జెఫ్ డుజాన్
వికీపీడియా నుండి
జెఫ్ డుజాన్ (Peter Jeffrey ("Jeff") Leroy Dujon) వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1956, మే 28న జన్మిచాడు. 1980 దశాబ్దంలో వెస్ట్ఇండీస్ జట్టుకు వికెట్ కీపర్‌గా ప్రాతినిధ్యం వహించినాడు. డుజాన్ 1974లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం ప్రారంభించి 19 సంవత్సరాలలో 200 పైగా మ్యాచ్‌లు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 10 వేలకు పౌగా పరుగులు కూడా సాధించాడు. డుజాన్ 1989లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తింపు పొందిన ఐదుగురిలో ఒకడు. 1992 లో రిటైర్మెంట్ తరువాత వెస్ట్ఇండీస్ జాతీయ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టినాడు.
టెస్ట్ రికార్డులు [మార్చు]
- టెస్ట్ ఆరంగేట్రం : 1981-82 ఆస్ట్రేలియాపై మెల్బోర్న్ లో
- చివరి టెస్ట్ : 1991లో ఇంగ్లాండుపై ఓవల్ లో
- ఆడిన టెస్ట్ మ్యాచ్‌లు : 81
- సాధించిన పరుగులు : 3322
- సెంచరీలు : 5
- అర్థ సెంచరీలు : 16
- అత్యుత్తమ స్కోరు : 139
- క్యాచ్‌లు, స్టంపింగ్‌లు : 267, 5
వన్డే రికార్డులు [మార్చు]
- వన్డే ఆరంగేట్రం : 1981-82 ఆస్ట్రేలియాపై అడిలైడ్ లో
- చివరి వన్డే : 1991, భారత్ పై, షార్జాలో
- ఆడిన టెస్ట్ వన్డేలు : 169
- సాధించిన పరుగులు : 1945
- సెంచరీలు : 0
- అర్థ సెంచరీలు : 6
- అత్యుత్తమ స్కోరు :82*
- క్యాచ్‌లు, స్టంపింగ్‌లు : 183, 21
బయటి లింకులు [మార్చు]
|
|
|
|---|---|
| క్లైవ్ లాయిడ్ (కెప్టెన్) · ఫావుడ్ బచుస్ · వేనె డేనియల్ · విన్స్టన్ డేవిస్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్ · జోయెల్ గార్నర్ · లారీ గోమ్స్ · గార్డన్ గ్రీనిడ్జ్ · డెస్మండ్ హేన్స్ · మైకెల్ హోల్డింగ్ · గస్ లోగీ · మాల్కం మార్షల్ · వివియన్ రిచర్డ్స్ · ఆండీ రాబర్ట్స్ |
|
|
|
|---|---|
| వివియన్ రిచర్డ్స్ (కెప్టెన్) · ఎల్డిన్ బాప్టిస్ట్ · విన్స్టన్ బెంజమిన్ · కార్లిస్తే బెస్ట్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్) · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · గస్ లోగీ · పాట్రిక్ ప్యాటర్సన్ · రిచీ రిచర్డ్సన్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ |