జె.వి. సోమయాజులు
జొన్నలగడ్డ వెంకట సోమయాజులు '(జె.వి.సోమయాజులు) (1928?-2004) శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన తెలుగు చలనచిత్ర నటుడు. మరొక నటుడు జె.వి. రమణమూర్తి ఇతని సోదరుడు.
ఇతడు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం వద్ద లూకాలం అగ్రహారానికి చెందినవాడు. ఇతని తండ్రి ప్రభుత్వోద్యోగి. సోమయాజులు నిజయంనగరంలో చదువుకొన్నప్పటినుండి నాటకాలు వేసేవాడు. తన సోదరుడు రమణమూర్తితో కలిసి గురజాడ అప్పారావు ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కాన్ని 45 యేళ్ళలో 500 ప్రదర్శనలు ఇచ్చాడు. ముఖ్యంగా కన్యాశుల్కంలో "రామప్పంతులు" పాత్రకు ప్రసిద్ధుడయ్యాడు. సోమయాజులు తల్లి శారదమ్మ అతనిని ప్రోత్సహించింది.
శంకరాభరణం సినిమాలో "శంకరశాస్త్రి" పాత్రతో ప్రసిద్ధుడయ్యాడు. తరువాత సినిమాలలో అలాంటి పాత్రలే అధికంగా పోషించాడు. అల్లరి పిల్లలు, రౌడీ అల్లుడు, స్వాతిముత్యం, త్యాగయ్య, సప్తపది, విజేత, వంశవృక్షం, అప్పుల అప్పారావు ఇతను నటించిన చిత్రాలలో కొన్ని. టెలివిజన్ ప్రసాఱం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించాడు. జంట నగరాలలో నాటక కళా ప్రోత్సాహానికి "రసరంజని" అనే సంస్థను గరిమెళ్ళ రామమూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్ళపల్లి వంటివారితో కలిసి స్థాపించాడు.
ఇతను రిటైరయ్యేనాటికి సాంస్కృతిక విభాగంలో డైరెక్టర్‌గా పనిచేసేవాడు. 2004లో గుండెపోటుతో హైదరాబాదులో మరణించాడు.[1]
[మార్చు] నటించిన సినిమాలు
| సం | చిత్రం | పాత్ర | సూచన |
|---|---|---|---|
| 2005 | భాగమతి | హిందీ చిత్రం | |
| 2003 | ఒందాగోణ బా | రాఘవయ్య (అజ్జ) | కన్నడ చిత్రం |
| కబీర్ దాస్ | |||
| 1994 | సరిగమలు | ||
| 1993 | గోవిందా గోవిందా | ||
| ముఠా మేస్త్రి | |||
| సోపానం | రాజ రాజ వర్మ తంబూరన్ | మళయాళ చిత్రం | |
| 1992 | అల్లరి మొగుడు | ||
| 1991 | రౌడీ అల్లుడు | ||
| ఆదిత్య 369 | మహామంత్రి తిమ్మరసు | ||
| అప్పుల అప్పారావు | శంకర శాస్త్రి | ||
| 1990 | ప్రతిబంధ్ | ముఖ్య మంత్రి సత్యేంద్ర | హిందీ చిత్రం |
| 1989 | స్వరకల్పన | ||
| 1988 | ఇడు నమ్మ అలు | శ్రీనివాస శాస్త్రి | తమిళ చిత్రం |
| 1987 | విశ్వనాధ నాయకుడు | ||
| స్వయంకృషి | |||
| చక్రవర్తి | స్వామిజీ | ||
| మజ్ను | |||
| సంకీర్తన | |||
| 1986 | కలియుగ పాండవులు | ||
| మగధీరుడు | |||
| ఆలాపన | |||
| కల్యాణ తాంబూలం | |||
| శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం | నానా చందోర్కర్ | ||
| తాండ్ర పాపారాయుడు | |||
| ప్యార్ కా సిందూర్ | హిందీ చిత్రం | ||
| 1985 | విజేత | నరసింహం | |
| దేవాలయం | |||
| స్వాతిముత్యం | |||
| శ్రీ రాఘవేంద్ర | సుధీంద్రాచార్యులు | తమిళ చిత్రం | |
| 1983 | సితార | ||
| నెలవంక | రహీం | ||
| 1982 | పెళ్ళీడు పిల్లలు | పి.వి.రావు | |
| 1981 | త్యాగయ్య | త్యాగయ్య | |
| 1980 | వంశవృక్షం | ||
| సప్తపది | యాజులు | ||
| 1979 | శంకరాభరణం | శంకర శాస్త్రి | |
| 1976 | జ్యోతి |