సింధూ నదికి ఉపనది అయిన జీలం నది (Jhelum River) పంజాబ్‌లో ప్రవహించే నదులలో పెద్దది. 774 కిలోమీటర్ల దూరం ప్రవహించే జీలం నది వేదకాలంలో వితస్థగా పిలువబడింది. కాశ్మీర్ లోయలోని పిర్‌పంజల్ దిగువ భాగాన వెరినాగ్ ప్రాంతంలో జన్మించిన జీలం నది శ్రీనగర్ మరియు ఊలర్ సరస్సు గుండా ప్రవహించి పాకిస్తాన్ లో ప్రవేశిస్తుంది. ఈ నది యొక్క పెద్ద ఉపనది అయిన నీలం నది ముజఫరాబాదు వద్ద, తరువాతి పెద్ద ఉపనది అయిన కున్హర్ నది కాఘన్ లోయలో జీలం నదిలో కలుస్తున్నాయి. జీలం జిల్లాలో ఈ నది పంజాబ్ రాష్ట్రంలో కలుస్తుంది. తరువాత ఇది పాకిస్తాన్ పంజాబ్‌లోని తీరమైదానంలో ప్రవేశిస్తుంది. చివరికి ట్రిమ్ము వద్ద చీనాబ్ నదిలో సంగమిస్తుంది.
బయటి లింకులు [మార్చు]