప్" అనే పేరుకు మూలం గురించి అనేక వివరణలు ఉన్నాయి. అయితే వీటి అన్నిటికి ఏ రుజువు లేదు. వీటిలో ఎక్కువగా ప్రాచర్యంలో ఉన్న వివరణ: సైన్యం ఈ వాహనానికి GP అని పెట్టిన పేరు తరువాత "జీప్" గా మారిందని ఒక వాదన ఉంది. ఈ వాహనానికి GP("ప్రభుత్వ వాహనం" లేదా "సాధారణ ఉపయోగం") అనే పేరు ఉండేదని, అదే పేరు శబ్దము మారి జీప్ గా మారిందని ఈ వాదం చెపుతుంది. అయితే, మెయిల్ కాల్, అనే టెలివిజన్ సిరీస్ లో ఆర్. లీ ఏర్మీ ఈ వాదనను తిరస్కరించి మరొక వాదనను ముందుంచాడు. ఆ వాహనం కొన్ని ప్రత్యేక ఉపయోగాల కొరకు రూపొందించబడిందని, అందువలన ఈ వాహనం ఎప్పుడు కూడా "సాధారణ ఉపయోగానికి" అని సూచించబడలేదని చెప్పాడు. మరియు జీప్ నడుపుతున్న ఒక సాధారణ GI కి ఈ పేరు తెలిసి ఉంటుందని అనుకోవడం అసాధ్యమని చెప్పాడు. ఫోర్డ్ సంకేతాక్షరం GPW అనగా (ప్రభుత్వ ఉపయోగానికి అని సూచించడానికి G, 80-inch (2,000 mm)వీల్ బేస్ ను సూచించడానికి P మరియు విల్లీస్-ఓవర్ల్యాండ్ ఇంజన్ ను సూచించడానికి W).

అప్పుడు ఉన్న సైనికులు ఆ క్రొత్త వాహనము బాగా నచ్చి, దానికి E. C. సేగర్ సృష్టించిన పోపెయే కార్టూన్ పాత్ర అయిన యూజీన్ ది జీప్ ను బట్టి ఏర్మీతో సహా పలువురు అభిప్రాయపడ్డారు. యూజీన్ ది జీప్ పోపోయే యొక్క "అడవి పెంపుడు జంతు". అది "చిన్నదిగా, వివిధ పరిమాణాల మధ్య తిరగగలిలే, అతి కష్టమైన సమస్యలను కూడా ఛేదించగలిగే జంతువు".[1]

1942లో ప్రచురించబడిన (ది పెంటగాన్ గ్రంధాలయంలో ఉన్న) క్లింటన్ ఎ. సాండెర్స్ రచించిన వోర్డ్స్ ఆఫ్ ది ఫైటింగ్ ఫోర్సస్ అనే సైన్యములో వాడే పదాల నిఘంటువులో ఈ నిర్వచనం ఇవ్వబడింది:

జీప్ : గూఢచారి పనులకు లేదా ఇతర సైన్య పనులకు వాడే, అర నుంచి ఒకటిన్నర టన్నుల సామర్ధ్యం కలిగిన ఒక నాలుగు చక్రాల వాహనం. బాంటం-కార్లకు సూచించే పదం. కొన్ని సార్లు లింక్ త్రైనేర్ అనే ఎయిర్ కార్పస్ లోని ఇతర మోటార్ వాహనాలకు (USA) వాడే పదం; ఆర్మర్డ్ సైన్యంలో ½-టన్ కమాండ్ వాహనం. "ఏ చిన్న విమానం, హెలికాప్టర్ లేదా పరికరాన్ని" కూడా సూచిస్తుంది.

నౌకాదళంలో వాడే చిన్న ఎస్కార్ట్ కేరియర్ లను కూడా "జీప్ కేరియర్" అని సూచించడం కూడా ఈ నిర్వచనాన్ని బలపరుస్తుంది.

ఈ వాహనం యొక్క ఆఫ్-రోడ్ సామర్ధ్యాన్ని 1941 ప్రారంబములో విల్లీస్-ఓవర్ల్యాండ్ ప్రదర్శించింది. యునైటడ్ స్టేట్స్ కేపిటల్ యొక్క మెట్ల మీద వాహనాన్ని నడిపించింది. దానిని విల్లీ వారి పరీక్షా చోదకుడు అయిన ఇర్వింగ్ "రెడ్" హాస్మన్ నడిపాడు. ఫోర్ట్ హోలబర్డ్ లోని సైనికులు ఆ వాహనాన్ని "జీప్" అని పిలవడాన్ని అతను విన్నాడు. అ వాహనం పేరు ఏమిటని కేతరిన్ హిల్ల్యర్ అనే వాషింగ్టన్ డైలీ న్యూస్ యొక్క సిండికేటడ్ కాలమిస్ట్ (లేదా మరొక కథనం ప్రకారం ఒక బైస్టాండర్) ఇర్వింగ్ ను అడిగినప్పుడు, అతను, "అది జీప్" అని బదులిచ్చాడు.

కేథరిన్ హిల్యర్ యొక్క వ్యాసం దేశవ్యాప్తంగా 1941 ఫిబ్రవరి 20న ప్రచురించబడింది. అప్పుడు వాహనం యొక్క ఛాయా చిత్రం ఈ శీర్షికతో ప్రచురమయింది:

చట్టసభ సభ్యులు చేసిన సవారి - న్యూ యార్క్ సెనటర్ మీడే వాహనాన్ని నడుపుతూ, న్యూ జెర్సీ ప్రతినిధి థామస్ ప్రక్కన కూర్చొని ఉండగా, "జీప్" లేదా "క్వాడ్" అని పిలవబడే సైన్యము యొక్క క్రొత్త స్కౌట్ కార్, కాపిటల్ మెట్ల పీద ఎక్కుతుంది. ఈ ప్రదర్శన నిన్న జరిగింది. వెనుక సీట్లలో కూర్చున్న సైనికులు ఏ ఆందోళన కనపరచలేదు.

ఈ ప్రదర్శన తరువాత, జీప్ గురించిన మిగిలిన అన్ని సూచనలు మర్చిపోబడి, జీప్ అనే పేరు ఈ 4x4 వాహనముకు నిలిచిపోయింది. ఇంకా పరీక్షించబడని వాహనాలకు కూడా ఈ పదం సైన్యములో వాడకములో ఉండేది. ఈ సైన్య వాహనం రూపకల్పన చేయబడటానికి పలు దశాబ్దాల ముందునుంచే ఈ పదం వాడకములో ఉంది.

"జీప్" అనే పదాన్ని నమోదు చేయబడిన వ్యాపార చిహ్నంగా వాడడానికి 1950లో విల్లీస్-ఓవర్లాండ్ ఇంక్ సంస్థకు హక్కు కల్పించింది; అయితే, ఆ పదాన్ని గాని వాహనాన్ని గాని రూపకల్పన చేసింది వారు కాదు.

వాహనముయోక్క మూలాలు: మొట్ట మొదటి జీప్‌లు[మార్చు]

బాంటం BRC 40
ప్రపంచ యుద్ధం II శకం జీప్ లోని డాష్ బోర్డ్.
50 కాల్. కలిగిన జీప్.బ్రౌనింగ్ మెషీన్ గన్

ఐరోపా లో రగులుతున్న యుద్ధములో యునైటడ్ స్టేట్స్ కూడా పాల్గొనబోతుందని తేటతెల్లమయినప్పుడు, ఒక నూతన నాలుగు చక్రాల గూఢచారి కార్ యొక్క మాదిరిలను ఇవ్వవలసినదిగా 135 సంస్థలను యు.ఎస్. సైన్యం కోరింది. ఆ అభ్యర్ధనకు రెండు కంపనీలు మాత్రమే స్పందించాయి. అవి అమెరికన్ బాంటం కార్ కంపెనీ మరియు విల్లీస్-ఓవర్లాండ్. 49 రోజులలో మాదిరిని ఇవ్వాలని ఒక అసాధ్యమైన గడువును సైన్యం విదించింది. విల్లీస్ ఎక్కువ సమయం అడిగినా అది నిరాకరించబడింది. దివాళా స్థితిలో ఉన్న అమెరికన్ బాంటం కార్ కంపెనీలో సాంకేతిక సిబ్బంది ఎవరూ లేరు. అప్పుడు ఆ సంస్థ డెట్రాయిట్ నుంచి కార్ల్ ప్రోబ్స్ట్అనే మంచి నైపుణ్యం కలిగిన డిజైనర్ ను పిలిపించింది. బాంటం అభ్యర్దనను మొదట్లో తిరస్కరించిన ప్రోబ్స్ట్, తరువాత సైన్యం అభ్యర్దనను మన్నించి, మొదట్లో ఎటువంటి జీతం లేకుండా, 1940 జూలై 17న పని ప్రారంబించాడు.

కేవలం రెండు రోజులలో ప్రోబ్స్ట్ మాదిరిని రూపకల్పన చేసి, మూడవ రోజు ఆ వాహనము యొక్క ఖరీదును లేక్కించాడు. జూలై 22న ప్రోబ్స్ట్ యొక్క బిడ్, బ్లూప్రింట్ లతో సహా సైన్యానికి సమర్పించబడింది.[2] వాహనము ఎక్కువగా అప్పడు అందుబాటులో ఉన్న వాహన విడిభాగాలనునుండే ఉత్పత్తి చేయబడింది. నాలుగు చక్రాల డ్రైవ్ ట్రైన్ భాగాలను స్పాన్సర్ సరఫరా చేసింది. చేతులతో తయారు చేసిన ఆ వాహన మాదిరి బుట్లేర్, పెన్న్స్యల్వనియా,[3] లో తయారు చేయబడి, క్యాంపు హోలబిర్డ్, మేరీలాండ్ కు నడుపుకు వెళ్ళబడి 1940 సెప్టెంబర్ 21 నాడు సైన్యంకు పరీక్షకోసం ఇవ్వబడింది. సైన్య అవసరాలను ఆ వాహనం పూర్తి చేసినా, ఇంజన్ మాత్రం సైన్యంకు కావలసిన టార్క్ లేకుండా ఉంది.

అవసరమైన వాహనాలని సరఫరా చేయగాలే సామర్ధ్యం బాంటం సంస్థకు లేదని భావించిన సైన్యం, ఆ డిజైన్ ను విల్లీస్ మరియు ఫోర్డ్ సంస్థలకు ఇచ్చి, వారిని సొంతంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రోత్సహించింది. చివరిగా ఫోర్డ్ వారు 'పిగ్మీ' ను విల్లీస్ వారు 'క్వాడ్' మదిరిలను తయారు చేశారు. అవి సాంతం బాంటం BRC (బాంటం రేకన్నైసంస్ కార్) నమూనా మాదిరిగానే ఉన్నాయి. ఒకే రకమైన 4-చక్రాల డ్రైవ్ ట్రైన్ బాగాలను స్పైసర్ సంస్థ మూడు సంస్థలకు సరఫరా చేసింది.

ఆ మూడు వాహనాల నమూనాలు ఒక్కొక్కటి 1500 ఉత్పత్తి చేయబడి, అవి విస్తృతంగా పరీక్ష చేయబడ్డాయి. విల్లీస్-ఒవర్లాండ్ యొక్క ప్రధాన ఇంజనీర్ అయిన డెల్మార్ "బర్నీ" రూస్, సవరించబడిన బరువు నియమాలకు (ఇందనం మరియు నీళ్ళు కలిపి గరిష్టంగా 2,175 lb (987 kg)) అనుగుణంగా డిజైన్ లో కొన్ని మార్పులు చేశాడు. అందుమూలాన అతను శక్తివంతమైన, కాని ఎక్కువ బరువు కలిగిన "గో డెవిల్" ఇంజన్ ను వాడగలిగాడు. ఉత్పత్తి కొరకు మొట్ట మొదటి కాంట్రాక్ట్ ను అతను గెలుచుకున్నాడు. విల్లీస్ తయారించిన ఈ కార్ డిజైనే తరువాత జీప్ డిజైన్ యొక్క ప్రమాణంగా మారింది. దీనికి వారు మోడల్ MB గా పేరు పెట్టి, టోలేడో, ఒహయో లోని తమ కర్మాగారములో ఈ వాహనాన్ని ఉత్పత్తి చేశారు. అందరికి తెలిసిన ప్రేస్ద్ మెటల్ జీప్ గ్రిల్ అంశం నిజానికి ఫోర్డ్ వారు డిజైన్ లో ఉన్న ఇక అంశం. దీనిని తమ తుది డిజైన్లో సైన్యం చేర్చింది.

యుద్ద విభాగానికి తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు అవసరమయ్యేసరికి, తమ ప్రమాణాలను వాడి వాహనాన్ని ఉత్పత్తి చేయడానికి మరొక సంస్థకు విల్లీస్-ఒవర్లాండ్ సైన్యానికి లైసెన్స్ ఇచ్చింది. విల్లీస్ వారి డిజైన్ ప్రకారం ఉత్పత్తి చేయడానికి ఫోర్డ్ కంపెనీని రెండవ సంస్థగా సైన్యం ఎన్నుకుంది. పూర్తి ప్లాన్ లు, నియమాలను విల్లీస్ సంస్థ ఫోర్డ్ కు ఇచ్చింది. మొట్ట మొదట జీప్ ను సృష్టించిన అమెరికన్ బాంటం సంస్థ సైన్యానికి భారి ట్రైలర్ లను ఉత్పత్తి చేయడములో నిమగ్నమయింది.

విల్లీస్-ఒవర్లాండ్ వారి తుది ఉత్పత్తి వెర్షన్ మోడల్ MB గాను, ఫోర్డ్ వారిది మోడల్ GPW గాను (G = ప్రబుత్వ వాహనం, P అనగా 80" వీల్ బేస్, మరియు W = విల్లీస్ ఇంజిన్ డిజైన్). రెండు వాహాల వెర్షన్ల మధ్య కొన్ని చిన్న చిన్న విబేధాలు ఉండేవి.[4] ఫోర్డ్ వెర్షన్లలో ప్రతి బాగం మీద (బోల్ట్ హెడ్ లతో సహా) "F" అనే ముద్ర ఉండేది. విల్లీస్ కూడా ఇది పద్దతిని పాటించి కొన్ని బాగాల పై తమ పేరును ముద్రించింది. కాని 1942లో అలాగా చేయడాన్ని మానేసింది.[5] యుద్ధం కొనసాగుతూ ఉండడంతో, వాహన ఖరీదు పెరుగడం మొదలయింది. మొట్ట మొదటి కాంట్రాక్ట్ ప్రకారం విలీస్ వాహనము యొక్క ధర US$648.74 గా ఉంది. (ఫోర్డ్ వాహన ధర $782.59).[6] విల్లీస్-ఒవర్లాండ్ మరియు ఫోర్డ్, చార్లెస్ ఈ. సోరెంసేన్ సారద్యంలో (రెండవ ప్రపంచ యుద్ధం సమయములో ఫోర్డ్ యొక్క ఉపాద్యక్షుడు) మొత్తం మీద 640,000 జీప్పులు ఉత్పత్తి చేసారు. యుద్ధం సమయములో యు.ఎస్.లో తయారైన మొత్తం సైన్య వాహనాలలో ఇది 18%.

యు.ఎస్. సైన్యములో ప్రతి విభాగంలో జీప్పులు వాడబడ్డాయి. ప్రతి ఇన్ఫన్ట్రి దళానికి సగటుగా 145 జీప్పులు సరఫరా చేయబడ్డాయి. ఇతర అనేక అవసరాలకు కూడా జీప్పులు వాడబడ్డాయి. వాటిలో కేబిల్ వేయడం, రంపం మిల్, అగ్నిమాఫిక పంపర్, ఫీల్డ్ అమ్బులన్స్, ట్రాక్టర్ వంటి అనేక అవసరాలకు వాడబడింది. చక్రాలను మార్చి, రైల్ పట్టాల పైన కూడా జీప్పును నడపవచ్చు. మాడల్ GPA లేదా "సీప్" (సి జీప్) అనే ఒక అమ్ఫిబియాస్ జీప్పును ఫోర్డ్ రూపిందించింది. అయితే, చాల తక్కువ సంఖ్యలోనే ఇది ఉత్పత్తి చేయబడింది. ఈ మాడల్ గొప్ప విజయం సాధించందని చెప్పలేము ఎందుకంటే ఇది నెల మీద బాగా నడవలేదు, నీటి మీద సరిగా నడవలేదు. రెండవ ప్రపంచ యుద్ధం సమయములో మొత్తం జీప్ ఉత్పత్తిలో దాదాపు 30% వాహనాలు గ్రేట్ బ్రిటన్ మరియు సోవియట్ రెడ్ అర్మి కి సరఫరా చేయబడ్డాయి. కొరియాలో జీప్ వాడినప్పుడు, సైన్యదళాలు జీప్ అనే పేరును "జస్ట్ ఇనఫ్ ఎసెన్షియల్ పార్ట్స్" అని పిలిచేవారు.

ప్రపంచవ్యాప్తంగా జీప్ పలు దేశాలలు అనుకరించబడింది. ఫ్రాన్స్ లో డేలహయే మరియు హోట్చ్కిస్ ఎట్ సై (1954 తరువాత విల్లీస్ నుంచి లైసెన్స్ తీసుకొని హోట్చ్కిస్ జీప్ ను ఉత్పత్తి చేసింది) సంస్థలు మరియు జపాన్ లో మిట్సుబిషి మోటర్స్ మరియు టయోట ఈ వాహనాన్ని ఉత్పత్తి చేసాయి. మొట్ట మొదటి జీప్ యొక్క మంచి ఆకారం మరియు రూపం పారిశ్రామిక డిజైనర్ల చే మరియు మ్యూజియం క్యూరేటర్ల చే ప్రశంసించబడింది. జీప్ ను ఫన్క్షనలిస్ట్ డిజైన్ కు ఒక్క అధ్బుతమైన ఉదాహరణ అని మ్యూజియం ఆఫ్ మాడర్న్ ఆర్ట్ వర్ణించింది. తమ సేకరణలో బాగంగా జీప్పును ప్రదర్శిస్తూ ఉంటుంది.[7][8] జీప్ మరియు కోలేమన్ జి.ఐ. పాకట్ స్టవ్ అనే ఈ రెండు పరికరాలను "రెండు అతి గొప్ప నాన్-కంబాట్ ఉపకరణాలు" అని ఎర్నీ పైల్ విమర్శించాడు.[9]

యుద్ధం అనంతరం, జీప్పులు ఎక్కువ సంఖ్యలో బయట మార్కెట్ లో అందుబాటులో వచ్చే సరికి, జీప్ మరింత ప్రాబల్యం చెందింది. "కర్మాగారం నుంచి నేరుగా జీప్పులు క్రేట్టులలో" అని కొన్ని ప్రకటనలు పేర్కొన్నాయి. జీప్పులు ఎప్పుడు కర్మాగారాలనుంచి నేరుగా క్రేట్టులలో సరఫరా చేయబడడం లేనప్పిటికి ఈ కథ కొన్ని దశాబ్దాల పాటు ప్రాచార్యంలో ఉంది.

మరొక కథ - ఇది నిజం - ఫిలిపైన్స్ లో సృష్టించబడిన జీప్నీ, అనే ఒక రకమైన టాక్సీ లేదా బస్ నుంచి వచ్చిన కథ. మొదటి జీప్నీలు, WWII మరియు ఫిలిపినో స్వాతంత్ర పోరాటం తరువాత సైన్య అవసరాలకు సరిపోను మిగిలిన MB మరియు GPWలు. జీప్పుల పొడవు పెంచి, వెనుక "టబ్" ను వెడల్పు చేసి, ఎక్కువ మంది ప్రయాణికులు పయనించే విదముగా జీప్నీ లు తయారు చేయబడ్డాయి. ఆ తరువాత, ఆధునిక ఫిలిపైన్స్ యొక్క చిహ్నంగా జీప్నీలు నిలిచాయి. వాటి యజమానులు జీప్నీలను చిత్ర విచిత్రంగా అలంకరించేవారు.

యునైటెడ్ స్టేట్స్ సైన్యంలో, జీప్ తరువాత అనేక వాహానాలు వచ్చాయి. (ఉ: ఫోర్డ్ వారి M151 MUTT)) వీటిలో అతి నూతనమైనది, హై మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికిల్ (HMMWV లేదా "హంవీ").

M715[మార్చు]

జీప్ M715

1965లో M715 1.25 టన్ సైన్య ట్రక్ ను జీప్ రూపిందించింది. ఇది వియత్నాం లో విస్తృతంగా ఉపయోగించబడిన పౌర J-సిరీస్ జీప్ ట్రక్ యొక్క సైన్య వెర్షన్. దీనిలో ఎక్కువ బరువుగల ఫ్లోటింగ్ ఎక్సిల్ లు మరియు ఒక ఫోల్దబిల్ వెర్టికల్ ఫ్లాట్ విండ్ షీల్డ్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వాహనం ఇతర దేశాలలో వాడబడుతుంది. లైసెన్స్ పొందిన కియా సంస్థ ఇప్పటికి ఈ వాహనాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది.

CJ (సివిలియన్ జీప్) సిరీస్ 1945లో మొదలయింది. తరువాత 1953లో CJ-2A మరియు CJ-3B సెరిస్ లు రూపొందించబడ్డాయి. సైన్య వాహనాలు, విల్లీస్ MB మరియు ఫోర్డ్ GPW నమూనాలు మాదిరిగానే ముందు ఫెన్డెర్స్ ఫ్లాట్ గా ఉండడం వలన ఈ ముందరి జీప్ లు "ఫ్లాట్ ఫెన్డెర్స్" అని పిలవబడ్డాయి. ఒక 1951 నమూనా మాదిరిగానే ఇప్పుడు CJ-4 ఉంది. ఫ్లాట్ ఫెన్డెర్డ్ CJ-2A మరియు CJ-3B వాహనాలకు 1955లో ప్రవేశపెట్టబడిన రౌండ్-ఫెన్డెర్డ్ CJ-5 లకు ఉన్న వారిది ఈ మోడల్ యే.

జీప్ మార్క్[మార్చు]

జీప్ మార్క్ పలు యజమానులను చూసింది. 1945లో మొదటి సివిలియన్ జీప్(CJ) ను రూపొందించిన విల్లీస్ సంస్థే దీని మొదటి యజమాని. ఈ సంస్థకే 1950లో మొదటి సారిగా వ్యాపారచిహ్నం మంజూరు చేయబడింది. 1953లో విల్లీస్ సంస్థ కైసేర్ మోటర్స్ కు అమ్మబడింది. 1963లో ఇది కైసేర్-జీప్ గా మారింది. 1970లో నష్టముల్ ఉన్న కైసేర్ యొక్క జీప్ వ్యాపారాన్ని అమెరికన్ మోటర్స్ కార్పరేషన్ (AMC) కొనుగోలు చేసింది. ఈ యుటిలిటి వాహానాలు AMC యొక్క కార్ వ్యాపారానికి అనుగుణంగా నిలిచాయి. రెండు వాహనాలు ఒకే బాగాలను వాడాడం, వాల్యూం సామర్ధ్యాన్ని పెంచడం, జీప్ యొక్క అంతర్జాతీయ మరియు ప్రబుత్వ మార్కెట్లలో జీప్ కు ఉన్న గిరాకి వంటి అంశాలు సానుకూలంగా ఉన్నాయి.

ఫ్రెంచ్ ఆటో సంస్థ అయిన రెనాల్ట్ AMCలో పెట్టుబడి పెట్టడం 1979లో ప్రారంబించింది. అయితే, 1897 సమయానికి, ఆటో మార్కెట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. రెనాల్ట్ సంస్థకే ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. అదే సమయములో, జీప్ బ్రాండ్ ను మరియు AMC యొక్క ఇతర ఆస్తులను సొంతం చేసుకోవాలని క్రిస్లర్ కార్పరేషన్ ప్రయత్నించింది. 1987లో, జీప్ CJ-7 స్థానే AMC వారి జీప్ రాంగ్లర్ ప్రవేశపెట్టిన తరువాత లేదా 1998లో YJ.క్రిస్లర్ సంస్థ డైమ్లర్-బెంజ్ తో విలీనం అయి డైమ్లేర్ క్రిస్లర్ సంస్థగా ఏర్పడిన తరువాత క్రిస్లర్ AMCను కొనుగోలు చేసింది. తరువాత డైమ్లేర్ క్రిస్లర్ సంస్థ క్రిస్లర్ లో తమ వాటాను 2007లో ఒక ప్రైవేట్ ఈక్విటి సంస్థకు అమ్మేసింది. క్రిస్లర్ మరియు జీప్ విభాగం ప్రస్తుతం క్రిస్లర్ గ్రూప్ LLC గా నడపబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు లైసెన్స్ పొంది జీప్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇండియాలో మహీంద్రా, స్పెయిన్ లో EBRO మరియు దక్షిణ అమెరికా లో పలు సంస్థలు జీప్ ను ఉత్పత్తి చేస్తున్నాయి. 1953 - 1998 మధ్య జపాన్ లో మిట్సుబిషి సంస్థ 30 కంటే ఎక్కువ జీప్ నమూనాలను తయారు చేసింది. వాటిలో పలు నమూనాలు విల్లీస్-కైసేర్ డిజైన్ తో కూడిన CJ-3B మాడల్ ఫై ఆధారపడినవే.[10]

జీప్ మార్క్ రూపొందించబడినప్పటినుంచి టోలేడో, ఒహయో నే ఆ వాహనానికి ప్రధాన కార్యాలయముగా ఉంటుంది. ఈ వారసత్వం ఆ నగరానికే ఒక గర్వకారణంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం సమయములో ఉత్పత్తి చేసిన అదే కర్మాగారంలో ఇప్పుడు ఆ వాహానాలు ఉత్పత్తి చేయబడడం లేదు. కాని పాత కార్మాగారం సమీపంలో ఒక వీధికి పేరు విల్లీస్ పార్కవే గాను మరొక వీధికి పేరు జీప్ పార్కవే గాను పెట్టబడింది.

అమెరికన్ మోటార్స్ తమ మొదటి ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రాన్ని 1984 జనవరి 15న ఒక ఉమ్మడి సంస్థ గా పీపిల్స్ రిపబ్లిక్ అఫ్ చైనా లో స్థాపించింది.[11] ఫలితంగా, బీజింగ్ లో జీప్ చెరోకీ(XJ) వాహానాలను తయారు చేయడానికి బీజింగ్ ఆటోమొబైల్ ఇండస్ట్రి కార్పరేషన్ బాగస్వామ్యంతో బీజింగ్ జీప్ కార్పరేషన్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటయింది. క్రిస్లర్ సంస్థ ఆంక్ ను కొనుగోలు చేసిన తరువాత కూడా జీప్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. ఈ ఉమ్మడి సంస్థ ఇప్పుడు డైమ్లేర్క్రిస్లర్ మరియు డైమ్లేర్క్రిస్లర్ చైనా ఇన్వెస్ట్ కార్పరేషన్ లో భాగంగా ఉంది. మొదట్లో రూపొందించిన 1984 XJ మోడల్ అప్డేట్ చేయబడి 2005లో ఉత్పత్తి ఆపివేసే సమయములో "జీప్ 2500" గా పిలవబడింది.[12]

క్రిస్లర్ గ్రూప్ LLC యొక్క విభాగమే జీప్ బ్రాండ్ యొక్క ప్రస్తుత యజమాని. ఇప్పుడు ఈ సంస్థే "జీప్" పేరుకు వ్యాపారచిహ్నం హొదాను కలిగి ఉంది. ఈ సంస్థే 7-స్లాట్లు కలిగిన గ్రిల్ డిజైన్ కు కూడా హక్కు కలిగి ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయములో మొదట్లో రూపొందించబడిన జీప్ లలో ఉన్న 9-స్లాట్ల గ్రిల్ డిజైన్ ను ఫోర్డ్ తమ GPW వహానాల కొరకు రూపొందించింది. దీనికి కారణం ఇది విల్లీస్ వారి "స్లాట్ గ్రిల్" (ఫ్లాట్ బార్ల కలిగిన ఒక రూపం) కంటే తక్కువ బరువు ఉండడమే. ఈ డిజైన్ ను "జీప్ యొక్క డిజైన్ ప్రమాణం" లో చేర్చారు.

AM జెనెరల్[మార్చు]

HMMWV (హంవీ) వాహనానికి జీప్ కు సంబంధం ఉంది. 1971లో, జీప్ యొక్క డిఫెన్స్ మరియు గవర్నమెంట్ ప్రాడక్ట్స్ విభాగం AM జెనెరల్ గా మార్చబడింది. ఈ సంస్థ అమెరికన్ మోటార్స్ కార్పరేషన్ యొక్క అనుబంద సంస్థ. ఈ సంస్థే జీప్ కు కూడా యజమాని. 1979లో, అమెరికన్ మోటార్స్ క్రింద ఉన్నప్పుడే, AM జెనెరల్ సంస్థ హై మొబిలిటి మల్టిపర్పస్ వీల్డ్ వెహికిల్ ను రూపకల్పనకు తోలి అడుగు వేసింది. 1953లో జీప్ రూపొందించిన రెండు చక్రాల డ్రైవ్ DJ వాహన ఉత్పత్తిని AM జనెరల్ కొనసాగుతూనే ఉంది.

జెనెరల్ మోటార్స్ హమ్మేర్ మరియు క్రిస్లర్ జీప్ సంస్థలు తమ తమ రేడియేటర్ గ్రిల్ లలో ఏడు స్లాట్ డిజైన్ ను వాడే హక్కు గురించి US న్యాయస్థానాల్లో పోట్లాడుతున్నాయి. నిలువుగా అమర్చిన ఏడు స్లిట్ గ్రిల్ డిజైన్ ను వాడే ఏకైక హక్కు తమకు మాత్రమె ఉందని క్రిస్లర్ జీప్ వాదిస్తుంది. విల్లీస్ సంస్థ యుద్ధం అనంతరం ఉత్పత్తి చేసిన జీప్ లలో ఫోర్డ్ రూపొందించిన 9-స్లాట్ గ్రిల్ కు బదులుగా 7 స్లాట్లు వాడడం మొదలు పెట్టిన తరువాత, ఆ హాక్కు కలిగిన వివిధ సంస్థలలో తమ సంస్థే మిగిలి ఉందని క్రిస్లర్ జీప్ వాదిస్తుంది.

ఆఫ్-రోడ్ సామర్ధ్యాలు[మార్చు]

మూస:Expand

జీప్ రాంగ్లర్ రోడ్డు-బయట

జీప్ ప్రకటనలలో వాహనము యొక్క ఆఫ్-రోడ్ సామర్ధ్యాలకే ప్రాముఖ్యత ఇచ్చేవారు.[13] ఈ రోజు, గట్టిగా ఉండే ముందు మరియు వెనుక ఎక్సిల్ కలిగిన కొన్ని నాలుగు చక్రాల వాహనాలలో రాంగ్లర్ ఒకటి. ఈ ఆక్సిల్ లు ధృడంగానూ ఎక్కువ కాలం స్తిరంగాను ఉంటాయి. పలు రాంగ్లర్లు డానా 35 వెనుక డిఫెరెన్షియల్ తోను, డానా 30 ముందు డిఫెరెన్షియల్ తోను (రూబికన్ లో 44) వస్తాయి. JK రాంగ్లర్ యొక్క సవరించబడిన రూబికాన్ మాడల్ లో ఎలెక్ట్రానికల్ గా ఏక్టివేట్ చేయబడే లాకింగ్ డిఫెరెన్షియల్లు, 4-10 గియర్లు కలిగిన ముందు మరియు వెనుక డానా 44 ఎక్సిల్లు, 4:1 ట్రాన్స్ఫేర్ కేస్, ఎలెక్ట్రానిక్ స్వే బార్ డిస్కనెక్ట్ మరియ హెవి డ్యూటి సస్పెన్షన్.

సాలిడ్ ఎక్సిల్ వాహనాలు ఆఫ్టర్ మార్కెట్ సస్పెన్షన్ సిస్టంలతో "పైకి లేపడానికి" సులబంగాను తక్కువ కర్చుతో కూడిన ప్రక్రియగాను ఉంటాయి. దీని మూలానా ఎక్సిల్ కు వాహన చాసిస్ కు మధ్య ఉన్న దూరం పెరుగుతుంది. ఈ దూరం పెరగడంతో, పెద్ద టయర్లు అమర్చుకునే అవకాశం ఉంటుంది. దీని మూలానా గ్రౌండ్ క్లియరన్స్ పెరిగి మరింత పెద్ద మరియు కష్టమైనా అడ్డంకి లను అధికమించడానికి వీలు ఉంటుంది. గ్రౌండ్ క్లియరన్స్ పెరగడంతో పాటు, సస్పెన్షన్ అర్టికులేషణ్ లేదా "ఫ్లేక్స్" కూడా పెరుగుతుంది. దీని వలన జీప్ కు ఆఫ్-రోడ్ సామర్ధ్యాలు మరింత పెరుగుతుంది. మంచి సస్పెన్షన్ ఆర్టికులేషణ్ ఉన్నప్పుడు, నాలుగు చక్రాలు నేలను తాకుతూ ఉండేలా చేసి, ట్రాక్షన్ ఉండేలా చూస్తుంది.

చిన్న జీప్ లలో ఉన్న సదుపాయాలు ఇవి: తక్కువ ఎత్తుగల చక్ర బేసులు సన్నటి ఫ్రేంలు మరియు సరిపోను అప్రోచ్,బ్రేక్ ఓవర్ మరియు డిపార్చర్ కోణాలు. వీటి వలన పూర్తి స్థాయి నాలుగు చక్రాల వాహనాలకు ఉన్న ఇబ్బందులు ఈ చిన్న జీపులకు ఉండవు.

జీప్ యజమానుల గురించిన సారాంశం[మార్చు]

  • 1941–1953: విల్లీస్-ఒవర్లాండ్
  • 1953–1964: కైసర్-జీప్ ( "విల్లీస్ మోటార్స్" అని వాటిని పిలిచేవారు)
  • 1964–1970: కైసర్-జీప్
  • 1970–1987: AMC (w/ రినాల్ట్ నియంత్రణ గావించే ఉత్పాపాదన 1986 లో)
  • 1987–1998: క్రిస్లర్
  • 1998–2007: డైమ్లర్క్రిస్లర్ AG
  • 2007–2009: క్రిస్లర్ LLC
  • 2009–ప్రస్తుతం వరకు: క్రిస్లర్ గ్రూపు LLC

జీప్ నమూనాల పట్టిక[మార్చు]

చారిత్రాత్మక మరియు సైనిక నమూనాలు[మార్చు]

ప్రపంచ యుద్ధం II శకం జీప్ ఫోర్డ్ చే తయారుచేయబడినది, విల్లీస్ -ఒవర్లాండ్ ఆకృతి ఉపయోగించినది
  • 1940 బాంటం పైలెట్- ప్రతిరూపం
  • 1940 బాంటం BRC-60- నమూనా
  • 1940 విల్లీస్ క్వాడ్- నమూనా
  • 1940 ఫోర్డ్ పిగ్మీ- నమూనా
  • 1940 బుడ్ ఫోర్డ్- నమూనా
  • 1941 ఫోర్డ్ GP
  • 1941 విల్లీస్ MA
  • 1941 బాంటం BRC-40
  • 1942 విల్లీస్ MB (స్లాట్ గ్రిల్)
  • 1942–1945 విల్లీస్ MB (గ్రిల్ గా స్టాంప్ చేయబడిన)
  • 1942–1945 ఫోర్డ్ GPW
  • 1942–1943 ఫోర్డ్ GPA
  • 1944 విల్లీస్ MLW-1- నమూనా (ఎప్పటికీ పూర్తిచేయబడలేదు)
  • 1944 విల్లీస్ MLW-2- నమూనా
  • 1946–1965 విల్లీస్ జీప్ వాగన్
  • 1947–1965 విల్లీస్ జీప్ ట్రక్కు
  • 1948–1950 VJ — విల్లీస్ జీప్స్టర్
  • 1950 X-98– నమూనా
  • 1953 BC బాబ్ కాట్ – నమూనా
ప్రపంచ యుద్ధం II శకం విల్లీస్ జీప్
  • 1950–1955 M-38 (MC)
  • 1952–1957 M38A1 (MD)
  • 1952–1957 M38A1C
  • 1953–1963 M170
  • 1955 M38A1D
  • 1959–1978 M151 MUTT
    • M151A1
    • M151A1C
    • M151A2
    • M718 అంబులెన్స్
    • M718A1 అంబులెన్స్
    • M825
  • 1960–1968 జీప్ M606
  • 1956–1965 జీప్ ముందుకు నడిపే నియంత్రణ (సైనికపరమైన మార్పులు)
    • M676
    • M677
    • M678
    • M679
  • 1967–1969 కైసర్ జీప్ M715– సామాన్యుల అవసరాలకు తగినటువంటి జీప్ గ్లేడియేటర్

FC ట్రక్కులు, VJ జీప్స్టర్స్, & FJ వాన్స్[మార్చు]

  • 1948-1950 విల్లీస్ VJ జీప్స్టర్[14]
  • 1948-1949 VJ2 జీప్స్టర్[15][16]
  • 1949-1951 VJ3 జీప్స్టర్[17]
  • 1949 ఆల్కొవా అల్యుమీనియం-చట్రం కలిగిన జీప్స్టర్ కూపే (నమూనా) [18]
  • 1962 థ బ్రెజిలియన్ జీప్స్టర్ (నమూనా) [19][20]
  • జీప్స్టర్ సఫారీ (ఆలోచన) [21]

(నియంత్రణ ముందు ఉండే జీప్)

  • 1956-1965 జీప్ ఫార్వార్డ్ కంట్రోల్
    • FC-150
    • FC-160 - స్పెయిన్, ఇండియా
    • FC-170
    • M676
    • M677
    • M678
    • M679

(ఫ్లీట్ వాన్ జీప్)

  • 1961-1975 ఫ్లీట్ వాన్
    • FJ-3
    • FJ-3A
    • FJ-6
    • FJ-6A
    • FJ-8
    • FJ-9

కమాండో

  • 1966-1971 C101- జీప్స్టర్ కమాండో
    • హర్స్ట్ జీప్స్టర్ (కేవలం 100 మాత్రమే నిర్మించబడ్డాయి)
    • హర్స్ట్ హాఫ్ కాబ్
    • రివైవల్ జీప్స్టర్
    • కమాండో కన్వర్టిబుల్
    • బాహాటంగా చట్రం ఉండే రోడ్స్టర్
  • 1972-1973 C104— జీప్ కమాండో
    • కమాండో హాఫ్ కాబ్

CJ నమూనాలు[మార్చు]

(పౌరులకు అనువైన జీప్)

ఒక USPS మెయిల్ రవాణా వాహనం జీప్ చే తయారుచేయబడినది
1982 జీప్ స్క్రాంబ్లర్
  • 1944 అగ్రిజీప్ CJ-1
  • 1944-1945 CJ-2
  • 1945-1949 CJ-2A
  • 1949-1953 CJ-3A
  • 1950 CJ-V35
  • 1950 CJ-4- నమూనా
  • 1950 CJ-4M - నమూనా
  • 1950 CJ-4MA - నమూనాలు
  • 1953-1968 CJ-3B
  • 1954-1983 CJ-5
    • 1961-1963 టక్సేడో పార్క్ మార్క్ III
    • 1969 కామ్పర్
    • 1969 462
    • 1970 రేనీగ్రేడ్ I
    • 1971 రేనీగ్రేడ్ II
    • 1972-1983 రేనీగ్రేడ్ నమూనాలు
    • 1973 సూపర్ జీప్
    • 1977-1980 గోల్డెన్ ఈగిల్
    • 1977 గోల్డెన్ ఈగిల్ కాలిఫోర్నియా ఎడిషన్ (కాలిఫోర్నియా AMC డీలర్ షిప్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయబడినవి)
    • 1980 గోల్డెన్ హాక్
    • 1979 సిల్వర్ వార్షికోత్సవం CJ-5 పరిమిత ఎడిషన్ (దాదాపు 1,000 తయారుచేశారు)
  • 1955-1975 CJ-6
  • 1955-1968 CJ-3B లాంగ్- స్పెయిన్
  • 1960-1977 జీప్ గ్రామీణ- బ్రెజిల్
  • 1964-1967 CJ-5A/CJ-6A టక్సేడో పార్క్
  • 1976-1986 CJ-7
    • 1982 — జమ్బోరీ పరిమిత ఎడిషన్ (2500 యూనిట్లు)
  • 1979 — CJ-5 సిల్వర్ వార్షికోత్సవం పరిమిత ఎడిషన్- (సుమారుగా 1,000 తయారుచేయబడినవి)
  • 1981-1985 CJ-8 స్క్రాంబ్లర్
  • 1981-1985 CJ-10

DJ నమూనాలు[మార్చు]

(డిస్పాచర్ జీప్)

  • 1955 USAF DJ
  • 1955-1964 DJ-3A
    • సర్రే గాలా ప్యాకేజ్
  • 1965-1975 DJ-5
  • 1965-1973 DJ-6
  • 1967-1975 DJ-5A
  • 1970-1972 DJ-5B
  • 1973-1974 DJ-5C
  • 1975-1976 DJ-5D
  • 1976 DJ- 5E ఎలక్ట్రక్
  • 1977-1978 DJ-5F
  • 1979 DJ-5G
  • 1982 DJ- 5L

SJ (FSJ) నమూనాలు[మార్చు]

(పూర్తి నిడివి జీప్)

1974 చెరోకీ S పనిలో.
  • 1963-1983 SJ వాగోనీర్
  • 1963-1986 J-శ్రేణి
    • జీప్ గ్లేడియేటర్
    • జీప్ హొంకో
  • 1966-1969 SJ సూపర్ వాగోనీర్
  • 1967-1969 కైసర్ జీప్ M715- పౌరజీవనానికి అనువైన జీప్ గ్లాడియేటర్
  • 1974-1983 SJ చరోకీ
    • S
    • పరిమిత
    • క్లాసిక్
    • చీఫ్
    • క్రీడ
    • పయోనీర్
    • లారేడో983
  • 1984-1991 SJ జీప్ గ్రాండ్ వాగోనీర్
    • 1991 ఆఖరి ఎడిషన్

XJ నమూనాలు[మార్చు]

  • 1984-2001 XJ చెరోకీ
    • 1984-2001 — బేస్ "SE"
    • 1984-1988 — చీఫ్
    • 1984-1990 — పయోనీర్
    • 1985-1992 — లారేడో
    • 1987-1992/1998-2001 — పరిమిత
    • 1988-2001 — క్రీడా
    • 1991-1992 — బ్రయార్వుడ్
    • 1993-1997 — కంట్రీ
    • 1996-2001 — క్లాసిక్
  • 1984-1990 XJ వాగోనీర్
    • 1984-1985 — బ్రౌవుడ్
    • 1984-1990 — పరిమిత

MJ నమూనాలు[మార్చు]

(మెట్రిక్ టన్ జీప్ కొమాన్చ్)

  • 1986-1992 MJ కొమాన్చ్
    • 1986 — కస్టం
    • 1986 — X
    • 1986 — XLS
    • 1987-1992 — బేస్ SE
    • 1987-1990 — చీఫ్
    • 1987-1992 — లారేడో
    • 1987-1990 — పయోనీర్
    • 1987-1992 — స్పోర్ట్రక్
    • 1987-1992 — ఎలిమినేటర్
1997 జీప్ రాంగ్లర్ TJ

YJ, TJ, LJ మరియు JK నమూనాలు[మార్చు]

(జీప్ వ్రాంగ్లర్)

  • 1987-1995 వ్రాంగ్లర్ YJ
    • 1991-1993 రేనీగేడ్
    • 1988-1995 రాంగ్లర్ లాంగ్-వెనిజులా
2005 TJ రుబికన్
  • 1997-2006 రాంగ్లార్ TJSe, క్రీడా, సహారా నమూనాలు
    • 2002 - TJ Se, X, క్రీడా, సహారా నమూనాలు
    • 2003 - TJ రుబికాన్, సహారా, స్పోర్ట్, X, Se నమూనాలు
    • 2004-2006 - LJ అపరిమితమైన (నిడివిగల వర్షన్ TJ) రుబికాన్, స్పోర్ట్, X, Se నమూనాలు
    • 2004-2005 - విల్లీస్ ఎడిషన్ (2004-1997 చేయబడిన, 2005-2001 చేయబడిన)
    • 2004 — కొలంబియా ఎడిషన్
    • 2005 - రుబికాన్ సహారా అపరిమిత LJ (1000 తయారుచేయబడినవి)
    • 2006 - గోల్డెన్ ఈగిల్ ఎడిషన్
2006 గోల్డెన్ ఈగిల్
  • 2007-2009 రాంగ్లర్JK
    • 2007-2009 JK రుబికాన్, సహారా, X
    • 2010 JK రుబికాన్, సహారా, మౌంటైన్, ఐలాన్దర్, స్పోర్ట్
2010 జీప్ రాంగ్లర్ అన్లిమిటడ్ మౌంటైన్

ZJ, WJ, మరియు WK నమూనాలు[మార్చు]

(జీప్ గ్రాండ్ చెరోకీ)

మొదటి తరం ZJ
1994 ZJ లారేడో మోడల్
  • 1993-1998 ZJ గ్రాండ్ చెరోకీ
    • 1993–1995 – బేస్ SE
    • 1993–1998 – లారేడో
    • 1993–1998 – పరిమిత
    • 1995–1997 – ఒర్విస్ "పరిమిత ఎడిషన్"
    • 1997–1998 – TSi
    • 1998 - 5.9 పరిమిత
  • 1993 ZJ జీప్ గ్రాండ్ వాగోనీర్
  • 1999-2004 WJ గ్రాండ్ చెరోకీ
    • 2002–2003 — స్పోర్ట్
    • 2002–2004 — ప్రత్యేక ఎడిషన్
    • 2002–2004 — ఒవర్లాండ్
    • 2004 — కొలంబియా ఎడిషన్
  • జీప్ గ్రాండ్ చెరోకీ — ఐదుగురు-ప్రయాణీకుల కుటుంబ-విధానSUV.
    • WK — ఆ సరిక్రొత్త గ్రాండ్ చెరోకీ , 2005–ప్రస్తుతము ("WK" ఆ క్రొత్త గ్రాండ్ చెరోకీ కి రూపకల్పన చేసినవాడు, అది నాన్-J-గా రూపొందిన కొన్ని జీప్ లలో ఒకటి).

KJ నమూనాలు[మార్చు]

(జీప్ లిబర్టీ )

  • 2002-2007 KJ లిబర్టీ
    • క్రీడ
    • పరిమిత
    • రెనేగేడ్
    • 2003 ఫ్రీడం ఎడిషన్
    • 2004 కొలంబియా ఎడిషన్

ప్రస్తుత మాడల్ లు[మార్చు]

జీప్ బ్రాండ్ లో ప్రస్తుతం ఆరు మాడల్ లు ఉన్నాయి:

  • జీప్ రాంగ్లర్
    • JK — రాంగ్లర్ యొక్క ప్రస్తుతము వర్షన్, 2007 మోడల్ గా విడుదల చేయబడింది.
    • JK అపరిమిత — 2007 రాంగ్లర్ యొక్క పొడుగైన చక్ర బేస్ మరియు 4-తలుపులు కలిగిన వెర్షన్.
  • జీప్ గ్రాండ్ చెరోకీ — ఐదు-ప్రయాణికులు కుటుంబ ఉపయోగాలకు అనువైన SUV.
    • WK — గ్రాండ్ చెరోకీ , 2005–2010 ("WK" అనేది క్రొత్త గ్రాండ్ చెరోకీను సూచిస్తుంది. J అక్షరము లేని జీప్ మాడల్ లలో మొదటిది).
    • 2005–ప్రస్తుతము – లారేడో
    • 2005–ప్రస్తుతము – పరిమిత
    • 2006–ప్రస్తుతము – ఒవర్లాండ్
    • 2006–ప్రస్తుతము – SRT-8
    • WK2 (2010-ప్రస్తుతము )
  • జీప్ కమాండర్XK — ఏడు ప్రయాణికుల SUV.
  • జీప్ లిబర్టీKK — చిన్న SUV (చెరోకీ స్థానే వచ్చినది. ఉత్తర అమెరికాకు బయట ఆ పేరు పెట్టబడింది.
  • జీప్ కంపాస్MK — ఒక చిన్న క్రోసోవర్ SUV ప్లాట్ఫారం డోడ్జ్ కాలిబర్తో పంచుకున్నది.
  • జీప్ పేట్రియాట్MK — ఒక చిన్న క్రోసోవార్ SUV ప్లాట్ఫారం డోడ్జ్ కాలిబర్తో పంచుకోబడినది.

కాన్సెప్ట్ వాహనాలు[మార్చు]

  • 1958 DJ-3A పికప్
  • 1970 XJ001
  • 1970 XJ002
  • 1971 జీప్ కౌబోయ్
  • 1977 జీప్ II
  • 1986 చెరోకీ టార్గా ఒక రెండు-తలుపుల చెరోకీ మార్పుకు అనువైన (తరువాత జీప్ ఫ్రీడం షో కార్గా మార్చబడింది)
  • 1987 కొమాంచ్ తండర్చీఫ్ ఈ వాహనం కొమాంచ్ ఎలిమినేటర్ తరువాత దశలో నిర్మాణంలోకి తీసుకురాబడింది.
  • 1989 జీప్ రుబికాన్ రాంగ్లర్ ఈ వాహనం తరువాత దశలో నిర్మాణంలోనికి వచ్చింది.
  • 1990 జీప్ JJ ప్రత్యేకంగా ఐకాన్ అని తరువాత రోజులలో పిలువబడినది.
  • 1990 జీప్ ఫ్రీడం ఒక మార్పు చెందిన చెరోకీ టార్గా.
  • 1991 జీప్ వాగోనీర్ 2000 మరుసటి తరం వాగోనీర్ కొరకు ఒక రూపకల్పన స్టేడి. ఉత్పత్తి చేయబడలేదు
  • 1989 జీప్ కాన్సెప్ట్ 1 - ZJ గ్రాండ్ చెరోకీ గా మారింది.
  • 1993 జీప్ ఎక్కో
  • 1997 జీప్ చెరోకీ కాసాబ్లాంకా చెరోకీ యొక్క విశేష వెర్షన్- ఉత్పత్తి చేయబడలేదు.
  • 1997 జీప్ రాంగ్లర్ అల్టిమేట్ రెస్క్యూ SEMA ప్రదర్శన కొరకు రూపొందించబడిన TJ రాంగ్లర్ యొక్క మేరుగుబరించ వెర్షన్
  • 1997 ఫెన్డెర్ జీప్ రాంగ్లర్
  • 1997 జీప్ దకర్ XJ చెరోకీ మరియు TJ రాంగ్లర్ వెర్షన్ల కలయిక
  • 1997 జీప్ ఐకాన్ మరుసటి తరం రాంగ్లర్ కు ఒక డిజైన్ స్టడి
  • 1999 జీప్ జర్నీ
  • 1999 జీప్ జీప్స్టర్ కాన్సప్ట్
  • 2000 జీప్ చెరోకీ టోటల్ ఎక్స్పోషర్
  • 2000 జీప్ వర్సిటీ తరువాత కంపాస్ గా ఉత్పత్తి చేయబడింది.
  • 2000 జీప్ కమాండర్ కాన్సెప్ట్- తరువాత XK గా ఉత్పత్తి చేయబడింది
  • 2000 జీప్ విల్లీస్
  • 2001 జీప్ విల్లీస్ 2
  • 2002 జీప్ రాంగ్లర్ టబాస్కో
  • 2002 జీప్ రాంగ్లర్ పాట్రియాట్ రాంగ్లర్ X/సపోర్ట్ కు ఒక విశేష డెకాల్ పేకేజ్
  • 2002 జీప్ రాంగ్లర్ మౌంటైన్ బైకర్
  • 2004 జీప్ గ్రాండ్ చెరోకీ (WJ) కన్సియర్జ్
  • 2004 జీప్ ట్రియో
  • 2004 జీప్ రెస్క్యూ
  • 2004 జీప్ లిబరేటర్ CRD
  • 2005 జీప్ హరికేన్ - నాలుగు చక్రాల స్టియరింగ్ సిస్టం వలన వాహానానికి జీరో టర్నింగ్ సైకిల్ తో పాటు "క్రాబ్" సైడ్వేస్ కూడా ఉంటుంది.[22] దీని ఇంజిన్ తరువాత గ్రాండ్ చెరోకీ (WK) SRT/8 లో అమర్చబడింది.
  • 2005 జీప్ గ్లేడియేటర్ కాన్సెప్ట్ ఈ వాహానాన్ని ఉత్పత్తి చేయవలసి ఉంది కాని జీప్ దాన్ని రద్దు చేసింది.
  • 2005 జీప్ అగ్రేసర్ (రేజో)
  • 2007 జీప్ ట్రైల్ హాక్
  • 2008 జీప్ రేనిగేడ్
  • 2010 జీప్ J8
  • 2010 జీప్ నుకిజేర్ మిలిటరీ కైసేర్ M-715 ప్రేరణతో రూపొందించబడినది.

ప్రపంచవ్యాప్తంగా జీప్పులు[మార్చు]

ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు జీప్పులను నిర్మాణం గాని అసేమ్బిల్ గాని చేసాయి.[23]

  • అర్జంటినా - IKA జీప్ లు 1956-ప్రస్తుతము; ప్రస్తుతం క్రిస్లర్ క్రింద ఉంది[24]
  • ఆస్ట్రేలియా - విల్లీస్ మోటర్స్ ఆస్ట్రేలియా - 1940లు-1980లు[25]
  • బెల్జియం
ట్రాలర్ T4
  • బ్రెజిల్ - విల్లీస్ ఒవర్లాండ్ డో బ్రసిల్, ఫోర్డ్ చే కొనబడి ఫోర్డ్ డో బ్రసిల్ గా మారింది- 1957-1985[26].

ట్రోల్లెర్ T4 బ్రెజిల్ లో ఉత్పత్తి చేయబడున ఫైబర్ గ్లాస్ బాడి కలిగిన జీప్ వర్షన్. ట్రోలర్ ఫోర్డ్ డో బ్రసిల్ చే 2007లో కొనబడింది.

  • బర్మ/మయన్మార్ - రెండు బర్మా కంపెనీలు జీప్ యొక్క లైన్సేస్ లేని ప్రతిలని ఉత్పత్తి చేస్తున్నాయి; మయన్మార్ జీప్ లు మరియు చిన్ డ్విన్ స్టార్ జీప్ లు.
  • కెనడా - కైసేర్ జీప్ - 1959-1969[27]
  • చైనా - బీజింగ్ జీప్ కార్పరేషన్ - 1983 నుంచి 2009 వరకు బీజింగ్-బెంజ్ డైమ్లర్ క్రిస్లర్ ఆటోమోటివ్. గువాంగ్జో ఆటోమొబైల్ ఇండస్ట్రి గ్రూప్(GAIG)తో ఉమ్మడి గా ఫియట్-క్రిస్లర్ చైనా లో జీప్ ఉత్పత్తి ని చేయాలాని ప్రణాళిక.[28]
  • కోలంబియా - విల్లీస్ కొలంబియా - 1999 వరకైనా[29]
  • ఈజిప్ట్ - కైరో లో ఉన్న అరబ్ ఆర్గనైసేషణ్ ఫర్ ఇండస్ట్రియలైసెషన్ అనుబంద సంస్థ అరబ్ అమెరికన్ వెహికల్స్ - జీప్ చెరోకీ
  1. REDIRECT Template:Disambiguation needed
  • This is a redirect from a template shortcut to a template with a longer name. ను ఉత్పత్తి చేస్తుంది; ఓపెన్-టాప్, రాంగ్లర్- ఆధారిత జీప్ AAV TJL.
  • ఫ్రాన్స్ - హోట్చ్కిస్ మరియు ఆవేర్ల్యాండ్ - 1952-1962[30]
  • ఇండియా - మహీంద్రా & మహీంద్రా లిమిటడ్ - 1960లు-ప్రస్తుతము[31]
  • ఇరాన్ - DJ సీరీస్ మీద ఆధారపడిన పార్స్ ఖోడ్రో, షాబాజ్, సహరా, మరియు అహూ - షాబాజ్, జీప్ రాంగ్లర్ మరియు CJ సిరీస్ మీద ఆధారపడిన సహరా, మరియు వాగనీర్ మీద ఆధారపడిన అహూ
  • ఇస్రేల్ - ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ - AIL స్టారం (సుఫా) సీరీస్ జీప్ రాంగ్లర్-డెరివేటివ్ లను ఉత్పత్తి చేసే సంస్థ
  • ఇటలీ - 1950లు[32]
  • జపాన్ - మిట్సుబిషి జీప్ లు - 1953-1998[33]
  • కొరియా - ఆసియా మోటార్స్, Ltd, డోంగ్ ఎ మోటర్స్ (స్సాంగ్యాంగ్ మోటార్ కంపెనీ) మరియు కియా. (జీప్ పేరు వాడవద్దు) - 1980s-ప్రస్తుతము [34]
  • మెక్సికో - VAM జీప్లు - 1946-1987 [35]
  • నెథర్లాండ్స్ - నేడేర్లాండ్స్ కైసేర్-ఫ్రాజేర్ - 1954-1990లు[36]
  • ఫిలిప్పిన్స్ - జీప్నీస్s;[37] MD జువాన్ విల్లీస్ MB.;[38] "E-జీప్నీస్జీ" లేక మినిబసెస్, LSV (తక్కువ-స్పీడ్ వాహనాలు) విద్యుత్చక్తి వాడేవి.[39][40]
  • పోర్చుగల్ - బ్రేవియా - 1960లు -1980లు
  • స్పెయిన్ - వేహికులస్ ఇండస్ట్రియల్స్ వై అగ్రికోలాస్, S.A. (VIASA), ఎబ్రో ట్రక్స్ తో విలీనం అయింది. తరువాత నిస్సాన్ కు అమ్మబడింది - 1960-1990లు[41]
  • టర్కీ - టుజ్ల - 1954-1970లు[42]

వీటిని కూడా పరిశీలించండి[మార్చు]

  • AMC/జీప్ ట్రాన్స్మిషన్స్
  • అమెరికన్ మోటర్స్
  • జీప్ నాలుగు చక్రాల డ్రైవ్ సిస్టంలు
  • జీప్ ట్రైల్
  • జీప్నే
  • SUV మరియు కాంపాక్ట్ SUV
  • విల్లీస్
  • జీప్ పరేడ్
  • Jeep Jamboree: Off Road Adventure, అప్పటి జీప్ రాంగ్లర్ YJ మోడల్ మీద ఆదారపడిన ఒక వీడియో గేం

సూచనలు[మార్చు]

ఇన్లైన్
  1. "Wordorigins.org". Wordorigins.org. Retrieved 2010-07-04. 
  2. "The Military Jeep". Cossor.com.au. Retrieved 2010-03-12. 
  3. ""Invention of the Jeep" Waymark". Waymarking.com. 2006-03-09. Retrieved 2010-08-27. 
  4. Allen, Jim (2003). Jeep: Collector's Library. MBI Publishing Company. pp. 36–39. ISBN 9780760314869. 
  5. Scott, Graham (1996). Essential Military Jeep: Willys, Ford & Bantam models 1941–45. MBI Publishing Company. p. 25. ISBN 9781870979764. 
  6. Zaloga, Steven J. (2005). Jeeps 1941–45. Osprey Publishing. p. 10. ISBN 9781841768885. 
  7. లే బ్రౌన్, పట్రిషియా, ౭౪౭ ను ఎక్కడ వేలాడిస్తారు? , న్యూ యార్క్ టైమ్స్, డిసెంబర్ 13, 1998
  8. MOMA ప్రెస్ రిలీస్, ది మ్యూజియం ఆఫ్ మాడెర్న్ ఆర్ట్ పూర్తి సేకరణను ప్రదర్శిస్తుంది , పేజి 2 (జూన్ 2002) http://www.moma.org/about_moma/press/2002/AUTObodies_6_01_02.pdf
  9. ఆర్. కోల్, "కోలేమాన్ ను కొనడానికి అధ్యక్షుడు ఆశక్తి" న్యూ యార్క్ టైమ్స్, పేజి D1, ఫెబ్. 15, 1989.
  10. "Mitsubishi Jeep Photos on The CJ3B Page". Film.queensu.ca. 2002-08-29. Retrieved 2009-09-23. 
  11. మాన్, జిం. (1997). బీజింగ్ జీప్: చైనాలో ప్రాశ్చాత్య వ్యాపారాల గురించిన ఒక కేస్ స్టేడి. వెస్ట్ వ్యూ ప్రెస్. ISBN 0-691-06962-X.
  12. డున్నె, టిమొతీ."కాన్ క్రిస్లర్ రీబౌండ్ ఇన్ చైనా?" బసనెస్ వీక్, నవంబర్ 2, 2007. జనవరి 10, 2008న పునరుద్ధరించబడింది.
  13. "Toledo-built Jeeps' sales results abroad mirror those in North American market". News.top100.biz. 2007-11-13. Retrieved 2010-07-04. 
  14. "Jeepster VJ - - Jeep at Off-Road.com". Jeep.off-road.com. Retrieved 2009-09-23. [dead link]
  15. http://www.americanjeep sterclub.org/history/hist1.jpg
  16. http://www.americanjeep sterclub.org/history/hist2.jpg
  17. http://www.americanjeep sterclub.org/history/hist3.jpg
  18. http://www.americanjeep sterclub.org/history/49coupe.jpg
  19. http://www.americanjeep sterclub.org/history/proto.jpg
  20. http://www.americanjeep sterclub.org/history/proto2.jpg
  21. http://www.americanjeep sterclub.org/history/proto3.jpg
  22. "Jeep 4-wheel steering". Retrieved 2007-01-12. 
  23. "Jeeps Around the World on The CJ3B Page". Film.queensu.ca. 2009-01-31. Retrieved 2010-07-04. 
  24. "Jeeps in Argentina on The CJ3B Page". Film.queensu.ca. 2005-02-06. Retrieved 2010-07-04. 
  25. "Jeeps in Australia on The CJ3B Page". Film.queensu.ca. Retrieved 2010-07-04. 
  26. "Jeeps in Brasil on The CJ3B Page". Film.queensu.ca. Retrieved 2010-07-04. 
  27. "Kaiser Jeep in Canada 1959-69 on The CJ3B Page". Film.queensu.ca. Retrieved 2010-07-04. 
  28. "Fiat to Re-introduce Jeep to China". ChinaAutoWeb.com. 2010-05. 
  29. "Jeeps in Colombia on The CJ3B Page". Film.queensu.ca. 2010-03-22. Retrieved 2010-07-04. 
  30. "Jeeps in France on The CJ3B Page". Film.queensu.ca. 2008-09-17. Retrieved 2010-07-04. 
  31. "Mahindra Jeeps on The CJ3B Page". Film.queensu.ca. 2007-01-31. Retrieved 2010-07-04. 
  32. "Jeeps in Italy on The CJ3B Page". Film.queensu.ca. 2009-03-24. Retrieved 2010-07-04. 
  33. "Jeeps in Japan on The CJ3B Page". Film.queensu.ca. 2009-01-31. Retrieved 2010-07-04. 
  34. "Jeeps in Korea on The CJ3B Page". Film.queensu.ca. 2006-11-02. Retrieved 2010-07-04. 
  35. "Jeeps in Mexico on The CJ3B Page". Film.queensu.ca. 2002-07-25. Retrieved 2010-07-04. 
  36. "Jeeps in the Netherlands on The CJ3B Page". Film.queensu.ca. Retrieved 2010-07-04. 
  37. "Jeepneys of the Philippines on The CJ3B Page". Film.queensu.ca. 2005-04-27. Retrieved 2010-07-04. 
  38. (AFP) – Jun 30, 2008 (2008-06-30). "Afp.google.com, Philippine firm brings old WWII jeeps back to life". Afp.google.com. Retrieved 2010-07-04. 
  39. The Earthtimes (2008-07-01). "earthtimes.org, Electric minibuses start commercial operations in Philippines". Earthtimes.org. Retrieved 2010-07-04. 
  40. "manilastandardtoday.com, Enforcers to drive E-jeeps". Manilastandardtoday.com. Retrieved 2010-07-04. 
  41. "Jeeps in Spain on The CJ3B Page". Film.queensu.ca. 2009-02-12. Retrieved 2010-07-04. 
  42. "Jeeps in Turkey on The CJ3B Page". Film.queensu.ca. 2005-11-22. Retrieved 2010-07-04. 
సాధారణ
  • Allen, Jim (2004). Jeep. MBI Publishing Company. ISBN 9780760319796. 
  • Foster, Patrick R. (2003). Standard Catalog of Jeep 1940-2003. Krause Publications. ISBN 9780873495226. 
  • Ludel, Moses (1992). Jeep Owner's Bible: A Hands-On Guide to Getting the Most from Your Jeep. Robert Bentley Publishers. ISBN 9780837601540. 
  • Hartwell, Dickson (December 1960). "The Mighty Jeep". American Heritage Magazine 12 (1). 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Jeep Car Timeline మూస:Chrysler Holding LLC

"http://te.wikipedia.org/w/index.php?title=జీప్&oldid=1183243" నుండి వెలికితీశారు