జీవ శాస్త్రము
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
జీవుల అధ్యయనము జీవ శాస్త్రము (ఆంగ్లం biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ వర్గీకరణ కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని అణుజీవశాస్త్రం (మాలిక్యులార్ బయాలజీ) అనీ, జీవరసాయనశాస్త్రం (బయోకెమిస్ట్రీ) అనీ, జీవసాంకేతిక శాస్త్రం (బయోటెక్నాలజీ) అనీ, అణుజన్యుశాస్త్రం (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని కణజీవశాస్త్రం (సెల్ బయాలజీ) అనీ, అంగము (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని శరీర నిర్మాణ శాస్త్రము (అనాటమీ) అనీ, జన్యువు నిర్మాణాన్ని, అనువంశికతను జన్యుశాస్త్రం (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.
విషయ సూచిక |
[మార్చు] జీవ శాస్త్రము భాగాలు
[మార్చు] వృక్ష శాస్త్రము
[మార్చు] జంతు శాస్త్రము
[మార్చు] వైద్య శాస్త్రము
|
|
|
|---|---|
|
జీవ శాస్త్రము · గణిత శాస్త్రము · భౌతిక శాస్త్రము · రసాయన శాస్త్రము · వైద్యశాస్త్రము · ఖగోళ శాస్త్రము · భూగోళ శాస్త్రము |