జెసిబి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జె సి బామ్ఫోర్డ్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్
రకం ప్రైవేట్
Founded 1945
ప్రధానకార్యాలయం రోసెస్టర్, యునైటెడ్ కింగ్డమ్
కీలక వ్యక్తులు సర్ ఆంథోనీ బంఫోర్డ్, ఛైర్మన్
పరిశ్రమ భారీ పరికరాలు
ఉత్పత్తులు నిర్మాణం, కూల్చివేత & వ్యవసాయ యంత్రాలు
ఆదాయం £ 2.75 బిలియన్ (2012)[1]
ఉద్యోగులు సుమారు 7,000[2]
వెబ్‌సైటు www.jcb.com
జెసిబి సహాయంతో మట్టిని త్రవ్వుతున్న దృశ్యం

జెసిబి అనునది Joseph Cyril Bamford అనే వ్యక్తి స్థాపించిన ఒక సంస్థ పేరు. జెసిబి అనగా అధికారికంగా జె సి బామ్ఫోర్డ్ ఎక్స్కవేటర్స్ లిమిటెడ్, ఇది ఒక ఒక బ్రిటీష్ బహుళజాతి సంస్థ. దీని ప్రధాన కార్యాలయం రోసెస్టర్, యునైటెడ్ కింగ్డమ్ లో ఉన్నది. నిర్మించడానికి, కూల్చివేయడానికి మరియు వ్యవసాయరంగానికి అవసరమైన పరికరాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉంది ఈ సంస్థ. ఇది ప్రపంచంలో మూడో అతి పెద్ద నిర్మాణ సామగ్రి తయారీ సంస్థ. ఇది డిగ్గర్స్ (Backhoes), ఎక్స్కవేటర్లు (త్రవ్వి తీసేవి), ట్రాక్టర్లు మరియు డీజిల్ ఇంజిన్లతో సహా 300 కంటే ఎక్కువ రకాల యంత్రాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థకు ఆసియా, యూరోప్, ఉత్తర అమెరికా, మరియు దక్షిణ అమెరికా అంతటా 18 ఫ్యాక్టరీలున్నాయి, దీని ఉత్పత్తులను 150 పైగా దేశాల్లో విక్రయిస్తారు. జోసెఫ్ సిరిల్ బామ్ఫోర్డ్ ద్వారా 1945 లో స్థాపించబడిన ఈ సంస్థ తరువాత ఇతని పేరుతోనే మరియు ఇతని పేరుతో ఉన్న బామ్ఫోర్డ్ సంస్థకు స్వంతంగా కొనసాగింది. సాధారణంగా వ్యవహారికంలో జెసిబి అంటే త్రవ్వి తీసే యంత్రాలు అనే విధంగా ఉపయోగిస్తున్నారు.

చిత్రమాలిక[మార్చు]


మూలాలు[మార్చు]

  1. "JCB mit Rekordergebnis 2011". DEMCO JCB. 24 April 2012. సంగ్రహించిన తేదీ 24 April 2012. 
  2. "Company Information". J C Bamford Excavators Limited. సంగ్రహించిన తేదీ 27 September 2010. 

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=జెసిబి&oldid=1183523" నుండి వెలికితీశారు