జురాసిక్ పార్క్ ఫ్రాంచైస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jurassic Park film series
దస్త్రం:Jurassic Park Adventure Pack.jpg
Jurassic Park Adventure Pack
దర్శకత్వం Steven Spielberg (Jurassic Park & The Lost World: Jurassic Park)
Joe Johnston (Jurassic Park III)
రచన Michael Crichton (Jurassic Park & The Lost World)
Malia Scotch Marmo (Jurassic Park)
David Koepp (Jurassic Park & The Lost World)
Alexander Payne (Jurassic Park III)
Peter Buchman (Jurassic Park III)
Jim Taylor(Jurassic Park III)
సంగీతం John Williams (Jurassic Park & The Lost World)
Don Davis (Jurassic Park III)
పంపిణీదారు Universal Pictures
విడుదలైన తేదీ 1993 - present
దేశం United States
భాష English
పెట్టుబడి $229,000,000
వసూళ్లు $1,902,110,923

జురాసిక్ పార్క్ ఫ్రాంచైస్ అనేది క్లోండ్ రాక్షసబల్లుల థీం పార్క్ ను సృష్టించుటకు చేసిన విపత్కరమైన ప్రయత్నానికి సంభందించిన పుస్తకాలు, సినిమాలు, బొమ్మల కథలు మరియు వీడియోల ధారావాహిక. 1990లో యూనివర్సల్ స్టూడియోస్ మైఖేల్ క్రింక్టన్ రాసిన నవల ప్రచురణకు ముందే దాని హక్కులను కొనుగోలు చేయడంతో ఈ ప్రయత్నము మొదలయ్యింది.

ఈ నవల ఆధారంగా వచ్చిన 1993 ఫిలిం అడాప్షన్ సాధించిన విజయంలాగానే ఈ నవల పెద్ద విజయం సాధించింది. ఈ విజయం రెండు కొనసాగింపు సినిమాలకు దారి తీసింది. అయితే చివరిది మాత్రం మొదట వచ్చిన సినిమాల లాగా నవల ఆధారితం కాదు. 1993 సినిమా నుండి వీడియో ఆటలను అభివృద్ధి చేసే హక్కులను ఓషన్ సాఫ్ట్వేర్, బ్లూస్కై సాఫ్ట్వేర్, సెగా ఆఫ్ అమెరికా మరియు టెల్టేల్ గేమ్స్ వంటి సాఫ్ట్వేర్ కంపనీలు తీసుకుని ఎన్నో రకాలైన వీడియో ఆటలను అభివృద్ధి చేశాయి.

మూడవ సినిమా తరువాత ప్రస్తుతము నాల్గవ చలన చిత్రం తయారి దశలో ఉంది కాని సంవత్సరంనుండి డెవలప్మెంట్ హెల్ నందు వేలాడుతోంది. ఈ ప్రాజెక్టు యొక్క నేపధ్యం, రచన మరియు కొత్త లోగోలకు సంబంధించి ఎన్నో పుకార్లు ప్రారంభ దశ నుండి ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు తయారు అవుతున్న నాల్గవ సినిమా పాత సినిమాల లాగా కాకుండా కొత్త నేపధ్యంతో వస్తుందని జురాసిక్ పార్క్ III దర్శకుడైన జో జాన్స్టన్ నవంబర్ 2009లో తెలిపారు.[1]

అభివృద్ధి[మార్చు]

మైఖేల్ క్రింక్టన్ ఈ స్క్రీన్ రచనకు ముందు ఫాసిల్ DNA నుండి క్లోన్ చేయబడిన ఒక టెరోసార్ చుట్టూ తిరుగుతున్న తన ఆలోచనలతో కుస్తీపడి జురాసిక్ పార్క్ నవలను వెలుగులోకి తెచ్చారు.[2] అక్టోబర్ 1989లో స్టీవెన్ స్పీల్బర్గ్ క్రింక్టన్ తో ఒక టెలివిజన్ ధారావాహిక ER కు సంభందించిన చర్చలో ఉండగా ఈ నవల గురించి తెలుసుకొన్నారు. ఈ నవల ప్రచురణకు ముందే క్రింక్టన్ ఎటువంటి బేరానికి తావులేకుండా 1.5 మిలియన్ల డాలర్ల పారితోషకము మరియు ముడి ఆదాయంలో కొంత శాతాన్ని కావాలని అడిగారు. ఈ నవల యొక్క హక్కులకోసం[3] వార్నర్ బ్రదర్స్ మరియు టిం బర్టాన్, కొలంబియా ట్రైస్టార్ మరియు రిచర్డ్ డొన్నార్, 20వ సెంచరి ఫాక్స్ మరియు జో డాంటే లు కూడా వేలం పాటలో ప్రయత్నించారు. అంతేకాకుండా యూనివర్సల్ క్రింక్టన్ కు 500,000 డాలర్లు నవలకోసం[4] చెల్లించింది. అయితే మే 1990లో స్పీల్బర్గ్ కోసం యూనివర్సల్ ఈ హక్కులను సాధించింది.[3] తమ కంపనీని నిలబెట్టుకోవడం కోసం యూనివర్సల్ కు డబ్బు చాల అవసరం ఉండింది. జురాసిక్ పార్క్ వాణిజ్యపరంగా[5] మరియు విమర్శనాత్మకంగా[6] విజయం సాధించి కొంత మేరకు ఈ అవసరాన్ని తీర్చింది.

హోం వీడియోకు జురాసిక్ పార్క్ విడుదలైన తరువాత కొనసాగింపు నవలకోసం క్రింక్టన్ పై వత్తిడి ఏర్పడింది. కాని క్రింక్టన్ వాటన్నిటిని తోసిపుచ్చాడు. అయితే నవలకు కొనసాగింపు వచ్చినట్లయితే దానిని సినిమానువాదంగా మలిచి దర్శకత్వం చేయడానికి స్పీల్బర్గ్ ఆశక్తి కనబరచిన తరువాత క్రింక్టన్ ఒప్పుకున్నాడు. క్రింక్టన్ వెంటనే పని ప్రారంభించాడు. 1995లో నవల ప్రచురణ అయిన తరువాతThe Lost World: Jurassic Park సెప్టెంబర్ 1996లో చిత్ర నిర్మాణం ప్రారంభమైయ్యింది.[7]

రెండవ చిత్రం యొక్క నిర్మాణానికి ముందు జో జాన్స్టన్ సీవెన్ స్పీల్బర్గ్ ను దర్శకత్వము గురించి సంప్రదించాడు. మొదటి కొనసాగింపు చిత్రాన్ని స్పీల్బర్గ్ దర్శకత్వం చేయాలనుకున్నాడు. ఒకవేళ మూడవ సినిమా వస్తే దాన్ని జాన్స్టన్ దర్శకత్వం చేసేందుకు ఒప్పుకున్నాడు.[8] 2000 ఆగస్టు 30న నిర్మాణం మొదలయ్యింది.[9]

పుస్తకాలు[మార్చు]

శిధిలావస్థలో ఉన్న DNA నుంచి టెరోసార్ ను అభివృద్ధి చేసే నేపధ్యం ఉన్న ఆలోచన నుండి జురాసిక్ పార్క్ తయారయ్యింది.[10] మైఖేల్ క్రింక్టన్ ఈ ఆలోచనతో చాల సంవత్సరాలు పనిచేశాడు. ఆయన తన మొదటి భాగంలో ఒక థీం పార్క్ మరియు ముఖ్య పాత్రలో ఒక చిన్న బాలుడు ఉండాలని నిర్ణయించుకున్నాడు.[10] కాని దీనికి చాల విరుద్ధమైన స్పందన రావడంతో క్రింక్టన్ తన నవలను తిరిగి పెద్దల ఆలోచనా సరళికి సరిపోయేటట్టు రాశాడు. ఈ ప్రయత్నంతో ఫలితం కొద్దిగా మెరుగయ్యింది.[10]

దీనికి కొనసాగింపు నవల కోసం పాఠకులు మరియు స్టీవెన్ స్పీల్బర్గ్ నుండి క్రింక్టన్ కు వత్తిడి పెరగడంతో కొనసాగింపు నవల నిర్మాణం మొదలయ్యింది.[11] తన నవలలో సర్ ఆర్థర్ కోనన్ డోయ్లె యొక్క ఇదే పేరుతో ఉన్న నవల లోని కొన్ని అంశాలు ఉన్నాయని మైఖేల్ క్రింక్టన్ చెప్పాడు.[12] ఈ పుస్తకము వృత్తిపరమైన మరియు ఔత్సాహిక విమర్శకుల వద్ద పెద్ద విజయము సాధించింది.[11] ఒక చిత్ర అనుకరణ 1997లో విడుదలయ్యింది.

కామిక్ పుస్తకాలు[మార్చు]

టాప్స్ కామిక్స్[మార్చు]

ఇప్పుడు వాడుకలో లేని టాప్స్ కామిక్స్ జూన్ 1993 నుండి ఆగస్ట్ 1997 వరకు మొదటి రెండు సినిమాల యొక్క అనుకరణలు మరియు జురాసిక్ పార్క్ యొక్క బొమ్మల పుస్తకాలను ప్రచురించింది. అవి:

  • జురాసిక్ పార్క్ #1-4 (జూన్ - ఆగస్ట్ 1993). కథను చిత్రానికి అనుగుణంగా మలచడం, వాల్టర్ సైమంసన్ చే రచించబడిన మరియు గిల్ కేన్ గీసిన చిత్రం. ప్రతి పుస్తకముపై రెండు కవర్లు ఉండేవి - ఒకటి కేన్ నుండి మరొకటి డేవ్ కాక్రం నుండి.
  • జురాసిక్ పార్క్ #0 (నవంబర్ 1993, ఏకైక సంచిక). చిత్రానికి రెండు పూర్వపు కథలు, ఒకటి పార్కు చుట్టూ తిరుగుతున్న డోనాల్డ్ జెన్నారో గా జాన్ హామ్మండ్ నటించారు. ఇంకొకటి హామ్మండ్ మరియు డెన్నిస్ నేడ్రి ల మధ్య వివాదము, డెన్నిస్ నేడ్రి యొక్క మోసము తెలుపునది. వాల్టర్ సైమంసన్ రచించిన మరియు గిల్ కేన్ గీసిన చిత్రం. ఈ సంచిక చిత్ర అనుకరణ యొక్క ట్రేడ్ పేపర్ బ్యాక్ లో మాత్రమే లభించేది.
  • జురాసిక్ పార్క్: రాప్టర్ #1-2 (నవంబర్ - డిసెంబర్ 1993). "రాప్టర్" ట్రైలాజీ మొదటి భాగం మరియు చిత్రం యొక్క కొనసాగింపు. స్టీవ్ ఏంజిల్హార్ట్ రచించిన మరియు ఆర్మండో గిల్ మరియు డెల్ బర్రాస్ చే గీయబడింది.
  • జురాసిక్ పార్క్: రాప్టర్స్ యొక్క దాడి #1-4 (మార్చ్ - జూన్ 1994) ట్రైలాజీ యొక్క రెండవ భాగము ఏంజిల్హార్ట్ చే రచించబడి, ఆర్మండో గిల్ (#1) మరియు చాజ్ ట్రోగ్ చే గీయబడింది. ఈ కథ ప్రకారం రాబర్ట్ మల్దూన్ అనే పాత్ర చనిపోలేదు.
  • జురాసిక్ పార్క్: రాప్టర్స్ హైజాక్ #1-4 (జులై - అక్టోబర్ 1994) ట్రైలాజీ యొక్క ఆఖరి భాగం. ఎంజిల్హార్ట్ రచించారు, నీల్ వోక్స్ కళాత్మక నైపుణ్యాన్ని అందించారు.
  • జురాసిక్ పార్క్ వార్షికం (మే 1995) రెండు కథలు కలిగి ఉన్నది. ఒకటి కొనసాగింపు కథ మరొకటి పూర్వపు కథ. నీల్ బార్రేట్ జూ., మైఖేల్ గోల్డెన్ మరియు రెనీ విట్టర్స్టేటర్ చే రచించబడి, క్లాడ్ సెయింట్.ఆబిన్ మరియు ఎడ్ ముర్ చే గీయబడింది.
  • రిటర్న్ టు జురాసిక్ పార్క్ #1-9 (ఏప్రిల్ 1995 - ఫెబ్రవరి 1996). తక్కువ నిడివిగల జరుగుతున్న ధారావాహిక. ఈ నాలుగు సంచికలు ఏంజిల్హార్ట్ రచించారు. (కామిక్ పుస్తకముతో తన ఆఖరి ప్రమేయాన్ని తెలుపుతూ). జో స్టాటన్ చే గీయబడింది. "రాప్టర్" ట్రైలాజీకి ఇది కొనసాగింపు కాదు. తరువాతి నాలుగు సంచికలు టాం మరియు మేరి బీర్బాం రచించారు. దీనికి ఆర్మాండ్ గిల్ చిత్రాలు గీసాలు. బీర్బాంలు రెండు కొత్త పాత్రలను ప్రొటాగానిస్టులుగా పరిచయం చేసారు. ఆఖరుదైన తొమ్మిదవ సంచిక కీథ్ గిఫ్ఫెన్ మరియు డ్వైట్ జోన్ జిమ్మేర్మాన్ రచించిన జాం పుస్తకము. ఇందులో కళాత్మక నైపుణ్యాన్ని ప్రఖ్యాత కళాకారులైన జాసన్ పియర్సన్, ఆడం హ్యుగ్స్, పాల్ గులాసి, జాన్ బైం, కెవిన్ మాగురె, మైక్ జెక్, జార్జ్ పెరెజ్ మరియు పాల్ చాడ్విక్ అందించారు. ఈ సంచిక తరువాత ధారావాహికలో చిన్న విరామం ఏర్పడి ఇప్పటికి కొనసాగుతోంది.
  • లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్ #1-4 (మే - ఆగస్ట్ 1997) రెండవ చిత్రం యొక్క అనుకరణ. డాన్ మెక్గ్రెగర్ చే రచించబడి, జేఫ్ఫ్ బట్లర్ (#1-2) మరియు క్లాడ్ సెయింట్. ఆబిన్ (#3-4) చే గీయబడింది. ప్రతి సంచిక పలు కవర్లతో వచ్చింది - ఒకటి వాల్టర్ సైమంసన్ చే కాగా ఇంకొకటి ఫోటో కవర్.

"రిటర్న్ టు జురాసిక్ పార్క్" కు చెందిన #9 సంచిక తప్ప మిగతా అన్నిటి కవర్లు మైఖేల్ గోల్డెన్ చే చిత్రించబడ్డాయి. #9 మాత్రం జాన్ బాల్టాన్ చిత్రించిన కవర్తో వెలువడింది.

IDW కామిక్స్[మార్చు]

2010 ప్రారంభంలో జురాసిక్ పార్క్: రిడెంషన్ అనే సరికొత్త ధారావాహికను IDW పబ్లిషింగ్ అనే సంస్థ అభివృద్ధి పరిచింది. ఈ కొత్త ధారావాహిక కనీసం ఆరు కామిక్లను కలిగి ఉండేలా అభివృద్ధి చేసారు. IDW ప్రచురించిన కామిక్స్:

  • జురాసిక్ పార్క్: రిడెంషన్ #1-2 (జూన్ 2010 - ప్రస్తుతము). బాబ్ ష్రెక్ చే రచించబడింది.ఇస్లా నబ్లార్ సంఘటన తరువాత 13 సంవత్సరాలకు టిం మరియు లేక్స్ మర్ఫిల గురించి ఈ ధారావాహిక ప్రస్తావిస్తుంది.[13]

ప్రస్తుత చిత్రాలు[మార్చు]

జురాసిక్ పార్క్[మార్చు]

మైఖేల్ క్రింక్టన్ రచించిన జురాసిక్ పార్క్ నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ అదే పేరుతొ 1993 లో సైన్సు ఫిక్షన్ సినిమా తీశారు. ఈ చిత్రం కథ ఇస్లా నబ్లార్ అనే ద్వీపం చుట్టూ తిరుగుతుంది. ఈ ద్వీపంలో శాస్త్రవేత్తలు విజ్ఞానాత్మక మరియు వినోదాత్మక పార్కు ను నిర్మిస్తారు. అందులో వైజ్ఞానిక శాస్త్రం ద్వారా పుట్టించిన రాక్షసబల్లులు ఉంటాయి. జాన్ హమ్మండ్ (రిచర్డ్ అటెంబరో) కొంతమంది శాస్త్రవేత్తలను పార్కును సందర్శించటానికి పిలుస్తాడు. శాస్త్రవేత్తలుగా సామ్ నీల్, జెఫ్ఫ్ గోల్ద్బ్లం మరియు లారా డర్న్ లు నటించారు. విచ్చలవిడిగా రాక్షసబల్లులను వదలడంతో సాంకేతిక నిపుణులు మరియు సందర్శకులు ద్వీపం నుండి పారిపోవటానికి ప్రయత్నించారు.

చిత్ర నిర్మాణం నవల ప్రచురణకు ముందే మొదలయ్యింది. నవల యొక్క కథను బాగా తగ్గించి సినిమాకు అనుగుణంగా స్క్రిప్ట్ రాయటానికి క్రింక్టన్ ను నియమించారు. స్పీల్బర్గ్ స్టాన్ విన్స్టన్ స్టూడియోస్ యొక్క తోలు బొమ్మలను అద్దెకు తీసుకొని ఇండస్ట్రియల్ లైట్ & మ్యాజిక్ సహాయంతో రాక్షసబల్లులను చిత్రీకరించడానికి కట్టింగ్ ఎడ్జ్ CGI ను అభివృద్ధి చేశారు. పాత్ర స్వభావాన్ని విమర్శిన్చినప్పటికి, విమర్శకులు జురాసిక్ పార్క్ చిత్రాన్ని ఆమోదించారు. ఈ చిత్రం విడుదలైనపుడు 914 మిలియన్ డాలర్ల అత్యధిక వసూళ్లు నమోదు చేసి అంతవరకు వచ్చిన అన్ని చిత్రాలకంటే విజయవన్తమైనదిగా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం అత్యధిక వసూళ్లు చేసిన 14వ చిత్రం గా ఉంది. ముఖ్యంగా CGI ను స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కోసం ఉపయోగించే చిత్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా 1997 లో The Lost World: Jurassic Park , 2001 లో జురాసిక్ పార్క్ III మరియు డెవలప్మెంట్ హెల్ లో ఉన్న జురాసిక్ పార్క్ IV వచ్చాయి.

ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్[మార్చు]

ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్ 1997 లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా. మైఖేల్ క్రింక్టన్ ఇదే పేరుతో రచించిన నవల ఆధారంగా స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వము వహించిన జురాసిక్ పార్క్ సినిమాకు ఇది కొనసాగింపు. మొదటి సినిమా విజయం తరువాత అభిమానులు మరియు విమర్శకులు కొనసాగింపు నవలకై మైఖేల్ క్రింక్టన్ పై వత్తిడి తెచ్చారు. గతంలో ఇటువంటి కొనసాగింపు నవల రాసిన అనుభవం లేకపోవడంతో క్రింక్టన్ ముందు ఒప్పుకోలేదు. కాని స్టీవెన్ స్పీల్బర్గ్ బలవంతంతో క్రింక్టన్ కొనసాగింపు నవలను ప్రకటించాడు. ఆ నవల ప్రచురణ అయిన వెంటనే, ఒక చలనచిత్ర నిర్మాణం చేపట్టారు. ఈ చలనచిత్రాన్ని 1997 మధ్యలో విడుదల చేయాలనుకున్నారు. విడుదలైన తరువాత ఆ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతమైన చిత్రంగా నిలిచి, ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం మిశ్రమ విమర్శలను అందుకుంది. దీని ముందు వచ్చిన సినిమాల లాగ పాత్ర స్వభావం గురించిన విమర్శలు ఎదుర్కొంది. ఈ చిత్రం క్రింక్టన్ యొక్క నవల ఆధారితంగానే తీసినప్పటికీ, కేవలం ఒకే సన్నివేశాన్ని నవల నుంచి తీసుకొని సినిమాలో వాడుకున్నారు.

ఈ చిత్రంలో కథ ఇస్లా సొర్న అనే ద్వీపం చుట్టూ తిరుగుతుంది. రాక్షసబల్లులు ఆక్రమించి, నివసిస్తున్న అడవి ఉన్న ప్రధాన జురాసిక్ పార్క్ ద్వీపానికి ఇది అనుబంధంగా ఉంటుంది. ఇయాన్ మాల్కం బృందం రాక్షసబల్లులను వాటి నివాస స్థలంలో చిత్రీకరించి డాకుమెంటరీ తాయారు చేయడానికి బయలుదేరుతారు. కాగా, ఇంజెన్ బృందం రాక్షసబల్లులను వల పన్ని పట్టుకొని సాన్ డిగోలో రెండవ జురాసిక్ పార్క్ నిర్మించాలనుకుంటారు.

ది లాస్ట్ వరల్డ్ చిత్రం ముగిసిన తరువాత స్టీవెన్ స్పీల్బర్గ్ తను మరోసారి జురాసిక్ పార్క్ చిత్రం గురించి పని చేయనని ప్రకటించారు. కొన్ని సంవత్సరాల తరువాత, జో జాన్స్టన్ జురాసిక్ పార్క్ III నిర్మాణం చేపట్టారు.

జురాసిక్ పార్క్ III[మార్చు]

జురాసిక్ పార్క్ III 2001 లో విడుదలైన సైన్సు ఫిక్షన్ చిత్రం, పైగా ఇది The Lost World: Jurassic Park కు కొనసాగింపు. మైఖేల్ క్రిక్టన్ రాసిన నవల ఆధారం కాకుండా మరియు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించని జురాసిక్ పార్క్ చిత్రాలలో ఈ చిత్రం మొదటిది. నిజానికి, మూడవ జురాసిక్ పార్క్ చిత్రం జురాసిక్ పార్క్: ఎక్స్టిన్షన్ [14] పేరుతొ నిర్మించబడింది. ఈ చిత్రానికి ప్రాణాంతకమైన వ్యాధితో రెండు ద్వీపాల్లోని రాక్షసబల్లులు అంతరించిపోవడం అనే స్క్రిప్ట్ ను అనుకున్నారు. స్క్రిప్టులో చాలా రకాలుగా మార్పులు చేసిన తరువాత, యూనివర్సల్ ఆ స్క్రిప్టును తిరస్కరించి, ప్రస్తుతం సినిమాలో ఉన్న స్క్రిప్టును ఎంచుకొని దానికి జురాసిక్ పార్క్ III అని పేరు పెట్టింది. తిరస్కరించిన స్క్రిప్టును జురాసిక్ పార్క్ IV కోసం వాడదలిచారు.[15]

జో జాన్స్టన్ జురాసిక్ పార్క్ యొక్క కొనసాగింపు చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆసక్తి కనబరిచి, తన స్నేహితుడైన స్టీవెన్ స్పీల్బర్గ్ ను సంప్రదించాడు. స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ యొక్క మొదటి కొనసాగింపు చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆసక్తి తెలిపారు. ఈ ధారావాహికలో మూడవ చిత్రాన్ని కూడా నిర్మిస్తే, ఆ చిత్రానికి జాన్స్టన్ దర్శకత్వం వహించేందుకు స్పీల్బర్గ్ ఒప్పుకున్నారు.[8] అయినప్పటికీ, స్పీల్బర్గ్ ఈ మూడవ కొనసాగింపు చిత్రానికి ఎక్సెక్యూటివ్ ప్రోడ్యూసరుగా పని చేసి చిత్ర నిర్మాణంలో పాల్గొన్నారు. కాలిఫోర్నియా, ఓహు మరియు మోలోకాయ్ లలో చిత్రీకరణతో ఈ సినిమా యొక్క నిర్మాణము 30 ఆగస్ట్, 2000[9] న మొదలయ్యింది.[16] ఈ చిత్రం ఒక మోస్తరుగా విజయం సాధించి విమర్శకుల నుండి మిశ్రమ అభిప్రాయాలను అందుకుంది. ఇంతకుముందు వచ్చిన చిత్రాల కంటే ఈ మూడవ చిత్రం బాగుందా లేక అసలు బాగాలేదా అనే విషయమై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఈ చిత్రం మరియొకసారి పాత్రపరంగా విమర్శలను ఎదుర్కొంది.

రెండవ సినిమాలో ఉన్న ఏ పాత్ర ఇందులో కనిపించదు. అయితే మొదటి సినిమాలో నటించిన శాం నీల్ మరియు లారా డార్న్ ఇందులో నటించారు.ఇయాన్ మాల్కం మరియు జాన్ హామ్మండ్ గురించి ప్రస్తావించడం జరిగింది. రెండవ చిత్రంలో చూపించిన ఇస్లా సొర్నా అనే ద్వీపాన్ని ఇందులో కూడా చూపించారు. ఈ చిత్రంలో ఒక జంట డా.ఎలాన్ గ్రాంట్ ను తమ పర్యాటక మార్గదర్శకుడిగా నియమించుకున్నారు (నిజానికి వీరు అతనిని తమ కొడుకైన ఎరిక్ ను కాపాడటానికి నియమించుకున్నారు). కాని వాళ్ళ లోహవిహంగము ద్వీపంపై కూలిపోవడంతో బ్రతికి బయటపడినా వాళ్ళు ద్వీపం నుండి పారిపోవుటకు ప్రయత్నిస్తుండగా స్పైనాసరస్ మరియు వెలోసిరాప్టర్స్ వెంటబడి తరిమాయి.

భవిష్యత్తు[మార్చు]

జురాసిక్ పార్క్ IV[మార్చు]

జూన్ 2002లో స్టార్లాగ్ మాగజైన్ కు ఇచ్చిన ముఖాముఖిలో దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ జురాసిక్ పార్క్ IV ను నిర్మించదలిచి, జురాసిక్ పార్క్ III యొక్క దర్శకుడైన జో జాన్స్టన్, ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తాడని ప్రకటించాడు. నవంబర్ 2002లో విలియం మొనాహన్ అనే రచయిత ఈ చిత్రం కోసం నియమించబడ్డాడు[17]. ఈ చిత్రాన్ని 2005 వేసవిలో విడుదల చేయాలనుకున్నారు.[18] జూలై 2003 నాటికి మొనాహన్ కథయొక్క మొదటి డ్రాఫ్ట్ ను సిద్ధం చేసాడు. ఈ భాగం పూర్తి సమయానికి కథ అడవి నేపధ్యంలో లేదు.{0/) ఈ చిత్రం యొక్క చిత్రీకరణ 2004లో కాలిఫోర్నియా మరియు హావాయిలలో మొదలౌతుందని అనుకున్నారు. ఇందులో డా.ఎలెన్ గ్రాంట్ పాత్ర తనే పోషిస్తున్నానని నటుడు శాం నీల్ తెలిపారు.[19] 2004 సెప్టెంబర్ లో జాన్ సేయ్ల్స్ చిత్రం యొక్క స్క్రిప్ట్ ను తిరిగి రాయడంతో ఈ చిత్రం విడుదల 2005 శీతాకాలానికి వాయిదా పడింది.[20]

ఇంతకు ముందు జురాసిక్ పార్క్ చిత్రాలకు పని చేసున సాంకేతిక సలహాదారుడైన పేలియంటోలజిస్ట్ జాక్ హార్నర్ 2004 అక్టోబర్ లో ఈ చిత్రానికి కూడా తను పని చేస్తున్నట్టు తెలిపారు.[21] ఏప్రిల్ 2005 నాటికి, స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కళాకారుడైన స్టాన్ విన్స్టన్ ఇచ్చిన వివరణ ప్రకారము ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్ ను పదే పదే మార్చడం మూలంగా, అందులో ఏ ఒక్కటి దర్శకుడు స్పీల్బర్గ్ ను తృప్తి పరచ లేకపోవడం మూలంగా ఈ చిత్రం యొక్క నిర్మాణం ఆలస్యమయ్యింది. విన్స్టన్ చెప్పిన ప్రకారం, ఏ ఒక్క స్క్రిప్ట్ లో కూడా సైన్స్ మరియు సాహస అంశాల సమతుల్యం ప్రభావితంగా లేవని దర్శకుడు భావించాడు. మితిమీరిన సైన్స్ మరియు సాహసం చిత్రాన్ని విమర్శల పాలు చేస్తాయి.ఈ రెండిటి మధ్య రాజీ కుదరడం కష్టతరం.[22] ఫిబ్రవరి 2006 లో నిర్మాత ఫ్రాంక్ మార్షల్ చిత్రానికి సరైన స్క్రిప్ట్ దొరికిందని, చిత్రీకరణ 2007 లో మొదలౌతుందని, 2008లో విడుదలౌతుందని తెలిపారు.[23] మార్చ్ 2007లో లారా డార్న్ 2008లో విడుదల చేయదలచిన ఈ కొత్త చిత్రం కోసం ఆహ్వానించబడ్డారు.[24] దర్శకుడు జో జాన్స్టన్ కూడా ఈ చిత్రం యొక్క దర్శకత్వం చేయడం లేదని తెలిపారు.[25] జాన్ హామ్మండ్ పాత్ర పోషించడానికి రిచర్డ్ అటెంబరో ను సంప్రదించారు.[26] జేఫ్ఫ్ గోల్ద్బ్లం ఈ నాల్గవ చిత్రంలో తన పాత్రను పోషించడానికి కొంత ఉత్సాహం చూపించారు.[27]

డిసెంబర్ 2008లో కొనసాగింపు యొక్క అభివృద్ధిపై ఫ్రాంక్ మార్షల్ మరియుకాథ్లీన్ కెన్నెడీ లను ప్రశ్నించారు. కెన్నెడీ అన్నారు, "లేదు... నాకు తెలీదు. మీకు తెలుసా, మైఖేల్ క్రింక్టన్ చనిపోయినపుడు ఇక ఇంతే అని నాకు అనిపించింది. మేము దాన్ని కెలకలూడదని ఇలా జరిగిందేమో.[28] మార్షల్ మరియు కెన్నెడీలకు యూనివర్సల్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ తో ఒప్పందాలు లేనప్పటికీ ఈ జురాసిక్ పార్క్ IV చిత్రానికి పనిచేస్తారు.[29] నవంబర్ 2009లో జో జాన్స్టన్ జురాసిక్ పార్క్ IV యొక్క విశ్లేషణ చేస్తూ ఈ చిత్రం యొక్క కథ ముందు వచ్చిన సినిమాలకంటే భిన్నమైనదని, ఇది ఒక కొత్త ట్రైలాజీకి నాంది అని ఆన్నారు.[30][31]

జురాసిక్ పార్క్ IV రెండవ జురాసిక్ పార్క్ ట్రైలాజీకి ప్రారంభమని జురాసిక్ పార్క్ III దర్శకుడైన జో జాన్స్టన్ జనవరి 2010లో ఒక ముఖాముఖిలో అన్నారు.[32] ఇంతకుముందు చూసిన అన్ని చిత్రాలకంటే జురాసిక్ పార్క్ 4 భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు.[33] 2010లో జో జాన్స్టన్ తో డ్రూ మక్వీని బిహైండ్ ది ఫిలిమ్స్ వెబ్సైట్ లో జరిపిన కొత్త ముఖాముఖి ప్రకారంగా ఒక కొత్త నేపధ్యంతో విభిన్నమైన ఆలోచనలతో తయారు అవుతోంది. కెప్టెన్ అమెరికా పూర్తి చేసిన తరువాత జురాసిక్ పార్క్ IV కథను స్టీవెన్ స్పీల్బర్గ్ తో కలిసి అభివృద్ధి చేస్తానని జాన్స్టన్ చెప్పారు. ఈ చిత్రం ఒక సారి కంటే ఎక్కువ సార్లు నిర్మించబడనుందని జో జాన్స్టన్ ఏంటో ఉత్సాహంగా చెప్పారు.[34]

ప్రధాన తారాగణం[మార్చు]

పాత్ర చలనచిత్రం
జురాసిక్ పార్క్ The Lost World: Jurassic Park జురాసిక్ పార్క్ III
అలాన్ గ్రాంట్ సామ్ నీల్   సామ్ నీల్
ఎల్లీ సాట్లర్ లారా డర్న్   లారా డర్న్
ఇయాన్ మాల్కం జెఫ్ఫ్ గోల్డ్ బ్లం   కేవలం తెలుపబడిన
జాన్ హామ్మండ్ రిచర్డ్ అటెన్బరో   కేవలం తెలుపబడిన
టిం మర్ఫి జోసెఫ్ మోజెల్లో  
లేక్స్ మర్ఫి అరియాన రిచర్డ్స్  
డోనాల్డ్ జెన్నారో మార్టిన్ ఫెర్రెరో  
రాబర్ట్ మల్డూన్ బాబ్ పెక్  
రే ఆర్నాల్డ్ శ్యాముల్ యల్. జాక్సన్  
డెన్నిస్ నేడ్రి వేన్ నైట్  
లేవిస్ డాడ్సన్ కామెరాన్ తోర్  
జెర్రి హార్డింగ్ జేరాల్ద్ ఆర్. మోలెన్  
హెన్రి వూ బి.డి.వాంగ్  
సారా హార్డింగ్   జూలియన్నె మోర్  
కెల్లి మాల్కం   వెనేస్సా లీ చెస్టర్  
నిక్ వాన్ ఓవెన్   విన్సె వాఘ్  
ఎడ్డీ కార్   రిచర్డ్ స్కిఫ్ఫ్  
పీటర్ లుడ్లో   ఆర్లిస్ హోవార్డ్  
రోలాండ్ టేమ్బో   పెటే పోసిలేత్ వెయిట్  
డీటర్ స్టార్క్   పీటర్ స్టోమరే  
అజయ్ సిద్ధు   హార్వి జాసన్  
రాబర్ట్ బుర్కే   థామస్ ఎఫ్. డఫ్ఫీ  
పాల్ కిర్బి   విలియం హెచ్. మేసి
అమంద కిర్బి   టీ లియోని
ఎరిక్ కిర్బి   ట్రివర్ మోర్గాన్
బిల్లి బ్రెన్నాన్   అలెస్సాండ్రో నివోల
ఉడెస్కి   మైఖేల్ జేటార్
నాష్   బ్రూస్ ఏ. యంగ్
కూపర్   జాన్ డీల్

నవలలతో కొనసాగింపు[మార్చు]

సినిమాలు ఎన్నో రకాల రాక్షసబల్లులను చూపించగా పుస్తకాలలో మరెన్నో జాతుల (తెర మీద చూసినవి కాని క్లోనింగ్ చేయబడినవి కాని) రాక్షసబల్లుల ప్రస్తావన ఉంది. జురాసిక్ పార్క్ చిత్రాలలో లేనివి కూడా ఈ పుస్తకాలలో ఉన్నాయి. నవల ఆధారితం కాదు కనుక జురాసిక్ పార్క్ III ఇందులో కలవదు. నవలా ధారావాహికలో సిరాటోసారస్ , బ్రాఖియోసారస్ , స్పైనోసారస్ , ఆంకైలోసారస్ , కొరిథోసారస్ మరియు మామెంఖిసారస్ జాతుల రాక్షసబల్లుల ప్రస్తావన లేదు.

ఊహాజనిత ప్రాంతాలు[మార్చు]

ఇస్లా నబ్లార్[మార్చు]

జురాసిక్ పార్క్ పుస్తకంలో మరియు సినిమాలో ఇస్లా నబ్లార్ ఒక ఊహాజనిత ద్వీపము. స్పానిష్ భాషలో ఈ పేరు యొక్క అర్థము "మేఘపు ద్వీపము".[35] కథాపరంగా ఇది కోస్టా రికా [36] తీరం నుండి 120 miles (190 km) దూరంలో ఉంది. వెడల్పాటి ప్రాంతము వద్ద ఈ ద్వీపము 8 miles (13 km) పొడవు మరియు 3 miles (4.8 km) వెడల్పు కలిగియుంది.[37] ఈ చిత్రం కోసం స్పీల్బర్గ్ కౌఅయి ద్వీపాన్ని ఇస్లా నబ్లార్ ద్వీపంగా చూపించారు.[38]

ప్రఖ్యాత సంస్కృతిలో, ఫ్లోరిడాలోని యూనివర్సల్ థీం పార్క్ వద్ద ఐదు ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ లో ఒకటిగా ఈ ద్వీపం అనిమాట్రానిక్ డైనాసర్స్ మరియు రైడ్స్ తో ఏర్పాటు చేయబడింది.[39] హాలివుడ్ లోని యూనివర్సల్ స్టూడియోస్ జురాసిక్ పార్క్ ముఖ ద్వారం వద్ద "ది ఇస్లా నబ్లార్ జురాసిక్ బాండ్" కలిగి ఉంటుంది.[40]

ఇస్లా సొర్నా[మార్చు]

ది లాస్ట్ వరల్డ్ యొక్క పుస్తక మరియు చిత్ర రూపకంలో, జురాసిక్ పార్క్ III చిత్రంలో కనిపించే ఊహాజనితమైన ద్వీపం ఈ ఇస్లా సొర్నా. దీన్ని "సైట్ B" అని కూడా అంటారు. విజ్ఞానాత్మక మరియు వినోదాత్మక పార్క్ అయిన ఇస్లా నబ్లార్ లాగా కాకుండా ఇస్లా సొర్నా అనేది ఒక లాబొరేటరిగా మరియు ఒక పరిశోధనా కేంద్రంగా నెలకొల్పబడింది. ఇస్లా సొర్నాలో పొదిగి, పెంచిన రాక్షసబల్లులను బాల్య దశలోనే ఇస్లా నబ్లార్ ద్వీపానికి పంపుతారు.[41] ఈ ద్వీపము ఇస్లా నబ్లార్[42] నుండి 87 miles (140 km), కోస్టా రికా తీరం నుండి 207 miles (333 km) దూరంలో ఉంది.[43] ది లాస్ట్ వరల్డ్ చిత్రం కోసం, యురేక మరియు న్యూ జీలాండ్ తమ ఘనమైన అడవులతో ఇస్లా సొర్నా యొక్క చిత్రీకరణకు ఉపయోగపడ్డాయని జోడి డంకన్ మరియు డాన్ షే తెలిపారు.[44] రాబ్ డిసాల్లే మరియు డేవిడ్ లిండ్లేలు పుస్తకాన్ని సమీక్షిస్తూ వెలోసిరాప్టర్స్ గుహలను అనిమల్ హౌస్ చిత్రం లోని వాటికంటే కూడా భిన్నంగా క్రింక్టన్ చూపించారు.[45]

ఆదరణ[మార్చు]

బాక్సాఫీసు లో ప్రదర్శన[మార్చు]

చలనచిత్రం విడుదల తేదీలు బాక్సాఫీసు ఆదాయం బాక్సాఫీసు ర్యాంకింగ్ బడ్జెట్ వివరణ
సంయుక్త రాష్ట్రాలు విదేశాలు ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా ప్రపంచ వ్యాప్తంగా
జురాసిక్ పార్క్ జూన్ 6, 2009 $357,067,947 $557,623,171 $914,691,118 #14
#17(A)
#14 $63,000,000 [46]
ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్ మే 17, 2008 $229,086,679 $389,552,320 $618,638,999 #67
#97(A)
#53 $73,000,000 [47]
జురాసిక్ పార్క్ III జూలై 18, 2001 $181,171,875 $187,608,934 $368,780,809 #120 #148 $93,000,000 [48]
మొత్తం $767,326,501 $1,134,784,425 $1,902,110,926 $229,000,000
సూచికల జాబితా
  • (A) అనేది ప్రస్తుత టిక్కెట్ ధరలను బట్టి సవరించిన మొత్తాలను సూచిస్తుంది. (బాక్స్ ఆఫీస్ మోజో చే లెక్కించబడినది)

విమర్శనాత్మక ప్రతిస్పందన[మార్చు]

చలనచిత్రం రోటేన్ టొమాటోస్ మెటాక్రిటిక్
మొత్తం ముఖ్య విమర్శకులు
జురాసిక్ పార్క్ 87% (38 విమర్శలు)[49] 90% (10 విమర్శలు)[50] 78% (20 విమర్శలు)[51]
ది లాస్ట్ వరల్డ్: జురాసిక్ పార్క్ 48% (58 విమర్శలు)[52] 42% (12 విమర్శలు)[53] 59% (18 విమర్శలు)[54]
జురాసిక్ పార్క్ III 49% (154 విమర్శలు)[55] 30% (30 విమర్శలు)[56] 49% (30 విమర్శలు)[57]

వీడియో గేమ్స్[మార్చు]

1993లో జురాసిక్ పార్క్ చలన చిత్రం యొక్క ప్రకటన వెంటనే, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయిన ఓషన్ సాఫ్ట్వేర్, బ్లూస్కై సాఫ్ట్వేర్ మరియు సెగా ఆఫ్ అమెరికా కంపనీలు వీడియో గేమ్స్ తయారు చేయుటకు, అప్పటి ప్రముఖ థియేటర్లలో చిత్ర విడుదల తేదీలకు అనుకూలంగా ఉండేవిధంగా హక్కులను పొందాయి.

ఓషన్ సాఫ్ట్వేర్ 1993 చిత్రం ఆధారంగా కొన్ని విడియో గేమ్స్ ను విడుదల చేసింది. అవి నెస్, సూపర్ నెస్, గేం బాయ్,PC:DOS మరియు అమిగా. సెగా ఆఫ్ అమెరికా సెగా సిస్టమ్స్ కోసం మూడు ఆటలను విడుదల చేసింది. ప్రతి ఆట నికరమైన అమ్మకాలు నమోదు చేసి SNES మరియు గేం బాయ్ ఆటల రెండవ ధారావాహికకు దారితీసింది. రెండవ చిత్రంకు సంబంధించిన హక్కులతో ద్రీమ్వర్క్స్ ఇంటరాక్టివ్ కంపని అప్పటి ప్రముఖ సిస్టమ్స్ కొరకు అయిదు ఆటలు విడుదల చేసింది. మూడవ చిత్రం అత్యధికంగా ప్రచారం కలిగి ఉండడంతో PC మరియు గేం బాయ్ అడ్వాన్స్ ల కొరకు ఏడు విడియో గేమ్లు విడుదల చేయబడ్డాయి. ఈ మూడు చిత్రాల కొరకు ఎన్నో లైట్గన్ మరియు ఆర్కేడ్ గేమ్స్ విడుదల చేయబడ్దాయి.

ప్లే స్టేషన్ 2, Xబాక్స్ మరియు PC కొరకు Jurassic Park: Operation Genesis అనే ఆట విడుదల అయ్యింది. ఇందులో ఆటగాళ్ళు తమ సొంత శైలిలో జురాసిక్ పార్కును నిర్మించి నిర్వహించగలరు. ఈ ఆట జూ టైకూన్ ఆటను పోలి ఉంది.

NBC యూనివర్సల్ తో ఒప్పందంలో భాగంగా టెల్టేల్ గేమ్స్ జురాసిక్ పార్క్ ఆధారంగా ఒక వీడియో గేమ్ ను రూపొందించనుంది. ఇంతకు ముందు వచ్చిన ఆటల తరువాత ఎనిమిది సంవత్సరాలకు ఈ వీడియో గేమ్ల ధారావాహిక విడుదలై ఈ ఆటలపై మరో సారి ఆశక్తి పెంపొందిన్చనుంది.[58]


సూచనలు[మార్చు]

  1. "Joe Johnston Talks Jurassic Park 4". సంగ్రహించిన తేదీ 8 November 2009. 
  2. Michael Crichton (2001). Michael Crichton on the Jurassic Park Phenomenon (DVD). Universal. 
  3. 3.0 3.1 జురాసిక్ పార్క్ DVD నిర్మాణ వివరాలు
  4. "Leaping Lizards". Entertainment Weekly. 1990-12-07. సంగ్రహించిన తేదీ 2007-02-17. 
  5. జురాసిక్ పార్క్ (1993)
  6. జురాసిక్ పార్క్ - చిత్ర విమర్శలు, ప్రచార చిత్రాలు, సినిమాలు - రాటెన్ టొమాటోస్
  7. "The LOST WORLD JURASSIC PARK". British Film Institute. సంగ్రహించిన తేదీ 2007-07-07. 
  8. 8.0 8.1 The Making of Jurassic Park III (DVD). Universal Pictures. 2005. 
  9. 9.0 9.1 "Jurassic Park III". British Film Institute. సంగ్రహించిన తేదీ 2007-07-09. 
  10. 10.0 10.1 10.2 "Jurassic Park". MichaelCrichton.com. సంగ్రహించిన తేదీ 2009-01-01. 
  11. 11.0 11.1 The Lost World: Jurassic Park DVD ప్రత్యేక లక్షణాలు - ప్రొడక్షన్ వివరాలు
  12. మైఖేల్ క్రింక్టన్.కాం | ది లాస్ట్ వరల్డ్
  13. http://comics.ign.com/articles/110/1101498p1.html
  14. 2001 DVD విడుదల, పోస్టర్ సెక్షన్ కింద ప్రత్యేక లక్షణాలు
  15. జురాసిక్ పార్క్ IV నేపధ్య వివరాలు
  16. "Jurassic Park III". Hollywood.com. Archived from the original on 2012-09-04. సంగ్రహించిన తేదీ 2007-07-09. 
  17. Linder, Brian (2002-11-07). "Jurassic Park IV Goes Ahead". IGN. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  18. McNary, Dave; Carl Diorio (2002-12-22). Pat McGovern is rumered to be in the movie "Early-bird specials". Variety. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  19. Paul Davidson (2003-07-11). "Sam Neill Confirms Jurassic Park IV". IGN. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  20. Paul Davidson (2004-09-17). "Rewriting Jurassic Park IV". IGN. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  21. Bryan O'Connor (2003-10-12). "Scientist Horner challenges youths". Billings Gazette. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  22. *Paul Davidson (2005-04-11). "Status of Jurassic Park IV". IGN. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  23. Paul Davidson (2006-02-21). "Jurassic Park IV Script Ready". IGN. సంగ్రహించిన తేదీ 2007-02-20. 
  24. "JURASSIC PARK IV News". Collider.com. 2007-04-05. సంగ్రహించిన తేదీ 2007-04-07. 
  25. Shawn Adler (2007-04-06). [http:// . . / /news/articles/1556604/20070406/story.jhtml "'Jurassic Park IV' To Hit Theaters In 2008"]. MTV. సంగ్రహించిన తేదీ 2007-04-08. 
  26. John Millar (2007-12-09). "Movie Director In Tearful Scots Trip". The Sunday Mail. సంగ్రహించిన తేదీ 2007-12-10. 
  27. Vineyard, Jennifer (October 20, 2008). [http:// blog.mtv.com/2008/10/20/jeff-goldblum-mulls-jurassic-park-4-open-to-possible-return/ "Jeff Goldblum Mulls ‘Jurassic Park 4,’ Open To Possible Return"]. MTV. సంగ్రహించిన తేదీ 2008-11-18. 
  28. Silas Lenick (2008-12-07). "Producers Say No to Jurassic Park 4". ComingSoon.net. సంగ్రహించిన తేదీ 2008-12-08. 
  29. Fernandez, Jay A.; Borys Kit (December 8, 2008). "Par, Uni won't renew major producer deals". The Hollywood Reporter. సంగ్రహించిన తేదీ December 10, 2008. 
  30. "Joe Johnston Talks Jurassic Park 4". Coming Soon. November 6, 2009. సంగ్రహించిన తేదీ 2009-11-07. 
  31. జురాసిక్ పార్క్ 4 టాక్?బ్రింగ్ ఆన్ ది డైనాస్!
  32. DNA సమూహము కనుగొనబడినది, కొత్త జురాసిక్ పార్క్ ట్రైలాజీ పని సాగుతోంది.
  33. Jackson Cresswell (January 13th, 2010). "Director Joe Johnston Talks CAPTAIN AMERICA, JURASSIC PARK 4". Collider.com. సంగ్రహించిన తేదీ January 13, 2010. 
  34. "More Jurassic Park 4 News! No Dinosaurs With Guns!". Behind the Films. 2010-02-08. సంగ్రహించిన తేదీ 2010-03-04. 
  35. సూసన్ లీ స్టార్, ఎకాలజీస్ ఆఫ్ నాలెడ్జ్: వర్క్ అండ్ పాలిటిక్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సని ప్రెస్, 1995), 41.
  36. జుడిత్ ఈ. బాస్, లేరే డబ్ల్యు. దబెక్, మరియు సుజానే ఈ. మోషియర్, ఫాన్టాస్తిక్ వొయేజస్: లెర్నింగ్ సైన్సు త్రూ సైన్సు ఫిక్షన్ ఫిల్మ్స్ (స్ప్రింగర్, 2003), 314.
  37. రాబ్ డిసల్లె మరియు డేవిడ్ లిండ్లే, ది సైన్సు అఫ్ జురాసిక్ పార్క్ అండ్ ది లాస్ట్ వరల్డ్, ఆర్, హౌ టు బిల్డ్ ఎ డైనోసార్: అండ్ ది లాస్ట్ వరల్డ్ ఆర్, హౌ టు బిల్డ్ ఎ డైనోసార్ (బేసిక్ బుక్స్, 1997), 150.
  38. క్లాడియా హెల్ల్మాన్ మరియు క్లాడైన్ వెబెర్ హాఫ్, ఆన్ లొకేషన్ 2: ఫేమస్ ల్యాండ్స్కేప్స్ ఇన్ ఫిలిం (బుచేర్, 2007), 36.
  39. మిరేయ నవర్రో, "ట్రావెల్ అడ్వైసరి: కర్రెస్పాండెంట్స్ రిపోర్ట్: టూ రైవల్స్ అప్ ది యంటే విత్ న్యూ థీమ్ పార్క్స్," ది న్యూ యార్క్ టైమ్స్ (నవంబర్ 16, 1997).
  40. బాబ్ సెలింగర్, అనఫీషియల్ గైడ్ తో డిస్నీల్యాండ్ 2004 (విలే, 2003), 234.
  41. Nichols, Peter M. (2001-08-03). "A Missing Boy on an Island Tyrannized by Dinosaurs". New York Times. సంగ్రహించిన తేదీ 2007-12-27. 
  42. ఇయాన్ ఫ్రీయర్, ది కంప్లీట్ స్పీల్బర్గ్ (విర్జిన్, 2001), 239.
  43. పీటర్ యం. నిఖోల్స్, "టేకింగ్ ది చిల్ద్రెన్, ఎ మిస్సింగ్ బాయ్ ఆన్ యాన్ ఐలాండ్ టిర్రనైజ్డ్ బై డైనోసార్స్," ది న్యూ యార్క్ టైమ్స్ (ఆగస్ట్ 3, 2001).
  44. జోడి డంకన్ మరియు డాన్ షే, ది మకింగ్ అఫ్ ది లాస్ట్ వరల్డ్: జురాస్సిక్ పార్క్ (బాలంటైన్ బుక్స్, 1997), [1].
  45. రాబ్ డి సల్లె మరియు డేవిడ్ లిండ్లే, ది సైన్సు ఆఫ్ జురాసిక్ పార్క్ అండ్ ది లాస్ట్ వరల్డ్, ఆర్, హౌ టు బిల్డ్ ఎ డైనోసార్: అండ్ ది లాస్ట్ వరల్డ్ ఆర్, హౌ టు బిల్డ్ ఎ డైనోసార్ (బేసిక్ బుక్స్, 1997), 147.
  46. "Jurassic Park (1993)". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2007-06-26. 
  47. "The Lost World: Jurassic Park (1997)". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2007-06-26. 
  48. "Jurassic Park III (2001)". Box Office Mojo. సంగ్రహించిన తేదీ 2007-06-26. 
  49. "Jurassic Park". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-11-30. 
  50. "Jurassic Park". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2009-11-30. 
  51. "Jurassic Park: Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2007-06-26. 
  52. "The Lost World: Jurassic Park". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2010-010-08. 
  53. "The Lost World: Jurassic Park". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2010-01-08. 
  54. Lost World: Jurassic Park "The Lost World: Jurassic Park: Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2010-01-08. 
  55. "Jurassic Park III". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2010-01-08. 
  56. "Jurassic Park III". Rotten Tomatoes. సంగ్రహించిన తేదీ 2010-01-08. 
  57. "Jurassic Park III: Reviews". Metacritic. సంగ్రహించిన తేదీ 2007-05-15. 
  58. Kollar, Phil (2010-06-08). "Telltale Creating Episodic Jurassic Park Game". GameInformer.com. సంగ్రహించిన తేదీ 2010-06-08. 

బావ్య లింకులు[మార్చు]

మూస:Jurassic Park మూస:Jurassic Park games మూస:Hasbro