జెఫ్ బెజోస్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Jeffrey Preston Bezos
Jeff Bezos 2005.jpg
Jeff Bezos 2005
జననం (1964-01-12) జనవరి 12, 1964 (వయస్సు: 50  సంవత్సరాలు)
Albuquerque, New Mexico
వృత్తి Chairman and CEO of Amazon.com

జెఫ్రీ ప్రెస్టన్ "జెఫ్" బెజోస్ (జననం: జనవరి 12, 1964) అమెజాన్.కాం యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వాహణా అధికారి మరియు అమెజాన్.కాం పాలక మండలి సభాపతి. బెజోస్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంకు చెందిన టావు బేటా పై గ్రాడ్యువేట్. 1994లో అమెజాన్ ను స్థాపించే ముందు, అతను డి. ఈ. షా & కంపెనిలో ఆర్ధిక విశ్లేషకుడుగా పని చేశాడు.

బాల్య జీవితం మరియు నేపథ్యం[మార్చు]

బెజోస్' తల్లి వైపు పూర్వీకులు టెక్సాస్లో స్థిరపడినవారు. కొన్ని తరాల తరువాత, వారు కోటల్లాలో 25,000 ఏకరాల (101 కిమీ2 లేదా 39 మైళ్ళు2) రాంచ్ ని కొన్నారు. బెజోస్ యొక్క తాత అల్బకర్కూ లో యు.ఎస్. అటామిక్ ఎనర్జి కమిషన్లో ప్రాంతీయ డైరెక్టర్ గా ఉండేవారు. అతను ముందుగానే పదవి విరమణ చేసి రాంచ్ కు వచ్చేశాడు. అక్కడే బెజోస్ తన యవ్వన ప్రాయములో చాలా వేసవి కాలాన్ని గడిపేవాడు. అక్కడ తన తాతతో కలిసి వివిధ రకాల పనులను చేసేవాడు. చిరుప్రాయములోనే అపూర్వమైన యాంత్రిక వైఖరిని ప్రదర్శించాడు - పసిబిడ్డగా ఉన్నప్పుడే, ఒక స్క్రూ డ్రైవర్ తో తన క్రిబ్ (పిల్లలను పడుకోబెట్టే తొట్టి)ని విప్పతీయడానికి ప్రయత్నించాడు.[1]

జెఫ్ బెజోస్ పుట్టినప్పుడు అతని తల్లి జాకీ టీనేజ్ లో ఉంది. అతను న్యూ మెక్సికో లోని అల్బకుర్కూలో పుట్టాడు. ఆమెకు అతని తండ్రికి జరిగిన వివాహం ఒక ఏడాది కంటే కొంత ఎక్కువ కాలం మాత్రమే నిలిచింది. జెఫ్ కు అయిదేళ్ళప్పుడు, ఆమె మళ్ళీ వివాహం చేసుకుంది, ఈసారి మిగువేల్ బెజోస్ ను. మిగువేల్ క్యూబాలో జన్మించి, తన 15వ ఏటా యునైటెడ్ స్టేట్స్ కు ఒంటరిగా వలస వచ్చాడు. అక్కడ అల్బకుర్కూ విశ్వవిద్యాలయంలో కష్టపడి పైకి వచ్చాడు. పెళ్లి తరువాత, అతని కుటుంబం హూస్టన్, టెక్సాస్కు వెళ్ళిపోయారు. అక్కడ మిగువేల్ ఎక్సాన్ సంస్థలో ఇంజనీరు అయ్యాడు. జెఫ్ హూస్టన్ లోని రివర్ ఓక్స్ ఎలెమెంటరీలో 4 నుంచి 6వ తరగతి వరకు చదివాడు.

బాల్యంలోనే బెజోస్ వివిధ రకాల వైజ్ఞానిక రంగాలలో అమితమైన ఆసక్తిని చూపాడు. తనకంటే చిన్న తోబుట్టువులను తన గది నుంచి దూరంగా ఉంచడానికి తన ఏకాంతాన్ని కాపాడుకోవడానికి అతను ఒక ఎలెక్ట్రిక్ అలారంను ఏర్పాటు చేశాడు. తన విజ్ఞాన ప్రాజక్టుల కోసం తల్లితండ్రుల గ్యారేజిని ఒక ప్రయోగశాలగా మార్చుకున్నాడు. వారి కుటుంబం మియామి, ఫ్లోరిడాకు వెళ్ళిపోయిన తరువాత , బెజోస్ మియామి పాల్మెట్తో సీనియర్ ఉన్నత పాఠశాలలో చదివాడు.[2] ఉన్నత పాఠశాలలో చదువుతున్నపుడు, అతను ఫ్లోరిడా విశ్వవిద్యాలయలంలో విద్యార్దుల విజ్ఞాన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నాడు; ఇది 1982లో సిల్వర్ నైట్ అవార్డు అందుకోవడానికి అతనికి సహాయపడింది .[3] భౌతిక శాస్త్రం చదువుదామని అనుకుని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరాడు. కాని త్వరలోనే తనకు ఇష్టమైన కంప్యూటర్ రంగానికి వచ్చేసి ఎలేక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్లో బేచలర్ అఫ్ సైన్స్ డిగ్రీ ని పొంది సుమ్మ కం లాడే , ఫై బీటా కప్పా గా పట్టభద్రుడయ్యాడు. 2008లో బెజోస్ కార్నెగీ మేల్లాన్ విశ్వవిద్యాలయం నుండి సైన్స్ మరియు టెక్నాలజీ లో గౌరవ డాక్టరేట్ను పొందాడు.

వృత్తి జీవితం[మార్చు]

ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి 1986లో పట్టభద్రుడయిన తరువాత, బెజోస్ వాల్ స్ట్రీట్లో కంప్యూటర్ సైన్స్ రంగములో పని చేశాడు.[4] తరువాత ఫితెల్ అనే ఒక సంస్థ కోసం అంతర్జాతీయ వర్తకం[[]] కొరకు ఒక నెట్‌వర్క్ ను నిర్మించే పనిలో ఉన్నాడు. తరువాత అతను బ్యాంకర్స్ ట్రస్ట్కు ఉపాధ్యక్షుడు అయ్యాడు. అనంతరం, అతను డి. ఈ. షా & కంపనిలో కంప్యూటర్ సైన్స్ లో పని చేశాడు.

1994లో, బెజోస్ అమెజాన్.కాంను స్థాపించాడు. దీనికి అతను న్యూ యార్క్ నుంచి సియాటిల్ కు కదిలి వచ్చాడు. వచ్చే దారిలోనే అమెజాన్ యొక్క వ్యాపార ప్రణాళికను వ్రాసి, సంస్థను తన గ్యారేజీలో స్థాపించాడు.[5] అమెజాన్ లో అతను చేసిన పని వలన అతను ప్రముఖ డాట్-కాం వ్యాపారవేత్తలలో ఒకరిగా అయి, బిలియనీరుగా అయ్యాడు. 2004లో అతను , మానవ అంతరిక్ష ప్రయాణం కొరకు బ్లూ ఆరిజిన్ అనే స్టార్ట్ అప్ సంస్థ[[]]ను స్థాపించాడు.

వ్యాపార పద్ధతుల వివరాలకు బెజోస్ అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. కొండే నాస్ట్ యొక్క పోర్ట్‌ఫోలియో.కాం లో వివరించనట్లుగా, అతను "ఎప్పుడు ఉల్లాసంగా ఉండే మొగల్ మాత్రమే కాకుండా ఒక భయంకరమైన మైక్రోమేనేజర్....ఒక ఒప్పందం గురించిన చిన్న చిన్న విషయాల నుంచి అమెజాన్ పత్రికా ప్రకటనలలో తాను చెప్పినవి ఎలాగ ఇవ్వబడ్డాయనే విషయాల వరకు అన్ని తెలుసుకోవాలనుకునే ఒక అధికారి. [5]

కృత్రిమ మేధస్సు[మార్చు]

కృత్తిమ కృత్రిమ మేధస్సు(ఏఏఐ) అనే పదాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించి జెఫ్ బెజోస్ సృష్టించాడు. ఒక ఛాయాచిత్రములో ఉన్న వ్యక్తి పురుషుడా లేక స్త్రీయా అని గుర్తించేటటువంటి పనులను ఇప్పటికీ కంప్యూటర్ కంటే మనుషులే చక్కగానూ వేగంగానూ చేయగలుగుతున్నారు. ఇటువంటి పనులకు ప్రోగ్రామింగ్ చేయడానికి ఏఐ ఇంకా సరిపోవడం లేదు. కంప్యూటర్ ప్రోగ్రాం లోని ఇటువంటి పనులను మనుషులకు అవుట్‌సోర్స్ చేయడమే ఏఏఐ వెనుక ఉన్న ఆలోచన.[6] అమెజాన్ మెకానికల్ టర్క్ ఏఏఐ సిద్ధాంతం పై ఆధారపడి ఉంది.

గుర్తింపు[మార్చు]

1999లో అతను టైం పత్రిక వారి పర్సన్ అఫ్ ది ఇయర్గా పేర్కొనబడ్డాడు.[7] 2008లో, యూ.ఎస్. న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ అతన్ని అమెరికా యొక్క ఉత్తమ నాయకులలో ఒకరిగా పేర్కొంది.[8]

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూస:Amazon మూస:Time Persons of the Year 1976-2000